పేరు (ఆంగ్లం) | Lingutla Konetappa |
పేరు (తెలుగు) | లింగుట్ల కోనేటప్ప |
కలం పేరు | – |
తల్లిపేరు | రంగమ్మ |
తండ్రి పేరు | వెంకటప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/10/1910 |
మరణం | – |
పుట్టిన ఊరు | ఛాయాపురము గుత్తి తాలూకా, అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వంశరత్నాకరము, దశరథరామ శతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | లింగుట్ల కోనేటప్ప |
సంగ్రహ నమూనా రచన | కం. కరిబ్రోవ మకరి జంపితి మురిపెముతో కంతు జనక, మోక్షపురిశా; హరి, నను నేలవదేలర? దరి జేరితి ఛాయపురము దశరథరామా |
లింగుట్ల కోనేటప్ప
అనంతపురం జిల్లాలో అజ్ఞాతంగా జీవించిన కవులలో లింగుట్ల కోనేటప్ప గారొకరు. జన్మించింది కమ్మకులము, చదివింది ఎనిమిదవ తరగతి. చేపట్టిన వృత్తి వ్యవసాయము. అభిరుచులు – నాటకములు, శాస్త్రీయ సంగీతము, జ్యోతిశ్శాస్త్రం, వైద్యవిద్య. వీరు సేకరించిన మాండలిక పదకోశ నిర్మాణము వ్యవసాయము – చేనేత; రెండు భాగములుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించుట ఎంతయో ముదావహము.
తదుపరి వీరి ‘‘వంశరత్నాకరము’’ అకారాది నిఘంటువు. అముద్రితము. దాదాపు ఇది ఒక వేయిపుటల గ్రంథము. ‘‘అ నుండి ఔ’’ వరకుగల సాముదాయిక నిఘంటువిది. దీనిని కవిగారు బహుళ కృషితో తయారుచేసిరి. ముద్రణాభాగ్యము పొందలేదు.
వీరు కొన్ని శతకములు కూడా వ్రాసినారు. ఏకప్రాస కంద పద్య దశరథరామ శతకము, యువతీ శతకము, ఈ రెండునూ అముద్రితములే. దశరథరామ శతకములోని ఒక పద్యము మచ్చునకు
కం. కరిబ్రోవ మకరి జంపితి
మురిపెముతో కంతు జనక, మోక్షపురిశా;
హరి, నను నేలవదేలర?
దరి జేరితి ఛాయపురము దశరథరామా
‘‘ఆధునిక సుమతి శకతము’’ అనునది వీరి ఒకే ఒక ముద్రితకృతి. జాతీయోద్యమము ముమ్మరముగా సాగుచున్న రోజులలో మన సమాజములోవున్న ఒడుదుడుకులను తెలుపుతూ వ్రాసిన శతకమిది. చిన్నతనపు వీధి బడిలో కంఠస్థలము చేసిన బద్దెన సుమతి శతకపు పోకడలు అచ్చటచ్చట నెమరువేసిరి. ‘‘నాయీ రచన కొన్నిచోట్ల ఛాందస మహానుభావులకు వెగటు గల్గించినా ప్రజాబాహుళ్యము ఈ శతకాన్ని ఆదరించగలదని నా నమ్మిక’’ అని కవిగారు వ్రాసుకొనిరి. మచ్చుకా పద్యములు.
పదవీ వ్యామోహంబున
పదిలముగా జనులచుట్టు పనివడి తిరుగున్
పదవి లభించిన పిమ్మట
వదలును ప్రజ కార్యమెల్ల స్వార్థుడు సుమ
పదవులకు బ్రాకులాడెడి
ఉదరంభరి కెపుడుగాని ఓటియ్యకు మీ
యెదలో ప్రజమేల్ దలచెడి
సదయుని యెన్నికకు నిమ్ము సమ్మతి సుమతీ
కోనేటప్పగారు వందల కొద్ది జానపద గేయములను సేకరించినట్లును, వీరి వద్దగల అమూల్యగ్రంథములు, అముద్రిత ప్రతులు ఎన్నో బంధువుల, స్నేహితుల యిండ్లలో వుండిపోయిన వనియు, తుదకీ ఒక్క శతకము మాత్రమే లభ్యమె ముద్రణా భాగ్యము పొందినదని వారి కుమారులు లింగుట్ల వెంకటప్ప పై శతకములో వ్రాసుకొన్నారు. ఈ కవిగారి కుటుంబమునకు దశరథ నందనుని అనుగ్రహము సదా లభించుగాక.
రాయలసీమ రచయితల నుండి….
———–