పేరు (ఆంగ్లం) | Madhunapantula Satyanarayana Sastry |
పేరు (తెలుగు) | మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | లచ్చమ్మ, |
తండ్రి పేరు | సత్యన్నారాయణమూర్తి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 3/5/1920 |
మరణం | 11/7/1992 |
పుట్టిన ఊరు | పోలవరం గ్రామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
విద్యార్హతలు | 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు |
వృత్తి | 1947లో ఆయన నివాసం రాజమండ్రికి మార్చి వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 1974 వరకు అ పాఠశాలలోనే పనిచేసి పదవీవిరమణ చేశాడు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల సౌందరనందము, దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహచరిత్ర, శతావధాని గడియారం వేంకట శేషశాస్త్రి శ్రీ శివభారతము, తుమ్మల సీతారామమూర్తి బాపూజీ ఆత్మకథ అనేవి. శాస్త్రి రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం. ఖండకావ్యాలు – (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ |
ఇతర వివరాలు | ఆంధ్ర భాషమీద ఉన్న అపారమైన ఆభిమానంతో 1939లో ఆంధ్రి అనే మాసపత్రికను ప్రారంభించాడు.1940-44ల మధ్యకాలంలో ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | ఈ ప్రస్తావన భావుకులకు నవీనము కాకపోవచ్చును . నన్నయ భట్టారకుల సారస్వతమున మహా భారతావతారిక మనము చూచుచున్నదే , ఆయన సర్వ సిద్దాంతముల కా యవతారిక ఆయువు పట్టు .లక్షణ గ్రంధ ఘట్టముగానున్న యా భాగములో వ్యాఖ్యానతః విశేష ప్రతిపత్తి గోచరించుచునే యుండును . “నహి సందేహా దలక్షణం “. |
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
ఆంధ్ర మహాభారతము వచనోపక్రమము
ఈ ప్రస్తావన భావుకులకు నవీనము కాకపోవచ్చును . నన్నయ భట్టారకుల సారస్వతమున మహా భారతావతారిక మనము చూచుచున్నదే , ఆయన సర్వ సిద్దాంతముల కా యవతారిక ఆయువు పట్టు .లక్షణ గ్రంధ ఘట్టముగానున్న యా భాగములో వ్యాఖ్యానతః విశేష ప్రతిపత్తి గోచరించుచునే యుండును . “నహి సందేహా దలక్షణం “.
అవతారికలో రాజరాజనరేంద్రుని కొలువు నభివర్ణించుచు వ్రాయబడిన యొక వచన మున్నది . ఆకొల్వున గూర్చుండిన విద్వజ్జనులు అయిదు శ్రేణులుగా నున్నారు . ప్రధమ శ్రేణి వై యాకరణులది రెండవది భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణిక కులది . మూడవ శ్రేణి దీర్చియున్న వారు మహా కవులు .నాల్గవ యైదవ శ్రేణులకు దార్కికులు వైణిక గాయ కాదులు వచ్చిరి . ఇది నన్నయ్య భట్టారకులు సాక్షాత్తుగా చూచి చెప్పిన రాజనరేంద్రుని సభా భవన ప్రాంగణములోని ఆసన శ్రేణీ పరిష్కరణము . ఇక్కడ నొక చిక్కు :
ఒకనాడు సుల తాను కొలువులో షాజీ పుత్రుడైన శివాజీకి అయిదు వేల సరదారులు కూర్చున్న పంక్తి లో బీఠము చూపబడెనట .మనస్వి యగు శివాజీకి అది భరింపరాని పరాభవమైనది . ఆ మహా రాష్ట్ర నాయకుడు వారు చూపిన యాసన శ్రేణీ కంటె సమున్నతమైన యాసనము పై అధిష్టింప దగిన వాడు నన్న ఆత్మ ప్రత్యయము కలవాడు . తన పీఠము ప్రక్క తరహా వారు ! ఇది కదా ప్రశ్న . మాటలతో వేరే తుటూరింప నక్కర లేదు . తన దృష్టికి వాడు విశిష్టుడు కాని , తుల్యుడు కని కానిచో నట్టివని చెంత దనకు బీట వేసిన పెద్ద మానిసితో దగవు తప్పదు . ఇది యొక యవమానముగా నొకడు పట్టించు కొనడు . ఒకడు పట్టించుకొనుచు , పట్టించుకొన్నవాడు ఆత్మ గౌరవము కలవాడుగా విజ్ఞ లోకమున నభినందితుడగు చున్నాడు . మొదటి వాడు అమాయికుడేని , యోగి యేని కావలయును .
లోకజ్ఞుడు సద్వినుతా వాడాత చరిత్రుడునైన నన్నయ రాజ రాజు కొలువునే శ్రేణికి జెందిన పీఠమున సమాసీను డాయెనో ! యన్నది యొక వివిదిష . ఆ రాజరాజానురక్తు దెచ్చట గూర్చుండు గాక ! పురస్కారమున కేమి కొదవ ? ఇంతకు భట్టారక పీఠం అభి వర్ణిత శ్రేణులకు భిన్నమైన యొక ప్రత్యేక స్థానమున నుండ వలయును ఆ స్థానము రాజమనోహరుని యంతరంగము కంటె నన్యము కాదు .
ఈ శ్రేణీ కల్పనము వలన మనము గురుతింపవలసినది భట్టారకుల హృదయము . ఆయనకు బ్రధమాభిమాన శాస్త్రము శాబ్దము . తరువాత , మహా కవిత్వము . పదపడి , తక్కినవి . ఈ క్రమములో బూర్వ పూర్వ మాయనకు గాడాభిమాన విషయములు . తాను విపుల శబ్ద శాసనుడు “ ప్రధమే హాయ్ విద్వాంసోం వై యాకరణః “ కనుక . సభలో వైయాకరణ శ్రేణిని ముందుంచట జరిగినది . నన్నయ తాను బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతుడు . రెండవ శ్రేణిలో బౌరాణికులను గూర్చుండ జేసినది యీ విజ్ఞాననిరతి . నన్నయ తాను కవి , మృదు మధుర రసభావ భాసుర నవార్ధ వచన రచనా విశారదుడైన మహా కవి యగును గదా ! ఈ కవిత్వమునకు స్థానమును మూడవదిగా నేల కొనెను ! అహంకార నిరాసార్ధమా ! ఆయన దృష్టిలో దాని కదియే స్థానము కావలయునా ?
‘ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని యాధ్యాత్మ విదులు వేదంతమనియు నీతి విచాక్షణు ల్ నీతి శాస్త్రంబని కవి వృభులు మహా కావ్యమనియు “ఇత్యాది గానున్న పద్యములో నీక్రమము మరియు స్పష్ట పఱచి భట్టారకులు చెప్పియున్నారు . ఇంత కంటే అక్కజముగా “తన కుల బ్రాహ్మణు ననురక్తు నవిరళ జప హోమతత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు ‘ ఇత్యాది సీసములో నీక్రమము సువ్యక్త పడుచున్నది . విపుల శబ్ద శాసనత్వము తరువాత బురాణ విజ్ఞాము . తరువాత ఉభయ భాషా కావ్య రచనము , ముమ్మారు ఈ రీతిగా శాస్త్ర పురాణ కవిత్వ కళల యొక్క క్రమత పూర్వ పూర్వ విషయములపై తనకు గల తత్పరత భట్టారకులు చెప్పినట్లయినది . రాజ శేఖరుడు కావ్య మీమాసంలో శాస్త్ర కావ్యములు ఈ రకముగా విభాజము చేసేను . పురస్సరద్ధ ర్మా నుశాసనమైన మహా కావ్యముగా ఆంధ్రా భారతమునుప్రమించుటలో భట్టారకుల మెలకువ తెలుగు సరస్వతి యలికమున విశేషక రచన యగుచున్నది .
ప్రాచీన శాస్త్రము లన్నియు నే శబ్దముతో నుపక్రాంతము లగుచున్నవి ? అందు గొన్ని మంగళార్ధకమైన ‘అధ ‘తో నారంభమైనవి “ అధాతో ధర్మ జిజ్ఞాసా “ – “ అధాతో బ్రహ్మ జిజ్ఞాసా “ ఇట్లు పూర్వోత్తర మీమాంసా సూత్రములు ప్రవర్తిల్లినవి . “ అధ శబ్దాను శాసనం . కేషాం శబ్దానాం “ ఇట్లు పాతంజల మాహా భాష్యము ఓంకార మునకు అధ శబ్దము సహోదరము. ఈ రెండును మాంగళికములు .
ఓంకార శ్చా థశబ్దశ్చ ద్వా వేతౌ బ్రహ్మణః పురా
కంఠం భిత్వా విని ర్యాతౌ తస్మా న్మాంగ ళి కా వుభౌ ||
తత్తచ్చాస్త్రాదియందు బ్రయుక్తమైన యీ “అధ “ అవ్యయమై మంగళార్ధకమే కాకా అధికార ద్యోతకము కూడా నగుచున్నది . నామ లింగాను శాసనము దీని కయిదు అర్ధములు చెప్పినది . మంగళము అనంతరము ఆరంభము ప్రశ్నము కృత్స్నత ఇవి కాక “ మేదిని “ దీనికి సంశయ మను నర్ధము కలదనెను . నన్నయ అవతారికోపక్రమణ మునకు అధ శబ్దార్ధ విచారమునకు ఏమి సంబంధ మందురు ! “ అధ “ శబ్దార్ధమునకు సరియగు తెనుగు అని యన్నది . అధ వర్ణ ద్వయాత్మక మైనది . “ అని “ యునట్టిదే . అందురు ఇందును ఆకారమే ముందున్నది . “ అధ “లోని ధ కారము తెనుగులో “ని “ వర్ణముగా దిగినది . ఈ తద్భవతలో మనము సంతోషపడ వలసినది తవర్గును దాటకుండా జరుగుటయే . ఒకానొక ముచ్చటకుగాని యిందు మనకు దద్భావతా ప్రసక్తి యక్కర లేదు . అధ ఆనంత ర్యార్ధకము . “ అని “ యన్నదియు నట్టిదే . ఈ సంస్కృతాంద్రా వ్యయములు రెంటికీ ఇంత బలిష్టమైన బాంధవ మున్నది .
నన్నయ భాతారకుల దేశ భాషా కృతి రచనము దేవ భాషా శాస్త్ర సంప్రదాయానుగతమైనది . ఆంద్ర మహా భారతము “ అని సకల భువన రక్షణ ప్రభువులై యాద్యులైన హరి హర హిరణ్య గర్భ పద్మోమా వాణీ పతుల స్తుతియించి తత్ర్పసాద సమాసాదిత నిత్య ప్రవర్ధ మాన మహా మహీ రాజ్య విభవుండును నిజభుజ విక్రమ విజితారాతి రాజనివ హుండును నఖిల జగజ్జేగీయమాన నానాగుణ రత్న రత్నా కరుండు నై పరగుచున్న రాజరాజ నరేంద్రుండు “.
అను వచనముతో నుపక్రమింప బడుట చూడగా బూర్వోత్తర మీమాంసాది శాస్త్రముల వలె అధ శబ్దసహోదరమైన “అని “ ముమ్మోదట బ్రయుక్త మయ్యేనని విజ్ఞులు తెలిసికొనియుందురు . ఆంద్ర మహా భారత మిటులు భట్టారకుల యుపక్రమణ సంప్రదాయముతో శాస్త్రమై కవి వృషభులకు మహా కావ్య మగుచున్నది . మహా కావ్య మైనపుడు కావ్య ప్రయోజనము ఆదియందు సూచింప బడవల యుండవలెను . ఒకటి కాదు , మూడింటికి ముడియగు గద్యమే ఆద్య ప్రయుక్తమైన దన్నచో నన్నయ గారి హృదయము నారాధించుట యగును .
తొలి వచనమున హరి హర హిరణ్య గర్భులకు నమస్కారము చేయబడుట తత్ప్ర సాదా సమాసాదిత … అనుట వలన రాజ నరేంద్రునకు ఆశీస్సు లొసగ బడుట గోచరమగుచున్నది . మఱీ వస్తు నిర్దేశము ! ఎక్కడో కాక ప్రధమతః ప్రయుక్త మైన శబ్దములో నేయున్నదని నా చేయుచున్న మనవి . నన్నయ తాను పాక శానని . భారత ఘోర రణమున నుద్య తుడై దుష్ట శిక్షణ సాధుభువన రక్షణములు జరుపవలసిన వాడు . నారాయణ సహాయుడైన యీ నరునితో ధర్మము మహా భారతమున బ్రతిష్టతమైనది . దుష్ట నిగ్రహమునకు సంగ్రామము వలసియున్నది . భారత సంగరము జరిగిన చోటు కురుక్షేత్రము ధర్మ క్షేత్రము . “ భారం సంగ్రామం తనోతి విస్తార యతి “ అని భారతమునకు వ్యుత్పత్తి చెప్పుదురు . ఇంతకు తేలినది భారత వస్తువు సంగ్రామము . నన్నయ గారు అయోధ నార్ధకమైన అని శబ్దము నాడిలో బ్రయోగించి వస్తు నిర్దేశము నెంత గుప్తము గావించినారో యిపుడు విచారింప వచ్చును .
“యధా యుధానాం కులిశ మింద్రి యానాం యధా మనః |
తధేహ సర్వ శాస్త్రాణం మహా భారత ముత్తమమ్ ||
మార్కండేయ పురాణం ,
మంగళార్ధకమైన అధ శబ్దము వంటిదే యగు “ అని “ తో మహా భారతారంభ మగుట – అది కాక వస్తు నిర్దేశకరణోద్దేశమున సంగ్రామార్ధకమగు “ అని “తో సమారంభమగుట – చూడగా తెనుగు భారతమును శాస్త్రముగా మహా కావ్యముగా నాంధ్రులకు అను గ్రహించెడి తలంపు నన్నయ మహర్షి కుండెను . “ అక్ష రాణా మకారోస్మి “, అని కదా భగ వద్వచనము.
ఆంద్ర మహా భారతము వంటి సారస్వత ప్రధమా వతారము ఛందో బంధేతరమైన , ‘ అని సకల భువన రక్షణేత్యాది వచనముతో నారంభింప బడెనా ? మఱీ –
శ్రీవాణి గిరిజాశ్చి రాయ దధతో వక్షో ముఖాం గేషు యే
లోకానాం స్థితి మావ హంత్య విహతాం స్త్రీ పుంస యోగో ద్భ వామ్
తే వేద త్రయ మూర్తయ స్త్రీ పురుషా స్సం పూజితా వస్సురై
ర్భూ యాసు పురుషోత్త మాంబుజ భావ శ్రీకంధరా శ్శ్రే యసే !
మూర్తి త్రయ స్తవాత్మక మైన యీ శ్లోక ముమాట యే మైనది ! ఇది యాంధ్రము కాలేదు . అంతరంగ కృత మైన కవి ప్రార్ధనము శిష్య శిక్షకు గ్రంధానుంచుట యాచారము కదా ! తెనుగు భారతము అచ్చముగా ఎచ్చట నుండి యుప క్రాంత మయిన దనగా నా యొద్ద నుండియే యని చెప్పవచ్చినట్లు గ్రంధారంభ సర్వసముదాచారగుంఫితమైన తొలి వచనమే చెప్పుచున్నది . పంచమ వేదము నాంద్రీకరించు నపుడు చందః పురస్కారము విధిగా జరుగవలసియుండగా గడ్యా రంభము శాస్త్ర సంప్రదాయ సుందరమైన భట్టారకుల హృదయమును పట్టి చూపుచున్నది . ఆయన గద్య పద్యములకు తుల్య ప్రతిపత్తి నిచ్చిన మహా కవి .
సేకరణ :మధునాపంతుల సాహిత్య వ్యాసాలు
———–