ఆర్య నారాయణమూర్తి (Arya Narayanamurthy)

Share
పేరు (ఆంగ్లం)Arya Narayanamurthy
పేరు (తెలుగు)ఆర్య నారాయణమూర్తి
కలం పేరు
తల్లిపేరునారమ్మ
తండ్రి పేరుగురుమూర్తి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1866
మరణం
పుట్టిన ఊరుకుందుర్సి , కళ్యాణ దుర్గం తాలుకా అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఈశ్వర రహస్యసారము, ఫరిత జ్యోతిష ఖండనము, భారత సూర్యోదయము, తత్త్వజ్ఞానము , స్వాత్మనిరీ క్షణము , భక్తి ప్రార్ధనోపాసనము , అగ్ని హోత్ర లాభము , మనుష్య జీవనము, వైవాహిక ప్రహసనము , ప్రశ్నార్ణవము , న్యాయ దర్శన పరిచయము, కలిదర్బారు ప్రహసనము” ,మరణ దుఃఖ నివారణము ,స్వర్గీయ మహాసభ (పురాణ సమీక్ష)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆర్య నారాయణమూర్తి
సంగ్రహ నమూనా రచనకొందరు కవులు తమ రచనా వ్యాసంగమును సంఘ శ్రేయస్సుకు, సంస్కరణకు, ప్రబోధమునకు, వినియోగించి ధన్యులైరి వేమన కవి ఎంతటి సంఘసంస్కరణాభిలాషియో, మనకు తెలియనిది కాదు. కీ.శే. వీరేశలింగం పంతులుగారు తమ రచనలద్వారా సంఘమును ప్రబోధించలేదా గురజాడ దేశభక్తిని తమ గేయములద్వారా రేకెత్తించలేదా కవులు సంఘ సేవకులని, పేరుగా చెప్పవలసిన పనిలేదు. వారు చిట్టి చిట్టి సంఘ సంస్కరణలను, కూడ ప్రవేశ పెట్టినవారే, రాజకీయ నాయకులవలె వారు సంఘ దురాచార నిర్మూలనకు నడుము కట్టిన వారే.

ఆర్య నారాయణమూర్తి

కొందరు కవులు తమ రచనా వ్యాసంగమును సంఘ శ్రేయస్సుకు, సంస్కరణకు, ప్రబోధమునకు, వినియోగించి ధన్యులైరి వేమన కవి ఎంతటి సంఘసంస్కరణాభిలాషియో, మనకు తెలియనిది కాదు. కీ.శే. వీరేశలింగం పంతులుగారు తమ రచనలద్వారా సంఘమును ప్రబోధించలేదా గురజాడ దేశభక్తిని తమ గేయములద్వారా రేకెత్తించలేదా కవులు సంఘ సేవకులని, పేరుగా చెప్పవలసిన పనిలేదు. వారు చిట్టి చిట్టి సంఘ సంస్కరణలను, కూడ ప్రవేశ పెట్టినవారే, రాజకీయ నాయకులవలె వారు సంఘ దురాచార నిర్మూలనకు నడుము కట్టిన వారే. కీ. శే. పప్పూరి రామాచార్యుల వంటి వారి పదును కలములు సాహిత్యరంగమందేకాక సంఘ పురోభివృద్ధి, జాతి మనుగడ, జీవ హింసా సిద్ధాంతము, మానవ సేవ, మున్నగు అనేక రంగము లందు చిందలు వేసినవి. వారి రచనలను స్థానిక పత్రికలలో ప్రకటించిరి, పత్రికలు లేని తావులందు తామే స్వయముగా పత్రికలు నడిపిరి తామెంత దుర్భర దుస్థితియందున్నను సంసారజీవయాత సాగుటకెంత క్లిష్టపరిస్థిత లేర్పడినను, వారు మనో ధైర్యము వీడక సమిష్టి సమాజ వికాసమునకై ఆహోరాత్రులు కృషిచేసిన ప్రబోధకవులు వారిలో కొందరు. శ్రీ ఆర్య నారాయణమూర్తి, ఎల్లమరాజు నారాయణభట్ట, కిడాంది రాఘ వాచార్యులు, అభయార్థి నంజుండప్పగార్ల ముఖ్యులు, వారిలో శ్రీ ఆర్యనారాయణమూర్తి ప్ర థములు,
శ్రీ ఆర్యనారాయణమూర్తిగారు భట్టువంశమునకు చెందిన, మధ్యమ తరగతికి చెందినవారు వీరు ముగ్గురన్నదమ్ములు ఇతడు మధ్యముడు, 12వ ఏటనే, మూర్తిగారు తండ్రిని కోల్పోయిరి, అన్నగారి పోషణలో విద్యాభ్యాసము కొనసాగించిరి తరువాత తోడిపిల్లలలో కలసి రాష్ట్రాంతరము వెళ్ళి, ఆక్కడ శ్రమపడి చదివి, 1886 వ సంవత్సరములో ఉపాధ్యాయ వృత్తియందు ప్రవేశించిరి.
తరువాత గృహమునందేర్పడిన కొన్ని చికాకుల ఫలితముగా వారికి విరక్తి జనించి, ఉపాధ్యాయ వృత్తిని విడనాడిమరల రాష్ట్రాతరము వెళ్ళిరి, అచ్చట వారికి సాధు సజ్జనుల సాంగత్యము లభించెను. బళ్లారి “దివ్యజ్ఞాన సమాజములో చేరి (Theosophical Society) కొంత కాలము నకు బోధకులైరి. కొంతకాలము గడచెను. దివ్యజ్ఞాన సమాజమవారు నాస్తికులని గ్రహించిరి. సమాజమును విడిచిరి.
స్వగ్రామము చేరుకొని, “విజ్ఞాన వర్ధని’ యను మాసపత్రికను స్థాపించిరి. కొన్ని సంవత్సరముల తర్వాత పత్రిక ఆగి పోయెను.

మరల శ్రీ మూర్తిగారు మనశ్శాంతికై, ఉత్తర దేశయాత్ర సాగించిరి, బొంబాయి, పూనా మొదలైన పట్టణములను దర్శించిరి. వారి అభిరుచి కాంగ్రెసు సంస్థ వైపు మరలి ఆ సంస్థ లో ప్రవేశించిరి.
హిందీ భాషను చక్కగా అభ్యసించిరి. అనేక విద్వాంసులను సంద ర్శించి, వారి ఉపన్యాస, శాస్త్ర గోష్ఠుల యందు పాల్గొని, జ్ఞాన సంపన్నులైరి . సాధు సజ్జన సహవాసము వల్ల పరిణతి జెందిరి, సనాతన దర్మములను, సంఘ సిద్ధాంతములను గ్రహించిరి మఱల స్వగామము చేరుకొనిరి. కల్యాణదుర్గములో “ఆర్యక్షత్రియ మహాసభ’ను స్థాపించి, కొంత కాలము నడిపిరి.

తరువాత గృహస్థులైరి, గృహస్థజీవనము నడపుటకై వారు మఱల ఉపాధ్యాయవృత్తిని, స్వీకరించక తప్పలేదు.

వీరి, 40వ, సంవత్సరము వయస్సునకు, సంసారము పెరిగెను. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగిరి, కుమార్తెలు (1) శ్రీమతి దేవమ్మ (2) శ్రీమతి సుభదమ్మ (3) శ్రీ భానుమూర్తి, (కుమారుడు).

స్వగ్రామమైన కుందుర్సి విడిచి 1905లో వీరు కుటుంబ సమేతులై హిందూపురము చేరుకొనిరి. స్వగృహము సంపాదించిరి. 1911వ సంవత్స రములో వీరికి భార్యా వియోగము సంభవించెను . మూర్తిగారు చాల పట్టుదల గల వారు గాన, తామ స్థాపించిన ఆర్యక్షత్రియ సమాజములోనై కమత్యమును పెంచుటకై తమ సమాజములోని, భిన్నభిన్నశాఖల నొక్కటిగా చేర్చుటకు, విశేష ప్రయత్నము లొనరించిరి తన పెద్ద కుమార్తెను సికిందరాబాదు లోని శుకదేవవర్మ’ యను నొక క్షత్రియ కుమారునకిచ్చి పెండ్లి చేసిరి, రెండవ కుమారై కాలధర్మమొండెను.
శ్రీ మూర్తిగారు, అనేక వైది కాంధ్ర గ్రంధములు రచించిరి. హైస్కూలులో పండితులుగా పనిచేసిరి,
– వీరు వాసిన గ్రంథములు –

1) ఈశ్వర రహస్యసారము, 2) ఫరిత జ్యోతిష ఖండనము, 3) భారత సూర్యోదయము, 4) తత్త్వజ్ఞానము 5) స్వాత్మనిరీ క్షణము 6) మత, మతాంతర, మహాసభ 7) భక్తి ప్రార్ధనోపాసనము 8) అగ్ని హోత్ర లాభము 9) మనుష్య జీవనము, 10) వైవాహిక ప్రహసనము 11) ప్రశ్నార్ణవము 12) న్యాయ దర్శన పరిచయము, 13) కలిదర్బారు ప్రహసనము” 14) మరణ దుఃఖ నివారణము 15) స్వర్గీయ మహాసభ (పురాణ సమీక్ష).
వైదిక ధర్మవిరొధులు కొందఱు వీరి గ్రంధములను ఖండించుటకు బయలుదేరిరి. వారి వ్రాతలనెల్ల, ప్రతి ఖండనము చేయుచు, వ్యాసములను వ్రాసి వర్తమాన పత్రిక” (అప్పటి పత్రిక) లో ప్రచురించిరి ఆంధ్రదేశ మంతట, వైదిక ధర్మ ప్రచార మొనరించిరి. ఆచ్చటచ్చట ఆర్యసమాజము లను స్థాపించిరి.
తుదకు, సంసార తాపత్ర యములలో చిక్కి, మనసు విసుగెత్తి జీవితాంతదశలో గృహస్థజీవితమును చాలించి, తృతీయాశ్రమమున దివ్య లోక ప్రాప్తినొందిరి.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...