పేరు (ఆంగ్లం) | Palluru Subbanacharyulu |
పేరు (తెలుగు) | పాళ్ళూరు సుబ్బణాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | గుండమ్మ |
తండ్రి పేరు | పాళ్ళూరు హనుమంతాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1912 |
మరణం | – |
పుట్టిన ఊరు | హరేసముద్రము, మడకశిర తా. అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | బి.ఏ. |
వృత్తి | పాత్రికేయులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తొలకరి చినుకులు, లేపాక్షి శిల్పకళాక్షేత్రము, ప్రణయ సమాధి, |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాళ్ళూరు సుబ్బణాచార్యులు |
సంగ్రహ నమూనా రచన | అనంతపురములో 1930 సం. నందు వెలసిన కవివనూర సమితిలో ఒక్కరైన శ్రీ పాళ్ళూరు సుబ్బణాచార్యులవారు, పి.యస్. ఆచార్యగా శ్రీకాకుళంలో, హిందూ పత్రికావిలేఖరులుగా వ్యవహరింపబడుచున్నారు ‘కవికుమార సమితి’ ప్రచురించిన ‘తొలకరి చినుకులు’. ‘క్రొకా, ఱు మెఱుగులు’ వీరి కవితలు. వీరు ‘లేపాక్షి శిల్పకళాక్షేత్రము’ ‘ప్రణయ సమాధి’ యను మరి, రెండు కవితా సంపుటములను ప్రచురించిరి. |
పాళ్ళూరు సుబ్బణాచార్యులు
అనంతపురములో 1930 సం. నందు వెలసిన కవివనూర సమితిలో ఒక్కరైన శ్రీ పాళ్ళూరు సుబ్బణాచార్యులవారు, పి.యస్. ఆచార్యగా శ్రీకాకుళంలో, హిందూ పత్రికావిలేఖరులుగా వ్యవహరింపబడుచున్నారు ‘కవికుమార సమితి’ ప్రచురించిన ‘తొలకరి చినుకులు’. ‘క్రొకా, ఱు మెఱుగులు’ వీరి కవితలు. వీరు ‘లేపాక్షి శిల్పకళాక్షేత్రము’ ‘ప్రణయ సమాధి’ యను మరి, రెండు కవితా సంపుటములను ప్రచురించిరి.
ఈ కవికుమారులు తను తొమ్మిదవ సంవత్సరము వఱకు కల్యాణ దుర్గము తాలూకాలోని తూర్పు కోడిపల్లి గ్రామములో నుండిరి. వీరి తాత ముత్తాతల స్వస్థలము పాళ్ళూరు. తండ్రిగారి కాలమునకు వీరి కుటుంబము తూర్పు కోడిపల్లికి వలస వచ్చిరి. పౌరోహిత్యముచే కుటుంబ పోషణ జరుగు చుండెను. ఆ గ్రామములో చదువు సంధ్యల కవకాశము లేనందున ఆ గ్రామమునకు రెండు మైళ్ళ దూరములో గల ‘భట్టువారిపల్లె’ వీధిబడిలో ఆచార్యులు చదువుకొనిరి. తొమ్మిదవ యేటనే వీరి తండ్రిగారు గతించుటచే కుటుంబభారము వీరి తల్లిమీద పడెను. అప్పుడామె కుమారుని చదువు సంధ్యల కొఱకై కల్యాణదుర్గము చేరి, మధ్యమిక పాఠశాలకి తన కుమారునికి చదువు చెప్పించినది తదుపరి అనంతపుర కళాశాలలో చేరి బి.ఏ., పట్టము పొందిరి. ‘నా తల్లి నా విద్యాజ్యోతిని వెలిగించిన చదువుల తల్లి’ అని తల్లిపై కృతజ్ఞత ఈ క్రింది పద్యములో తెలుపు కొన్నారు.
ఉ. వేకువ వేగుజుక్క కనిపించినతోడనె నిద్రలేచి, య
ఱ్ఱాకలకోర్చి శాంతము రవంతయ వీడక జేయు రాత్రి యౌ
దాకిను చాలకార్యములదిల్లి, యదెట్టుల తీర్చికొందునో
నాకది తోచదా ఈణ మనంతము సత్యసమిత్రపబోధకా (క్రొ.మె)
కళాశాలలొ వీరు శ్రీ వాసుదేవమూర్తి. శ్రీ వెల్లాల ఉమామహేశ్వరరావులతో కలసి మెలసి తిరుగుచూ సాహిత్యచర్చలు గావించుకొనుచుండెడివారు. వీరి కాసమయమున ‘టాల్ట్పాయి’ రచనల మీద మంచి అభిప్రాయ మేర్పడినది. దానికి తోడు కీ.శే. వివర్తి వెంకటసుబ్బయ్యగారితో సాహచర్య మేర్పడి, టాల్ట్పాయి రచనలు చదువుట యందాసక్తి ఎక్కువాయెను.
కళాశాలలో చదువు చున్నప్పుడే ఆచార్యలు రాజకీయ దుమారములో చిక్కుకొనిరి. విద్యార్థులెవ్వరు గాంధిటోపీని ధరించి కళాశాలకు రాకూడదని ప్రిన్సిపాలుగారొక వుత్తరువు జారీ చేసిరి. అప్పుడాచార్యులు తమ స్నేహితులతో కలసి గాంధీ టోపీలను ధరించి కళాశాలకు వెళ్ళి తదితర విద్యార్థులు ధరించుట కొఱకై టోపీలను వంచిరి ప్రిన్సిపాలుగారు దిగ్భ్రాంతులై తమ ఉత్తర్వు నుపసంహరించుకొనునట్లు చేసిరి. కళాశాల విద్యాభ్యాసానంతరము నిరుద్యోగ సమస్య ఆచార్యులవారిని పీడించెను. సంసార భారము భరింపరానిదయ్యెను అట్టి క్లిష్టకాలమునందు సాహిత్య రచనకు పూనుకొని మనశ్శాంతి పొందిరి. అప్పటి వీరి రచన లన్నియు ‘తొలకరి చినుకులు’ ‘క్రొక్కారు మెఱుగు’లుగా వెలువడినవి.
వీరు కీ.శే. కల్లూరు సుబ్బరావుగారి ‘రాజకీయ శిష్యులైరి’ వారివెంట 1936లో బెజవాడకు వెళ్ళి అక్కడ దేశోద్ధారక కాశీనథ నాగేశ్వరరావు గారిలో పరిచయ మేర్పరచుకొనిరి. ఆ పరిచయము వారిని ఆంధ్రపత్రికా విలేఖరిగా మార్చినది. రెండు సంవత్సరములు వారనంతపురములో పాత్రికేయులుగా వ్యవహరించిరి. 1937 వ సం.లో వీరి జీవితము నందొక పెద్ద మార్పు సంభవించెను. పుట్టి పెరిగిన అనంతపురం జిల్లా విడిచి శ్రీకాకుళమునందు ‘హిందు’ ఆంగ్ల దినపత్రికకు విలేఖరిగా స్థిరపడిరి. 1937 నుండి 1942 వరకు ‘ప్రజావాణి’ వారపత్రిక కుప సంపాదకులుగా పనిచేసిరి.
అనంతపురంలో ఉన్నప్పుడే వీరు సాధన పత్రికలో కథలు వ్రాయుచుండిరి. ఈ కథావళిని నూతలపాటి పేరరాజాగారిచే నడపు చుండిన ‘మారుతీ గ్రంథమండలి’ ప్రచురించెను. 1977లో ‘‘లేపాక్షి శిల్పకళాక్షేత్ర’’మమను పద్యకావ్యమును ప్రచురించిరి. కావ్య ప్రచురణకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడిమీవారు ద్రవ్యసహాయ మొనర్చిరి.
ఆచార్యలు కవితలో తీవ్రభావములు, కొన్నిటిలో యథార్థ జీవిత సత్యములు కనబడును. ఆచార్యుల ఖండికలలో ‘పుష్పము’ లోని భావనను కొంత చూతము.
చం. అమృతము నిత్తు వేడకయె ప్రాణవిభుండని యెంచి నిన్ను, ధే
హమున కలంద పుప్పొడి నహర్నిశమున్ ముదమారనిత్తు స్నే
హమున మెలంగనెంచితి నవంగుని బాధల కోర్వజాల నో
భ్రమర కులేంద్ర యిట్టినను వంతల మున్గర జేయ బాడియే (తొలకరి చినుకులు)
ఆచార్యవర్యులకు కవి పండితులపై అభిమాన మెక్కువ వారి నొకచోట తమ ఆతిథ్యమున కాహ్వానించిరి. మరియొకచోట వారిని ప్రశంసించిరి. పింగళి సూరనను ‘భవ్య రచనా ధురంధర – భవ్య చరిత పింగళి కులాబ్ధి చంద్ర కవీంద్ర చంద్ర అని స్తుతించిరి క కవిని తన పర్ణశాలకిట్లు ఆచార్యు లాహ్వానించు చున్నారు.
చం. గిరిగహనంబులం దిరిగి భిన్నర నందిలి కన్గొనంగ, నీ
చరణయుగంబు పొకెక, నవచంద్రిక లీను ముఖమ్ము గందె, బం
గరుమెయి ఫర్మ బింధువులు గ్రమ్మెను, గాన కవీంద్రచంద్ర నీ
వరమరలేక నేనొసగు నర్ఘ్యము, పాద్యము గొమ్ము నెమ్మదిన్ (తొలకరి చినుకులు)
ఈ కవిగారు చిన్నతనమునుండి పేదరికము ననుభవించిన వారు, ఆ బీదరికపు బాధలతనికి బాగుగా తెలియును బీదల, ననాథులను జూచినప్పుడతని మనస్సు ద్రవించును. అందుకే ఆయన తన ఖండికలో తాను గాంచిన యొకానొక అనాధుని గూర్చి ఇట్లు ప్రశ్నించు చున్నాడు.
ఉ. మాసిన తుండుగుడ్డ, యవమానము మానము గప్పిపుచ్చగా,
దోసిలిలోని చిప్ప యతి దుర్దశ తెల్పగ, పొట్ట కూటికై
వేసరకుండ నిండ్లకడ వేకువ నుండియు గాచియుండెదో
దాసరి యెవ్వరీవనిన ధారగ కన్నుల నీరు గార్చుచున్ (క్రొ.మె)
ఆ అనాథుడు తనగోడును కవీంద్రునకు చెప్పుకొన్నాడు.
వీరి ‘లేపాక్షి శిల్పకళా క్షేత్రమ’ను ఖండకావ్యమొక ఉత్తమ భావ సంపుటి. కవి హృదయ మిందు మనము గాంచగలము. లేపాక్షి శిల్పిరాతి కమరత్వము నిచ్చిన కళాతపస్వి ఆచార్యులవారు రాతిశిల్పములను పలికించినారు. ‘భావుకవుల కవిత్వమునకు స్పష్టత ముఖ్యము. ఆధునిక భావ కవులకు వితరుల ననుకరించ వలెననెడి తపన హెచ్చు. అది అంతగా సరియైనది కాదు’ అని శ్రీ రాళ్ళపళ్ళివారు ‘క్రొక్కాఱు మెఱుగు’ నందు ఆచార్యులవారి విషయములో వ్రాసిరి. ఆ మాటల నాచార్యులవారీ కావ్యము నందు వమ్ము చేసిరి. ఆ ఉద్వేగముతోనే ఈ రచన. ఆచార్యులు సాగించిరేమో, లేపాక్షిలోని అసంపూర్ణ కల్యాణ మంటపమును, నిరుపణ్ణ కంటిధారచు చూచిన వారెవ్వరు కంట తడిపెట్టకపోరు. రాతిగుండె కూడ కఱగిపోగలదు. ఎంతటి శాంతమూర్తి యైనను రుద్రుడు కాగలడు. ఈ భావన చూడుడు.
శివుని పెండ్లాడ కూర్మాద్రి జేరు సరికి
జీర్ణ కల్యాణమండప స్థితిని జూచి
గిరిజ వేసారి గుండె నిబ్బరముమాని
తీవ్ర తపమున దుర్గగా తేజరిల్లె
ఇదొక అద్భుత భావన. లేపాక్షిలో వెలసినది, దుర్గా పావనాశేశ్వరులుగాని శివపార్వతులు కారు.
రాజుగారి యాజ్ఞను విన్నంతనే విరుపణ్ణ యిట్లు నేలకొరిగినాడు.
భీకరాజ్ఞను విరుపణ్ణ విన్నయంత
సర్ప దంష్ట్రాప్రసార సంజనిత వహ్ని
దగ్ధదేహుడుంబలె చేష్టదప్పి వ్రాలె
మదకరీంద్రము కూలిన మాడ్కినేల
లేపాక్షి శిల్పములో బసవణ్ణ ఒక అపూర్వ కళాసృష్టి దానిని శిల్పులు దేవాలయము బయట కొంత దూరములో ఒకే రాతిలో అందముగా చెక్కినారు. అందువారి యుద్దేశ్యమేదియో మనకవగతము కాదుకాని, కవిగారి భావన మాత్రమిట్లున్నది.
కూర్మశైలంబు తొలిపించి గుళ్లుకట్టు
పనికి యెవరేని నాటంక పరతురనుచు
పగతు గుండెను నీర్జేయు పగిదిగాను
నూరి బయటన కావలియుండు నంది.
ఈ కవిగారిట్టి మనోజ్ఞ భావములతో కవితాపుష్పములను వెదజల్లి ఆంధ్ర రసజ్ఞ లోకమును రంజించెదరు గాత.
రాయలసీమ రచయితల నుండి….
———–