పేరు (ఆంగ్లం) | Aluru Ramasastry |
పేరు (తెలుగు) | ఆలూరు రామశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | గంగమాంబ |
తండ్రి పేరు | నరసింహశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 6/9/1911 |
మరణం | – |
పుట్టిన ఊరు | మలయనూరు – కల్యాణదుర్గం తా. అనంతపురం జి. |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ రాధాకృష్ణ ప్రణయము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆలూరు రామశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతములందు పుట్టి పెరిగిన కొందరు కవి పండితులకు ఆ రెండు భాషలయందును రచనలు గావించెడి నేర్పు పుట్టుకతోనే అబ్బిన ఒక పుణ్యవిశేషము. దానికితోడు సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మరికొందరికి సంస్కృత వాజ్మయములో సంపూర్ణ ఆధిక్యత లభించుట బంగారుకు తావి అబ్బినట్లే కదా. ఆంధ్ర, కన్నడ సాహిత్యములకు వారు వారధిగట్టి అనర్ఘరత్నములను ఇరువైపులా వంచిరి. అట్టి వారు మన రాయలసీమలో పెక్కు మందున్నారు. వారిలో శ్రీ ఆలూరు రామశాస్త్రిగారొకరు. |
ఆలూరు రామశాస్త్రి
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతములందు పుట్టి పెరిగిన కొందరు కవి పండితులకు ఆ రెండు భాషలయందును రచనలు గావించెడి నేర్పు పుట్టుకతోనే అబ్బిన ఒక పుణ్యవిశేషము. దానికితోడు సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మరికొందరికి సంస్కృత వాజ్మయములో సంపూర్ణ ఆధిక్యత లభించుట బంగారుకు తావి అబ్బినట్లే కదా. ఆంధ్ర, కన్నడ సాహిత్యములకు వారు వారధిగట్టి అనర్ఘరత్నములను ఇరువైపులా వంచిరి. అట్టి వారు మన రాయలసీమలో పెక్కు మందున్నారు. వారిలో శ్రీ ఆలూరు రామశాస్త్రిగారొకరు.
శాస్త్రిగారు పాఠశాలలో విద్య గరిపినది తక్కువేయైనను, ఇంట తండ్రిగారి వద్దనే అమరము, శబ్దరత్నావళి, సంస్కృత సాహిత్యాభ్యాసము, రఘవంశాది పంచకావ్య పఠనములను క్షుణ్ణముగా నేర్చిరి. కీ.శే. సముద్రాల నారాయణశాస్త్రి గారితో కలిసి అప్పుడప్పుడు గీర్వాణ సాహిత్య ప్రసక్తి, చర్చలు, ప్రసంగాలు, ఆంధ్ర కావ్యములను గూర్చి భాషణ, సరిహద్దు ప్రాంతీయ భాషయగు కర్ణాటక భాషా కావ్యములను గూర్చి చర్చించి వారిద్వారా అనేక విషయములు నేర్చిరి. జీవికకు వైదికవృత్తిని వదలక పిత్రార్జితమైన స్థిరాస్తితో కాలము గడుపుచుండిరి.
40 ఏండ్లు దాటిన తరువాత శాస్త్రిగారికి తెనుగునగల సుమతి శతకమును, భాస్కరశతకమును, కన్నడములోనికి అనువదింప వలెననెడి ఒక ఆలోచన పొడసూపి, ఆ కార్యమునకు పూనుకొనిరి. సుమతి శతకము 1955లో కన్నడమున ముద్రింపబడి, బహుళ ప్రచారములోనికి వచ్చెను. తదుపరి కీ.శే. శ్రీవడ్డాది సుబ్బరాయ కవిగారు శ్రీ సూక్తి వసుప్రకాశమను గ్రంథమునుండి దాదాపు 4, 5 శతకములను కన్నడములోనికి అనువదించిరి. కానీ వాటిని ప్రచురించుటకు మూలకర్తగారి సర్వస్వామ్య సంకలితాధికారము లెవరినుండి పొందవలెనో తెలియక ప్రచురింపబడలేదని కవిగారు తెలిపిరి. ఈ విధముగా ఈ ఉభయ భాషలందును అనువదింపబడిన ఖండ కావ్యములు దాదాపు 12కు పైగా ఉన్నవి. ‘‘శ్రీ రాధాకృష్ణ ప్రణయము’’ వీరి స్వకపోల కల్పితాంధ్ర పద్యకావ్యము.
ఇక వీరు కన్నడమునుండి తెలుగులోనికి అనువదించిన భాగములు కొన్ని కలవు. వాటిలో కర్ణాటక జెమిని భారతము నందలి చంద్రహాసచరిత్ర, శ్రీ రామాశ్వమేధము అను నారికేళ పాకభాగములను, ఆంధ్రభాషలో కదళీ ద్రాక్షాపాకములలో అనువదించిరి. వీరి రచన మచ్చునకు చూతుము.
అరయగౌతమపత్నిపై గుహునిపై యా యంజనా సూనుపై
చిరకాలంబు దపింప నా శబరిపై శిక్షార్హుడౌ పక్షిపై
మరణోత్కంఠు జటాయుపై పుడుతపై, మౌనుల్ గన వారిపై
కరుణ జూపిన రామచంద్ర మది విన్ గాంక్షించెదన్ బ్రోవవే.
సుమతి శతకములోని ఒక సుప్రసిద్ధ పద్యమునకు వీరి కన్నడానువాదమిది.
నరనిగె సిరిబందొడెతావ్
బరువరు బంధుగళు కేళదు యంతన్నల్
కెరెయెళగె నీరు తుంబిరే
బరువవు కప్పిగళు హత్తుసావిర సుమతీ
ప్రస్తుతము ఈ కవిగారు కర్ణాటకరాష్ట్రమునకు చెందిన చిత్రదుర్గం జిల్లా పరశురాంపురంలో సత్య శోధనాలయ మందు నివసించుచున్నారు. వీరికి భగవంతుడు ఆయురారోగ్యభాగ్యములిచ్చి కాపాడుగాక.
రాయలసీమ రచయితల నుండి….
———–