Share
పేరు (ఆంగ్లం)K.Seetaram
పేరు (తెలుగు)కె సీతారాం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథలు: పిరికివాడా?, ప్రేమ వ్యాపారమా
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకె. సీతారాం
పిరికివాడా?
సంగ్రహ నమూనా రచనకిరీటిరావు సాహిత్యాభిలాషి. అంతేకాదు మంచి రచయిత కూడాన ఇటీవల వస్తున్న అనేక తెలుగు పత్రికల్లో కిరీటిరావుకి మంచి స్థానం వుంది. యన రచనలను అమితంగా దరించే పత్రికలూ వున్నాయి. విపరీతమైన మోజు చూపించే అభిమాన పాఠకులూ వునానరు.
అసలు కిరీటిరావులో మొట్టమొదటి సారిగా సాహితీ జిజ్ఞాస కలిగించింది రాజారావు.
రాజారావుకి, కిరీటిరావుకి మంచి స్నేహం వుంది సాహిత్యం వారిద్దరి మధ్య మరింత అనుబంధం ర్పరచింది దాంతో ఒకరంటే మరొకరికి ఎడతెగని అభిమానం.

కె. సీతారాం
పిరికివాడా?

కిరీటిరావు సాహిత్యాభిలాషి. అంతేకాదు మంచి రచయిత కూడాన ఇటీవల వస్తున్న అనేక తెలుగు పత్రికల్లో కిరీటిరావుకి మంచి స్థానం వుంది. యన రచనలను అమితంగా దరించే పత్రికలూ వున్నాయి. విపరీతమైన మోజు చూపించే అభిమాన పాఠకులూ వునానరు.
అసలు కిరీటిరావులో మొట్టమొదటి సారిగా సాహితీ జిజ్ఞాస కలిగించింది రాజారావు.
రాజారావుకి, కిరీటిరావుకి మంచి స్నేహం వుంది సాహిత్యం వారిద్దరి మధ్య మరింత అనుబంధం ర్పరచింది దాంతో ఒకరంటే మరొకరికి ఎడతెగని అభిమానం.
రెండు సంవత్సరాల క్రిందట ఇద్దరూ కలిపి ఆంధ్రాయూనెవర్సిటీలో, సోషియాల్జీ ఫైనల్ చదివేవారు. ఒకే క్లాసు చదవడం మూలంగా ద్దరిలోనూ మరింత సన్నిహితం ఏర్పడింది.
అదృష్టం కొద్దీ చదువు పూర్తవగానే ఇద్దరికీ ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగం మాత్రం ఇద్దరినీ విడదీసింది రాజారావు వుద్యోగం ఢిల్లిలో అయితే, కిరీటిరావు మాత్రం విశాఖపట్టణంలోనే సంపాదించగలిగాడు.
చదువుకొనే రోజుల్లో, ఏ మాత్రం లీజరు దొరికినా, వాళ్ల క్లాసురూం ప్రక్కనే వుండే మామిడి తోటలోకి పోయేవాడు. అక్కడ కూర్చుని సాహిత్యం గురించి రచయితల వివరాలు గురించీ చర్చిస్తూ వుండేవాళ్ళు. ఆదివారం వస్తే సముద్రం ఒడ్డుకుపోయి గంటల తరబడి సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్లు.
‘‘సమాజంలో వున్నతవ్యక్తిగా గుర్తింపబడాలంటే రచనలందకు బాగా దోహదం చేస్తాయి’’ అని చెప్పిన రాజారావు మాటలు కిరీటిరావుకి టానిక్లా పనిచేసాయి. ఆరోజు నుండే అతడు కలం పట్టాడు. రాజారావు మాత్రం విమర్శకుడిగానే మిగిలిపోయాడు.
అచ్చయిన తన కథలమీద ఢిల్లిలో వున్న తన మిత్రుల అభిప్రాయం కోసం ఎదురు చూస్తుండటం కిరీటిరావుకి అలవాటు.
ఒక రోజున రాజారావు దగ్గర నుండి వుత్తరం వచ్చింది. పోస్టుమాన్ చేతిలో పెట్టగానే ఆతృతగా చించి చదివాడు కిరీటిరావు.
డియర్ ఫ్రెండ్
నీవు ఈమధ్య రాసిన వివిధ పత్రికల్లోని పది కథలూ చదివాను. రచయితగా నీవు కీర్తింపబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది కానీ… నీవు రాసిన పది కథలూ ఒకే కోవకు చెందినట్టున్నవి వస్తు వైవిధ్యం లేదు దాదాపు ఏడెనిమిది కథల్లో ఇతివృత్త మేమిటి? పేదవాడైన హీరో, బాగా డబ్బున్న హీరోయిన్, వాళ్ళిద్దరి గాఢమైన ప్రేమ. చివరకు వాళ్ల ప్రేమ ఫలించక పోవడం.
ఫార్ములా కథల మూసలోనే నీవూ నడిపించేసావు అందమైన భవనాలు, ఖరీదైన కారు, చుట్టూ కథలలేపావు. నిజానికి నీవు పది కథలొ చెప్పదలుచుకున్నది, ఒకే ఒక కథలో చెప్పవచ్చు. నీవు రాసిన పద్ధతి రచయితగా బ్రతకాడానికి వునియోగ పడుతుందేమోకాని, ఎదుగుదలకు ఎంత మాత్రం వుపయోపడదు.
నీవు వుత్తమ రచయితగా ఎదగడానికి నాదొక చిన్న సలహా, పాటిస్తావని ఆశిస్తాను.
మొట్ట మొదట చేయవలసిన పని ఊహాలోకంలో ఊహించే కథలు రాయడం కట్టిపెట్టు. అటువంటి రచనలవల్ల మాత్రం ప్రయోజనం లేదు రచయిత చుట్టూ వున్న పరిస్థితులు విస్మరించి పట్టనట్టు వుండకూడదు సంఘ సౌభాగ్యానికి రచయితక్కూడా బాధ్యత వుంది సమాజాన్ని సంస్కరించి, లోపాలను ఎదుర్కొనవలసిన అవసరం వుంది. అందుకోసం జీవిత చిత్రణ కథలు రాయడం అవసరం. నీ చుట్టూ వున్న జీవితాలను పరిశీలించు. ఎన్నో అట్టడుగునున్న జీవితాలు కనిపిస్తాయి. వాళ్ల గురించి కథలు వ్రాయి, ముష్టివాళ్ల గురించి, మురికి వాడల్లో నివసించేవాళ్ల గురించి నీ కథల్లో పాత్రలుగా చిత్రీకరించి అటువంటి నికృష్టపు బ్రతుకు అనుభవించడానికి క్కారణమేమిటని? సమాజాన్ని ప్రశ్నించు.
మరొక సలహా ఏమిటంటే ఏ రచనా, నీవు ఊహించి రాయకు పరిశీలన చేస్తూ రచన చెయ్యడం ప్రారంభించాలి. హఈదయ విదారకమైన సంఘటన ఎదురైనప్పుడే దాన్ని కథగా చిత్రీకరించు
అలాంటి కథలు నీవురాయగలిగిన నాడు రచయితగా నీ ఔన్నత్యాన్ని అభినందిస్తాను. నా సలహా పాటిస్తావని విశ్వసిస్తూ, నా విమర్శన సహృదయంతో స్వీకరించగలవని, ఆశిస్తూ యీ జాబు ఇంతటితో ముగిస్తున్నాను.
ఇట్లు
నీ ప్రియ మిత్రుడు
రాజారావు,
ఢిల్లీ – 25
మిత్రుని వుత్తరం కిరీటారావుని మేల్కొలిపింది కథలంటే ఏమిటో బోధపడింది. ఇంతవరకూ, తన కథలు ఎంతో గొప్పవని మురిసిపోతున్న తనకి యిప్పుడా కథలన్నీ చెత్తగా కనిపించాయి.
రాజారావు చెప్పింది నిజమే చుట్టూ అనునిత్యం అనేక సంఘటనలు జరుగుతుంటాయి ఇలాంటి వాస్తవ సంఘటనలు వదిలిపెట్టి, వూహా పూరితమైన సెంటిమెంటుగల కథలు రాయడం తెలివితక్కువ తనమే యిలాంటి కథలవల్ల ప్రయోజనం కూడా శూన్యం. సరైన కథ రాయాలంటే ఏమైన సంఘటన ఎదురవ్వాలి. అంతవరకు కలం ముట్టకూడదని నిర్ణయించుకున్నాడు కిరీటిరావు. ఆనాటి నుండి అనేక విషయాలు తెలుసుకోవడం కోసం అనేక పుస్తకాలు చదవడం మొదలెట్టాడు.
కిరీటిరావు సాయంకాలం పూట ప్రతి రోజూ పట్టణానికి, సెంటర్లో వున్న ‘‘జగదాంబా’’ జంక్షన్కి, షికారుకి వెళ్లడం అలవాటు కారణం అక్కడ వివిధ రకాల మనుషులు వస్తూ పోతూ, వుంటారు కథలకు చక్కని ప్లాట్స్ వాళ్ల నుండి దొరుకుతాయి.
ఎప్పటిలాగే, ఆరోజు కూడా షికారుగా, జగదాంబ జంక్షన్కి వెళ్లాడు కిరీటిరావు. ఐదు నిముషాలసేపు అక్కడ నుంచున్నాడో లేదో, ఒక హఈదయ విదారకమైన సంఘటన చూడవలసి వచ్చింది. ఆ దృశ్యం బలవంతుని దౌర్జన్యానికి బలహీనుడికి జరిగిన అన్యాయానికి ప్రతీక ఇక్కడ, బలవంతుడంటే శారీరకంగా బలమైన వాడు కాదు ధనంల్, అధికారంల్, పలుకుబడిలో అతగాడు బలవంతుడు. బలహీనుడు ఆర్థికంగా అణగద్రొక్కబడినవాడు.
ఈ దృశ్యం చూసేసరికి, కిరీటిరావు, ఆవేశం ముంచుకొచ్చింది. మానవతావాదం పైకి లేచింది. ఈ అన్యాయం సహించరాని దుసుకున్నాడు మనసులో. ఆ ఇన్ స్పిరేషన్ తో వెంటనే యింటికిపోయి తను చూసిన సంఘటన ఆధారంగా ఒక కథ రాసాడు. పూర్తయ్యేక చదివితే తనకెంతో తృప్తినిచ్చింది ఇన్నాళ్లకో మంచికథ రాయగలిగానన్న ఆనందం కలిగింది అన్యాయాన్ని ఎదుర్కొనడంలో రచయితగా తన బాధ్యత నెరవేర్చానని మురిసిపోయాడు కిరీటిరావు.
తర్వాత ఆ కథను ఒక పత్రిక నిర్వహించే కథల పోటీకి పంపించాడు.
తను ఎక్ స్పెక్ట్ చేసినట్టుగానే తన కథకు ప్రథమ బహుమతి లభించింది. దాంతో కిరీటిరావు సంతోషం పట్టలేకపోయాడు. ఒక అమాయకుడికి జరిగిన అన్యాయాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించారని కిరీటిరావుని పొగుడుతూ, పాఠకులు ప్రశంసా ఉత్తరాలు కురిపించారు.
తన కథ అంతరి ప్రశంసలు పొందింది. అయితే అందరి అభిప్రాయాలు ఒక ఎత్తు, మిత్రుడు రాజారావు అభిప్రాయాలు ఒక ఎత్తు, అందుచేత రాజారావు దగ్గర నుండి అభిప్రాయం రావలసి వుంది. ఈ కథ తప్ప కుండా వాడిక్కూడా నచ్చి తీరుతుంది. అని భావించి మీత్రుడి జాబుకోసం ఎదురుచూసాడు కిరీటిరావు.
రాజారావు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది.
ప్రియ మిత్రమా
నీకు కథల పోటీలో ప్రథమ బహుమతి లభించినందుకు, నా కంగ్రాచ్యులేషన్సు.
కానీ… ఒక అమాయకుడైన దరిద్రుడ్ని ధనికుడైన ఒక పెద్దమనిషి నాల్గురోడ్ల కూడలిలో అన్యాయం, చితకబాదుతుంటే అక్కడున్నవాళ్లెవరూ డబ్బుగల పెద్ద మనిషికి భయపడి అతని అన్యాయాన్ని ప్రతిఘటించలేక పోయారు. పైగా తనని కొట్టినట్టు సాక్ష్యమివ్వడానిక్కూడా అందరూ భయపడ్డారు. ఈ సంఘటన ధారంగా కథ రాశానన్నావు అలాగానే వుంది. అయితే ఆ సంఘటన జరిగేటప్పుడు నీవు కూడా అక్కడే వున్నట్టు రాసావు. నీవు కూడా అక్కడే వుండి ఆ దారుణమైన సంఘటన చూస్తూ ఆ పెద్ద మనిషి దౌర్జన్యాన్ని ఎదిరించలేక పోయావు కానీ, ఆ సంఘటన ఆధారంగా చేస్కొని, ఇంటికి పారిపోయి ఒక కథ రాసేసి, దానికి బహుమతి కూడా కొట్టేసి మురిసి పోతున్నావు. నిజంగా నీ అంతటి పిరికివాడు, మరొకడు వుండడు.
అసలు నీవు కథలు రాసేది ఎందుకు? సామాజిక ప్రయోజనాలు ఆశించి, అన్యాయాన్ని ఎదిరించడానికేనా? ధనవృదాంధులు దరిద్రులను ఎంత నీచంగా చూస్తూన్నరో వివరించడానికేనా? అయితే వాళ్ల గురించి కథల్లో మాత్రమే రాస్తావు నిజ జీవితంలో ఎదురయితే పిల్లిలా పారిపోతావు. యిది సహించరాని నేరం. ఇటువంటి కథలు రాయడం కంటే కలాన్ని కట్టి పెట్టడం మంచిది. ఎందుకంటే ఈ పద్ధతి నిన్ను పూర్తి వ్యాపారస్తుడుగా తయారుచేస్తుంది.
ఇట్లు
రాజారావు,
ఢిల్లీ
ఉత్తరం పూర్తిగా చదివి ఆశ్చర్యపోయాడు కిరీటిరావు మంచి రెస్పాన్సు వస్తుందనుకున్న ఈ కథనుకూడా రాజారావు తిట్టిపోసాడు. తర్వాత కొంతసేపు నిశితంగా ఆలోచించాడు.
ఏ సంఘటన చూసి తన కథ రాశాడో ఆ సంఘటన జరిగినప్పుడు తను అక్కడే వుంటూ, ఆ అన్యాయాన్ని ఎదిరించలేకపోవడం రాజారావు అన్నట్టు నేరమా? తనలోని పిరికితనమా? లేకుంటే ఈ విషయంలో రచయితగా తన బాధ్యత ఎంతవరకు? అని కిరీటిరావులో సంఘర్షణ ప్రారంభమయింది.

———–

You may also like...