పేరు (ఆంగ్లం) | Sahadeva Suryaprakasharao |
పేరు (తెలుగు) | సహదేవ సూర్యప్రకాశరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కథలు : క్షమావతి, దుర్గావతి, మీర, సుప్రియ, బాబి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సహదేవ సూర్యప్రకాశరావు |
సంగ్రహ నమూనా రచన | క్షమావతి. ఆమె త్యాగశీలిని. ఆమె ప్రాచీనసాహిత్య సౌహిత్యమున తన జీవితమును పునీత మొనరించుకొన్నది. పూపప్రాయమునుండి యనుభూతముగా జ్యోతిషశాస్త్రము నవగతముచేసికొని యమూల్యసూక్తములను నావిష్కరించినది. యపూర్వసూత్రములే నాటినుండి నేటివఱకు హిందూహృదయమున శబలితరోచిస్సులతో నాయకమణులగా ద్యోతించుచున్నవి. |
సహదేవ సూర్యప్రకాశరావు
క్షమావతి. ఆమె త్యాగశీలిని. ఆమె ప్రాచీనసాహిత్య సౌహిత్యమున తన జీవితమును పునీత మొనరించుకొన్నది. పూపప్రాయమునుండి యనుభూతముగా జ్యోతిషశాస్త్రము నవగతముచేసికొని యమూల్యసూక్తములను నావిష్కరించినది. యపూర్వసూత్రములే నాటినుండి నేటివఱకు హిందూహృదయమున శబలితరోచిస్సులతో నాయకమణులగా ద్యోతించుచున్నవి.
ఆమె మేధావి. ఆమె ద్రష్ట. ప్రతిస్వల్పవిషయమునామె ప్రకృతిభండారమునుండియే సేకరించుకొన్నది. ఆమెవ్రేలికొనలు నిరంతర మేతారకాగణమునో గుణించుచుండును. వివిక్తవిభావరీవేళల నామె తరళనయనము లేగ్రహగతినో పరీక్షించుచుండును.
ఆమె విజ్ఞానతృష్టకు ఆవలి సీమలేదు. అందుచేతనే జీవితాంతము నామె హృదయప్రశాంతిని నోచుకొనలేదు నూత్నదర్శనములకు, నూత్నపరీక్షలకు నామె తపించిపోయెడిది.
దైనందిన కార్యము లామె వ్రేలిగుణింపులను జరగిపోవలయును. నాడు జరిగినవి. నేడు జరుగుచున్నవి. ఆమె సమంకితసూత్రము లంతగా హిందూకేదారమున వేళ్లుపాణినవి, తొలకరించినవి, సుమించినవి.
ఆమె నంద ప్రమదావనమునుండి జారిపడిన పారిజాత ప్రసూనము. ఆయమరసుమప్రమదామణి నెటుల గైసేయుటో ఈర్ష్యావిలులగు పండితశౌండులకు దెలిసినదికాదు హృదయము గ్రహించిన మిహిరునకు దెలిసినదికాదు.
క్షమావతి పండితకుమారి. ఆమెతండ్రి అతనాచార్యుడు వ్యుత్పన్నుడు, విద్యాచార్యుడు, కాశ్మీరబ్రాహ్మణుడు. సమగ్రవిద్యావ్యాసంగములో నాతనితల నెరసిపోయినంది. విద్యాకాంక్ష యాతని కనులలో నింకను తరళించుచుండెను. ఆమరణాంతము నాతడు నవీనశాస్త్రచర్చ గావించినాడు.
రెండుమూడు శతాబ్దములకుపూర్వము హస్తినాపురము (ఢిల్లీ) రాజకీయాందోళనలపాలయి యట్టుడికినట్లుడుకసాగినది. ఆరాజకీయవిప్లవవాయువు లాకళోపాసకుని విద్యాసమాధినుండి లవలేశమేని కదలింపలేదు.
అపరూపవ్యక్తులకు లోకవాసనలతో నిమిత్తము లేదు. వారలకు ద్వంద్వముల భేదాభేదము లుండవు. వారు అతీతులు.
కొన్ని జనపదములు నిర్ధూమధామము లయినవి. విప్లవకారులు కొందఱు సార్వభౌముని ప్రాణాపహరణమునకు బూని విఫలీకృతులయినారు. సంఘమరణములు సంభవించినవి. సస్యలక్ష్మిని కార్మొయిళ్లు కాఱుక్రమ్ముకొన్నవి. విశేషములపై విశేషములు తామర తంపరలవలె వచ్చుచుండెను. కాని యేబదియేండ్లు పైబడిన ముదుసలి చెక్కుచెదరనిహృదయముతో గ్రహభ్రమణములను గుర్తించుచుండెను.
తూరుపుదెసను నీలాంబరవక్షమును ముద్దాడు కాశ్మీరపర్వతశ్రేణి; పరమర హిందూకుష్ పర్వతపాళి. ఆమధ్యప్రదేశము ప్రకృతిప్రసాదితము. అది నైసర్గిక సౌందర్యఖండము. ఆగ్రామము శ్రీనగరము; అతనాచార్యుని జన్మస్థానము.
క్షమావతి తల్లిలేని బిడ్డ. ఆమెను గని తల్లి కదళీ తరువువోలె నశించిపోయినది. ఆమె మాతృప్రేమోన్మీన రాగనయనములను నొక్కపరియేని చూడలేదు. ఆమె వసుంధరావక్షమున పసిగన్నులు తెఱచునప్పటికి ఆయమృతవాత్సల్యనేత్రములు మూసికొనిపోయినవి. చిరంతనము మూసికొనిపోయినవి.
అతనాచార్యుడు వాత్సల్యము పుంజీభవించిన పుణ్యమూర్తి. జరాభారమున ముగ్గిన పండుహస్తములతో వాసుకుమారిని అల్లారుముద్దుగా పెంచినాడు. పూలపొత్తికలలోనుంచి లాలించి తల్లిలేని లోపమును కలిగించినాడు కాడు. అతడే యామెకు తండ్రి, తల్లి, సర్వస్వము.
ఆతని ముదినడకలలో నామె తప్పటడుగులు కలపినది. ఆతడస్తమింపనున్న జ్యోతి. ఆమెజీవితజ్యోతిర్వర్తి ఇంకను మసివాఱలేదు; నుసివోవలేదు. తండ్రి విజ్ఞానరోచిర్మయూఖను తనలో విలీన మొనరించుకొన్నది. ఏబదియేండ్లనుండి స్వానుభవమున గ్రహించిన జ్యోతిషశాస్త్రతత్వము నామె చిన్నారిప్రాయముననే యలవరించుకొన్నది. అతనాచార్యుడొకనాడు కుమార్తె నేత్రములలో ఉజ్వలతారకాద్వితయమును చూచినాడు. భ్రుకుటినాట్యములో దీక్షను, తృష్ణను పరికించినాడు.
అప్పటి కామెకు పదియేండ్లు దాటినవి. పదకొండవయేడు ప్రవేశించినది. అప్పటికే యామె గణిత శాస్త్రమును తండ్రివ్రేలిత్రిప్పులను నేత్రపక్ష్మలములను నేర్చికొన్నది. భాస్కరాచార్యుని సూత్రములు, వరాహమిహిరుని సూక్తములు కొట్టినపిండి యయినవి.
ఆయేకాంతజనపదము మూసికొన్న వాతావరణము వ్యాప్తిలేని యాప్రకృతి ఆమెదృష్టిప్రసారమునకు చాలినదికాదు. ఆమె విజ్ఞానవీక్ష ప్రపంచించిపోవలయునన్న విశాలాశావకాశములు కావలయును.
అతనాచార్యుడు యోచించినాడు. పుట్టిననాటినుండి వాసముచేయుచున్న జన్మభూమి.కుమార్తె పురోభివృద్ధి. దేనిని కాంక్షింపవలయును? అది సమస్య. ఒక ప్రశాంతనిశాంతమున కన్నీళ్లతో నొక నిశ్చయమునకు వచ్చినాడు. కుమారికాసహితుడై అంతటి వయస్సులో అతనాచార్యుడు వారణాసికి ప్రయాణము చేసినాడు.
వారణాసి విద్యాసరస్వతికి పుట్టినిల్లు. పావనగంగా సవంతిచే పునీతమయిన పుణ్యతలము. సాహిత్యము, శాస్త్రము అక్కచెల్లెండ్రు. పొరపొచ్చెములు లేకసౌహార్ధముతో మెలగుచుందురు. నాటి కళాలయములకు నేటి కళాలయములకు ఆకృతులలో, రతులలో, బోధనాపద్ధతులలో విపర్యాస మున్నది. ఏయాశయము నాడు హిందూ హృదయమున ద్యోతించెనో, ఆయాశయమే నేడు హిందూహృదయమున ప్రభావంత మగుచుండెను. అందులో పరిణామము లేదు. ప్రవహించునది ఒక్కటే స్రవంతిక. ఒక్కటే గత్యము. కాని దానిని జేరు గతులు వేఱు. గతులు భిన్నములయినను ఆశయ మొక్కటే అయినప్పుడు మన్నింపవలయును.
బ్రహ్మచారులు విద్యానిరతులై అచ్చటికి వచ్చుచుందురు. ఉభయసంధ్యల వేదఘోష. శాస్త్రపఠనము పవమానవీచికల తేలితేలి గంగాతరంగాగ్రముల తూగాడుచుండును.
కాశికాపురి విశ్వనాథుని కాణాచి. భారతసంహిత ప్రణేత వ్యాసభగవానుడు ఒక్కనాటి యాకటివేగున కాగిలకోలేక వారణిసిని నిర్దహింప యత్నించినాడు. అది కొనసాగినది కాదు. పార్వతి అన్నపూర్ణమ్మయై ఆఋషి కల్పుని యలుక మాన్పి ముద్దుగా సుద్దులు చెప్పినది.
అతనాచార్యుడు జగమెఱింగిన బ్రాహ్మణుడు. ఆతడు జగము నెఱింగినవాడు.
పండుతమలపాకువయస్సులో అతనికన్ను మెఱియించు విషయ మేముండును? కుమారివ్యుత్పన్నురాలు కావలయును. అదియే యాతడు కాంక్షించునది. అంతకన్న నితరము నాశింపడు.
ఆనవీనసీమలో తండ్రికుమార్తె లిరువురు అచ్చటి పరిస్థితులను తెలిసికొనుచు కొంతకాలము గడపినారు.
క్షమాపతి వయస్సుచెడ్డది. ప్రకృతిలోని ప్రతి నూత్నవిషయమును అలవరించుకొన అఱ్ఱెత్తిచూచును. కేలు సాచును. క్రేళ్లుఱుకును. ఒక్కొక్కప్పుడు విక్రీతమయిపోవును.
అతనాచార్యుని రాక మొదట కాశికావిశ్వేశ్వరుని దేవాలయఘంటికలలో మ్రోగెను. గంగాతరంగాగ్ర వీధుల బడిపోయి ఆశాంచలముల నల్లుకొన్నది. అతని యాగమనము ప్రతిజీవికి జీవముపోసినది. వారణాసియే చదువుల పాలవెల్లి యయిపోయినది. నాటికినేటికి విద్యాసంస్థలలో వన్నెయు, వాసియు గన్నది.
ఒక్కొక్క శాస్త్రములో నిధులైన పండితప్రకాం… సన్నిధిని చేరి బ్రహ్మచారు లావిద్యను సమగ్రముగా నిర్వహించెదరు.
కొలదికాలమునకే అతనాచార్యుని గృహము………… యిపోయినది. కన్నులలో విద్యారోచిస్సు…….. బ్రహ్మచారికి అతని గృహము తేనెపట్టు.
కొలదికాలమునకే వివిధశాస్త్రపండితశిఖావతసులతో నాతనికి పరిచయ మయినది.
ఇది క్షమావతివిద్యాభిరతికి దోహద మయినది కాశికాపురివాతావరణమే ఆమెను సంపూర్ణముగా మార్చివేసినది. దీక్ష కన్నులలో తళుకొత్తినది. తృష్ణ హృదయమున పూర్ణించుకొన్నది. వికాసము వదనమున ప్రభాసించినది.
తండ్రి ఉగ్గుబాలతో రంగరించిపోసిన జ్యోతిషశాస్త్రమును కిప్పుడామె యద్వయము చెప్పుకొనసాగినది. ఇతరశాస్త్రములు దానికి ప్రోది. విద్యాసార్వభౌముల మధ్య మెలంగుచు క్షమావతి యనూచాన హిందూజ్యోతిషమును జీర్ణించుకొన్నది. ఆమె భావిభవితవ్యము ఆనందగీతాతోరణములతో విరాజిల్లుట కదియే మూలకందము.
విద్యామధువును గ్రోలుటకు హరిదంతపదముల నుండి యువకభ్రమరకుమారులు దీక్షాపక్షముల నల్లార్చికొనుచు అతనాచార్యుని గృహారామమును జేరి శాస్త్రఝంకారము చేయసాగిరి.
అందులో నెన్నదగినవాడు మిహిరుడు. ఆతడు బ్రాహ్మణబాలకుడు, వంగీయుడు. అతని గ్రామము చంద్రపురము. ఆపురము లేతతమలపాకుల పంటకు హోరెత్తినది. దాని నాధుడు చంద్రకేతువు. ఆతడు ఢిల్లీసార్వభౌముని సామంతుడు. ఏటేట కప్పములు గట్టివేయుచు ఆతని రాజభక్తిని వెల్లడించుచుండెను. అతడు సరసుడు, రసజ్ఞుడు.
మిహిరుడు చంద్రకేతుని ఆశ్రితుడు. ఆతనికొలమువా రారాజవంశమున కొలువుచేయుటయేగాక ఏదియో సంబంధబాంధవ్య మున్నదనికూడ ప్రతీతి.
———–