Share
పేరు (ఆంగ్లం)B. Basappa
పేరు (తెలుగు)బి. బసప్ప
కలం పేరు
తల్లిపేరుమల్లమ్మ
తండ్రి పేరుబెళగల్లు పెద్ద ఆగులూరప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/13/1903
మరణం
పుట్టిన ఊరుబెళగుప్ప – కల్యాణదుర్గము తాలూకా అనంతపురం జిల్లా
విద్యార్హతలులోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ ట్రయినింగులు పాసయ్యిరి.
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలుకన్నడము,
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబసవరాజు శతకము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఉభయ భాషా ప్రవీణ
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబి. బసప్ప
సంగ్రహ నమూనా రచనకవిగారి ఇంటిపేరు బెళగల్లు వారు. వీరి కులవృత్తి నేతపని. పేద కుటుంబములో పుట్టిపెరిగి కష్టపడి చదువు నేర్చుకొన్నవారు. చదివినది నాల్గవ తరగతి స్వయంకృషితో నేర్చుకొన్న భాషలు తెనుగు, కన్నడము, వీధిబడి ఉపాధ్యాయుడుగా కాలము గడపుచు, లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ ట్రయినింగులు పాసయ్యిరి, కన్నడ – తెనుగుభాషలలో పాండిత్యము సంపాదించి ‘ఉభయ భాషా ప్రవీణ’ బిరుదును పొందిరి. 14 సంవత్సరములు ఉపాధ్యాయునిగా పనిచేసిరి. వైద్యమునేర్చి రోగులను కాపాడిరి.

బి. బసప్ప

కవిగారి ఇంటిపేరు బెళగల్లు వారు. వీరి కులవృత్తి నేతపని. పేద కుటుంబములో పుట్టిపెరిగి కష్టపడి చదువు నేర్చుకొన్నవారు. చదివినది నాల్గవ తరగతి స్వయంకృషితో నేర్చుకొన్న భాషలు తెనుగు, కన్నడము, వీధిబడి ఉపాధ్యాయుడుగా కాలము గడపుచు, లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ ట్రయినింగులు పాసయ్యిరి, కన్నడ – తెనుగుభాషలలో పాండిత్యము సంపాదించి ‘ఉభయ భాషా ప్రవీణ’ బిరుదును పొందిరి. 14 సంవత్సరములు ఉపాధ్యాయునిగా పనిచేసిరి. వైద్యమునేర్చి రోగులను కాపాడిరి.
బసప్పగారి ఆధ్మాత్మిక చింతనాపరులు, వారి కబ్బిన కవిత్వమును ఆధ్యాత్మిక ప్రబోధమునకు ఉపయోగించిరి. ‘సద్గురు హితబోధే’ అను శతకమును కన్నడభాషలో వీరు ఆటవెలది వృత్తములతో వ్రాసిరి. ఈ శతకము ద్వారా కవిగారు ‘‘గ్రంథములు చదివి జ్ఞానము సంపాదించవచ్చును, బుద్ధి వికసింపజేసుకొని పండితుడు కావచ్చును, సభాసన్మానములు పొందవచ్చును – అంతేకాని ఆత్మవికసింపదు, నీవు ధర్మపరుడైన స్వర్గసుఖములు అధర్మపరుడైన నరక దుఃఖములు తప్పవు’’ అని ప్రబోధించిరి. ఈ శతకమును వీరి గురువులైన ‘ఎరిస్వామి’ గారికంకిత మిచ్చిరి. తదుపరి వీరి నీతి శతకములోని ఈశ్వరుని వర్ణన చూతము.
సీ. కట్టపుట్టము లేక – కరితోలు, పులితోలు
కటిచుట్టు బిగియించి గట్టినావు
వాయువేగముగల్గు – వాహనంబులు వీడి
ఎద్దుపై మోజుతో నెక్కినావు
పాలన్నమును బాపి – పాయసాన్నము వోలె
మేటైన విసమును మెక్కినావు
బంగారు తొడవులు బాగుగాదని ద్రోసి
పాముల పొమ్ముగా వలచినావు
గీ. ఎవరు దరిజేర నీయని హేతువనుచు
తెలియదరమౌనె నీదగుతెలివిగాదె
సత్యమనుజాటు, వివరయ్య సకలజనులు
పూజ్యబసవేళ బెళగుప్ప పురనివాస
వీరి పద్యములన్నియు నరసింహ శంకశైలిని బోలి ధారాళముగ ప్రవహించినవి. అన్నియు అముద్రితములే.
శ్రీ బసప్పగారి ‘బసవరాజు శతకము’లోని ఆటవెలదులు వేమన్న ఆటవెలదులవెల ఆడిపాడినవి, అందువారు తొలుత గణపతినిట్లు ముద్దుగా ప్రార్ధించిరి.
ఆ.వె. షదిన దనువ తనయ – మఱుమాటలాడక
దొసగు పొసగ నీక – తోడుకమ్ము
కవిత వ్రాయనేను – కలము బట్టినపుడు
పరిమయోగితేజ – బసివరాజ
ఈ కవిగారు యోగులు; భక్తులు నిరాడంబరులు, వీరజ్ఞాతముగా మారుమూల కుగ్రామమునందు గుట్టుగా జీవించుచున్న ఆధ్యాత్మిక తత్త్వప్రబోధ కవులు. ఇట్టివారి కృషిఫలితముగా గ్రామములందలి కష్టజీవులు దైవభక్తిని, ఆధ్యాత్మిక చింతను పెంపొందించు కొనుచున్నారు. ఇట్టి నిస్వార్థసేవాపరాయణులగు కవులనుగూర్చి మనము తెలుసుకొనుట ఎంతేని అవసరము. వీరి రచనలు వెలుగుజూడ గోరుచున్నాము. వీరికి బసవేశ్వరుడు సంపూర్ణ ఆయురారోగ్యములనిచ్చి కాపాడుగాక.

రాయలసీమ రచయితల నుండి….

 

———–

You may also like...