గుంటి సుబ్రహ్మణ్యశర్మ (Gunti Subrahmanya Sharma)

Share
పేరు (ఆంగ్లం)Gunti Subrahmanya Sharma
పేరు (తెలుగు)గుంటి సుబ్రహ్మణ్యశర్మ
కలం పేరు
తల్లిపేరుజానకమ్మ
తండ్రి పేరుగుంటి భాస్కరప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1905
మరణం
పుట్టిన ఊరుకల్యాణదుర్గం, అనంతపురం జిల్లా
విద్యార్హతలుబి.కాం.
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభూతగృహము, రహస్యశోధన, విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము), మాధవాశ్రమము (నవల), విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము), శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము), జయాపజయములు,
కాసులదండ, కాలభ్రమణం, కన్నీటికాపురం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిశేఖరుడు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగుంటి సుబ్రహ్మణ్యశర్మ
సంగ్రహ నమూనా రచనపెన్నేటిగట్టున పుట్టిన ‘శ్రీకవిత్వవేది’ పదును కలమునుండి వెలువడిన ఉద్గ్రంథము ‘అశోక్ సామ్రాట్’, ఆ సామ్రాట్ మనస్సున కూరట కల్గించిన శాంతిమూర్తి బౌద్ధమతస్థాపకుడు, విశ్వజ్యోతిగావెల్గిన బుద్ధదేవుని జీవిత చరిత్ర నొక ఉద్గ్రంథ రాజముగా మలచిన కవిశేఖరుడు శ్రీ గుంటి సుబ్రహ్మణ్యశర్మ. వీరిరువురు అనంతపురం జిల్లా సాహిత్య చరిత్రలో ఎన్నదగిన చారిత్రాత్మక కావ్యనిర్మాతలే. శ్రీ గుంటివారి ‘విశ్వజ్యోతి’ కావ్యము సుమారు రెండువేల పద్యములు కల్గి, బదాశ్వాసములుగా ప్రబంధశైలిలో తేనెలూరు తేటతెనుగునుడికారముతో వెలువడి, జిల్లా సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట స్థానము నందుకొన్నది.

గుంటి సుబ్రహ్మణ్యశర్మ

పెన్నేటిగట్టున పుట్టిన ‘శ్రీకవిత్వవేది’ పదును కలమునుండి వెలువడిన ఉద్గ్రంథము ‘అశోక్ సామ్రాట్’, ఆ సామ్రాట్ మనస్సున కూరట కల్గించిన శాంతిమూర్తి బౌద్ధమతస్థాపకుడు, విశ్వజ్యోతిగావెల్గిన బుద్ధదేవుని జీవిత చరిత్ర నొక ఉద్గ్రంథ రాజముగా మలచిన కవిశేఖరుడు శ్రీ గుంటి సుబ్రహ్మణ్యశర్మ. వీరిరువురు అనంతపురం జిల్లా సాహిత్య చరిత్రలో ఎన్నదగిన చారిత్రాత్మక కావ్యనిర్మాతలే. శ్రీ గుంటివారి ‘విశ్వజ్యోతి’ కావ్యము సుమారు రెండువేల పద్యములు కల్గి, బదాశ్వాసములుగా ప్రబంధశైలిలో తేనెలూరు తేటతెనుగునుడికారముతో వెలువడి, జిల్లా సాహిత్య చరిత్రలో ఒక విశిష్ట స్థానము నందుకొన్నది.
శ్రీ సుబ్రహ్మణ్యశర్మగారు శతాధిక గ్రంథకర్తలు, పద్యరచనలోనే కాదు; వచనరచనలో కూడ వీరు సిద్ధహస్తులు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషలందు విద్యావంతులు. సంస్కృతమును గురుముఖముగా కాకుండ కేవలము స్వయంకృషితో వీరు నేర్చిరి. క్రొత్తగా అపరాధ పరిశోధక నవలలు వెలువడుచున్న ఆనాటికాలములో వీరు ‘భూతగృహము’ ‘రహస్యశోధన’ అనబడు నవలలు వ్రాసి పేరుదెచ్చుకొనిరి. ‘భూతగృహము’ నవలకు ఆంధ్రప్రచారణీ గ్రంథమాల కాకినాడ వారు మెచ్చి ఆకాలమున రూ. 116 లు పారితోషక మిచ్చిరి. క్రమేపి నవలారచనతో ప్రారంభించిన వీరి కలము 18 నవలలు, 18 బాలసాహిత్యపు కథలపుస్తకములు 18 ప్రబంధ వచన కావ్యములు 20 వరకు దేశనాయకుల జీవితగాథలు, 8 పద్యకావ్యములు 8 తర గ్రంథములను వ్రాయగలిగి, జిల్లాలో పేరును, మెప్పును పొందినది. వీరి ‘మాధవాశ్రమము’ నవల, రెండు భాగములుగా హిందూపురం శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల ద్వారా వెలువడినది, ఇందెన్నియో, సాంఘిక సమస్యలు పరిష్కరింపబడినవి. ఈ నవల భారతి, గృహలక్ష్మి మున్నగు పత్రికల ప్రశంసల నందుకొన్నది.
శ్రీ శర్మగారి కవితాధార శుద్ధికలది, సంస్కృతాంధ్ర భాషాసమ్మేళనమైనది. వీరి పదములకూర్పు, పద్యముల నడక, భావముల పొందిక మెచ్చదగినది. భముగ్రంథ పరిచయము గలవారగుటచే ‘బుద్ధచరిత్ర’ కొక చక్కని రూపము నిచ్చి, అతనిని విశ్వజ్యోతి స్వరూపునిగా నిరూపించిరి.
సిద్ధార్థుని మనసునకు జీవితము నిస్సారమని తెలిపినది, అతడొకవింత ప్రవృత్తిలో పడి కొట్టుమిట్టాడు చున్నాడు. అతని అంతర్వాణి అతనిని ప్రబోధించినది. ఒకనాడు సిద్ధార్థుడు నిద్రనుండి మేల్గాంచి భార్యనుద్దేశించి యిట్లనుచున్నాడు.
ఉ. ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
మిన్నలుకావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తినెల్గ, నా
పన్నుల సేవఁజేతు; నిదిపాడియు; మద్భవసార మిద్ధరన్
ఆ. ఏమిసేతు సకట నలేని నీరూప
కాంతి, రెంట దీన కష్టజనుల
యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
కం. తనయుడనై నీ యొడిలో
దవరారుచు నుందు నింక తలఁకక, నాపై
మనసుంచక, యేలోటును
గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
ఇట్టి రసవత్తర ఘట్టములిందు పెక్కులున్నవి. మధురాహారము నందేభాగము మధురముగా నుండదు? రసగుళికల వంటి పద్యములిందు అసంఖ్యాకములు. గ్రంథమును చదివి రసాస్వాదన గావించుటయే సాహితీ రసికులు చేయవలసిన ముఖ్యపని ‘విశ్వప్రేమ’ యనుపేర శ్రీ బసవేశ్వరుని జీవితమునందలి అంతిమ ఘట్టము నొకచిన్న పద్యసంపుటిగా రచించిరి. అందలి బోధన లిట్లున్నవి.
మ. మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
లొక్కటౌదురు, భువిలోన నుక్కిపిదప
నెవర లేమౌదురో దేపు డెఱుగు సకట
మురిసి పోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
ఈ కవిగారు అనంతపుర మండలమున అనేక స్కూళ్ళయందు సెకండరీగ్రేడు ఉపాధ్యాయులుగా పనిజేయుచు ఇంటర్మీడియట్, బి.కాం., పరీక్షలు ప్రైవేటుగా చదివి ఉత్తీర్ణులైరి. తొలుతనుండియు వీరు ఆధ్యాత్మిక విచారమును కలిగి స్వప్రయోజనములందు నిస్పృహగలవారై ఉన్నంతలో జీవితమును సాగించు శాంతమూర్తులు. అనంతపురం రాయల కళాగోష్ఠివారు వీరి ‘విశ్వజ్యోతి’ కావ్యము నావిష్కరించి, శ్రీ గడియారం వేంకటశాస్త్రుల వారి సమఓమున ‘మహాకవి’ యను బిరుదమును ప్రసాదించిరి. వీరి మరొక అముద్రిత ఉద్గ్రంథము ‘శ్రీ రామకృష్ణ భాగవతము’ 5000 పద్యములు గలి. త్వరలో వెలువడుటకు రాయలసీమలోని దాతలు చేయూత నిత్తురుగాక. ఒక గ్రంథము వ్రాయుట కెంత కష్టమున్నదో దానిని వెలుగునకు దెచ్చుటకు పదింతలు కష్టమున్నదనియు, అమ్ముడుపోవుటకు నూరింతలు తొందరలున్న వనియు కవులకే కాదు ఎల్లరకూ విదితమైన విషయమే, అట్లని కవులు వ్రాయకుందురా?
నైజగతమైన శక్తిచే నడ్డు దెలిపి
వ్రాయు కుండగ నుండ మా వశముగారు
వ్రాసి ముద్రింపలేని యీ వ్రాతలెల్ల
శిథిలమౌగాదె మరుభూమి శిల్పమట్లు.
అని శ్రీ గుంటి సుబ్రహ్మణ్యశర్మగారు వాపోవుటలో అసత్యములేదు. ఆ కావ్యశిల్పములు శిథిలమగుట మన సంస్కృతికే లోటు. అందుకు మనము కారకులము కారాదు. దీనినెల్లరూ ఎఱిగి దివ్యనిర్మాణకృషికి భూరి దాతృత్వగుణముకల్గి సజ్జమ లుందురుగాత. భగవంతుడు సదా మహాకావ్య నిర్మాతలకు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించుగాక.

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...