శ్రీరంగం నారాయణ బాబు (Srirangam Narayanababu)

Share
పేరు (ఆంగ్లం)Srirangam Narayanababu
పేరు (తెలుగు)శ్రీరంగం నారాయణ బాబు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ5/7/1906
మరణం10/2/1961
పుట్టిన ఊరువిజయనగరం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురుధిర జ్యోతి , కపాల మోక్షం, కిటికీలో దీపం, గడ్డి పరక,మౌనశంఖం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీరంగం నారాయణ బాబు
సంగ్రహ నమూనా రచన
రక్త పతాకం,
శక్తి నాలుక,
అగ్ని కిరీటం,
ఆకాశమ్మున
ముని మాపు
కేకలు వేస్తూ
పిలిచింది.
కాలం నాగు
విను వీధులలో
వెన్నెల పడగ
విప్పింది.

సామిధేని

సామిధేని
రక్త పతాకం,
శక్తి నాలుక,
అగ్ని కిరీటం,
ఆకాశమ్మున
ముని మాపు
కేకలు వేస్తూ
పిలిచింది.
కాలం నాగు
విను వీధులలో
వెన్నెల పడగ
విప్పింది.
శారద రాత్రి
శంకరు ఫాలం
బూది పవిత్రత
బూరా వూదింది.
హంతకు చేతిని
కత్తులు
వింత హృదయమున
భావాలు
శిరసున రతనము
గళమున విషమ్ము
కలమ్ము కొసలో
కాటుక మబ్బులు
కాగితమె కంపించింది
పాటే
గ్రహపాటాళి
సూరన అడిదాన్ని
తిక్కన ఖడ్గాన్ని
పేలిన బిజాపూరు
ఫిరంగి గుండు
నా గుండె.

 

 

 

 

కవీ!
మృత్యువొసంగే
మాతృ కరమ్ముల
విధవ కానుపు
పెదిమల
వెలుగై వెలిగి
నలుపెక్కిందీ సంధ్యఖేదం రేపీ
రోదసి నిండి
విశ్వ గళమ్మున
హాలాహలమై
విస్తరిల్లినవి
చీకటులు!నల్లని త్రాచు కోరలు
తెల్లని మశూచి కుండలు
గగనమ్మున
తారలు!
* * * *
జట్కా గుఱ్ఱం
కాలం మెళ్ళో
గంటలు రెండు
మ్రోగినవిచచ్చిన తల్లి శవం
మెళ్ళో గజ్జెల
పట్టెడతో
ఉల్లాసంగా
ఆడుకునే
పసి పిల్లడులా
గాలి!ఒళ్ళు తెలియని
పుళ్ళ బాధతో
వెక్కి వెక్కి
ఏడ్చినది
చుక్కల ఆకాశం!సద్యో ఫలితం
విద్యు ద్దీపం
వెలుగున
గదిలోఖ్యాతి గడించే
గీతం వ్రాసి
ప్రేయసి కంకిత
మీయాలంటూ
మూతి బిగించి
చేతులు నులుముతు
కూచున్నావ!!!


కావాలి
(జ్వాల – 1935)
రేయి ముసుగు
పుడమి కొసగి
దివసావసాన
కాష్ఠ జ్వాలల్లో
కాలం
సహగమనం
చేసింది.
ఆరిన చితిలో
బూడిద వెన్నెల
జారిన ముక్కుపుడక-
ఒకటే చుక్క;
సమాధిలో
మృతశిశు వట్టుల
జలదాంతర శశి!
శ్యామల
శ్మశాన వాటుల
వ్రాలిన రాబందులె
శరన్మేఘములు;
వ్యోమ మార్గముల
ఊహ కతీతంబగు
శక్తి
దృగంచలాలకు
దొరకని
వ్యక్తి
సంచరించినది!
సంచలించినది!
సందేశాలను
పెంపొందించే
మూగ కేకలే
వేసింది;
నటరాజ
పాదముల
గజ్జల మ్రోతకు
పాటలు కూర్చే
కవులుంటే
కావాలంటూ!
చిలువతాలుపు
గరళ కంఠమున
కాలసర్పము
జోల పాటలో
సొక్కిపోవగ
నాగస్వర మూదే
కవులుంటే
కావాలంటూ!!
విలయవేళల
ప్రళయ తాండవం
చేసే శివునకు
వెనుక పాటపాడే
కవులుంటే
కావాలంటూ!!!

ఆంధ్ర భారతి నుండి….

———–

You may also like...