కె.సుబ్బరామప్ప (K.Subbaramappa)

Share
పేరు (ఆంగ్లం)K.Subbaramappa
పేరు (తెలుగు)కె.సుబ్బరామప్ప
కలం పేరు
తల్లిపేరురంగమ్మ
తండ్రి పేరుకె. సుబ్బరామప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/23/1913
మరణం
పుట్టిన ఊరుమేడాపురం, ధర్మవరం తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలువిద్వాన్, ఎం.ఎ. బి.ఇడి; బి.ఓ.ఎల్,
వృత్తితెలుగు లెక్చరర్
తెలిసిన ఇతర భాషలుఆంగ్లము, కన్నడం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపెక్కు వ్యాసములను వ్రాసిరి.
కోలారు జిల్లా, On Kannada Telugu Harmony, తెలుగు ఛందస్సు ను గూర్చి కన్నడభాషలో తులనాత్మక వ్యాసము వ్రాసిరి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకె.సుబ్బరామప్ప
సంగ్రహ నమూనా రచనతెలుగు కన్నడ భాషలకు ఏక లిపి అవసరమని తలచి అందుకొరకు ద్విభాషా నిఘంటువును తయారుచేయుటలో అహోరాత్రులు కృషి చేసినవారు. తెలుగు కన్నడ సాహితీ దురంధరులు శ్రీ కె. సుబ్బరాయప్పగారు. అందుకుగాను ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములు, కన్నడ సాహిత్య పరిషత్తు అంగీకరించడం, సహకార మందించడం జరిగింది.

కె.సుబ్బరామప్ప

తెలుగు కన్నడ భాషలకు ఏక లిపి అవసరమని తలచి అందుకొరకు ద్విభాషా నిఘంటువును తయారుచేయుటలో అహోరాత్రులు కృషి చేసినవారు. తెలుగు కన్నడ సాహితీ దురంధరులు శ్రీ కె. సుబ్బరాయప్పగారు. అందుకుగాను ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములు, కన్నడ సాహిత్య పరిషత్తు అంగీకరించడం, సహకార మందించడం జరిగింది. అప్పటి తెలుగు ప్రభుత్వం నియమించిన ‘‘తెలుగు లిపి సంస్కరణ’’లో సుబ్బరామప్పగారు ఒక సభ్యులుగా పనిచేసిరి. అట్లే కర్ణాటక ప్రభుత్వంవారు కూడ వీరిని తమ రాష్ట్రములో తెలుగు పాఠ్య పుస్తకాలు వ్రాయుటకు నియమించిన కమిటీకి అధ్యక్షులుగా చేసిరి.
శ్రీ సుబ్బరామప్ప మదనపల్లిలోని బిసెంట్ థియసాఫికల్ హైస్కూలు, కళాశాలల్లో చదివి, విద్వాన్, ఎం.ఎ. బి.ఇడి; బి.ఓ.ఎల్, పరీక్షలలో ఉత్తీర్ణులైరి. మదనపల్లెలో తాను చదివిన హైస్కూల్, కళాశాలలోనే వీరు అసిస్టెంట్ హెడ్ మాష్టరుగా, తెలుగు లెక్చరర్లా పనిచేశారు.
1949 జనవరి నాటికి మైసూరు విశ్వ విద్యాలయములో తెలుగుభాషా శాఖాధ్యక్షులుగా చేరిరి. మైసూరు చేరిన పిమ్మట వీరు కన్నడభాషా సాహిత్యమును బాగుగా అభ్యసించి తెలుగు, కన్నడ భాషా సాహిత్యములలోని గొప్పదనములను వ్యాసముల ద్వారా తెలియజేయుచుండిరి. వీరి వ్యాసములు ఇంగ్లీషు, కన్నడ, తెలుగుపత్రికలలో అనేకములు ప్రకటితమైనవి. 1975 నవంబరు 6వ తేది ఇండియన్ ఎక్స్ ప్రెస్స్ దినపత్రికలో వీరు వ్రాసిన “On Kannada Telugu Harmony” అనబడు వ్యాసములో తెలుగుకవులు కొందరు కన్నడ రాజ్యంలో ఏ విధంగా నివసించి ఆ భాషను నేర్చి గ్రంథములను వ్రాయగలిగిరో సోదాహరణముగా వివరించిరి.
నన్నయ నుండి వేమన వరకు గల తెలుగు కవుల రచనల నుండి తెలుగు పద్యములను సేకరించి వీరు ‘‘తెలుగు పాఠగళు’’ అనబడు తెలుగు పద్య సంకలనమును తయారుచేసిరి. దీనిని మైసూరు విశ్వ విద్యాలయ ప్రచురణశాఖవారు ప్రకటించి వీరిని గౌరవించిరి. తెలుగు సాహిత్యమును పరిచయము చేసికొనగోరు కన్నడిగులకిది మిక్కిలి యుపయుక్తమగు రీతిగా, అచ్చతెలుగు పదములకు కన్నడ అర్థములను, కన్నడభాషలోనే ఉపోద్ఘాతమును వ్రాసి ముద్రించిరి.
మైసూరు యూనివర్శిటీ నుండి పరిశోధనా పట్టమును పొందగోరు సాహిత్య విద్యార్థులకు వీరు పర్యవేక్షకులుగా నుండిరి. వీరి పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్.డి., పట్టణమును పొందినవారిలో శ్రీ నండూరు రామకృష్ణమాచార్యులు తిరుపతి, గారొకరు. ప్రొఫెసర్ సుబ్బరామప్పగారు ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర, మద్రాసు, విశ్వవిధ్యాలయములలో తెలుగుభాషకు సంబంధించిన బోర్డు ఆఫ్ స్టడీస్ మొదలైన వానిలో సభ్యులుగా పనిచేసిరి.
తెలుగు విజ్ఞాన సర్వస్వములోని విశ్వసాహితి VI వ సంపుటములో వీరు వ్రాసిన ‘‘కన్నడ రత్నత్రయము’’ (పంప, పొన్న, రన్నకవులు) అను వ్యాసము ప్రకటింపబడినది. అట్లే కన్నడ విజ్ఞాన సర్వస్వమునకు ‘‘తెలుగు ఛందస్సు’’ ను గూర్చి కన్నడభాషలో తులనాత్మక వ్యాసము వ్రాసిరి. మైసూరు ప్రభుత్వం ప్రకటించిన “Karnataka through the Ages” అనే ఇంగ్లీషు సంకలన ఉద్గ్రంథమునకు వీరు “Telugu Literature in Karnataka” అను పరిశోధనాత్మక వ్యాసము వ్రాసిరి. హైదరాబాద్లో ప్రకటింపబడిన సంగ్రహ ఆంధ్రవిజ్ఞానకోశం 3వ సంపుటమున వీరి ‘‘కోలారు జిల్లా’’ అను వ్యాసము ప్రకటింపబడినది.
ప్రొఫెసర్ సుబ్బరామప్పగారు జీవితాంతము తెలుగు కన్నడములకు ఏక లిపిని చేయు బృహత్కార్యములోనే నిమగ్నులై, కన్నడ, తెలుగువారల మధుర బాంధవ్యములకు వారధి గట్టిన వారైరి. తెలుగు, కన్నడ ప్రజల హృదయాంతరాళములలో శాశ్వితులైరి.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...