రొద్దం హనుమంతరావు (Roddam Hanumantharao)

Share
పేరు (ఆంగ్లం)Roddam Hanumantharao
పేరు (తెలుగు)రొద్దం హనుమంతరావు
కలం పేరు
తల్లిపేరుసాకమ్మ
తండ్రి పేరుకృష్ణరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1873
మరణం1/1/1904
పుట్టిన ఊరుపెనుకొండ అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తిన్యాయవాది
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువరూధినీ పరిణయము (నాటిక), చంద్రికా నాటకము (రెండంకములు ) రాఘవశతకము ,
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరొద్దం హనుమంతరావు
సంగ్రహ నమూనా రచనశ్రీ రొద్దం హనుమంతరావు గారు ” పెనుకొండ పట్టణమున న్యాయ వాదులుగా నివసించిరి. వీరు 1895 సం; ప్రాంతమున “వాసవదత్త “ ను లఘటీకతో సహా వ్రాసిరి. శ్రీ వేదం వేంకటరాయశాస్త్రీ గారిచే యది పరిష్కరింపబడి 1889లో ముద్రింపబడినది. తరువాత “వరూధినీ పరిణయ మను నాటకమను రచించిరి. 1902లో “భార్గవీ అను మకుటముతో 150 చంపక, ఉత్పలమాల పద్యములు గల “భార్గవి మూలిక”న ముద్రించిరి. ‘చంద్రికా నాటకము (రెండంకములు ) రాఘవశతకము (75 పద్యములకలది ) ఇవి అసంపూర్ణ గ్రంధములు.

రొద్దం హనుమంతరావు

శ్రీ రొద్దం హనుమంతరావు గారు ” పెనుకొండ పట్టణమున న్యాయ వాదులుగా నివసించిరి. వీరు 1895 సం; ప్రాంతమున “వాసవదత్త “ ను లఘటీకతో సహా వ్రాసిరి. శ్రీ వేదం వేంకటరాయశాస్త్రీ గారిచే యది పరిష్కరింపబడి 1889లో ముద్రింపబడినది. తరువాత “వరూధినీ పరిణయ మను నాటకమను రచించిరి. 1902లో “భార్గవీ అను మకుటముతో 150 చంపక, ఉత్పలమాల పద్యములు గల “భార్గవి మూలిక”న ముద్రించిరి. ‘చంద్రికా నాటకము (రెండంకములు ) రాఘవశతకము (75 పద్యములకలది ) ఇవి అసంపూర్ణ గ్రంధములు. కవిగారి మరణానంతరం వారి తమ్ముని కుమారుడగు రొద్దం రామరావుగా అసంపూర్ణ చంద్రికా నాటకమును దాని జతక “భార్గవీ మాలికను చేర్చి ద్వితీయ ముద్రణగా 1969 చెన్నపట్టణమున ముద్రించిరి.
శ్రీ హనుమంతరావు గారి కుమారులు ‘ శ్రీరంగారావుగారు ఈ నాటకమును పూర్తి చేయ తలపెట్టిరి కాని సాధ్యపడలేదు ఈ చంద్రికా నాటకము, ఆంగ్ల కవి షేక్ స్పియర్ నాటకములలోని “వింటర్స్ “టేల్’ అను నాటకమునకు ఆనుసరణ ఈ నాటకమును తాను క్రీ శ 1900 సం నందే వ్రాసినట్లు నాంది వాచకములో కవిగారు చెప్పకొన్నారు ఇందలి కథా భాగమును సూత్రధారి చేత సంగ్రహముగా నిట్లు కవిగారు చెప్పించిరి.

సీ|| శ్రుతకీర్తి యనురాజు సతి గర్భవతి, జార
యను శంకఁ జెరసాల ననుచుటయును
ఆచట, నాసతి గన్న యాడబిడ్డను గరు
ణించక యేట ద్రోయించుటయును
“జనని రక్షించుమో జనక యటంచుఁ బ్రా
ర్థించు తనూజ హింసించుటయును
నిరపరాధను నన్నుఁ గరుణింపమని మ్రోక్కు
తనసతి డాకాలఁ దన్నుటయును
గీ: ఏటఁబడి చిన్న శిశు వొక చోట నెమ్మి
రక్షతస్థితిఁ గనుటయు రాజు మరల
నందరునుగూడి బహు సౌఖ్య మందుట యును
జిత్రముగ వర్ణికంబులై చెలగు నిందు
ఈ రెండంకములందే 70 పద్యములు కలవు సంభాషణలు స్వల్పము. పద్యములు నారికేళ పాకములు శ్రుతికీర్తి పాడెడి పద్యము చూడుడు.
సీ: సంతతాత్యంత హృచ్చింతా దవానలా
మోఘ సంవర్త, ఘనా ఘనంబు
భూరి తాపత్రయోదార ధారాధర
స్పారాతి ఘోర ఝుంఝూం విలంబు
భయ శోక రోగాది ఒహు విపద్భయ దాహి
దారుణ ఖగరాజ దర్శనంబు
కామాది రిపు షట్క ఘన దుర్గమో దగ్ర
వీరు ద్వితాన లవిత్రకంబు
గీ : సమాధికాఖిల పురుషార్థ సాధకంబు
నకిల భోగాభియోగ ప్రసాధనంబు
కామితార్థ ప్రదాయక కల్పకంబు
గాదె సజ్జన సాంగత్య గౌరవంబు
కవి గారు తమకుగల భాషా పాండిత్యము నిందు గుప్పించిరి ఇందు నాటకీయత తక్కువ ఇది ప్రదర్శనాయోగ్యమగా లేదు.

వీరి “సార్వోచిష’ (వరూధినీ పరిణయము) నాటకములోని పద్యము లన్నియు మనుచరిత్రలోని పద్యములకు మారుసేతలు. ఇదికూడా పూర్తిగా నాటకీయతను సంతరించుకొనలేదు ఈ నాటకమును గూర్చి క్రీ. శే . కల్లూరు వేంకటనారాయణరావుగారు తమ వీరేశలింగయుగమున నిట్లు వ్రాసిరి.

మనుసంభవములో వలెనే దీనియందును వస్వైక్యము లేదు ఆది కావ్యము దాని కిసుమంతయు దోషములేదు కాని యిది రూపకము ఆద్యంతములకొక నిబంధన సూత్రము నాటకములలో లేకున్న నదియు కావ్యములే యగును. వీనియందు శ్రవ్యము దృశ్యము కాలేదు. కాని నాటక కళా కుశలతను చూపించు గుర్తులు మాత్రముకలవు “
పై అభిప్రాయమే చంద్రికా నాటకము చదివినవారికి కూడ కలుగగలదు.
కవిగారు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు. ఈ సమాజము ఆర్షమత సనాతన ధర్మములు కర్మవిషయము పునర్జన్మ విచారము మున్నగు అనేక అంశమలపై ప్రచురించిన గ్రంథములసంఖ్యాకములు, కాని కవిగారికీ అంశములపై గల సందేహములను పద్యరూపమున వెలువరించిరి అదియే భార్ణవీమాలికగా రూపొందినది ఇందుపయోగించిన తమ భాషాశైలిని గూర్చి కవి గారిట్ల వ్రాసు కొనిరి.

“ పద్యశైలి క్లిష్టముగాను, సాంకేతిక పదభూయిష్టముగను, దీర్ఘ సమాన యుక్తం బుగను గ్రాంధిక ధాటీ పాటవంబు గలదియును గానుండిన యెడల నది నిరుపయోగముగా నుండునని తలంచియు ఇంతకన్నను బాగుగా రచించు శక్తి చాతుర్యాదులు చాలనందున సులభశైలి కలది యగునట్లు దీనిని రచించితిని.”

నిరుపయోగమైన కవిత్వమేదో కవిగారు తెలుసుకొన్నారు పాండిత్య ప్రదర్శనవల్ల ఫలమేమున్నది ? తమ రచనలలోగల లోపములను గ్రహించ గల్లి వాటిని సరిదిద్దుకొనగల సరసహృదయులు మన రాయలసీమ కవులు.

రొద్దంవారి రచనా వ్యాసంగము తొమ్మిదేండ్లకాలము మాత్రమే కొన సాగినది . వీరు ధర్మవరం రామకృష్ణమాచార్యులు – కోలాచలంగార్ల సమకాలికలు, ఈ సమకాలికులు బొందిన పేరుప్రతిష్టలే వీరినాటక రచనకు పోత్సాహ మిచ్చినట్లున్నది.

రొద్దం హనుమంతరావువంటి ప్రౌడ కవిత చెప్పగలిగిన ఆనాటి వారి సమకాలికుడు పొలికి చిదంబరరాయకవి గారొక్కరే.
ఇట్టి కవులా రాయలసీమలో ఎందరన్నారో ?.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...