జంధ్యాల పాపయ్యశాస్త్రి (Jandhyala Papayya Sastry)

Share
పేరు (ఆంగ్లం)Jandhyala Papayya Sastry
పేరు (తెలుగు)జంధ్యాల పాపయ్యశాస్త్రి
కలం పేరుకరుణశ్రీ
తల్లిపేరుమహాలక్ష్మమ్మ
తండ్రి పేరుపరదేశయ్య
జీవిత భాగస్వామి పేరుఅనసూయమ్మ
పుట్టినతేదీ8/4/1912
మరణం6/22/1992
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామము
విద్యార్హతలుకొమ్మూరులో ప్రాధమిక, మాగధ్యమిక విద్య, భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు , రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షల ఉత్తీర్ణుడయ్యారు
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపుష్ప విలాపం, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నుండి గౌరవ డాక్టరేట్
ఇతర వివరాలుమృదు మ దురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. పుష్పవిలాపం ఘంటసాల గానం చేశారు. ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల వీరి కుమారుడే.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజంధ్యాల పాపయ్యశాస్త్రి
పుష్ప విలాపం
సంగ్రహ నమూనా రచనకుంతీకుమారి పద్యాలు
మ|| ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ
చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప
ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్

బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి.

భోగ భాగ్యాలతో తులదూగుచున్న
కుంతి భోజుని గారాబు కూతురు నయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన.”

జంధ్యాల పాపయ్యశాస్త్రి
పుష్ప విలాపం

సీ|| నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

కుంతీకుమారి పద్యాలు[మార్చు]
మ|| ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ
చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప
ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్

బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి.

భోగ భాగ్యాలతో తులదూగుచున్న
కుంతి భోజుని గారాబు కూతురు నయి
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన.”

అంజలి పద్యాలు[మార్చు]
సీ|| పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెల పాలు పోసి పోసి
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
వింత వింతల రంగు వేసి వేసి

తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాదిదేవ
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు

సీ||లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను


సీ||కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి

లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

———–

You may also like...