నూతలపాటి పేరరాజు (Nootalapati Peraraju)

Share
పేరు (ఆంగ్లం)Nootalapati Peraraju
పేరు (తెలుగు)నూతలపాటి పేరరాజు
కలం పేరు
తల్లిపేరుసీతాంబ
తండ్రి పేరుఆదిరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1896
మరణం11/15/1968
పుట్టిన ఊరుఉరవకొండ – అనంతపురం జిల్లా, ఆం.ప్ర.
విద్యార్హతలు
వృత్తిఆంధ్రభాషోపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిజయనగర సామ్రాజ్య చరిత్ర , తులసీ రామాయణం , ఆనంద రామాయణము, రామకథామృతము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువిద్యార్ణన, సాహిత్య సరస్వతి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనూతలపాటి పేరరాజు
సంగ్రహ నమూనా రచనగుంటూరు జిల్లా నూతలపాడు గ్రామములో పుట్టి పెరిగి, విదాయబుద్ధులు నేర్చి ‘‘జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల?’’ అన్నట్లు బహు గ్రంథకర్తలుగా వాసికెక్కి పెక్కేండ్లు అనంతపురం జిల్లాలో ఆంధ్రభాషోపాధ్యాయులుగా పనిచేసి, ‘‘విద్యార్ణన’’ ‘‘సాహిత్య సరస్వతి’’ ఇత్యాది బిరుదములతో కవిగా, పండితునిగా వాసికెక్కిన శ్రీ నూతలపాటి పేరరాజు గారి నెఱుగని సాహితీ ప్రియులరుదు. విజయనగర సామ్రాజ్య చరిత్ర – తులసీ రామాయణం – ఆనంద రామాయణము వీరి భాషా సేవకు నిదర్శనములు.

నూతలపాటి పేరరాజు

గుంటూరు జిల్లా నూతలపాడు గ్రామములో పుట్టి పెరిగి, విదాయబుద్ధులు నేర్చి ‘‘జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల?’’ అన్నట్లు బహు గ్రంథకర్తలుగా వాసికెక్కి పెక్కేండ్లు అనంతపురం జిల్లాలో ఆంధ్రభాషోపాధ్యాయులుగా పనిచేసి, ‘‘విద్యార్ణన’’ ‘‘సాహిత్య సరస్వతి’’ ఇత్యాది బిరుదములతో కవిగా, పండితునిగా వాసికెక్కిన శ్రీ నూతలపాటి పేరరాజు గారి నెఱుగని సాహితీ ప్రియులరుదు. విజయనగర సామ్రాజ్య చరిత్ర – తులసీ రామాయణం – ఆనంద రామాయణము వీరి భాషా సేవకు నిదర్శనములు. ఆనాటి స్కూలు ఫైనల్ విద్యార్థుల తెలుగు పాఠ్య పుస్తకములకు అరటి పండొలిచి చేతి కిచ్చినట్లుగా, సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించి విద్యార్థి లోకమున కందించిన విద్యార్థి కల్పతరువులు వీరు.
తులసీరామాయణము, ఆనందరామాయణము, రామకథామృతము వీరి వచన రచనకు మచ్చు తునుకలు. చక్కటి వచన రచన చేయగల సమర్థులు వీరు. వైదర్భీవిలాసము, శ్రీసాయి బాబా చరిత్ర, శాంతి విజయము, తులసీదళము వీరి పద్యరచనలలో మేల్పంతులు.
వీరి వైదర్భీవిలాసము ఒక చక్కటి ద్విపద కావ్యము. దీనిని కవిగారు 1918లో రచించి, 1928లో ముద్రించిరి. విదర్భ రాజతనయ, రుక్మిణీ పరిణయ గాథ యిందు వర్ణింపబడినది. రుక్మిణి తన మనోహరుడైన శ్రీకృష్ణునకు తన యభీష్టము తెలుపుచూ వ్రాసిన లేఖ చదువుడు.
మం.ద్వి. భువనైక సుందరా; పురుషాగ్ర గణ్య
భవదీయ సుందర పదపద్మములకు
భక్తితో నొనరింతు వందన శతము
గొనుము దయాస్ఫూర్తి గోపాలబాల
నిరతోదిత కరునానిధి వీవటంచు
లావణ్య సర్వస్వ రమణుడవనుచు
నిన్నె వరింపంగ నెమ్మదిం దలచి,
వాంఛ బెంచితి నిన్నివత్సరంబులను;
నేడు వ్రాసితి లేఖ నీతియేలేక
మదవతియ లిఖించె మందాఓమీగి
యని. నీరసింపక యరయుము కమ్మ;
నీ పదాంబుజసేవ నేబాయగలనె?
మన్నించి కొనిపొమ్ము మానితాకార
కల్యాణ పూర్వంబు గౌరీనివేశ
మందు నేనుందు నమంద భక్తికడు
నార్యాసమర్చనా ధ్యాన లీననయి
విలసిల్లు తఱిగాంచి, విమత నికాయ
మాజి నిర్జించి, సమ్మానంబున, నను
గొనిపోవు ఖ్యాతిగై కొమ్ము మానాథ – ‘‘రుక్మిణి’’
‘‘శ్రీ సాయిబాబా చరిత్ర’’ మన ఖండ కావ్యమందు శ్రీ షిర్డీసాయిబాబా పుట్టుక, మహిమలను సంక్షిప్తముగా కడుమనోహరముగా, రసవత్తరముగా వర్ణించిరి. పద్యములన్నియూ ఆణిముత్యములే. రచన అతిసరళము. ఇందు వారు ‘‘తోచకము’’ ‘‘సుగంధి’’ వృత్తములను గూడ వాడిరి. వీరి ‘‘సుగంధి’’ తీరును కొంత ఆఘ్రాణింతము.
కాంచి రంత గాంచనాబ్జ – కమ్ర విస్తృతాక్షుని
మించి మందహాసమొల్కు – మేటి మోము వానినిన్
అంచితార్క భూరితేజు – హారి దివ్య దేహునిన్
ఎంచి చూడ వారి భాగ్య – మింతనంగ వచ్చునే.
‘‘శ్రీకృష్ణ నిర్యాణము’’ వీరి అముద్రిత కృతి. శిశువిద్య శ్రీశైలప్రభ – ఆరాధన – పత్రికలకు వీరు సంపాదుకులుగా పనిచేసిరి. ఉరవకొండలో 30 సంవత్సరాలకాలం తెలుగు పండితులుగా పనిచేసి, అక్కడే స్థిరపడిరి. కలకాలము నిలుచు కావ్యములే వీరి సంతానము. వీరికి అనంతపురం జిల్లాలో పెక్కుమంది శిష్యులున్నారు. వారందరూ ఉన్నత పదవుల నలంకరించి యున్నారు. వీరి శ్రీరామకథామృతమును ఉరవకొండ తా. పెద్ద కాకుంట్ల గ్రామ వాస్తవ్యులు కీ.శే. పయ్యావుల కేశన్నగారి కుమారులు శ్రీ పయ్యాపుల వేంకటనారాయణగారు తండ్రిగారి పేర ముద్రించి ధన్యులైరి. అనంతపురం జిల్లా సాహిత్యచరిత్రలో శ్రీ నూతలపాటి పేరరాజుగారి పేరు చిరస్థాయిగా నిలిచి కీర్తిని పొందినది.
రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...