టి. శివశంకరం పిళ్లె (T. Sivashankaram Pillei)

Share
పేరు (ఆంగ్లం)T. Sivashankaram Pillei
పేరు (తెలుగు)టి. శివశంకరం పిళ్లె
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా పెనుకొండ
విద్యార్హతలు
వృత్తిపెనుకొండ తాలూకా బోర్డు ప్రెసిడెంటు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురామరాయలచరిత్ర, వేంకట పతిరాయలచరిత్ర, రాజత్వపౌరత్వము, ఆంగ్లదేశాటన చరిత్ర, భగవద్గీత, స్థానికకూటములు, దేశమాతా స్తవము, ఉల్నత్తుఖాజాకంగళ్. (తమిళ గ్రంథము)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికటి. శివశంకరం పిళ్లె
సంగ్రహ నమూనా రచనశ్రీ టి. శివశంకరంపిళ్లెగారు అనంతపురం జిల్లా పెనుకొండ నివాసి. న్యాయవాది, మంచివక్త, మంచి రచయిత. అనేక సంవత్సరాలు పెనుకొండ తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా పనిచేసిరి.
‘‘దేశమాతాస్తవము’’ (National Anthem) ఒక దేశీయగీతము. సర్వసాహిత్యములతో ప్రచురింపబడినది. ఇట్టి గీతము దేశమున కవసరమని ఎంచి శ్రీ టి. శివశంకరపిళ్లెగారు 1883 నాటికే ఈ గీతమును రచించి, దానిని 1908 సంవత్సరములో మదరాసు కాంగ్రెస్సు సభలకు వెళ్ళినప్పుడు ఆంధ్ర నాటక పితామహులగు శ్రీమాన్ ధర్మవరం రామకృష్ణమాచార్యులవారికి పాడి వినిపించిరి.

టి. శివశంకరం పిళ్లె

శ్రీ టి. శివశంకరంపిళ్లెగారు అనంతపురం జిల్లా పెనుకొండ నివాసి. న్యాయవాది, మంచివక్త, మంచి రచయిత. అనేక సంవత్సరాలు పెనుకొండ తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా పనిచేసిరి.
‘‘దేశమాతాస్తవము’’ (National Anthem) ఒక దేశీయగీతము. సర్వసాహిత్యములతో ప్రచురింపబడినది. ఇట్టి గీతము దేశమున కవసరమని ఎంచి శ్రీ టి. శివశంకరపిళ్లెగారు 1883 నాటికే ఈ గీతమును రచించి, దానిని 1908 సంవత్సరములో మదరాసు కాంగ్రెస్సు సభలకు వెళ్ళినప్పుడు ఆంధ్ర నాటక పితామహులగు శ్రీమాన్ ధర్మవరం రామకృష్ణమాచార్యులవారికి పాడి వినిపించిరి. పాట అల్లుటకు వీరి కాప్త మిత్రులైన సంగీత విద్వాన్ ‘‘చోళేమరి నరసింహాచార్లు’’, చిరకాలము పెనుకొండలో ఉపాధ్యాయులుగా పనిచేసిన ‘‘శ్రీ కురూత్తాళ్వారు అయ్యంగార్లు’’, బెంగుళూరు ‘‘చక్రవర్తి వేంకటవరద అయ్యంగార్లు’’ తోడ్పడిరి. ఆంధ్రభాషయందు దేశీయ గీతమంత వరకు లేదను కొఱతను పిళ్లేగారు తీర్చిరి. వీరీ గీతమును వ్రాయుటలో గల శయము నిట్లు వ్రాసుకొనిరి.
‘‘జాతీయైక్యతకు ఆంధ్రలోకమున కిట్టి గీత మొకటి ఇప్పటి పరిస్థితులందు ఆవశ్యకమనియు, యిట్టి గీతము, నెల్లరూ పాడ నేర్వవలెనన్న స్వరసాహిత్యములు, సులభములై యుండుట అవసరము. అందలి భావములు సహితము లలితములై యున్నగాని ప్రయోజనముండదు. అందుకే ఈ గీతము నాంధ్రలోకమునకు సమర్పించితిని’’.
వీరి రామరాయలచరిత్ర, వేంకటపతి రాయలచరిత్ర, ప్రసిద్ధములు. అవి ప్రస్తుతము అలభ్యములు. ఈ రెండు పుస్తకములు చరిత్రకారుల కెంతగానో నేటికి ఉపయోగపడుచున్నవి. వీరి కృషి ఆచంద్ర తారార్కముగా నిలిచినది.

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...