కొండవీటి వేంకటకవి (Kondaveeti Venkatakavi)

Share
పేరు (ఆంగ్లం)Kondaveeti Venkatakavi
పేరు (తెలుగు)కొండవీటి వేంకటకవి
కలం పేరు
తల్లిపేరుశేషమ్మ
తండ్రి పేరునారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/25/1918
మరణం4/7/1991
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామం
విద్యార్హతలునరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించారు.
వృత్తిఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచెన్నకేశవ శతకం, హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నృసింహ తారావళి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకళా ప్రపూర్ణ, కవిరాజు
ఇతర వివరాలు1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు. నందమూరి తారకరామారావు వీరిని 1977లో పిలిపించి దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాయించారు. తరువాత శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
కొండవీటి వెంకటకవి హాస్యప్రియులు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవారు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండ పెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవారు..
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొండవీటి వెంకటకవి
సంగ్రహ నమూనా రచనకొండవీటి వెంకటకవిలో కవి ఎప్పుడు వచ్చి చేరిందో గాని, అది పేరులో అంతర్భాగమైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సంస్కృతంలో శిక్షణ పొందిన వాడు. పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగినట్లు చెప్పారు. అది మోతాదు మించిన ఆధ్యాత్మిక రీతి…

కొండవీటి వెంకటకవి

కొండవీటి వెంకటకవిలో కవి ఎప్పుడు వచ్చి చేరిందో గాని, అది పేరులో అంతర్భాగమైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సంస్కృతంలో శిక్షణ పొందిన వాడు. పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగినట్లు చెప్పారు. అది మోతాదు మించిన ఆధ్యాత్మిక రీతి…
1945 ప్రాంతాల్లో ఆంధ్రలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగా వున్నప్పుడు జరిగిన ఆసక్తి కర సంఘటన ఒకటి, కొండవీటి వెంకట కవి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి స్టేషన్ సమీపంలో ఒక జమిందారు ప్రాంగణంలో జరిగిన ఘట్టం అది. ఆంధ్రలో వున్న అనేక మంది స్వాములు, బాబాలు, మాతల్ని అక్కడి జమిందారు పేరిట ఆహ్వానించారట. సన్మానిస్తామని, సత్కారాలు అందుకోమని ఆహ్వానంలో రాశారు. ఆ మేరకు వచ్చిన వారిలో కొండవీటి వెంకటకవి కూడా వున్నారు. చుట్టూ ప్రహరీ, ఒకటే గేటు. వేదిక ఏర్పరచి, సన్మానానికి వచ్చిన వారిని కూర్చోబెట్టి కార్యక్రమం ఆరంభించారట. ఒకరు సన్మాన పత్రం చదవడం, మరొకరు సన్మానించడం. అదీ కార్యక్రమం. సన్మాన పత్రంలో అంశాలు వింటుంటే చెమటలు పట్టి బ్రతుకుజీవుడా ఎప్పుడు బయట పడతామా అని అనుకున్నారట.
ఆనాడు కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి. సెక్స్ జీవితం, అవినీతి యిత్యాదులన్నీ బయటపెడుతూ పోయారట. తరువాత బెత్తాలతో బాదడం. అదీ కార్యక్రమం. బయటకు పారిపోడానికి వీల్లేదు. కనుక అందరూ గౌరవాన్ని అందుకున్నారట.
ఆ దెబ్బతో కొండవీటి వెంకటకవికి ఆధ్యాత్మికత వదలి పోయిందట. సాయంత్రానికి దగ్గరలో వున్న స్టేషన్ లో రైలెక్కి ఎవరి దారిన వారు పోయారట. కొండవీటి వెంకటకవి యీ స్వానుభవాన్ని చెప్పినవ్వించారు. ఇది రాయవచ్చా అని అడిగితే, నిక్షేపంగా రాయమన్నారు. నేను దీనిని సమీక్ష, ఈనాడు, ఉదయంలో రాశాను. అది సరే.
కొండవీటి వెంకటకవి తనను లక్షాధికారిగా చెప్పుకుంటూ, కోటేశ్వరుడిని కావాలని వుందన్నాడు. ఆశ్చర్య పోయిచూస్తుంటే, లక్షపద్యాలు చెప్పగలను, కోటి వరకూ అలా చెప్పాలని వుందన్నారు. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టు మూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. ఒకసారి ఎ.సి. కాలేజి (గుంటూరు)కు పిలిపించి ఉపన్యాసం చెప్పించాం. ఆయన ప్రసంగం ఆంధ్రపత్రికలో ప్రచురించారు. స్ఫూర్తిశ్రీ (భాస్కరరావు) అది రాశారు. నేను అప్పట్లో కాలేజి సారస్వత సంఘానికి కార్యదర్శిని. 1956లో సంగతి.
వెంకటకవికి ఇంగ్లీషు రాదు. నెహ్రూ చరిత్ర కావ్యంగా రాయాలనుకున్నాడు. తుమ్మల సీతారామ చౌదరి గాంధీ ఆత్మకథ రాస్తే మంచి పేరు వచ్చింది. అందుకు దీటుగా నెహ్రూ కథ రాయాలని సంకల్పించాడు. ఆవుల గోపాలకృష్ణమూర్తి తోడ్పాటుతో ఇంగ్లీషులో విషయాలు చెప్పించుకుని రాశాడు. నెహ్రూతో ఇంటర్వ్యూ తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఆయనకు సమర్పించి తృప్తి చెందారు. ఇది 1960 ప్రాంతాలలో సంగతి. నెహ్రూ సెక్యూలరిస్టు గనుక వెంకటకవికి తోడ్పడినట్లు ఎ.జి.కె. (ఆవుల గోపాలకృష్ణమూర్తి) చెప్పారు.
“దివ్యస్మృతులు” రచనలో రాస్తూ, ఎం.ఎన్. రాయ్ కు నివాళులు అర్పించారు. త్రిపురనేని రామస్వామి, ఏటుకూరి వెంకట నరసయ్య అంటే వెంకట కవికి యిష్టం. చిన్నయసూరి అంటే భక్తి. వాదోపవాదాలలో దిట్ట.
హైదరాబాద్లో యీనాడులో వారం వారం శీర్షిక రాసేవాడు. దాన వీరశూరకర్ణకు సంభాషణలు రాశాడు. అందులో కులంపై దాడి వాడివేడి సంభాషణలు ఎన్.టి.రామారావు గొంతులో వన్నెలు సంతరించుకున్నాయి.
వెంకటకవి విమర్శలు, తర్కాలు, వాదోపవాదాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. రామరాజు భూషణుడు (భట్టుమూర్తి) పట్ల, కుల విచక్షణతో, ప్రబంధకవుల నుండి జరిగిన అవమానాలు. ఆయన ఏ కరువు పెట్టేవాడు.
దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి వద్ద శిష్యరికం చేశాడు. వ్యాకరణంలో దిట్ట శాస్త్రిగారు చిన్నయసూరి అభిమాని. వెంకటకవి యిక్కడా, కులతత్వాన్ని తెచ్చి పెట్టి చిన్నయసూరి విషయంలో సాహిత్యలోకం కనబరచిన విచక్షణను నిరసించారు.ఆవులగోపాల కృష్ణమూర్తి అనుచరుడుగా వెంకటకవి చక్కని విమర్శను, హేతువాదాన్ని మానవ తత్వాన్ని అలవరచుకున్నారు. అయితే కులాభిమానం వీడలేక పోయాడు. అష్టావధానాలు చేశాడు. భువన విజయాలలో పాల్గొన్నాడు.
లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. మేమిద్దరం కలసికొన్ని పెళ్ళిళ్ళు చేయించాం. అందులో ఆవుల మంజులత పెళ్ళి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో జరిపింరు. ఆయన పురోహితుడు.
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానే మంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండపెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు. వేయిస్తే, దుకూలాలు (తెల్లని పట్టువస్త్రం) కప్పితే చాలు అనేవాడు. చల్లపల్లి రాజాను అడిగితే ఏనుగు ఫ్రీగా యిచ్చే అవకాశం లేకపోలేదు అనేవాడు. లోగడ షష్ఠిపూర్తి జరిపించుకున్న వారిని, వెక్కిరిస్తూ అలా అన్నాడనిపిస్తుంది.
రచనలు : కర్షకా శతకం, హితబోధ, నృసింహతారావళి, చెన్నకేశవ శతకం, దివ్యస్మృతులు, నెహ్రూ చరిత్ర (కావ్యం), త్రిశతి (శతకాలు), ఈనాడులో వారం వారం కాలం.

“ఆచార్య దేవా! ఏమంటివి? ఏమంటివి? జాతి నెపమున సూతపుత్రుని కిందు నిలువ అర్హతలేదందువా హ్ ? ఎంతమాట! ఎంతమాట! ఇది క్షాత్ర పరీక్ష కాని, క్షత్రియ పరిక్ష కాదే! కాదూ కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా! నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా! నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధు డయిన ఈ శాంతనవుడు శివ సముద్రు؍ని భార్య అగు గంగా గర్భమున జనియించలేదా! ఈయనదే కులము! నాతో చెప్పించితివేమయా! మా వంశమునకు మూలపురుషుడు అయిన వశిష్టు డు దేవవేశ్య అగు ఊర్వశీ పుత్రుడు కాడా! ఆతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని , ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు కన్నెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రాయిన మా పితామయి అయిన అంబికతో మా తండ్రిని, పినపితామయి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా యింటి దాసితో ధర్మ నిర్మణచరుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదుర దేవుని కనలేదా? సంధర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమై న మా కురువంశము ఏనాడో కులహీనమై నది. కాగా నేడు కులము కులము అను వ్యర్ధవాదమెందులకు?”

తెలుగువారిలో బహుళ ప్రచారం పొందిన యీ మాటలు దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్.టి.రామారావు సుయోధన పాత్రధారిగా కులాన్ని దుయ్యబట్టినవి. అవి రాసిన కొండవీటి వేంకటకవి నాడు భావనారాయణ సంస్కృత కళాశాలలో (పొన్నూరు, గుంటూరు జిల్లా ) అధ్యాపకులు. వెంకయ్య నుండి వెంకట కవిగా మారిన ఆయన సాహితీ జీవితం సాహసోపేతమై నది.

———–

You may also like...