పేరు (ఆంగ్లం) | Meesaraganda Pullamaraju) |
పేరు (తెలుగు) | మీసరగండ పుల్లమరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీనరసమాంబ |
తండ్రి పేరు | మీసరగండ ఓబరాజు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/10/1919 |
మరణం | – |
పుట్టిన ఊరు | తరిమెల, అనంతపురం తా. జిల్లా. |
విద్యార్హతలు | తెలుగువిద్వాన్ |
వృత్తి | ఆంధ్రోపన్యాసకులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | స్వర్ణ ప్రతిమ, రజనీకాంతం, ఆదర్శసమితి, మధుకణములు ఖండికలు, కాంగ్రెస్ చరిత్ర – జంగంకథ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మీసరగండ పుల్లమరాజు |
సంగ్రహ నమూనా రచన | మీసరగండ బిరుదాంకిత పండిత వంశమందు జన్మించిన మీసరగండ ఓబరాజు సుప్రసిద్ధ పౌరాణికులు, సంస్కృతాంధ్ర పండితులు, అనంతగిరి విలాస బాలరామాయణ కర్తలు. వీరి కుమారులే మన పుల్లమరాజు కవిగారు. పుల్లమరాజుగారు బాల్యమునుండియు తండ్రి వద్దనే ఆంధ్ర పంచకావ్యములను పాఠమొనర్చిరి. తదుపరి తరిమెల వాస్తవ్యులు, సంస్కృత భాషయందు గొప్ప పాండిత్యముగల కీ.శే. రామాయణము శంకర శర్మగారి వద్ద సంస్కృత పాఠము నేర్పిరి. సంగీత, నాటకములన్న చిన్నతనమునుండి వీరికి అభిరుచి మెండు. |
మీసరగండ పుల్లమరాజు
మీసరగండ బిరుదాంకిత పండిత వంశమందు జన్మించిన మీసరగండ ఓబరాజు సుప్రసిద్ధ పౌరాణికులు, సంస్కృతాంధ్ర పండితులు, అనంతగిరి విలాస బాలరామాయణ కర్తలు. వీరి కుమారులే మన పుల్లమరాజు కవిగారు. పుల్లమరాజుగారు బాల్యమునుండియు తండ్రి వద్దనే ఆంధ్ర పంచకావ్యములను పాఠమొనర్చిరి. తదుపరి తరిమెల వాస్తవ్యులు, సంస్కృత భాషయందు గొప్ప పాండిత్యముగల కీ.శే. రామాయణము శంకర శర్మగారి వద్ద సంస్కృత పాఠము నేర్పిరి. సంగీత, నాటకములన్న చిన్నతనమునుండి వీరికి అభిరుచి మెండు.
ఉన్నతపాఠశాల విద్యాభ్యాసము అనంతపురంలో ముగించి 1938-40 సం. మధ్య అక్కడే ఉపాధ్యాయ శిక్షణపొంది, తదుపరి మద్రాసు యూనివర్సిటీలో తెలుగువిద్వాన్ పట్టము స్వీకరించిరి. తొలుత బళ్ళారి పురపాలక సంఘంలో గుమాస్తా ఉద్యోగములో చేరి, తరువాత గుంతకల్, బుక్కరాయసముద్రము, పెనుకొండ పట్టణములందు తెలుగు పండితుడుగా పనిచేసి, తుదకక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఆంధ్రోపన్యాసకులుగా పదవీవిరమణ గావించిరి.
ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడే వీరు కొన్ని నాటకములను రచించి వాటిని విద్యార్థులకు ప్రదర్శింపజేసి, అనంతపురం జిల్లా యందేగాక గుంటూరు మున్నగు ప్రాంతములందు కూడ బహుమానములు పొందిరి. వీరు రచించిన నాటకములు స్వర్ణ ప్రతిమ, రజనీకాంతం, ఆదర్శసమితి. ఇవి అముద్రితములు. మధుకణములు ఖండికలు, కాంగ్రెస్ చరిత్ర – జంగంకథ; ఇవి ముద్రితములు.
మధుకణములు ఒక ఖండకావ్యము. కవిగారు మధుర భావావేశములు పొందినప్పుడెల్లనూ వ్రాసిపెట్టిన పద్యరత్నములివి. హిందీ పద్యభాగములను కూడా కొన్ని అనువదించియిందు చేర్చిరి. ఇందలి ‘‘మాతృప్రేమ’’ ఖండిక ఎంతటి కఠినాత్ముని హృదయమునైననూ ద్రవింపజేయు ననుటలో సందేహములేదు. వేశ్యాలోలుడైన ఒక బ్రాహ్మణ యువకుడు తన ప్రేయసి తలనొప్పి బావుటకు, ఆమె కోరికమేరకు తల్లిగుండెను దెచ్చుటకు ఏమాత్రము జంకక తల్లికడకు వెళ్ళినాడు. మాతృ హృదయముమ మసిజేసి మాడునకు పూసిన ఆ వేశ్య శిరోభారము తగ్గునట. అతడీ విషయము తల్లికి చెప్పినాడు. ఆమె కుమారుని కోరికను కాదనలేదు. ఆమెను కత్తితో పొడిచి చంపి ఆ చల్లని తల్లిగుండె తీసుకొన్నాడు.
గుండియ చేతబట్టి చెలికోరిక దీర్చెద వేగ నంచు ను
ద్దండత నేగుచో శిలనుదాకి పదమ్మటు దొట్రిలంగ, నా
గండడు నేలపై బడియె; గ్రచ్ఛఱ గుండియయార్చె నాయనా;
మెండగు దెబ్బదింటివో సుమీ మెలమెల్లన లెమ్ము పుత్రకా
ఇట్టి రసవత్తర ఖండిక లెన్నియో ఈ మధుకణముల సంపుటిలో చోటు చేసుకొన్నవి. ఉద్యగో విరమణానంతరము పుల్లమరాజుగారి పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా సన్నిధిలో కాలము గడుప నిశ్చయించి, కర్ణాటకలోని వారి వైట్ ఫీల్డ్ ప్రశాంత నిలయములో ధార్మిక చింతనలో కాలము బుచ్చుచున్నారు. వీరికి శ్రీ సత్యసాయి ఆయురారోగ్య భాగ్యములందించుగాత.
రాయలసీమ రచయితల నుండి….
———–