డాక్టర్ గుంటుపల్లి రాధాకృష్ణ మూర్తి (Dr. Guntupalli Radhakrishnamurthy)

Share
పేరు (ఆంగ్లం)Dr. Guntupalli Radhakrishnamurthy
పేరు (తెలుగు)డాక్టర్ గుంటుపల్లి రాధాకృష్ణ మూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుగుంటుపల్లి శ్రీనివాసరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/25/1930
మరణం
పుట్టిన ఊరుకర్నూలు జిల్లా -బనగానపల్లి తాలూకా నందవరం
విద్యార్హతలు
వృత్తినేత్ర వైద్యులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురుక్మిణీ కల్యాణము, జానకి పరిణయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికడాక్టర్ గుంటుపల్లి రాధాకృష్ణ మూర్తి
సంగ్రహ నమూనా రచననేటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక చదువరులకు శ్రీ గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి గారి పేరు సుపరిచయమే. వీరి వైద్య విజ్ఞానం శీర్షిక జనరంజకంగా , బహుజనుల కుపయోగముగా నిర్వహింపబడుచున్నది. అనంతపురం పట్టణంలో వీరు సుప్రసిద్ధ నేత్ర వైద్యులుగా వాసికెక్కియున్నారు. అటు వృత్తిరీత్యా వారు డాక్టర్లు. ఇటు సాహిత్యంలో డాక్టరేట్ బిరుదును పొందదగిన సమర్ధులు, విజ్ఞానవంతులు , నేత్ర శాస్రాచార్యులు. పేదల పాలిట కొంగుబంగారం . నిర్మల హృదయులు , నిరాడంబరులు. సాహిత్య ప్రియులతో చెలిమి నాకాక్షించు తత్వము వారిది.

డాక్టర్ గుంటుపల్లి రాధాకృష్ణ మూర్తి

నేటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక చదువరులకు శ్రీ గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి గారి పేరు సుపరిచయమే. వీరి వైద్య విజ్ఞానం శీర్షిక జనరంజకంగా , బహుజనుల కుపయోగముగా నిర్వహింపబడుచున్నది. అనంతపురం పట్టణంలో వీరు సుప్రసిద్ధ నేత్ర వైద్యులుగా వాసికెక్కియున్నారు. అటు వృత్తిరీత్యా వారు డాక్టర్లు. ఇటు సాహిత్యంలో డాక్టరేట్ బిరుదును పొందదగిన సమర్ధులు, విజ్ఞానవంతులు , నేత్ర శాస్రాచార్యులు. పేదల పాలిట కొంగుబంగారం . నిర్మల హృదయులు , నిరాడంబరులు. సాహిత్య ప్రియులతో చెలిమి నాకాక్షించు తత్వము వారిది.
వీరి తండ్రి గారు కవులు. వారు రుక్మిణీ కల్యాణము, జానకి పరిణయమను కావ్యములను వ్రాసిరి. శ్రీ రాధాకృష్ణ మూర్తి
గారు తమ అన్న గారైన శ్రీ గుంటుపల్లి శ్రీరామమూర్తి గారి వద్దనే పెరిగి పెద్దవారై విద్యాబుద్ధులు నేర్చుకొనిరి . మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో B.Sc డిగ్రీని 1949లో కవి గారు పొందిరి .
తరువాత సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య శాఖలో చేరిరి. నేత్ర వైద్యములో ఉన్నతోన్నతమైన ఎం.ఎస్ డిగ్రీని 1961 లో చేపట్టిరి. కర్నూలు,వరంగల్ వైద్య కళాశాల లో సహాయ నేత్ర శాస్త్రాచార్యులు (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అఫ్త్తాల్మాలజీ ) గా పని చేసిరి . 1968లో వీరి పరిశోధనా పత్రాలకు గుర్తింపుగా అంతర్జాతీయ శాస్త్ర వైద్యుల కళాశాల చికాగో (అమెరికా) వారు రాధాకృష్ణ మూర్తి గారిని సభ్యులుగా ఎన్నుకొని డిగ్రీనిచ్చి సత్కరించిరి.
1965 ఆగస్ట్ 15 వ తేదీ నాడు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి నేత్ర వైదులుగా నియమించబడిరి. ప్రభుత్వ వుత్తర్వుననుసరించి వారు స్వతంత్రముగా ప్రాక్టీసు చేయదలచి ప్రభుత్వ ఉద్యోగమునకు ఉద్వాసన నిచ్చిరి. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరు అనంతపురం కోర్టురోడ్డులో స్వతంత్ర కంటివైద్య ఆస్పత్రిని స్థాపించి పేరు ప్రఖ్యాతులు పొందిరి.
వైద్యమునందే కాక రచనా వ్యాసంగములోనూ రాధాకృష్ణమూర్తి గారు ఆరితేరినారు. చిన్నతనము నుండి వీరికి తెనుగు భాష యందు మక్కువ మెండు . 1945 లో వీరు మద్రాసునందు యస్.యస్.యల్సీ చదువుతున్నపుడే వీరి తెలుగు పండితులు శ్రీ గరిమెళ్ళ సత్య గోదావరి శర్మగారు తరగతిలోని విద్యార్ధులకు ఛందస్సు బోధించుచు , ప్రతి పిల్లవానిని ఒక పద్యము వ్రాసుకొని రావాలసిందిగా ఆజ్ఞాపించిరి. మరుసటి రోజే రాధాకృష్ణ మూర్తి గారు ఉపాధ్యాయులవారికి ఒక పద్యము వ్రాసుకువచ్చి చూపిరి. తెనుగు పండితులవారు మెచ్చుకుని నీకు తెనుగు సాహిత్యములో మంచి భవిష్యత్తు కలదని ఆశ్వీర్వదించిరి. ఆనాటి వారి ఆశీర్వాద ఫలితంగానే ఈనాడొక గొప్ప రచయుతగా వెలుగుచున్నారు శ్రీ గుంటుపల్లి వారు . ” సుదినం’ వీరి తొలి రచన. 1946 లొ శ్రీ దుర్గాబాయి దేశముఖ్ గారి ” ఆంధ్రమహిళ” మాసపత్రికలో అలంకరించినప్పటినుండి వారి రచనా జీవితం సుదినంగా పరిఢవిల్లినది. తరువాత ఆంధ్రమహిళ -చిత్రగుప్త- నవజీవన- ఆనందవాణి-జయశ్రీ – కిన్నెర- ఆంధ్రప్రభ మున్నగు సుప్రసిద్ధ పత్రికలలో కథానికలు , వ్యాసాలు, నాటికలు, పద్యాలు, గేయాలు ధారావాహినిగా ప్రచురింపబడినవి. వీరు శతాధిక కథలనే రచించిరి. అందులో ప్రజామోదము పొందినవి. 1)కుబేరపుష్పము 2) మనసు మలుపుల్లో 3)లాటరీ చీటీ 4)షష్టాష్టకం 5)దోమతెర , తగాదా మొదలైనవి.
నవలా రచనలో కూడా గుంటుపల్లి వారు సిద్ధహస్తులు 1) గెలుపు 2)ప్రకాశము-ప్రేమ 3) చక్కని చుక్కలు పత్రికల్లో ధారావాహికంగా ప్రచురించబడిన నవలలు. వీరి ఓట్ల వేట నాటకము అనంతపురము లలితకళా పరిషత్తు వారిచే అనేక పర్యాయములు ప్రదర్శించబడి , హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రదర్శించబడి మెప్పులు పొందింది. ” టోకరా”- “ప్రేయసి” వన్ టూ త్రీ మొదలగునవి వీరి కలము నుండి వెలువడిన ఇతర నాటికలు, ఇటీవలనే ఆకాశవాణిలో వీరి ‘మరో జవహర్” అనే నాటికా ప్రసారమైంది.
1) చందమామ యాత్ర 2)హాస్య కుసుమాలు,3)హక్కులు-విధులు 4) విజ్ఞాన విశారదులు (5 భాగములు)5) కళ్లను కాపాడుకోండి మున్నగునవి వీరి ముద్రిత పుస్తకములు. వీరి రచనలకు భారత ప్రభుత్వ బహుమతులు కూడా లభించినవి.1956 లో ” ఆరోగ్యమే మహాభాగ్యము” 1957 లో “సంఘ జీవనం “. 1961 లోజ్ఞానపంచమి ‘ అనే వైద్య గ్రంథాలకు భారత ప్రభుత్వ బహుమతులు కూడా లభించినవి. వరుసగా మూడు సంవత్సరాలు భారత ప్రభుత్వ బహుమతి పొందుట వారికి గల ఘనతకు తార్కాణము. 1958లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బహుమతి వీరి ‘విజ్ఞానం” అనబడు పిల్లల పుస్తకమునకు లభించినది. 1964లో నెల్లూరు పౌరులు జరిపిన “కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి వర్థంతి ” సందర్భముగా శాస్త్ర రచన బహుమతి వీరి వైద్యవిజ్ఞానమునకు దక్కినది.
1960 లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి సంచికలో “తెలుగు కలాలు” శీర్షికలో రాధాకృష్ణ మూర్తి గారు తెలుగు పాఠకులకు పరిచయము చేయబడిరి. సంపాదకులు రచయుత గూర్చి ఇట్లు చెప్పిరి. ” సులువైన భాషలో బరువైన విషయాలను రచించగలగడం వీరి ప్రత్యేకత ” ఈ విషయం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడుచున్న వైద్య విజ్ఞానం వ్యాసములు చదివి తెలుసుకొనవచ్చును. సిస్టర్ సుమతి- అన్వేషణ ,- నవలలు ప్రయాణం-స్వాతంత్ర సమరం సర్వోదయం -కథా సాహిత్యము మొదలైన ఇతర గ్రంథాలు అచ్చుకు వేచియున్నవి. “గుంటుపల్లి స్ఫూర్తి ” గురుడ వినర” అనే మకుటంతో వీరు 200 పైగా పద్యములు రచించిరి . వచన కవితలు పెక్కులు అముద్రితముగా వున్నవి .
ఒకవైపు మానవకోటికి దృష్టి జ్ఞానమును ప్రసాదించుచు మరొకవైపు సాహితీ విజ్ఞానవేత్తలకు,పామరులకు మనోజ్ఞానమునిచ్చు వైద్య విజ్ఞాన గ్రంథములను, సాహిత్య గ్రంథములను రచించి ధన్యతనొందినవారు శ్రీ గుంటుపల్లి వారు. వీరు అనంతపురంలోని రోటరీ క్లబ్ అధ్యక్షులుగా నుండి మానవ సేవా కార్యక్రమములను నిర్వహించుట కూడా ఒక విశేష గుణము. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములిచ్చి కాపాడు గాక .

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...