కొత్త భావయ్య చౌదరి (Kotta Bhavayya Chowdary)

Share
పేరు (ఆంగ్లం)Kotta Bhavayya Chowdary
పేరు (తెలుగు)కొత్త భావయ్య చౌదరి
కలం పేరు
తల్లిపేరురాజమ్మ
తండ్రి పేరుశివలింగయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ06/02/1897
మరణం07/23/1973
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి
విద్యార్హతలువిజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందారు.
వృత్తిసర్వేశాఖలో ఫీల్డు డిప్యూటీ సర్వేయరు పదవి నిర్వహణ
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుదేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజ్య చరిత్ర, ఆంధ్ర రాజులు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువిమర్శకాగ్రేసర
ఇతర వివరాలుకొత్త భావయ్య చౌదరి ఒక చారిత్రక పరిశోధకుడు. కమ్మవారి చరిత్ర – సంక్షిప్త మూడు భాగాలు 1954 లో ఇంగ్లీషులో ప్రకటితమయినది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొత్త భావయ్య చౌదరి
సంగ్రహ నమూనా రచనకొత్త భావయ్య చౌదరి ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, గుంటూరు మండలము, తెనాలి సమీపమున నున్న సంగం జాగర్లమూడి అను గ్రామంలో జూన్ 2, 1897లో జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు నుండి యోగ్యతా పత్రం పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు.

కొత్త భావయ్య చౌదరి

కొత్త భావయ్య చౌదరి ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, గుంటూరు మండలము, తెనాలి సమీపమున నున్న సంగం జాగర్లమూడి అను గ్రామంలో జూన్ 2, 1897లో జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు నుండి యోగ్యతా పత్రం పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. స్వగ్రామమైన సంగం జాగర్లమూడి సర్పంచ్‌గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు. ఆంధ్ర, కర్ణాట, తమిళ దేశాలలో దొరికిన శాసనాలు, సంస్కృతాంధ్ర కావ్యాలు, తాళపత్ర గ్రంథాలు, కైఫీయతులు తదితర మూలాలు పరిశోధించి, ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరాలు కృషి చేసి కమ్మవారి చరిత్రం అను మూడు సంపుటాలు గ్రంథాన్ని రాశాడు. 1954లో మూడు సంపుటాలలోని సమాచారం క్లుప్తంగా ఆంగ్లంలోనికి అనువదించబడినది. మద్రాసులో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయం, విశ్వవిద్యాలయం, శాసన పరిశోధన కార్యాలయాలలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను మున్నగు వారిని సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యం సాధించాడు. భావయ్య విరచితమైన పెక్కు పుస్తకములలో కొన్ని: దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, ఆంధ్ర రాజులు, గుంటూరు మండల ప్రాచీన చరిత్ర, శాయపనేనివారి చరిత్ర, పరశురామ నాటకము, వినోద కథలు, ప్రభోధకుసుమావళి.

———–

You may also like...