పేరు (ఆంగ్లం) | M. Pushpavati Devi |
పేరు (తెలుగు) | ఎమ్ పుష్పవతీదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కృష్ణవిభావరి, సంధ్య |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | యం. పుష్పవతీ దేవి |
సంగ్రహ నమూనా రచన | రాత్రి ఒంటిఘంట కావస్తూంది. వెన్నెల గుడ్డిగా ఉంది. పల్లెటూరి చడీచప్పుడు ఏమీలేదు. సంధ్య ఆపాదమస్తకమూ దుప్పటిచుట్టుకుని, నిశ్శబ్ధంగా తలుపులు తెరచుకు బయటికివచ్చింది. తలెత్తి ఓమారు కనుచూపుమేరలో ఉన్న కిసన్ యింటివేపు చూసింది. ఎండాకాలం కాబట్టి, కిటికీ తలుపులు తెరచే ఉన్నై. ఆయింట్లో ఎవరో యితరులుంటూన్నారు. కిసన్ మట్టుకులేడు. ఒక సంవత్సరం క్రితమే ఆ యింటిని శాశ్వతంగ విడిచిపెట్టాడని తెలుసుకుంది. |
యం. పుష్పవతీ దేవి
రాత్రి ఒంటిఘంట కావస్తూంది. వెన్నెల గుడ్డిగా ఉంది. పల్లెటూరి చడీచప్పుడు ఏమీలేదు. సంధ్య ఆపాదమస్తకమూ దుప్పటిచుట్టుకుని, నిశ్శబ్ధంగా తలుపులు తెరచుకు బయటికివచ్చింది. తలెత్తి ఓమారు కనుచూపుమేరలో ఉన్న కిసన్ యింటివేపు చూసింది. ఎండాకాలం కాబట్టి, కిటికీ తలుపులు తెరచే ఉన్నై. ఆయింట్లో ఎవరో యితరులుంటూన్నారు. కిసన్ మట్టుకులేడు. ఒక సంవత్సరం క్రితమే ఆ యింటిని శాశ్వతంగ విడిచిపెట్టాడని తెలుసుకుంది. చాలా ఓపికతో అటు చూస్తూండిపోయింది. ఎన్నో గతించిన విషయాలు ఆమె స్కృతిపథంలో గోచరించినై. ఒకసారి నలువేపులా పరికించిచూసింది. ఎవరూలేరు. నిశ్శబ్దంగాఉంది. ప్రకృతి. అక్కడక్కడ నక్కల అరుపులుమట్టుకు వినవస్తూన్నై. స్టేషన్ వేపు తొందరగా నడవసాగింది. హృదయంలో ఎన్నోతలంపులు దొర్లిపోతూన్నవి. గుండె బరువుగా తోచింది. హృదయం కరిగేట్టు లోలోపలే ఏడ్చింది. ఒక్కొక్కసంగతి జ్ఞప్తికి తెచ్చుకుని.
మద్రాసు టిక్కట్ తీసుకుని బండిలో కూలబడింది…. రోజంతా ఏడవటంవల్ల ఆమెకళ్లెర్రబడి ఉన్నై… తలంతా చెదరి మొగంమీద పడుతూంది ప్రపంచంలోని దుఃఖం అంతా ఆమెనే ఆశ్రయించుకున్నట్టుంది.
ఎవరమ్మాయి? అని ప్రశ్నించింది ప్రక్కనే కూర్చున్న మరో స్త్రీ.
నేనా ఒక అనాధను అంది గద్గదంగా.
ఎవరూలేరా పాపం జాలిపడుతూ ఆ స్త్రీ చెప్పింది.
ఎవరున్నారు? అందరూపోయారు.
ఎక్కడికిపోతున్నావమ్మా
సుఖదుఃఖాలు లేనిచోటికి. ఈమాట ఉచ్ఛరిస్తుండగా ఆమె కనుకొలుకుల్నుండి ఆశ్రుబింధువులు జలజలరాలినై… ఆ స్త్రీ విస్తుపోయి చూస్తూండినది.
గడియారం పన్నెండూ టంగ్ టంగ్న కొట్టింది. కిసన్ చంద్ పుస్తకంమూసి, ముసుగు పెట్టి పండుకున్నాడు. ఒకఘంట నిశ్శబ్దంగా గడిచిపోయింది…. నిద్రమత్తులో ఎవరో తన్ను తట్టి పిలుస్తున్నట్టుగా విన్నాడు.
కళ్లు తెరవకుండానే ఎవరూ అన్నాడు.
‘కిసన్’ ఈ రెండో పిలుపుకు కళ్లునులుముకుంటూ లేచాడు… సంధ్య ముసుగుతోసి వేసింది…. గడిలో దీపం గంటంమల్లే వెలుగుతూంది.
కిసన్ ఒకతూరి ఆమెకేసిచూసి, తనకళ్లను తనే నమ్మలేకపోయాడు.
తర్వాత గుర్తించాడు. మొదట అతనికి నమ్మకం కలుగలేదు ‘ఎవరు? సంధ్యా’ అన్నాడు ఆశ్చర్యంతో స్థంభించిపోయి.
‘అవును నేనే’’ ఏమో చెప్పబోయింది… ఊపిరి బరువుగా వస్తూంది… మాట్లాడలేక పోయింది… కళ్లనీళ్లు పెట్టుకుంది…. కిసన్ గోడవేపు చూసాడు. గడియారం రెండుకొండుతూంది… నిశీధ సమయం… ఆకాశం అంతా మబ్బులతో నిండిఉంది.
‘‘ఎలావచ్చావు? ఎక్కడనుండి యింత రాత్రిలో’’ ఉద్వేగంతోనూ, సందేహంతోనూ ఒక్కమారు ప్రశ్నించాడు… సంధ్య తలవంచుకుని నేలమీద కూర్చుంది. నెమ్మదిగా చెప్పింది.
‘రామనగర్’ నుండి.
‘‘ఇక్కడి కెలా వచ్చావు? ఎలా తెలిసింది నేనిక్కడున్నానని?’’ ఆవేశంతో అన్నాడు.
‘‘ఈదినం అంతా ప్రయత్నించినమీదట తెలుసుకున్నాను.’’
‘‘నీ భర్తయెక్కడ? రామనగర్ వచ్చాడా’’ కిసన్ సందేహంతో ప్రశ్నించాడు.
‘‘నా భర్త చిరునవ్వు ఆమె పెదవుల మీద ఉంది…’’ వారం రోజుల క్రితం చనిపోయారు.
‘‘చనిపోయాడా’’ కిసన్ ఒక్కమారుగా తలపగులగొట్టుకున్నటైంది….
‘లోకంలో అనాథను అమ్మకూడా పోయిందిగా నేనూ ఎంతకాలమో బ్రతకను – కళ్లనీళ్లు నిండుకొచ్చాయి. దుఃఖంతో తల రెండుచేతుల్లో పట్టుకుని, కిసన్ దాదాపు ఒకఘంటవరకూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు…
శేషరాత్రం కిసన్ మేల్కునే ఉన్నాడు… కళ్ల వెంబడి ఆశ్రులు రాలుతూనే ఉన్నై… సంధ్య నిద్రపోయింది. ఆమె మొగాన్ని చూస్తూండిపోయాడు. ఎక్కడి రామనగరం ఎక్కడి సంధ్య ఆమధురమయ బాల్యం అంతా స్మృతీ పథంలో గోచరిస్తూంటే గుండెపగులుతూంది. నేటికి రెండేళ్లయింది సంధ్య కాపురాన్కిపోయి. మరికొన్ని నెలల్లో రామనగరాన్ని శాశ్వతంగ విడిచి వచ్చాడు కిసన్.
ఒకప్పుడు స్వర్గసీమలా కనిపించే రామనగరం…. అతనికి సంధ్యపోగానే పాడుశ్మశానంలా కన్పించసాగింది. ఇంకా అక్కడి మామిడితోపూ – పూలతోటలూ – ఆ చిన్నకుఠీరం చూస్తూంటే తను సంధ్యతో గడిపిన మధురతమక్షణాలన్ని జ్ఞప్తికివచ్చి తీరని దుఃఖం కల్గించేవి.
సంధ్య నెంత ప్రేమించేవాడు..ఆమెకోసం ఎంతదుఃఖం పొందాడు… ఆరాత్రులూ ఆచంద్రుడూ ఆపవిత్ర ప్రేమానుభవాలు… గతించిపోయినై… తిరిగి మళ్లా జీవితంలో ఆక్షణాలు రావు సంధ్య అన్యకులాన్కి చెందింది. సమాజం ఆ ప్రేమికుల జీవితాల్ని ఎడబాటుచేసింది. వాళ్ల జీవనాల్ని ఆజన్మాంతం తీరని ఆవేదనా దుఃఖంతో నింపింది.
బలవంతాన సంధ్య…. తను బాల్యంనుండీ… ప్రేమిస్తూవచ్చిన… సంధ్య పరులసొత్తయి పోయింది… కిసన్ స్వప్నాలన్నీ గాలితో మేడలైనవి. నిరాశలో ఆవేదనపొందాడు… జీవితంఅంతా నిరర్ధకము – దుఃఖమయముగా చేసుకున్నాడు. సంధ్య తల్లి చనిపోయేప్పుడు… కిసన్ ఆమె సమక్షంలో ఉన్నాడు.. కన్నతల్లి చావులో కూతురురాలేదు… బహుశా ఆమె జీవితం ఊమించుకునే ఉంటుంది తల్లి – మృత్యుశయ్యమీద కిసన్తో చెప్పింది.
‘‘బాబూ – చిన్ననాటినుండి దానిముద్దు ముచ్చటా చూసావు – ఆటాపాటా నేర్పావు – ఏం లాభం దానిరాతలో ఉంది… ఎంత దురదృష్టవంతురాలు నాసంద్య వఠ్ఠిత్రాగుబోతు, అన్నీ విన్నాను. అదిపడేబాధలన్నీ విన్నాను… ఏంచేసేది… భగవంతుడా ఏనాడైనా యిలా కల్లోనైనా తలంచానా నాయనా కిసన్ సంధ్యను ఒకకంటితో చూడు… నీకంటే వేరే దిక్కులేదు దానికి’’ – కిసన్ కళ్లు తుడుచుకుంటూ వచ్చేడు.
http://kathanilayam.com/story/pdf/6993
———–