గాజుల వెంకటరమణప్ప (Gajula Venkata Ramanappa)

Share
పేరు (ఆంగ్లం)Gajula Venkata Ramanappa
పేరు (తెలుగు)గాజుల వెంకటరమణప్ప
కలం పేరు
తల్లిపేరునంజమ్మ
తండ్రి పేరువెంకటప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/9/1917
మరణం
పుట్టిన ఊరుకొత్తచెఱువు – సత్యసాయి తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తిప్రధానోపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు‘‘భావోదయము’’ అను ఖండకావ్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగాజుల వెంకటరమణప్ప
సంగ్రహ నమూనా రచనజీవనోపాధికై ఉపాధ్యాయవృత్తిని చేబట్టిన శ్రీ గాజుల వెంకటరమణప్పగారు వృత్తిరీత్యా తలమర్ల గ్రామమునకు ప్రధానోపాధ్యాయులుగా వచ్చుట సంభవించినది. చిన్నతనము నుండి పద్యరచనపై మక్కువగల వెంకటరమణప్పగారు తాము వ్రాసిన రచనలకు వెలుగుచూపక ఎందులకో నిరుత్సాహపడుచుండుట తలమర్లలోని శ్రీ కళానిధిగారు చూచి, వీరిని ప్రోత్సహించి, తమ గురువులైన శ్రీ మధురకవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారితో పరిచయము గావించిరి.

 గాజుల వెంకటరమణప్ప

జీవనోపాధికై ఉపాధ్యాయవృత్తిని చేబట్టిన శ్రీ గాజుల వెంకటరమణప్పగారు వృత్తిరీత్యా తలమర్ల గ్రామమునకు ప్రధానోపాధ్యాయులుగా వచ్చుట సంభవించినది. చిన్నతనము నుండి పద్యరచనపై మక్కువగల వెంకటరమణప్పగారు తాము వ్రాసిన రచనలకు వెలుగుచూపక ఎందులకో నిరుత్సాహపడుచుండుట తలమర్లలోని శ్రీ కళానిధిగారు చూచి, వీరిని ప్రోత్సహించి, తమ గురువులైన శ్రీ మధురకవి బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారితో పరిచయము గావించిరి. అప్పటికే తలమర్లలో సారస్వత సమితి స్థపింపబడి అందలి సభ్యులైన శ్రీ వేదాంతం నరసింహారెడ్డి, కళానిధి, బెళ్ళూరి వారలు తీవ్రమైన కృషి సాగించుచూ కవిత్వతతత్త్వాన్ని చర్చించుకొంటు వుండేవారు. అప్పటి ఈర్ష్యాలోకం కోమలమైన ఆ కవితాకన్యపై దుమ్మెత్తిపోసి రాళ్ళు విసురుతూవున్నా వారి వెఱ్ఱి వారికానందమన్నట్లుగా ఆ కవిమిత్రులుండిరి. ఆ కవిమిత్రుల సాంగత్యము వెంకట రమణప్పగారికి లభించింది. అందుకే వారు తమ ‘‘భావోదయము’’ అను కవితా సంపుటిలో బెళ్ళూరి వారిని గూర్చి యిట్లు ప్రశంసించిరి.
నీవు జనించి మించిన పునీత తలమ్మున నే వసించుట
భావరసోల్బణంబు దయివార నొకింత కవిత్వ వాటికన్
తావులు గ్రుమ్మరింపగల దార్ఢ్యమునందగ గట సాహితీ
సేవయె జీవనంబగు వశీకృత చిత్తుడ వీవు సత్కవీ
అప్పటినుండి వెంకటరమణప్పగారు కూడ ఆ సమితిలో సభ్యులై తమ ‘‘భావోదయము’’ అను ఖండకావ్యమును ఆ సమితి ద్వారి వెలువరించిరి.
వీరి కవిత్వము ప్రాచీన కవితాపద్ధతిలో కొంత, నవీన కవితామార్గమున కొంత సమ్మేళనమై యుండును. వీరిది జిగిబిగి కల్గిన చక్కటిశైలి. భగవద్దత్తమైన భావనాశక్తిగల వారి కవిత్వము జీవంతో కూడుకొన్నదనుటలో సందేహంలేదు. ఈ కవి తన మనోకాంక్ష నిట్లు తెలుపుకొన్నారు.
అడ్డు పాటుల నెల్లను నధిగమించి
వనధిఁజేరంగ నరుగు స్రవంతియట్లు
స్వార్థయుతమగు సంఘ నిబంధనముల
ద్రోసి, స్వాతంత్ర్య సీమయందున వసింతు.
‘‘ఈ కవి సాహిత్యజీవి. శాశ్వతములైన తన భావములకు స్వరూప మిచ్చితీరవలె ననెడి యుద్దేశ్యము కలవాడు. ఇట్టి సాహితీ సమారాధకులు చాలామంది కానరాదు. కాబట్టి అభ్యుదయము వీరి సహజలక్షణము’’ అని బెళ్లూరివారు ప్రశంసించిరి.
వీరు వ్రాసినవి రెండు ఖండికలేయైననూ చక్కటి రచనలను తెలుగువారి కందించిరనుటలో అతిశయోక్తిలేదు. ఇరువదేండ్ల కాలము శ్రీ శ్రీ శ్రీ భూమానంద భారతీస్వాముల వారిని సేవించిన ఫలముగా తనకీ రచనాశక్తి అబ్బినదని కవిగారు చెప్పుకొన్నారు. వీరిపై భూమానంద స్వాములవారి కృపాకటాక్షములు సర్వదా ప్రసరించుగాత.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...