దేవరాజు వేంకటకృష్ణారావు (Devaraju Venkata Krishnarao)

Share
పేరు (ఆంగ్లం)Devaraju Venkata Krishnarao
పేరు (తెలుగు)దేవరాజు వేంకటకృష్ణారావు
కలం పేరు
తల్లిపేరురత్నమాంబ
తండ్రి పేరువేంకటరావు
జీవిత భాగస్వామి పేరురత్నమ్మ, సత్యవతి
పుట్టినతేదీ9/23/1886
మరణం9/13/1966
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునేనే (1914), కాలూరాయి (1916) , జానకీపరిణయం (తప్పుల తమాషా) , సంజయరాయబారం, శ్రీకృష్ణరాయబారం గ్రంథాలను వ్రాశారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుగడబిడదాస్‌, అర్జెంటు పంతులు, ప్రాడ్వివాకుడు
ఇతర వివరాలుతొలి తెలుగు అపరాధపరిశోధక నవలా రచయితగా పరిగణింపబడుతున్నారు. తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్‌పజిల్‌ను సృష్టించిన ఘనతకూడా దేవరాజు వేంకటకృష్ణారావుకే దక్కుతుంది. 1933లో అభినవాంధ్ర కవిపండితసభలో అఖండసత్కారాన్ని పొందారు. 1950లో విమర్శకాగ్రేసర అనే బిరుదుతో సత్కరించబడ్డారు. కాలూరాయి నవలలో హెలీకాప్టర్ను ఊహించి వ్రాశారు. అప్పటికి ఇంకా హెలీకాప్టర్ కనుగొనలేదు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదేవరాజు వేంకటకృష్ణారావు
సంగ్రహ నమూనా రచనఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బరంపురం 19వ శతాబ్ది పూర్వార్థానికి గంజాం జిల్లాలో ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వాసికెక్కింది. జాతీయ ఉద్యమం దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో మతం, కులం, స్త్రీల స్థితిగతులు, శాస్త్రీయత, హేతువాదం, ప్రధానాంశంగా ఆధునిక సమాజం రూపుదిద్దుకుంటున్న తరుణంలో బరంపురం ఆధునికతకు, అభ్యుదయ భావాలకు చిరునామాగా ఆంధ్రదేశ చరిత్రలో స్థానం సంపాదించుకున్నది. ఎందరో పండిత ప్రకాండులకూ, కవి గాయక వైతాళికులకు, దేశభక్తులకు జన్మస్థానం బరంపురం.

దేవరాజు వేంకటకృష్ణారావు

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బరంపురం 19వ శతాబ్ది పూర్వార్థానికి గంజాం జిల్లాలో ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వాసికెక్కింది. జాతీయ ఉద్యమం దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో మతం, కులం, స్త్రీల స్థితిగతులు, శాస్త్రీయత, హేతువాదం, ప్రధానాంశంగా ఆధునిక సమాజం రూపుదిద్దుకుంటున్న తరుణంలో బరంపురం ఆధునికతకు, అభ్యుదయ భావాలకు చిరునామాగా ఆంధ్రదేశ చరిత్రలో స్థానం సంపాదించుకున్నది. ఎందరో పండిత ప్రకాండులకూ, కవి గాయక వైతాళికులకు, దేశభక్తులకు జన్మస్థానం బరంపురం.
దేవరాజు వేంకటకృష్ణారావు 1910-11 సంవత్సరాల నుంచి వేగుచుక్క ముద్రణాలయం- గ్రంథమాల ద్వారా అనేక గ్రంథాలను ప్రచురించి- తెలుగుదేశంలో ఖ్యాతి నార్జించారు. 1912లో ‘వాడే వీడు’ నవలా రచన ద్వారా ఆంధ్రభాషలో తొలి అపరాధ పరిశోధక నవలాకర్తగా గుర్తింపు పొందారు. అటు పర్లాకిమిడి కార్యస్థానంగా గిడుగు రామమూర్తి పంతులు, గిడుగు సీతాపతి వ్యావహారికాంధ్ర భాషా ఉద్యమంలో, సాహితీ వ్యవసాయంలో తెలుగుతల్లి ముద్దుబిడ్డలుగా కీర్తి పతాకను ఎగురవేశారు.
పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి బరంపురం, కళ్ళికోట కళాశాలలో అధ్యాపక స్థానాన్ని అలంకరించి, రచయితగా సంస్కృతాంధ్ర, ప్రాకృత భాషాపండితుడిగా, అభ్యుదయవాదిగా యశస్సు నార్జించారు. ఈ నేపథ్యంలో నవీన రీతులలో రచనలు చేస్తున్నవారందరూ బరంపురంలో ఒక ఐక్యవేదికగా ఏర్పడి సభలు నిర్వహింపదలచినట్లుగా మనకు ‘నవ్యాంధ్ర సాహిత్య వీధుల’లోని ఈ పంక్తుల ద్వారా తెలుస్తోంది.
‘1933 నాటికి ఆంధ్రదేశంలో నవ్యసాహిత్యాన్ని ఆరాధిస్తున్న సంస్థలలో సాహితీ సమితి, యువకవి మండలి, కవితా సమితి ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసి 1933 మార్చి 10, 11, 12 లలో బరంపురంలో అభినవాంధ్ర (అఖిలాంధ్ర) కవి పండిత సభను పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి అధ్యక్షతన నిర్వహించాయి.’ (పుట-515) 1933 మార్చి 10, 11, 12 తేదీలలో బరంపురంలో జరిగిన ఈ సభలకు నాడు లబ్ధప్రతిష్ఠులైన కవి పండితులందరూ బరంపురం తరలివచ్చారు.
సభల నిర్వహణకు పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రికి అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీగురు భాగవతుల ధర్మారావు, దేవరాజు వేంకటకృష్ణారావు తదితరులు సహకరించారు. మూడు రోజుల మహాసభలను గిడుగు రామమూర్తి పంతులు ప్రారంభించారు.
మొట్టమొదటిసారిగా జరిగిన ఈ ఆధునిక సాహిత్య సదస్సుకి చిలుకూరి నారాయణరావు అధ్యక్షత వహించారు. సభలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, తల్లావఝ్జల శివశంకరశాస్త్రి, వేదుల సత్యనారాయణ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, గిడుగు సీతపతి, చింతా దీక్షితులు, కొంపెల్ల జనార్దనరావు, శ్రీశ్రీ, తాపీ ధర్మారావు, గుండిమెడ వెంకట సుబ్బారావు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, జయంతి జగన్నాధరావు ప్రభృతులు పాల్గొన్నారు.
శ్రీశ్రీ లాంటి యువకవులకి ఈ సభలు కొత్త ఉత్సాహాన్ని కల్గించాయి. సభలో తల్లావఝ్జల శివశంకరశాస్త్రి నవ్య కవుల కవిత్వాన్ని వినిపించారు. ముఖ్యంగా శ్లిష్ట్లా ఉమామహేశ్వరరావు కవిత- ‘మారో.. మారో.. మారో మారో/ఒకటి రెండూ — మూడు నాలుగు మారో మారో — మారో మారో” సభికుల్ని ఉత్తేజపరిచింది. బరంపురంలో జరిగిన సభలను శ్రీశ్రీ అనంతం: ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలలో నమోదు చేశారు. “…దీనిని నేనూ జనర్దనరావూ వెళ్లాము. అప్పుడే నేను కొత్త బాణీలో రాస్తున్న నా గీతాలను చింతా దీక్షితులుగారికి చదివి వినిపించాను. అది విని ఆయన అమితానందభరితుడు కావడమూ, వచ్చేసిందిదిగో కొత్త కవిత్వపు వరద” అని నన్ను మెచ్చుకోవడమూ ఎన్నటికీ నేను మరిచిపోలేను” (పుట-125)
గ్రాంధిక భాష వ్రాయటంలోని నిరర్థకత, వ్యావహారికాన్ని ఆశ్రయించాల్సిన ఆవశ్యకత ఈ మహాసభలలో చర్చకు వచ్చాయి. ఈ సభలో తీసుకున్న నిర్ణయాలు: – గ్రాంథికాంధ్రము ఒకానొకప్పుడు పరిమిత ప్రయోజనము కలదైనా నేడు అది సర్వజనోపయోగకారి కాదు. వ్యావహారికాంధ్రము అపరిమిత ప్రయోజనము కలది. ప్రజలలో జ్ఞానాభివృద్ధి కలగడానికి ఇదే పరమ సాధనము.
– ప్రారంభ విద్య ఉన్నత విద్యలను తెలుగు పిల్లలకు చెప్పేటందుకు సాధ్యముగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన గ్రాంథిక భాష అందులకు తగినది కాదు. భాషకున్నూ, బాలురకున్నూ అందువల్ల తీరని నష్టం కలుగుతున్నది. కావున జీవద్భాషలోనే విద్యా కార్యక్రమమంతా జరుపవలెనని గవర్నమెంట్‌ను ఈ సభ వారు కోరుతున్నారు. వీటితో పాటు నవ్య సాహిత్య పరిషత్తు పక్షాన ఒక సాహిత్య పత్రిక వెలువరించటానికీ, కొంపెల్ల జనార్దనరావును ఆ పత్రికా సంపాదకుడిగా నియమించడానికీ కూడా తీర్మానాలు జరిగాయి. కవి పండిత గోష్ఠులతో బరంపురం ప్రతిధ్వనించింది.
2006లో, నేటికి:
వీరి మనుమలు, మునిమనుమలు, మునిమునిమనుమలు మొత్తం పద్దెనిమిదిమంది అమెరికాలో స్థిరపడి ఉన్నారు. దేవరాజు వేంకట కృష్ణారావు గారి, ప్రథమ కుమారుడు, శ్రీ దేవరాజు వేంకట సత్యనారాయణ మూర్తి గారు తన తొంభై నాలుగేండ్ల వయసులో కూడ, అఖండ సంఘ, సాహితీ సేవ చేస్తూ, చేయిస్తూ, తన తండ్రి గారి మధుర స్మృతులతో, విశాఖలో స్థిర పడ్డారు.

———–

You may also like...