కొర్రపాటి గురువయ్య కవి (Korrapati Guruvaiah kavi)

Share
పేరు (ఆంగ్లం)Korrapati Guruvaiah kavi
పేరు (తెలుగు)కొర్రపాటి గురువయ్య కవి
కలం పేరు
తల్లిపేరుగుర్రమ్మ
తండ్రి పేరుగురుమూర్తి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1867
మరణం1/1/1927
పుట్టిన ఊరుకడపజిల్లా, కొర్రపాడు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసుద్యుమ్నరాజ చరిత్రము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిశేఖరులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొర్రపాటి గురువయ్య కవి
సంగ్రహ నమూనా రచనకం : ప్రతి పద్యరసాస్పదముగ
గృతిరచియింపంగవలయు గీర్తిచెలంగన్
క్షితి సప్తసంతతుల, ద
త్కృతియే శాశ్వతము మిగులగేవలమగుచున్

కొర్రపాటి గురువయ్య కవి

జననము 1867 – మరణము 1927
తల్లి : శ్రీమతి గుర్రమ్మ – తండ్రి చిన్న గురుమూర్తావారి
మతము కులము హిందూ-విశ్వబ్రాహ్మణులు- సానర్షిక గోత్రులు
జన్మస్థలము కడపజిలా, కొర్రపాడు
కడప జిల్లాలోని కొర్రపాడు ఒక పేరెన్నికగన్న సంస్థానము.

ఈ సంస్థానాధికారులై న శ్రీ కె, సితారామరెడ్డిగారు, వారి కుమారులు మంచి సాహిత్యపోషకులు, వారొకసారి కాళికాంబా వరప్రసాదులు ముసలాచారి పౌత్రులు , శేషాచార్యుల వారి శిష్యులైన శ్రీ కొబ్దపాటి గురవయ్య కవి వరేణ్యులను పిలిపించి, యిట్లు కోరిరి,
కం : ప్రతి పద్యరసాస్పదముగ
గృతిరచియింపంగవలయు గీర్తిచెలంగన్
క్షితి సప్తసంతతుల, ద
త్కృతియే శాశ్వతము మిగులగేవలమగుచున్

వారి ఆజ్ఞను శిరసావహించి కవిశేఖరులు “సుద్యుమ్నరాజ చరిత్రము’ లేక పురూరచోదయము ఆనబడు కావ్యమును తెనుగించి వ్రాసిరి.
వీరి కవిత్వము ప్రాచీన ప్రబంధ శైలిని అనుసరించినది. అదే ఒరవడిలో సాగినది, పోతన రచనాపోకడలోసాగిన. ఈ దైవ స్తుతి పద్య మిట్లన్నది

ఉ: సారెకుభక్తి వేడెదను స్వర్ణనగప్రతిమాన గాత్రనిన్
వైరి లతాలవిత్రు పరధవ్యచరిత్రుని భక్తశేముషీ
సారస మిత్రుని- దనుజసంచయజై త్రుని గిల్చిషాటవీ
దారుణపీతిహోత్రుని బుధస్తుతిపాత్రుని వాయుపుత్రునిన్

వసుచరిత్రలో భట్టుమూర్తి ఎట్లు పరమందలి అన్నిజాతుల వారిని, వర్ణములవారిని వర్ణించిరో అట్లే వీరును వర్ణనలు సాగించిరి. ఈ క్రింది పద్యముకూడ భట్టమూర్తి రచనాపోకడలలోనే నడచినది.

సీ: ఆమితాభి కాలాప శమితాబినవకోప
రమితాంగనాటోప రాజితములు
దత కుంజ సుమమధూద్ధత గుంజదళి వధూ
హితమంజురవ పృధూన్నితయుతములు
లీలాసరోభంగ డోలాచల రధాంగ
బాలాభినవసంగ భాస్వరములు
ఫలసూన భరచూత దళపీనసికజాత
వలమానమృధుగీత వలయుతములు
తే: వితత మందానిలోద్గత విచికలాది
వాసనా వాన దశ దిశా వ్యాప్తికలిత
శారికాకీర, కాకలీ, చక్రితపాంధ
సరసహృన్మథన కృదట్టసాయకంపు
భాసురమ్మలు, మధుమాస వాసరములు,

తదుపరి సుద్యుమ్నమహారాజుగారి మృగయా వినోదవర్ణన సాగినది. ఈ వర్ణన తరిగొప్పల మల్లనమంత్రి పుణితంబైన ‘చంద్రథాను చరిత్ర” లోని వర్ణనలను సరిపోలుచున్నవి.
చెంచుదొర మహారాజకడకు విచ్చేసి యట్ల విన్నవించుకొన్నాడు,
కం: ఎలిమిని జివ్వగలుఁ జిరుక
పులు లేడులుఁ గారు దున్నపోతులు గురుపో
తులు, గబ్బుచెoక మెకములు
దెలి మెకములు, దాడిగట్టు తెలిగున నుండున్

కం: చెట్టులపట్టుల వట్టక
నిట్టల మగుపిట్ట పిండు నెరక లోలిచియున్
బెట్టిన మంటల జొట జొట
దొట్టిన క్రొవ్వెగసి కారుదొర ! పేరడవిన్
వేటకు వెళ్లిన సుద్యుమ్నుని ఒక దైత్యుడు అడ్డగించును. వానితో రాజు పోరాడును. ఆ యుద్ధ వర్ణన కొంత సాగినది. యుద్ధమున వాడు కూలి నాడు . వాడు శాప ఫలితముగా ఆ రూపముదాల్చిన ఖచర వరుడు, దీనితో ప్రథమ , ద్వితీయాశ్వాసములా ముగియును. తృతీయాశాస్వములోని ఒక పద్యము రాయలవారి ఆముక్తమాల్యదను జ్ఞప్తికి తెచ్చును.

రాక్షస బాధ మాన్పి తదనంతరము రాజు పరివారముతో వన విహార మునకేగెను. అది కుమార వనము, ఇట కవిగారు వన విహార వర్ణనలకు దిగిరి . తరువాత సుద్యుమ్నమహారాజును పరివారిమతోబాటు జలక్రీడలకు దించిరి. ఆ సరోవర మహిమ ఎట్టిదియో కాని, మునిగిన వారందరు ముదిత లైరి. వారయోమయముపాలై రి స్త్రీ జన్మకంటె , రాయిగానో, చెట్లుగానో, పుట్టగానో, మారిపండిన బాగుండెడిదని వగచిరి వారి వగపతీర్చు వారెవరు ?
ఇంతలో కొందరు కన్నియలు అటుగావచ్చి, వారి దుఃఖహేతువును కనుగొని, శివపార్వతులను ప్రార్థించమనిరి,
ఆ మహిళామణియగు భూపతికి, నీలాదేవియను నామకరణము గావించబడెను. ఆ నీలాదేవి, తోడిచేడియలతో కలిసి వన విహారము చేయ దొడగినది, ఆ వర్ణన యిట్లన్నది,
సీ: ఇమ్మలై వలిగాలికమ్ములై పిట్టల
సౌమ్ములై, చక్కని కొమ్మలుండ
నిగ్గులై పౌదరిండ్ల మ్రుగ్గులె విరహుల
కెగ్గులై యలరుల మొగ్గలుండ
బ్రోవులై తేనియ బావలె తావుల
తావులై, విచ్చిన పూవులుండ
దొత్తలై వనికి సంపతులై పుప్పొళ్ళ
తిత్తులై దిగపూవు గుప్తలాండ
తే : నాకులయ్యను మరునకు బాకులగుచు
జొకలు సెలంగ నీ చిగురాసలుండి
దరువులెల్లను మిగుల నెత్తరుపులగమ
బయవు తేటల గుముల, జాదుపులయ్యె,

జలక్రీడలాడచున్న నీలాదేవి సౌందర్యము నొకిమనికుమారుడు చూచినాడు మోహించినాడ, ఆమె కూడా మోహించినది ఇక మదన తాపమున వీగవలెను కదా ! అది కూడ సాగినది రాయబారములు కూడ జరిగినవినీలాకన్య పరిచారిక అతనితో నిట్లన్నది.

ఉ : ఇంతుల మేలుబంతి లలితేక్షు శ రాసాను దంతి జాజిపూ
బంతి పడంతి సోయగపు బాటలదొంతి రబంగనామణి
స్వాంతము నిన్నెకోరినది యాపెకు నీకెతగున్ మహత్మకా
కంతు సమాన సుందరతగల్గిన వాడవు, ప్రోడ విద్దరన్,

కథతోబాటు అన్నివర్ణనలు సమానముగా సరితూగునట్లు రచించుట కవి గారి ప్రౌడి మకు తార్కాణము. అంధకారమును వర్ణించుచు ఈ చమత్కారమును కవిగారు చేసిరి,
సి : ……………………………………………….
…………………………………………………
తే : అస్త పాశ్చార్య వర్తకుడ బ్ర వీధి
వేల్పులను సాహుకారులు వెలకుగొనుట
కంగడిని బెట్టియమ్మ ముత్యమ్ములనగ
రిక్కగమి యొప్పెఁగాఁతలు పిక్క-టిల్ల

ఇక సరేసరి చంద్రోదయవర్ణన, విరహతావముతో చంద్రుని దూరుట. మన్మథునిపై ధ్వజమెత్తుట , మలయమారత దూషణ. ఇవన్నియూ ప్రబంధ కవులకు చెప్పవలసిన పనిలేదు. అతి చమత్కారమతో చెప్పట వారికి వెన్నతో పెట్టిన విద్య గురువయ్యగారుకూడ అట్లే వ్రాసిరి.
తుదకు నీలాదేవికి వివాహమైనది. పురూరపని జననముతో కావ్య మంతమైనది
ఇది ఐదు ఆశ్వాసముల కావ్యము. కవిగారి రచన, చక్కని, ధారా శుద్ధితో సాగినది, ఏ పద్యమ నందును బింకము చెడలేదు తెనుగు సంస్కృతి, సామెతలు, నటనిట అలంకారప్రాయముగా నతికిరి. వీరికొక స్వతంత్రరచనాశైలి, భావనాపటిమ . యున్నట్లు కావ్యము ద్వారా స్పష్టమగును. ప్రాచీనప్రబంధ కావుల రచనలకెమాత్రమిది తీసిపోదు.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...