గిడుగు రామమూర్తి (Gidugu Rama Murthy)

Share
పేరు (ఆంగ్లం)Gidugu Rama Murthy
పేరు (తెలుగు)గిడుగు రామమూర్తి
కలం పేరు
తల్లిపేరువెంకమ్మ
తండ్రి పేరువీర్రాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/29/1863
మరణం1/22/1940
పుట్టిన ఊరుశ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగ క్షేత్రం దగ్గర పర్వతాలపేట గ్రామం
విద్యార్హతలుబి. ఏ.
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలుతెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, ఒరియా, సవర
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం
సాహిత్య వ్యాసాలు
బాలకవి శరణ్యం
Memorandum on Modern Telugu
A Manual of Sora Language
ఇతర రచనలుhttp://www.languageinindia.com/nov2013/pavanramamurthigarufinal1.pdf
http://eemaata.com/em/issues/200509/66.html
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1913 లో “రావు బహదూర్‌” బిరుదు;
1934 లో ‘కైజర్-ఇ-హింద్ ‘;
1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణ.
ఇతర వివరాలుతెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. సవరభాషకి లిపిని కల్పించాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిన్నపము- వ్యవహారిక భాషోద్యమ చరిత్ర- వ్యాసం
సంగ్రహ నమూనా రచన

విన్నపము- వ్యవహారిక భాషోద్యమ చరిత్ర- వ్యాసం

మేము ఉద్దేశించిన ప్రయోజనము:- ఇంగ్లాండులో ఇంగ్లీషు, ఫ్రాన్సులో ఫ్రెంచి ఎట్లున్నవో – అట్లే తెలుగుదేశములో పెద్దలు నోటను వాడే నేటి తెలుగు భాషకు సాధ్యమైనంత దగ్గరగా తెలుగు వ్రాత తెచ్చి నోటి మాటా, చేతి వ్రాత ఒకదాని కొకటి పోషకములుగా చేసి, రెంటికిని సమముగా ప్రవృత్తి కలిగించి, వ్రాత సార్థకముగాను సులభముగాను చేసి, తెలుగువారు వ్రాసేదేకాక మాట్లాడేది కూడా సభ్యభాషే అనే గౌరవము దేశమునకు సంపాదించడము.

మా దృష్టిలో ఇదే వాస్తవమైన భాషాభిమానము. వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా? మా ఉద్దేశము కొనసాగితే, పెద్ద మనుష్యులు వ్రాసే సభ్య భాష దేశమంతా క్రమక్రమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుంది.

పామరులకు సులభమైన వాఙ్మయము పుట్టుతుంది. వక్తలకూ వాచకులకూ తగిన భాష కుదురుతుంది. మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూ ఉన్నట్టే మన దేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మన భాష నేర్చుకొని మన భాషలోనే వ్రాసి గాని నోటను చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును.

విన్నపము- వ్యవహారిక భాషోద్యమ చరిత్ర- వ్యాసం

          మేము ఉద్దేశించిన ప్రయోజనము:- ఇంగ్లాండులో ఇంగ్లీషు, ఫ్రాన్సులో ఫ్రెంచి ఎట్లున్నవోఅట్లే తెలుగుదేశములో పెద్దలు నోటను వాడే నేటి తెలుగు భాషకు సాధ్యమైనంత దగ్గరగా తెలుగు వ్రాత తెచ్చి నోటి మాటా, చేతి వ్రాత ఒకదాని కొకటి పోషకములుగా చేసి, రెంటికిని సమముగా ప్రవృత్తి కలిగించి, వ్రాత సార్థకముగాను సులభముగాను చేసి, తెలుగువారు వ్రాసేదేకాక మాట్లాడేది కూడా సభ్యభాషే అనే గౌరవము దేశమునకు సంపాదించడము.

          మా దృష్టిలో ఇదే వాస్తవమైన భాషాభిమానము. వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా?

          మా ఉద్దేశము కొనసాగితే, పెద్ద మనుష్యులు వ్రాసే సభ్య భాష దేశమంతా క్రమక్రమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుంది. పామరులకు సులభమైన వాఙ్మయము పుట్టుతుంది. వక్తలకూ వాచకులకూ తగిన భాష కుదురుతుంది. మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూ ఉన్నట్టే మన దేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మన భాష నేర్చుకొని మన భాషలోనే వ్రాసి గాని నోటను చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును. భాషలో ఐక్యమువల్ల దేశమునకు రాష్ట్రమునకు ఎంతబలము కలుగునో చరిత్ర చదివిన వారికీ రాష్ట్రము ఏలేవారికీ తెలుసును. వాదుకలో ఉన్న భాషవల్ల కలిగే ఇన్ని లాభములు విడిచి, వాడుకలో లేనిదీ, కొద్దిమంది పండితులకు మాత్రమే సాధ్యమయినదీ, ప్రాచీన భాష వ్రాతలలో వాడడము వ్యర్థప్రయాసము కాదా? ఆచారము దేశములోనూ లేదు. మన దేశమందయినా పూర్వము లేదు. మన తాతలనాడు లేదు. మన తండ్రులనాడు లేదు. ఒక్క తరములోనే వైపరీత్యము, ఉత్పాతము పుట్టినది. విషయము ముందు ముందు మేము విపులముగా చర్చించ దలచుకొన్నదే; గాని ఇక్కడ సూచనగా మాత్రము చెప్పినాము.

          పత్రికలు గానీ, పుస్తకములు గానీ, వ్రాసే వారి ముఖ్యోద్దేశ మేమి? నోట మాట్లాడే వారి ఉద్దేశమే: తమ అభిప్రాయములు ఇతరులకు తెలియజేయడము. మాట్లాడడము తమ ఎదుటనున్న వారికోసము. వ్రాయడము దూరముగా నున్న వారికోసము. ఎవరి మట్టుకు వారు జ్ఞాపకముగా వ్రాసి పెట్టుకోవడము కూడా గలదు. నోటి మాటకన్న చేతివ్రాత మేలయినది. నోటిమాట ఒక్కమారే వినబడును గాని చేతివ్రాత చాలామార్లు చూచి చదువవచ్చును. వ్రాత అనగా కాగితము మీద మాట్లాడడము. వ్రాసిన కాగితము ఒక విధమైన గ్రామోఫోను పలక. వ్రాసేవారు తమ నోటను పలికిన పలుకులే చదివేవారు తిరిగి తమ నోటను పలుకుతారు. ఇదే నోటిమాటకూ చేతివ్రాతకూ గల సంబంధము. నోట పలికినది గానీ, చేత వ్రాసినది గానీ, మాటయినా భావమును బోధించుట సాధనమాత్రము. అది పాత్రవంటిది అన్నా అనవచ్చును. ఏదో ఒక పాత్రలో పోయక నీరు నిలవనట్లు, మనోభావము ఏదో ధ్వని ద్వారా గాని స్పష్టముగా తెలియదు. మనోభావమునకు ఆధారముగాను సంజ్ఞగాను ఉన్న ధ్వనికే గదా భాష అని పేరు. ధ్వనికి గుర్తులు గదా వ్రాసిన అక్షరములు! ఇతరులకు జ్ఞానేంద్రియము ద్వారా నయినా తెలియరాక నిగూఢముగా ఉన్న ఒకరి మనో భావము పైకి వినబడే ధ్వనులవల్ల తెలుపుడు కావడము చాలా చిత్రమయిన విషయము. అట్లే చెవికి వినబడే ధ్వనులకు కంటికి కనబడే గురుతులు వాడడము కూడా అద్భుతమైనదే. వాటి రహస్యము తత్త్వవేత్తలు ఎరుగుదురు. దానిని గురించి మరొకప్పుడు విచారింతము గాని ఇప్పుడు అది అట్లుండనీయండి.

          నాగరికత గల ప్రతి దేశములోను ఎక్కువ నాగరికత గలిగి పెద్దలని పేరు పొందిన వారు నిత్యమూ వాడుకొనే భాష సభ్య మయినదనిన్నీ ఇతరులు వాడుకొనేది అసభ్యమైన దనిన్నీ ఎన్నిక చేయడము కద్దు. దేశములో నాగరికత వ్యాపించిన కొలదీ సభ్య భాషకూడా వ్యాపించి అదే సామాన్య భాష అవుతున్నది. ఇంగ్లీషు వారిని గురించి, అంతో ఇంతో వారి భాషను గురించీ మన వారికి చాలా మందికి ఎంతో కొంత తెలుయును. ఫ్రెంచి వారు, జర్మనులు మొదలయిన వారి భాషలను గురించి కూడా కొందరెరుగుదురు. వీరిలో పెద్దలయిన వారి వ్యావహారిక భాషే వారి దేశములో సామాన్య భాష; దేశ భాష. అట్టి భాష మాట్లాడే వారందరూ అది వ్రాయగలరు. వ్రాసే భాషకున్ను మాట్లాడే భాషకు వ్యత్యాసము అట్టే ఉండదు. స్వీట్ పండితుడు చెప్పినట్లువచనములోని భాష మాట్లాడే భాషకు దగ్గరగా ఉంటుంది (The language of prose often approaches very closely to that of ordinary conversation – Sweet’s English Grammar Vol. I)” ఔచిత్యము, పదములలోని కూర్పు, సొంపుఇవన్నీ రసికుల భాషలోవ్రాసినప్పుడే కాక మాట్లాడినప్పుడు కూడాకనబడక మానవు. సామాన్యులు నేర్పులేక ఏదో ఒక విధముగా తమ అభిప్రాయములు చెప్పినా విభక్తులు, ఆదేశములు, ఆగమములు, అనుబంధములు, శబ్దార్థములు, మొదలయిన వన్నీ పండితులు మాట్లాడే భాషకు పామరులు మాట్లాడే భాషకు సామాన్యమే.

          లోక వ్యవహారములో పండిత పామర సామాన్యముగా అందరినోటను నలుగుడు పడుతూ ఉన్న భాష ఎంతో కొంత మార్పు పొందడము భాషకు సహజధర్మమే. ప్రాచీన పుస్తకములు చూచిన వారందరూ ఇది లెస్సగా ఎరుగుదురు. భాషాతత్త్వ మెరిగిన వారికి భాష మారడము వింతగా కనబడనే కనబడదు. మారకపోవడమే అసంభవము. ఇంగ్లీషు భాషకు వ్రాసినట్లే ఫ్రెంచి మొదలయిన భాషలకున్ను పండితులు భాషా చరిత్రములు వ్రాసి ఉన్నారు. భాషా చరిత్రమనగా భాషలో కలిగిన మార్పుల వృత్తాంతమే కదా. ఎప్పుడూ ఒక్కలాగున ఉండే భాషకు చరిత్రమే లేదు. వాడుకలో లేక గ్రంథములందు మాత్రమే నిలిచి ఉన్న భాషకు మరి మార్పు ఉండదు; మరి చరిత్రమూ ఉండదు. నిఘంటువులున్ను, వ్యాకరణములున్ను, వాడుకలో ఉన్న వ్యవహారిక భాషలకు కావలెను; వాడుకలో లేని ప్రాచీన భాషలకూ కావలెను. మొదటి వాటికి లక్షణము భాషతో కూడా మారుతూ ఉండవలెను; తక్కిన వాటికి లక్షణము స్థిరముగా నిల్చి ఉండవలెను. లాటిన్, సంస్కృతము మొదలయిన వాటి లక్షణము స్థిరమైనదే. ఇంగ్లీష్ భాషకు 1775 లో జాన్సన్ పండితుడు వ్రాసిన నిఘంటువు ఇప్పుడు పనికి రాదు. వెబ్స్టర్ పండితుడు సుమారు నూరేండ్ల క్రిందట వ్రాసిన ఇంగ్లీషు నిఘంటువు ఎన్నో సార్లు పునర్ముద్రితమైనది; అయినప్పుడెల్లా గ్రంథము సవరణ కూడా అవుతూనే వచ్చినది. బెన్ జాన్సను (1600) మొదలయిన పండితులు వ్రాసిన ఇంగ్లీషు వ్యాకరణములలోని లక్షణము ఇప్పటి ఇంగ్లీషుకు పట్టదు. ఎందుచేత? భాష మారినది కనుక. వైల్డు అనే పండితుడు చెప్పినట్లు వ్యాకరణము భాషకు ఆధారము కాదు: భాషే ఆధారము వ్యాకరణమునకు. “పూర్వ కాలమందు జనులు ప్రకారమే మాట్లాడే వారు. గనుక ఇప్పుడు కూడా జనులు అట్లే మాట్లాడ వలెను.” అని నియమించేవాడు మంచి శాస్త్రకారుడు కాడు. ఎందుచేత నంటే భాష ఎల్లకాలము ఒకటే తీరున ఉండదు; మారుతూ ఉంటుంది; మార్పు వల్ల కీడుగానీ, మేలుకానీ, మారినదేమో మారినదే; అనివార్యము. మార్పు గ్రహించి యథాశక్తి తన కాలమందు వాడుకలో ఉన్న సభ్య భాష ఎట్లుంటే అట్లే పాటించవలెను శాస్త్రకారుడు

మిగిలిన వ్యాసాన్ని కింది pdf ఫైల్ లో చదవగలరు: http://eemaata.com/books/giDugu/vinnapamu.pdf విన్నపము 

(ఈమాట సౌజన్యంతో-)

———–

You may also like...