వంగీపురం వేంకట శేషాచార్యులు (Vangeepuram Venkata Seshacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Vangeepuram Venkata Seshacharyulu
పేరు (తెలుగు)వంగీపురం వేంకట శేషాచార్యులు
కలం పేరు
తల్లిపేరుకమలమ్మ
తండ్రి పేరునరసింహాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/5/1910
మరణం
పుట్టిన ఊరుకంపసముద్ర అగ్రహారం – చిట్వేలి, రాజంపేట తాలూక, కడపజిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీ వేంకటేశ్వర శతకము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవంగీపురం వేంకట శేషాచార్యులు
సంగ్రహ నమూనా రచనశా. అమ్మా భారతి రమ్మ మద్రసనవై – నాసీనవై ప్రేమమైఁ
గొమ్మా మత్సుమన స్సుమాంజలిని – జేకొమ్మా సుహృద్వీణ, గా
నమ్మున్ భక్తిసుతంత్రికా లలిత విన్యాస స్ఫురన్నాద సే
కమ్మున్ సీనుల విందొనర్సుము జగత్కల్యాణ కృత్కావ్యముల్.

వంగీపురం వేంకట శేషాచార్యులు

శా.  అమ్మా భారతి రమ్మ మద్రసనవై – నాసీనవై ప్రేమమైఁ

       గొమ్మా మత్సుమన స్సుమాంజలిని – జేకొమ్మా సుహృద్వీణ, గా

       నమ్మున్ భక్తిసుతంత్రికా లలిత విన్యాస స్ఫురన్నాద సే

       కమ్మున్ సీనుల విందొనర్సుము జగత్కల్యాణ కృత్కావ్యముల్.

అని యిష్టదేవతా ప్రార్థన గావించి, అపూర్వకథాసంవిధాన చాతుర్యవిలసిత. శ్రీరామదీక్షితుల సంస్కృతనాటకమగు ‘జానకీ పరిణయమును’ ………………

………….. దక్కుట మరొక విశేషము. తమ గురువులైన శ్రీ చేట్లూరి శేషాచార్యుల వారి యందున్న భక్తి ప్రపత్తులకు తార్కాణముగా, దీనిని కవిగారు శేష రామాయణముగా నామకరణము చేయుట మరియొక విశేషము.

మూలదృశ్య కావ్యమును పద్యములందు చొప్పించుటలో కవిగారు కొంతనేర్పు చూపిరి. మూలమునందలి విచిత్ర కల్పనా కమనీయమగు ఇతి వృత్తమును మాత్రమే ప్రధానముగా గొని ఆటనట వర్ణనలను స్వతంత్రముగా గావించిరి, ప్రతి పద్యములోని సంభాషణాచాతురి ఆటనట చొప్పించిన తెనుగు నానుడులు మెచ్చదగినవి. అనవసర పద్యములిందులేవు. ప్రతిపద్యము కధలో గట్టిముడిని పెనవేసుకొని యున్నది. ఇందలి యొక వట వృక్షవర్ణన యిట్లున్నది.

సీ.   చలిదిబొనమునకై నిలిపికొన్న శవాలు

                వ్రాలు గొమ్ముల మధ్య వ్రేలుచుండ,

       నర్ధభక్షితములై యవల ద్రోచిన కళే

                బరములు నేలపై దొరలు చుండ,

       దివియగు రాక నంధిగతమాంసములైన

                యెమ్ములకై కాకు లెగురు చుండ,

       దాహమారగ దేటద్రావ నిల్చిన మద్య,

                మునుకు నీగల గుమి ముసురుచుండ

తే.గీ. దొరయు పొలకంపు కలుకంపు బెరసివీచు

       వాయువులు ప్రాణబంధువు పగిది దమ్ము

       నందు రమ్మని పిలిచిన యట్టులుండ

       నుండు పెనుమఱ్ఱి వృక్షంబు నొకటి జేరి.

ఈ శేషరామాయణ మందలి సశేషకాండలను కవిగారు ముద్రించి, ఆంధ్రులకు అపూర్వకథా సంవిధానముగల ఇట్టి విశేష రామాయణమును త్వరలో అందింతురుగాత.

శ్రీ వంగీపురమువారు పద్యరచనలే కాక ప్రబంధ కావ్యములను వచన రచనలుగా బాలుర ఉపయోగార్థము తీర్చిదిద్దిరి. వీరి బొబ్బిలి వీరులు సార్వభౌములు మున్నగు కొన్ని చారిత్రాత్మక కథలను ఉన్నత పాఠశాల విద్యార్థుల కుపవాచకములుగా రచించిరి వీరనంతపురము, కడప మండల చరిత్రములను, గుత్తి దుర్గ చరిత్ర విశేషములను వ్రాసినారు. ప్రస్తుతము అనంతపురమునందు నివసించుచు విశ్రాంతి తీసుకొను చున్నారు. వీరు సౌమ్యులు, సంభాషణా చతురులు, సాహిత్య గోష్ఠులందు ఉత్సాహముతో పాల్గొను సాహిత్యపరులు.

చం. గడవిచిన వెన్ని జన్మమురొ కల్గువనెన్నియొ ఏ నెఱుంగ నా

       కిడుములు సాజమౌట సహియించెద నెన్నిటివేవి దేవ నీ

       యడుగుల నాశ్రయించు శరణార్థి పరాభవ భిన్నుడైన మా

       ర్నుడువగ నేల నీకు ననురూపము గాదది వేంకటేశ్వరా

       అని శ్రీ వేంకటేశ్వర శతకములలో చెప్పుకొన్నారు. శ్రీ వేంకటేశ్వరుడాయురారోగ్యముల నొసంగి రక్షించుగాత.

———–

You may also like...