పేరు (ఆంగ్లం) | D.Babanna Yadava |
పేరు (తెలుగు) | డి. బాబన్న యాదవ |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసాంబ |
తండ్రి పేరు | వెంకటరమణప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/15/1904 |
మరణం | – |
పుట్టిన ఊరు | హిందూపురం, అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | యస్.యస్.యల్.సి. |
వృత్తి | ప్రభుత్వ ఉద్యోగి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మునిసిపల్ ప్రహసనము, కవి దర్బారు, ప్రహసనమంజరి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | డి. బాబన్న యాదవ |
సంగ్రహ నమూనా రచన | శ్రీ డి. బాబన్నగారు హిందూపుర పట్టణమున ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయుచు విరామ సమయము లందు తమకు గల్గిన భావములను వ్యాసముగా వ్రాయుచుండిన అజ్ఞాత రచయతలు వీరజ్ఞాతముగా వుండుటకు ప్రధాన కారణము, ప్రభుత్వ ఉద్యోగమనియే చెప్పవచ్చును. వీరు ఆంగ్ల భాషల యందు కూడా రచనలు చేయగల సమర్థులు. వ్యవసాయ దారునిగా తన జీవయాత్రను సాగించిన ఈ రచయిత తండ్రిగారే మంత చదువుకొన్నవారు కాకపోవుటచే వీరి పెదతండ్రిగారే కవిగారి చదువుకు దోహదకారులైరి. శ్రీబాబన్నగారు తమ యస్.యస్.యల్.సి. వరకు చదివారు.. |
డి. బాబన్న యాదవ
శ్రీ డి. బాబన్నగారు హిందూపుర పట్టణమున ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయుచు విరామ సమయము లందు తమకు గల్గిన భావములను వ్యాసముగా వ్రాయుచుండిన అజ్ఞాత రచయతలు వీరజ్ఞాతముగా వుండుటకు ప్రధాన కారణము, ప్రభుత్వ ఉద్యోగమనియే చెప్పవచ్చును. వీరు ఆంగ్ల భాషల యందు కూడా రచనలు చేయగల సమర్థులు. వ్యవసాయ దారునిగా తన జీవయాత్రను సాగించిన ఈ రచయిత తండ్రిగారే మంత చదువుకొన్నవారు కాకపోవుటచే వీరి పెదతండ్రిగారే కవిగారి చదువుకు దోహదకారులైరి. శ్రీబాబన్నగారు తమ యస్.యస్.యల్.సి. వరకు చదివారు..
సాహిత్యములో ప్రహసనముల కొక విశిష్ట స్థానము లేక పోలేదు, ప్రహసనము దశ విధ నాటకములలో నొకటి, శాస్త్ర సమ్మతైనది కూడా. ఈ ప్రహసనములు మానవులననిన రంగముల యందును ప్రభావితము చేయుచున్నవి. తెలుగుదేశమున శ్రీకందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రహసనములు, మఱియు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి, ప్రహసనములు తలమానికములై కీర్తిగడించినవి. ఆ ప్రహసనములు కడుపుబ్బ నవ్వించునవియే కాదు, సంఘమందలి లోపముల నెత్తిచూపుచున్నవి. ఆ రసహసనములు సంఘ, కుల, మత, ప్రభుత్వము మున్నగు అన్ని రంగములందలి దోషములను చూపెట్టునట్టి నిలుపు టద్దములు. ఆకారణముగానే కవులు తమ రచనలలో ప్రహసనములకొక ఉన్నత స్థానముల నిచ్చుట జరిగినది. శ్రీ డి.బాబన్నగారి మయూర ప్రహసనము, కూడా ఆ కోవలో చేరినదని చెప్పవచ్చును.
హిందూపుర మందలి శ్రీ ఆర్యనారాయణ మూర్తిగారు 1910-12వ ప్రాంతముల మధ్య ‘మునిసిపల్ ప్రహసనము’ ‘కవి దర్బారు’ ‘ప్రహసనమంజరి’ మున్నగు వాటిని వ్రాసి సంఘములోని కుళ్లును బాహాటముగా ఎత్తి చూపి ప్రజలకు మేలు కలిగించిరి. శ్రీ బాబన్నగారి సహసనమందు కూడా మనకిట్టి విషయములే గోచరమకాగలవు. ఈ ప్రహసనమును విషయానుక్రమముగా వ్రాయక కొన్ని రంగములుగా విభజించి ఆయా పాత్రలచే ఆయా విషయములను చెప్పించిరి. తొలి రంగమున గోపాలశర్మ మిస్లీలా వీరిరువురి సంభాషణలు కొనసాగును, ఈ సంభాషణలలో ప్రహసనములు వాటి పుటుటుక, ఆంగ్ల, కన్నడ, తెలుగు నాటక రంగపు తీరుతెన్నులు సినిమాలు వాటి రచనలపై ప్రసంగములు కొనసాగినవి తదుపరి భిక్షాటనపై, విషాద హరిశ్చంద నాటకముపై ధ్వజమెత్తి చర్చగావించినారు. దొంగ వేషాలు వేయు హరి దాసులను, దోపీదాసులుగా ఎత్తి చూపి, ఒక చుఱుకును ముట్టించిరి ఇక ప్రజా ప్రభుత్వముపై మంత్రులపై దేశము చేయుచున్న అప్పులపై అతి చమత్కారముగా రచన సాగించిరి. ఈ ప్రహసనము నందు ఆట, పాట కొన్ని ప్రాంతీయ నానుడులను చేర్చుట ద్వారా హాస్యమునకు కొంత రాణింపు వచ్చినది. పోలీసును ‘అగ్గిపుల్లగా’ సేల్స్టాక్స్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లను మిడుతలందండుగా, నేటి సినిమాలు ‘కచడా సినిమాలుగా, నేటి మంత్రులు ‘దశమగ్రహాలు’గా, కేంద్రపరిపాలన రాజుగారి గుఱ్ఱము వ్యవహారములాంటిది’గా, ప్రభుత్వ పన్నులు ‘కాపును కరణాలు కంది గింజ మోస్తరు వేయించి, పీడించి తిన్నట్లుగా, చీట్ల పేకాటను ఆఖండరామ భజన’గా చమత్కరించి కడుపుబ్బ నవ్వించినారు.
తదుపరి వీరి ‘వీరులు – వీరపూజ’ కూడ ఒక వ్యాస సంపుటయే ఇందు కొందరు ప్రముఖ వీరుల వీరోచిత గాథలను చేర్చి నిర్వీర్యులైన ప్రజలకు వీరత్వమును నూరిపోయుటకు కృషిచేసిరి. గాంధీ, వల్లభాయి పటేలు స్వాతంత్ర్యసమర వీరులుగాను, శివాజీ హిందూ మతోద్ధరణకు పాటుబడిన మహారాష్ట్ర వీరుడుగాను, భారత రామాయణ కాలము నాటి వీరులను ప్రాచీన వీరులుగా నిందు పరిగణింపబడిరి. వీరే కాక అధర్మము నణచి ధర్మోద్ధరణకై కంకణము కట్టుకొన్న మహనీయులు, అంతశ్శత్రువులను జయించిన స్త్రీ పురుషులందరు కవిగారి దృష్టిలో వీరులే. ఆభావనం నిందు కవిగారు చక్కగా సమన్వయ పరచిరి.
శ్రీ బాబన్నగారికి చిన్న తనము నుండియే భగవద్గీతపై ఒకప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడినది. పెనుకొండలో వీరు యస్.యస్.యల్.సి. చదువుచున్నప్పుడే ప్లీడరు శ్రీ జి. వెంకటసుబ్బయ్య గారితో పరిచయమేర్పడి వారిద్వారా భగవద్గీత పరన ప్రారంభమైనది వారొక ఆంగ్ల భగవద్గీతను దానికి సరితూగు శ్రీ ఆదిపూడి సోమనాథరావు గారి పద్య భగవద్గీతనిచ్చి నిత్యపారాయణము గావించుమని కోరిరి. అప్పటి నుండి కవిగారి మనోవీధిలో గీతార్థరేఖ గీయబడెను. ఉద్యోగ విరమణానంతరము గీతాసారము నంతటిని ఆధునిక పరిస్థితులకు సమన్వయ పఱచుచు సోదాహరణములతో, సామాన్య పాఠకులకు కూడ సులభముగా అర్థమగునట్లు వచనములోవ్రాయ తలపెట్టిరి. ఆ కృషి 1979 నాటికి ఫలించినది. దీనిని శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాల వారు తమ 24వ పుష్పముగా ప్రకటించిరి.
భగవద్గీతలోని 18 అధ్యాయముల సారమును 22 శీర్షికలుగా విభజించి వ్రాసిరి. ఇందు 12 జ్ఞాన సూత్రము లనుభాగము ప్రముఖమా చదువదగినది. ఈ గ్రతంథముపై ఆంద్రప్రభ – ఆంధ్రపత్రికలు తమ అభిప్రాయముల నిట్లు వ్రాసినవి.
‘‘ఇది అనువాదంకాని, వ్యాఖ్యగాని, సారంకాని కాదు, భగవద్గీతను బాగా అవగాహన చేసుకొన్న రచయిత గీత మనకు ఏమి చెప్పుచున్నది. సులభమైన పద్ధతిలో పెక్కు శీర్షికలలో వివరించారు. భగవద్గీతలోని విషయాలను సులభంగా అవగాహనము చేసుకొనుటకు ఈపుస్తకము బాగా ఉపయోగిస్తుంది – ‘ఆయాప్య’
‘‘ఇందు రచయిత అక్కడక్కడ నారాయణ పండితుల పద్యాలు ఆదిపూడి వారి పద్యాలు ఉదహరించినారు. సాంఖ్య వివరణ, 12 జ్ఞానసూత్రాలు అనే భాగం ప్రముఖంగా చదువవలసింది. అలాగే సాధన సంపత్తికి బాబన్నగారిచ్చిన మార్గాలు మరీ గమనీయాలు, భగవద్గీతపై ఎన్నో రచనలు వస్తున్నాయి వస్తాయి. ఇది పులుముడు లేకుండా, ఆంతర్యమును తేట తెల్లముగా తెలిపే రచన, కనుక గీతా విషయమును సులభముగా తెలుసుకోగోరు వారికి, వరప్రసాదము వంటిది. అని నిస్సంకోచముగా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక తత్త్వమును అందరికి అందుబాటుగా బోధించే ఉత్తమ కృతి – ‘‘శ్రీ యామిజాల పద్మనాభ స్వామి’’.
శ్రీ బాబన్నగారు 1979లో అనారోగ్యమువల్ల ప్రభుత్వ ఆస్పత్రిచేరిరి, అప్పుడు వారికీ అశాశ్వత కాయమున్నంతలోనే తాను వ్రాసిపెట్టిన ‘భగవద్గీత సందేశము’ ను ప్రకటింపవలెననెడి ధృఢసంకల్పము కలిగినది. శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలకు రూ. 1000 సమర్పించి గ్రంథమాల ద్వారా వెలువరింపజేసిరి. వారి సాహిత్యసేవకై ఉదారముగా విరాళముల నిచ్చిన దాతలు. సౌమ్య స్వభావులు, నిరాడంబరులు, దేవబ్రాహ్మణులయందు భక్తి విశ్వాసములు గలవారు. కళాప్రియులు, విద్యా సంస్కరణలందు సత్వరాభృద్ధిని కోరు అభివాదులు వీరు రెండు వివాహములు చేసుకొన్నను సంతానము పొందలేక పోయిరి. వీరి కృతులే వీరికి పుత్రీరత్నములుగా మిగిలినవి. 1956వ సం. నుండి వీరు హిందూపుర మందలి శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాలకు కార్యదర్శిగా పనిచేయుచున్నారు. వీరికి ప్రాంతీయాభిమానము హెచ్చు. రాయలసీమలో అజ్ఞాతమగా బడివున్న విశిష్ట వ్యక్తులందరిని గూర్చి ల కమనకు పరిచయము చేయవలెననెడి సంకల్పముగల వారు. ఆ ఉద్ధేశ్యముతోడనే వారు ‘స్థానిక గొప్ప వ్యక్తులు’ అను పేర అప్పుడప్పుడు కరపత్రములను ముద్రించి, సాహితీ లోకమున కందించెడి వారు. వీరి కృషి పలువురి ప్రశంసలను పొందినది.
తదుపరి వీరి ఆంగ్లరచనలలో ముద్రితములు ‘లిటరరీ మ్యూజింగ్స్ (Literary Musings) మాడరన్ పోయిట్రీ (Modern Poetry) ఠాగూరు వారి గీతాంజలి పద్యములను, కొన్నింటిని అనుసరణీయ పద్యములుగా నిందు పొందుపరచిరి. వీరాంధ్రాంగ్ల భాషా సాహిత్యము లందెన్నదగిన కృషిని గావించిరి. విశ్వశ్రేయోమతము –‘Glimpses into English Literature’ అనునవి,వీరి అముద్రితములుగా నిలిచిన వ్యాససంపుటములు. 77 ఏండ్ల ఈ వయస్సులో వీరు ఏకాంత జీవితమును గడపుచు చదువు, వ్రాతలందుత్సాహము చూపుచు, సాహిత్య సభలందు శ్రోతగా పాల్గొనుచు, భావకవిత్వ రంగములోనికి దూకుదునా యని యువ్విళ్లూరుచున్న నవనవోన్మేష బాలవృద్ధ కవులనటలో పొరబాటు లేదు. వీరికి భగవంతుడు ఆయురారోగ్యముల నొసంగి కాపాడుగాక.
రాయలసీమ రచయితల నుండి…
———–