బత్తలపల్లి నరసింగరావు (Bathalapalli Narasinghrao)

Share
పేరు (ఆంగ్లం)Bathalapalli Narasinghrao)
పేరు (తెలుగు)బత్తలపల్లి నరసింగరావు
కలం పేరు
తల్లిపేరునరసమ్మ
తండ్రి పేరుసుబ్బరామయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/22/1901
మరణం
పుట్టిన ఊరుమద్దిమడుగు – కదిరి తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తికాలేజీలో లెక్చరరు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభక్తకల్పద్రుమ శతకము, కులలక్ష్మి, జవహర్ దిరలేఖలు (అనువాదము)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబత్తలపల్లి నరసింగరావు
సంగ్రహ నమూనా రచనశా. శ్రీరమ్యంబగు రత్నపీఠమున, నాసీనుండవై పార్శ్వమం
దారామామణి సేవజేయగను, బ్రహ్లాదుండు సద్భక్తితో
నారాధింప గృపాంతరంగమున, నిష్టార్థంబులస్ గూర్చి లో
కారాధ్యా ననుగావ ఖాద్రి నరసింహ భక్త కల్పద్రుమా

బత్తలపల్లి నరసింగరావు

వీరి భక్తకల్ప్రద్రుమ శతకము కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామియొక్క స్తోత్రములు. అందలి పద్యమొకటి చూతము.
శా. శ్రీరమ్యంబగు రత్నపీఠమున, నాసీనుండవై పార్శ్వమం
దారామామణి సేవజేయగను, బ్రహ్లాదుండు సద్భక్తితో
నారాధింప గృపాంతరంగమున, నిష్టార్థంబులస్ గూర్చి లో
కారాధ్యా ననుగావ ఖాద్రి నరసింహ భక్త కల్పద్రుమా
వీరి అముద్రితకృతులు పెక్కు కలవు. వాటిలో ‘‘చంద్రవదన మోహియార్’’ – 3 అశ్వాసముల కావ్యము. మత సామరస్యమును ప్రబోధించు ప్రేమజీవుల గాథ. దీనిని కవిగారు శ్రీ గాంధీ మహాత్మునికి అంకిత మిచ్చరి. ‘‘అభినవ – వేమన శతకము’’. ‘‘రామస్తోత్ర రత్నాకరము’’, ‘‘ఖాద్రి లక్ష్మి నృసింహ స్వామి చరిత్ర’’ ఇవి కూడ అముద్రితములే. అభినవ వేమన శతకములో 300 పద్యములు కలవు. అందలి ఒక పద్యము.
వాణి యజునిరాణి – వాక్కున నెలకొని
వీణమీటి నెగడ – వివిధగతుల
ఆట వెలదులెల్ల – నవె యాడి పాడెరా
విశ్వదాభిరామ – విను నృసింహ
శ్రీ నరసింగరావు సంఘసేవా పరాయణులు. వీరు ఐక్య భారత సేవాసంఘమును స్థాపించిరి. గాంధి ఆయుర్వేద ఆస్పత్రిని నెలకొల్పి ఉచిత వైద్యము చేయుచుండిరి. బొంబాయిలోని ‘‘సంస్కృత విశ్వపరిషత్తు’’కు సెక్రెటరీగా పనిచేసిరి. అనంతపురం కొత్తూరులోని మూడవ రోడ్డులో చాలకాలము నివసించి తుదకు ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి కృపకు పాత్రులై దివిచేరిరి.

———–

You may also like...