పేరు (ఆంగ్లం) | Palutla Venkata Narasaiah |
పేరు (తెలుగు) | పాలుట్ల వెంకటనరసయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | సుందరమ్మ |
తండ్రి పేరు | మార్తాండయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/29/1911 |
మరణం | – |
పుట్టిన ఊరు | రాజుపాలెం – ఎఱ్ఱగొండుపాలెం తా. ప్రకాశం జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ త్రిపురాంతకేశ్వర మాహాత్మ్యము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | బాలకవి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాలుట్ల వెంకటనరసయ్య |
సంగ్రహ నమూనా రచన | శా. సాలంకారముగా సలక్షణముగా శబ్దార్థయుక్తంబుగా సౌలభ్యంబగు శైలి, సత్కవులు మెచ్చన్ కందముల్ నూరుని ట్లాలోచించక, బాల్యకాలమున వ్రాయ న్నేర్చితౌనా భళీ పాలుట్లాన్వయవార్ధిపూర్ణకుముదాప్తా నారసింహాగ్రణీ |
పాలుట్ల వెంకటనరసయ్య
శా. సాలంకారముగా సలక్షణముగా శబ్దార్థయుక్తంబుగా
సౌలభ్యంబగు శైలి, సత్కవులు మెచ్చన్ కందముల్ నూరుని
ట్లాలోచించక, బాల్యకాలమున వ్రాయ న్నేర్చితౌనా భళీ
పాలుట్లాన్వయవార్ధిపూర్ణకుముదాప్తా నారసింహాగ్రణీ
అంటూ అవధాని శ్రీ ఉప్పల పిచ్చయ్యశాస్త్రిగారు, శ్రీ పాలుట్ల వెంకటనరసయ్యగారి ‘‘హైమవతీశ’’ శతకము పఠించి, వ్రాసిన ప్రశంసాపద్యమిది. చిన్నతనముననే కవిత్వము వ్రాయుట కలవాటుపడిన వెంకటనరసయ్య గారిని అందరూ ‘‘బాలకవి’’ యని పిలిచిరి. ఈ కవితాధోరణి యవలడుటకు ముఖ్యకారణము. వారు శ్రీ మద్దిరాల గోపన్నగారి గురుకుల వేద పాఠశాలలో శ్రీ రాళ్ళబండి నృసింహశాస్త్రుల వద్ద ‘‘రఘువంశము’’, ‘‘అప్పకవీయాది’’ గ్రంథములు చదువుటవలనను, వారి కులదైవము, శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి వారి అనుగ్రహము వల్లను కలిగినది. శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామిని, వీరి కుటుంబీకులు కడు భక్తి శ్రద్ధలతో అహర్నిశలు కొలిచెడిభక్తాగ్రగణులు.
శ్రీ వెంకటనరసయ్య, చిన్నతనమునుండి దత్తుతండ్రి నరసయ్యగారి వద్దనే పెరిగి విద్యాబుద్ధులు నేర్చిరి. 5వ తరగతి వఱకు మాత్రమే పాఠశాల చదువు సాగినది. 11వ ఏటనే ఉపనయనము చేసికొని తండ్రిగారి వద్ద ‘‘మంత్రపాఠము’’ ‘‘ముహూర్తజాతక పాఠములు’’, వేద పాఠశాలలో ‘‘శాస్త్రము, ఛందస్సు’’ నేర్చి, కవిత్వము చెప్ప నారంభించిరి.
1931 సం నుండి కొంతకాలము త్రిపురాంతకపు గ్రామ కరణముగాను, మునసుబుగాను, పనిచేసిరి. ‘‘పరోపకారార్థమిదంశరీరం’’ అను ఆర్యోక్తి ననుసరించి వీరు తమ గ్రామములోని హైస్కూలు, ఆస్పత్రి, దేవళములకు విరివిగా విరాళముల నిచ్చిరి. కాశీ, రామేశ్వరాది తీర్థయాత్రలు చేసిరి. అన్నదానము లొనర్చి, వేదపండితులను, కవులను సన్మానించిరి. ఇన్ని పుణ్యకార్యములు చేసినను, వీరు చేసుకొన్న పూర్వజన్మ దుష్కర్మఫలమేమో గాని సంతానము దక్కలేదు. తుదకు కవి గారు తమ గ్రామం రాజుపాలెములోని, తమ కులదైవం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి వారి యనుగ్రహముకోరి ‘‘హైమవతీశ శతకము’’ను రచించి, ముద్రించి ఆ పోత్తములను, కాశీగంగ సమారాధన సందర్భమున బందు మిత్రాదులకు పంచిపెట్టరి. వీరి హైమవతీశ శకములో ఆ త్రిపురాంతకు నిట్లు వేడిరి.
కం. చాలు సుపుత్రుండొక్కం
డేలా? బహుమంది సుతులు హీనమనస్కుల్
చాలడె శూరుండొక్కం
డాలంబున ధైర్యశాలి. హైమవతీశా
కం. అనఈతం బాడిన దోషం
బున, కెనయగు దోషమున్నె? భువి, నిది నిజమౌ
నని, మదిలోనమ్మి నరుం
డనయము, నిజ మాడవలయు; హైమవతీశా
వాగ్దాన మొనర్చినచో దానిని తూ.చ. తప్పక ఆచరించెడి దీక్షా పరాయణులు. వెంకటనరసయ్యగారు. అనఈతదోషమునకు కూడా వారు వెఱతురు. ఒకసారి అవధాని ఉప్పల పిచ్చయ్య శాస్త్రిగారిని, ఫలనా రోజున వచ్చి దర్శించెదనని చెప్పి, అనివార్యమైన కార్యమొక్కటి తటస్థించి చెప్పిన వ్యవధిలో వారిని కలియలేకపోయినందుకు చింతించి, అనృతదోష నివారణార్థము వారు ఆ రాత్రికి రాత్రే 25 మైళ్ళు నడిచి వెళ్ళి రాత్రి ఒంటిగంటకు వారిని దర్శించిరి. అప్పుడు శ్రీ పిచ్చయ్యశాస్త్రి గారు, ఆశ్చర్యపడి ఆశువుగా యిట్లు చెప్పి ఆశీర్వదించిరి.
ఆ.వె. వనజ సంభవుడు – యినుపకాళ్ళను, రాతి
నోరు బెట్టి, నీ శరీరసృష్టి
జేసె; లేకయున్న – చిత్రంబుగా నిట్లు
నడువ, నుడువనగునె? నారసింహ
అట్టి పెద్దల ఆశీర్వచన ఫలితముగా, వీరు శ్రీ త్రిపురాంతకేశ్వర మాహాత్మ్యము రచించి, ప్రచురించిరి. ఉగ్రనరసింహ స్వామిదండకము, మార్కాపురం చెన్నకేశవచరిత్ర, తిరుమల నాథస్వామి చరిత్ర, పాలంక వీరభద్రుని చరిత్ర, పాలుట్లవారి వంశచరిత్ర, మార్కాపురం తాలూకా కవులచరిత్ర వీరి అముద్రితకృతులు. శంకరుడు తమ కిచ్చినంతలో లేదనక కవి పండితుల కార్థిక సహాయం గావిస్తూ కవిపోషకులని కీర్తి పొందిరి. వీరికి ఆ త్రిపురాంతకేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యములిచ్చి కాపాడుగాత.
రాయలసీమ రచయితల నుండి…..
———–