గొట్టిపాటి సుబ్బరాయలు (Gottipati Subbarayalu)

Share
పేరు (ఆంగ్లం)Gottipati Subbarayalu
పేరు (తెలుగు)గొట్టిపాటి సుబ్బరాయలు
కలం పేరు
తల్లిపేరువెంకటమ్మ
తండ్రి పేరువెంకటప్ప (బొజ్జన్న)
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1917
మరణం1/21/1970
పుట్టిన ఊరుఅనంతపురం – ధర్మవరం తా. కోనాపురం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు16 పర్వముల వికాస భారతమును వ్రాయతలపెట్టి, అదిమ-బౌద్ధ-శాంతి-అణుపర్వములను వ్రాసిరి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగొట్టిపాటి సుబ్బరాయలు
సంగ్రహ నమూనా రచనగీ. ఒక్కొకరు నొక్కరీతిగా చిక్కదనము
చక్కదనములు, మిక్కిలై జాలువార
పెక్కురీతెల్గుగడ్డను దక్కిజేసి
కృషినొనర్చిరి, సాహిత్య ఋషుల దీక్ష్.

గొట్టిపాటి సుబ్బరాయలు

గీ. ఒక్కొకరు నొక్కరీతిగా చిక్కదనము
చక్కదనములు, మిక్కిలై జాలువార
పెక్కురీతెల్గుగడ్డను దక్కిజేసి
కృషినొనర్చిరి, సాహిత్య ఋషుల దీక్ష్.
తెనుగు గడ్డను దుక్కిచేసి కృషిచేసిన కృషిక పండితులు, పెక్కురున్నారని శ్రీ గొట్టిపాటి వారన్నమాటలో వాస్తవము లేకపోలేదు. వారి కృషి ఫలితముగా నేడు తెనుగు సాహిత్య నందనోద్యానవనము పుష్ప, ఫల భరితమై నయనానందమును కల్గించుచున్నది. ఈ కర్షక కవులు పండించిన పంటలు పలురకములు. శ్రీ గొట్టిపాటివారికి ఆంధ్ర సాహిత్యఋషుల యెడగల భక్తిప్రపత్తులపారములు. అందులకే వారు తాను పండించిన ఫలసాయము తనకృషి ఫలితము కాదని విశ్వసించి, ప్రతివారిని పేరు పేరున స్మరించి ధన్ములైరి. ఇది వారి గొప్పతనమునకు తార్కాణము.
శ్రీ గొట్టపాటి వంశీకులు పూర్వము గుంటూరు సీమ నివాసులు. వారు అనంతపురం జిల్లా, తాడిపత్రి ప్రాంతమునకు వచ్చిచేరిరి తదుపరి వారి నివాసము అనంతపురం జిల్లా ధర్మవరం దగ్గరగల గువపల్లెకు మార్చబడెను వీరి వంశీకులందరు రైతులే. ఎగువపల్లెకు దగ్గరలోగల కోనాపురమందు సుబ్బరాయుడుగారి తండ్రి కాపురముండి గౌరవముగా సేద్యము చేయుచుండిరి సుబ్బరాయుడు గారికి అతని పదవయేటనే తల్లిదండ్రులు దైరమైరి తదుపరి అన్నగారివద్ద జీవయాత్ర సాగించిరి. వీరి విద్యాగురువగు వెంకటరామరావుగారు వీరికి ఓ, నామాలనుండి ఉత్తర రామాయణము వరకు తొమ్మిది నెలలలో నేర్పిన మహనీయులు ఆంగ్ల, చరిత్రాదులను శ్రీ వీరభద్రరావు గారి వద్ద కవిగారు వరించిరి. పదునాల్గవ యేడు నిండకపూర్వమే కవిగారు గ్రంథాలయములకు వెళ్ళి వేలకొలది గ్రంథములను చదివి జ్ఞాన సముపార్జన గావించిరి.
ఇంతలో గాందీగారిపిలుపు దేశములోని యువకులను మేలుకొల్పెను. ఆయుద్యమమునందు సుబ్బరాయుడుగారు పాల్గొనిరి. ఆ సమయమున వారికి ‘బెత్తపుం దెబ్బ లొకపూట బత్తెమయ్యె’ అని వాక్రుచ్చిరి.
తదుపరి వచ్చని కష్టపరంపరలకు అంతులేదు. అప్పుడు వారు గోసెనెగజెక్కి వ్యవసాయకూలీగా నితరుల చేలలొ సేరుగింజల, కొరకు చెమటోడ్చి పనిచేసిరి. తదుపరి వారు ఒకచేత హలముబట్టి వేరొకచేత సాహితీ క్షేత్రమున కలము పట్టిరి.
వీరు ‘వికాసభారతమ’ను పేర మానవ ప్రగతి చరిత్రను వ్రాయ తలపెట్టిరి. అదొక పెద్దపథకము అయ్యది సంపూర్ణమై యుండిన మానవుని జీవిత మనుగడ విభిన్న దశల యందెట్టెట్టి మార్పులు చెందుచుండెనో విశదమగు చుండెడిది అట్లే భారతదేశస్థితిగతులు, చరిత్ర తెచ్చిన మార్పులు అవగతమయ్యెడివి ఈ భారత వికాసమును వీరు తేటతెనుగులోని దేశకవితలో చెప్పబూనుట సాహసమైన విషయము. ఇది కథకాదు. చరిత్ర. దాని కంతుండదు. చరిత్రను పెంచి వ్రాయు అభిలాష కవికి పూర్తిగా లేదు. వర్ణసలపట్ల వ్యామోహము కూడాలేదు. ఉక్కు శనగల వంటి మాటల నుపయోగించి పరితల నుక్కిరి, బిక్కరి చేసి, పండితుల నుండి ప్రశంసావాక్యములను కానుకగా గైకొనవెలననెడి మోజుకూడా కవిగారికి లేదు. కొన్ని తెలుగు పదములను నుడికారములను కొందరు కవులు తమ రచనలయందు వాడుకొనే పద్ధతిని కూడ, వదలిపెట్టిరి. గొట్టిపాటివారు కాలానుగుణ్యముగా మారి మడిగట్టుకొనక జంకక కల్పనలు వర్ణనలు గావించక అచ్చతెనుగునుడికారముల వదలక ముచ్చటైన అలతి అలతి పదములతోడనే 16 పర్వముల వికాస భారతమును వ్రాయతలపెట్టి, అదిమ-బౌద్ధ-శాంతి-అణుపర్వములను వ్రాసిరి.
వీరి పథకము పూర్తిగా సాగియుండినచో ఈ వికాస భారతమునకు సాహిత్యలోకములో ఒక విశిష్ట స్థానముండెడిది. వీరి అదిమ పర్వములో కొన్ని విషయములను చూతము.
భూమిపై పుర్వుగా ప్రాకుచున్న మానవుడు, సముద్రములను దాటి ఆకాశ వీథులందు దిరిగి, గోళములనెక్కి ‘నెలవంక’, కొమ్ములకు నిచ్చెనలు వేయు నందాక రెచ్చిపోయె’ ననుమాట ఆధునికకు లెల్లరకు తెలిసిన విషయమే. ఇదెంతటి మార్పు? అసలీతడెవరు? ఎక్కడి దింతబలము. ఈతడు పూర్వమింతటి నాగరికతను కల్గి ఉండెనా? అని ఆలోచించిన, చరిత్ర లేదనియే జవాబు చెప్పుచున్నది. మరి అతడెట్లుండెనో? అతని పుట్టుకెట్లు జరిగినదో తెల్పునదియే అది మానవచరిత్ర. కవిగారు మానవుని పుట్టుకకు గల వివిధ ఆధారము లన్నింటిని విపులీకరించిరి.
మాటలిన్నిలేక మనసును వెలిబుచ్చు
మూగపైగతోడ మూల్గుతోడ
వెరపు గల్గినప్పుడరచును గట్టిగా
తృప్తివేళ నవ్వు దుముకు చుండు,
చూపులో ఊపులో నిల్చుమోపులోను
తాపులో కాలుసేతుల చాపులోను
బొమల ముడిలోను భావముల్ పుణికి కొనుచు
నెదుటివారల హృదయాల నెరుగుచుండె
ఆదిమానవుని కామవాంఛ ఇట్లుండెనని కవిగారూహించిరి.
తనదు తొడమీద తలవాంచు తనయులేపి
కామవాంఛను దీర్చుకోగడగె తల్లి
అన్నయొక్కడు చెల్లెలి నడుమ బట్టి
యౌడుగరచుచు నానంద మనుభవించె.
ఇట్టి అనాగరిక మానవుడతి త్వరలోనే కుటుంబీకుడైనాడు. పశువులను పెంచనేర్చినాడు. పాలు, పెరుగు, వెన్నలు తిన మరిగినాడు దుష్టమృగముల చంప సాహసించినాడు. గుడిసెలు గట్టుకొని శాంతిగా జీవితము సాగించినాడు. తదుపరి వస్తువులు తయారు చేయటం నేర్చినాడు. దానిని కవిగారిట్లు ముచ్చటగా ఆటవెలదులలో వ్రాసిరి.
ఒండుమట్టిదెచ్చి యెక్కరూపంబిచ్చి
యెండలోననుంచి నెదియొ నెంచి
అగ్గిపైనగాల్చి ఆదికుండగా మల్చి
సాధనమా నెంచి సంతసించె
వృత్తి చెట్టుగాంచి విత్తులు విడదీసి
దూదిలోనునన ధూళి దులిపి
యేకేజేసి దారమింతితగా దీపి
కండెబోటు జుట్టు గలిగినాడు.
ఇట్లు పలువిధములుగా మానవుని మనుగడలో మార్పులు రాసాగినవి.
ఓబిరెడ్డిగారు నిరాడంబరులు వినయ గుణశీలురు. ఒక మారుమూల కుగ్రామమునందు బడిపెట్టుకొని, వారికి పారము జెప్పుచు, తీరిక సమయముందు తమకు తోచిన విషయములపై, కవిత్వము జెప్పుచు మఱియొక ప్రక్క సేద్యము చేసెడివారు.
ఓబిరెడ్డిగారు తమ తొలి రచనలుగా శతకములు, హరికథలు వ్రాసిరి. తదుపరి నాటకములు వ్రాయుట కుపకరించిరి. పద్యరచనయందు, చిత్రబంధ కవితారీతులతో, అంత్యప్రాసలతో, నూత్న పదబంధములతో వ్రాయుట వీరి కభిరుచి వీరి ‘భక్తశ్రీసిరియాళ’ హరికథను సాహితీపోషకులైన, శ్రీ భోగిసెట్టి జోగప్పగారు ప్రచురించి కవిని ప్రోత్సహించిరి. వీరి పద్యనడక చూడుడు.
శా. ఏమేమీ చిరుతొండనంబి సతతం – బీరీతి సద్భక్తులన్
ఆమోదంబు జెంగ, దృప్తిపడ – నాహారంబు లర్పించునే?
ఈ మాడ్కి జెలువొందు త్యాగవరు నెందేని గనుంగొంటిమే?
స్వామీ నామదిఁగోర్కె గల్గెను భవద్భక్తు బరీక్షింపగ
తదుపరి వీరి ‘భీమసౌగంధిక’ నాటక మెన్నదగినది. ఈ నాటకమును కవిగారిందరికి అర్థమగునట్లు వ్రాసిరి. ఇందు భీమాంజనేయ సంవాదమొక రసవత్తర ఘట్టము. ఆంజనేయుడు, భీముని పరాక్రమమును పరీక్షించి, ఇట్లవహేళన జేయుచున్నాడు.
గీ. ఇంక సౌగంధి కంబులం చెన్నడేని
స్వప్నమందైన దలపకు – సత్వరమున
నుని కేగుము ప్రాణంబు లున్నజాలు
భామినుల, నెందఱినినైన బడయవచ్చు.
అందులకు కోపగించిన బీముడు రుద్రుడై ఇట్లు పలికినాడు.
గీ. ముదుసలి వటంచు, కనికరమెద దలంచి
యింత వఱకును మదిని శాంతించి యుంటి,
వింక నోరెత్తి మాటాడితేని, నీదు
మూతి విఱుగంగ బొడుతు నా ముష్టిచేత
కవులందఱు, మొట్టమొదట శతకములనే వ్రాసినట్లు తెలియవచ్చును. ఆ శతకములందు, భక్తి, నీతి, వైరాగ్యములకే ప్రాధాన్యమొసంగిరి. మన రెడ్డిగారు తమ ‘‘కృష్ణశతకము’’నందు పెదవులు, తగలని పద్యములనే వ్రాసిరి. పెదవులు తగిలిన పాపమని భావించిరేమో? ఖడ్గ బంధకందము, శైలబంధకందము, రతిబంధము. ఉత్పల పాదగర్భకందము, మున్నగు చిత్రబంధ కవిత్వములన్నవి. ఈ క్రిందిపద్యము చూడుడు.
కం. నక్షత్రనేత ఖద్యో
తాక్షా రణరంగదక్ష ఆశ్రితరక్షా
రాక్షస గజహర్యక్షా
అక్షీణ దయా కవితకటాక్షా కృష్ణా
వీరు తరువాత కృతి, రాప్తాటి నిర్వచన రామాయణము. వీరు శ్రీరామకథను సర్వజనులకు అర్థమగురీతి సులభశైలిలో వ్రాయదలంచిరి. ఇందు కౌసల్యాపరిణయముకూడ, సంక్షిప్తముగాచేర్చిరి. రావణుడు కౌసల్యాపరిణయము దశరధునితో జరుగకుండ, భగ్నము చేయదలచినాడు. విధిని దాటితనని గర్వపడినాడు. తుదకు తానే భగ్నపడినాడు. అందుకు సాగరునిట్లు దూషించినాడు.
శా. ఏరా సాగర యింనీకు పొగరా మీరీతి నాయానతి
మేరంజాలతివా దురాత్మ కుటా మిథ్యానులాపా నిను
ఘోరప్రక్రియ ఖండఖండములుగా, గోయించి భూతాళికా
హారం బౌ నటులే నోనర్తు ననగా నాతండు భీతాత్ముఁడై
విరామ సమయములో కూడా, వీరు కాలమును సద్వినియోగము చేయుచున్నారు. తన వద్దకు వచ్చుచున్న విద్యార్థులకు విద్యాదానము చేయుచున్నారు.
హిందూపురము తా. దాని గ్రామములు కవులకు, పుట్టినిండ్లుగా వెలసినవి. కల్లూరు, కగ్గల్లు, మణేసముద్రము, కోడిపల్లి, కిరికెర, బేవినహళ్ళి, కొండాపురము మొదలైన గ్రామములలో కవులుద్భవించినారు. మణూరు మలుగూరు కవులుకూడి ప్రసిద్ధులు. సంగీత సాహిత్య సరస్వతులు. కీ.శే. రొద్దము రాజారావుగారు, హిందూపురములో ప్లీడరుగావుండి, ఆంధ్రసాహిత్య సంగీతములకు, చేయూతనొసంగిరి. శ్రీ కృష్ణదేవరాయ వర్థంతుల నెఱపి, సాహిత్య సంగీతసభలను ప్రోత్సహించినారు. కీ.శే. కల్లూరి సుబ్బరావుగారి జీవితములో, ఏటేట వసంతోత్సవముల జరిపి అనేక కవి పండితులను పిలిపించి వారిచే సాహిత్యోపన్యాసముల నిప్పించి వారిని ఘనముగా సత్కరించినారు. ఈ సందర్భమునందే మణూరువారికి కవితారామ వసంత బిరుదమును శ్రీ జనమంచి వారిచ్చిరి.
శ్రీ మణూరు రామారావుగారు ఈ క్రింది గ్రంథముల రచించినారు. 1) రామశతకము, 2) ముక్తాక్షరగ్రస్త రామాయణము-1936, 3) శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర-1940, 4) లీలారంగనాథము-1952, 5) స్వాతంత్ర్య విజయము-1957.
శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర :
‘ఇది యొక స్థలపురాణము. ఇందుఁబేరొకన్న కూర్మగిరి నిపు ‘డాదినారాయణకొండ’ యందురు. ఇయ్యది మైసూరు రాజ్యమున ‘‘గుడిబండ’’ కుత్తరమున నాఱుమైళ్ళ దూరమున యల్లోడను గ్రామము చెంత గలదు. ఇద్దరాధరంబుపై వేంచేసియుండు శ్రీమన్నారాయణుండు భక్తఫల ప్రదాతయని చాలాకాలమునుండియు లోకమున సువ్యక్తము. ప్రతిమాఘమాసమునకు తనగోడును, మొఱపెట్టుకొన్నాడు.
వీరి ‘శబ్దాలంకార శతకము’నందు, అంత్యనియమము, అంత్య ప్రాప, ద్వాప్రాస, త్రిప్రాస, లాటానుప్రాసముగల పద్యములనేకము లున్నవి. వీరి ఈ కృషి ప్రశంసింపదగినది.
వీరి అముద్రిత గ్రంథములు చాలగలవు. ఇట్టి అజ్ఞాతకవులు, మన రాయలసీమలో అనేకలున్నారు. వారు కీర్తికాములుకారు. వీరు చిరంజీవులై సాహిత్యలోకమున ఆతారార్కచంద్రులవలె ప్రకాశించెదరు గాత.

రాయలసీమ రచయితల నుండి…..

———–

You may also like...