పేరు (ఆంగ్లం) | B.H.Krishnamurthy |
పేరు (తెలుగు) | బి హెచ్ కృష్ణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నీలి దువ్వెన |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బి.హెచ్. కృష్ణమూర్తి నీలి దువ్వెన |
సంగ్రహ నమూనా రచన | వాచ్ చూసుకున్నాడు భాను. రెండున్నరయింది. నాగమణి అంటున్నది. పావురంలా మెడ ఒక పక్కకు వంచి, సూదిలో దారమెక్కిస్తూ ‘‘అవతలి గదిలో ఉన్నాయన ఇందాకంటున్నాడుఆవిడతో, ‘మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి, ఒకళ్లను చూసైనా నేర్చుకోం మనం’ అని, మన నుద్దేశించేను. నవ్వొచ్చింది. మనన్నిలా అనుకుంటున్నందుకు, వాళ్లొచ్చిన రెండు రోజులై చూస్తున్నాను, ఎందుకో అస్తమానం కీచులాడుకుంటూనే…’’ |
బి.హెచ్. కృష్ణమూర్తి
నీలి దువ్వెన
వాచ్ చూసుకున్నాడు భాను. రెండున్నరయింది. నాగమణి అంటున్నది. పావురంలా మెడ ఒక పక్కకు వంచి, సూదిలో దారమెక్కిస్తూ ‘‘అవతలి గదిలో ఉన్నాయన ఇందాకంటున్నాడుఆవిడతో, ‘మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి, ఒకళ్లను చూసైనా నేర్చుకోం మనం’ అని, మన నుద్దేశించేను. నవ్వొచ్చింది. మనన్నిలా అనుకుంటున్నందుకు, వాళ్లొచ్చిన రెండు రోజులై చూస్తున్నాను, ఎందుకో అస్తమానం కీచులాడుకుంటూనే…’’
ఇంకా ఆమె ఏదో చెప్తున్నది కాని వర్తమానంలో పయనిస్తున్న అతని మనస్సు ప్రవాహ మన్యంలో ఏదో అడ్డు తగిలి ఆగిపోయిన రెమ్మలా అయిపోయింది.
మొగుడూ పెళ్లాలు ఈ నాలుగు రోజుల్లో ఎంత చక్కగా అమరిపోయింది నాగమణి యీ రకపు జీవితానికి అతి నిపుణంగా, తలగడా గాలీలుమీద లతలూ పూలూ కుట్టడంలో, కదలుతూన్న ఆమె వేళ్లమీద నిలిచాయతని చూపులు. ఈ ఎంబ్రాయిడరీ సరంజామా నిన్ననే కొని తెచ్చాడు తాను. అప్పుడే ఎన్ని డిజైన్లు కుట్టింది.గదంతా కలయబార చూశాడు. ప్రశాంతమైన సాంసారిక వాతావరణం ఎంతిగా అలముకుంది యీ హొటలు గదిని నాగమణి ఎంత చక్కనిపేరు
లాభంలేదు.
జేబు తడిమి చూసుకున్నాడు, మెరమెరలాడుతూ తగిలింది కాగితం వేళ్లకు. నాలుగు పంక్తులే రాసినది తానా ఉత్తరంలో కాని అరగంట పైగా పట్టింది అది రాయడానికి, పేపరు కొనుక్కుని వస్తానని వళ్లిన వాడింత ఆలస్య మెందుక చేస్తున్నాడా అని ఆమె ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఎంత ఆదుర్దాగా తన రాక కోస మెదురు చూస్తుండేది. కిటికీ ఊచనొక చేతితో వదులుగా పట్టుకొని రోడ్డువైపే చూస్తున్న ఆమె కళ్లనుండి ఎక్కడో దూరాని కెగిరిపోతున్నట్లునానయి ఏవో తలపులు వేళకూడా…
మళ్లీ ఆమెమీద నిశ్చలంగా నిలిచాయతని చూపులు. పువ్వు కుట్టడం పూర్తయిపోయింది. ప్రక్కను నిన్న తాను పెన్సిలుతో రాసిన మొగ్గ ముడుచుకొని ఉన్న రేకులమీద లేతగులాబీ దారంతో ముద్దకుట్టు కుడుతూన్న రామె. చంటిపల్లవాడికి పాలిస్తున్న ఒక స్త్రీమూర్తి మెరిసిందతని మనోవీధిలో, లేనవ్వుతో కదులుతున్నా యా పెదవులు, ‘‘నీకొడుకే’’
ఊహ ప్రపంచంనుండి బలవంతాన మనసు మళ్లించుకుని ఆమె మాటలమీద నిలిపాడు.ఆమె తలపైకెత్తి తన కళ్లలోనికి తిన్నగా చూస్తూ అంది ‘‘ఈవాళేగదూ వెళ్లిపోవడం? ఈ నాలుగురోజులూ నుందే అనుకున్న యీ గదిని వదిలేసి…’’ కొద్దిగా సెంటిమెంటల్గా అయి మాట్లాడుతున్న ఆమె పెదవులమీద చిన్న చిరునవ్వు కదలాడ్తూ ఉంది. ఆ నవ్వు బరువుగా ఉన్నట్లుండడం తన ఊహేనేమో.
భాను అన్నాడు నవ్వుతూ, ‘‘గదిలో ఏముంది?’’
ప్రవాహంలో ప్రయాణం మొదలుపెట్టిన రెమ్మ మళ్లీ ఏదో అడ్డుతగిలి అక్కడే కొట్టుకోవడం మొదలు పెట్టింది.పై దేశంలో ఈ గదీ, ఈ మనిషీ, నాలుగు రోజుల్లో ఎంత సన్నిహిత మయ్యాయి తనకు.
నాలుగు రోజుల క్రిందట.
భువనేశ్వరం స్టేషన్లో రైలాగింది. అంత వరకూ మోకాళ్లతో తనను పొడుస్తూన్న ముసుగులోని యువతి దిగి వెళ్లిపోయింది తన భర్తతో, విశాలంగా కూర్చోవచ్చుగదా అనుకుంటుండగానే మరో ముగ్గురు వచ్చి ఆ జాగాలో కూర్చున్నారు. దైనందిన జీవితంలో పాటించవలసిన ఆర్థిక సూత్రాలను తనకు బోధపరిచి ఒప్పించి థర్డ్ క్లాస్ టికెట్లు కొనిపించిన నారాయణమీద ఎక్కడలేని కోపం వచ్చింది.
ప్రక్కనే కూర్చొనిఉన్న నారాయణ తన అంతులేని మాటలధోరణి ఉన్నట్టుగా మార్చి నెమ్మదిగా అన్నాడు. ‘‘చూడు భానూ – నేను చెప్పానుగదూ వెయ్యి మందిలో ఉన్నా తెలుగు మొహం ఇట్టే పట్టెయ్యొచ్చు. అదిగో, అవతల, ఆ చివర చిన్న బెంచీమీద మూడో మనిషి. పందెమేసి చెప్తానబ్బాయి, ఆ మనిషి మన తెలుగుదే.’’
తనదృష్టి ఆవైపు పోనిచ్చాడు భాను. మాసిపోయిన ఆకుపచ్చరంగు చీరా, తెల్లబ్లౌజూ, జడవేసుకోకుండా ముడుచుకొన్న ఒత్తైన జుట్టూ, చామనచాయగా ఉన్నా ఆకర్షణీయంగా ఉన్న యువతి తరువాత తెలిసింది. ఆమె వయ సిరవైరెండేళ్లని, అప్పుడు మటుకింకా చిన్నదిలాగే కనిపించింది తన కళ్లకు చేతిలోని నీలంగాఉన్న ఏదో వస్తువుమీద గోళ్లతో రాస్తున్నది.
నారాయణంటున్నాడు, ‘‘అరే, ను రెవరూ లేరే ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు ఒక్కరితే ఎక్కడికి చెప్మా వెళ్తున్నది, ఎవరోగాని?’’
ఆమాట నిజమేలా ఉంది. ఆ చుట్టుపక్కల మనుష్యులకూ ఆమెకు సంబంధమున్నట్లు లేదు. తానన్నాడు. ‘‘ఎవరైతే మనకేం లెద్దూ.’’
ఆ మాట అంటున్నప్పుడు ఇంతగా ఆమెతో తనకు ప్రమేయం కలుగుతుందని తాననుకోలేదు గాని మనసులో మటుకు కొద్దిగా ఆశ్చర్యమైంది.
తన కిటువంటి విషయాల్లో అనుభవం లేదు గాని, విచిత్రమైన మనిషి నారాయణ, ఎలా పరిచయం కలుగ జేసుకున్నాడో, ఆ కాస్తపాటి టైములో ఆవిడతో, ట్రెయిన్ బరాంగ్ స్టేషన్లో ఆగింది. ఎలాగూ ట్రెయినక్కడ అరగంట పైగా ఆగుతుందిగదా, అలా తిరిగివద్దామని తానన్న మాట కొప్పుకొనని నారాయణ నక్కడే వదలి, తాను వెళ్లి అలా తిరిగి బండి కదుల్తుందనగా వచ్చాడు కంపార్ట్ మెంట్ లోపలకు. తాము మొదట కూర్చున్న సీట్లుమార్చి, ఆవిడ కూర్చున్న బెంచీమీదకు చేరి, ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు నారాయణ. చచ్చినా తానంత చొరవ చెయ్యలేడు.
తాను రావటంతోనే పక్క నుంచిన కంఫర్టర్ అవతలకు తోసి నారాయణ అన్నాడు. ‘‘రా, భానూ. పాప మీవిడ విజయనగర మెళ్లాలట, వాళ్ల పినతల్లి గారింటికి ఖుర్ధాలో యీ బండి మారాలని తెలియక ఇందులోనే ఉండిపోయింది. ఎవరో చెప్పారట ఇదే నేరుగా వెళ్తుందని’’.
కూర్చుని తానామె వైపు చూశాడు. చేతిలో ఉన్న నీలిదువ్వెన పళ్లు గోళ్ళతో గీస్తూ తల వంచుకొని కూర్చుని ఉందామె. జాలి వేసింది తనకు. కాని నారాయణలా పైకి చూపెట్టలేక పోయాడు. ఏదో మాట అనవలసిన బాధ్యత తనమీద ఉన్నట్లనిపించి అన్నాడు తాను. ‘‘కొత్త జాగాల్లో సరిగా కనుక్కోవలసింది. ఏ టికెట్ కలెక్టర్నడిగినా చెప్పుఉండును.’’
ఏమారతపు కదలికా లేకుండా అంత బిజినెస్ లైక్ గా మాట్లాడినందుకు మందలిస్తూ నారాయణన్నాడు. ‘‘బాగా చెప్పావోయ్ పాప మాడమనిషి. అయినా ఇప్పుడేం మించిపోయిందిలే కటక్లో దిగి మళ్లీ అటునుంచి రాత్రి రెండుగంటల కొచ్చే పాసెంజర్లో వెనక్కు వెళ్లిపోతుంది.’’
‘‘అనుకున్న దానికి మరొక పదిగంటలాలస్యం అని, అంతకు మించి మరేం నష్టం అనికూడా కొనను కలపబోయాడు భాను కాని ఆమె తనవైపు అదొక రకంగా చూస్తూ ఉండడం గమనించి ఆమాట వినలేదు.
తానూ నారాయణా సిగరెట్టు వెలిగించుకున్నారు. రెయిల్ ట్రెయిన్ పెద్ద చప్పుడు చేస్తూనడుస్తున్నది. కాట్టోడిబ్రిడిజమీద, తనకు ప్రతేక్యంగా వేశారుగదా ఇది అన్న గర్వంతో లాగు. ఆమె అంతగా మాట్లాడినట్లు లేదు కాని ఆ రైలు హోరులో నారాయణ మాలు మటుకు అక్కడక్కడ వినిపిస్తునానయి. వినాలని తన కంత ఆసక్తిగా కూడా లేదు. ఇంకో అయిదు రోజుల్లో మళ్లీ వెనక్కి బ్రిడ్జిమీదనుండే తన ఊరికి వెళ్లిపోతానుగదా అనుకుంటున్నాడు.
కటక్ స్టేషన్ చేరుకుని రైలాగింది. నారాయణా, ఆమే, లేచి నిల్చున్నారు. పైన ఉంచిన చేతిసంచీ తీసుకిన తానూ నిలబడ్డాడు.
నారాయణ ఆవిడతో అంటున్నాడు. ‘‘ఇదే కటక్ సామాన్లేవీ లేవుగదూ?’’ ఆ గొంతులో ఉన్న చనువు చూసి తన కాశ్చర్యమైంది. ఆమె నెమ్మదిగా ‘‘లేవు’’ అని తనచేత నున్న మడత పెట్టిన గోధుమరంగు చీరవైపూ నీలిరంగు దువ్వెన వైపూ చూచింది. వాలి ఉన్న ఆమె కనురెప్పలక్రింద నీళ్లుకూడుకొంటూ ఉన్నాయేమో.
భూతకాలంలో తిరుగుతున్న మనస్సు మళ్లా హోటలు గదిలో ఉన్న నాగమణిమీదకు వాలింది. తనను చుట్టివున్న వస్తుసంచయ మంతా తనదే అయినా ఆ స్పృహే లేని శ్రీమంతురాలి ధీమాతో, ఎంత సహజంగా కూర్చొని ఉంది ఈ గది నడుమ.
ఆమె అంటున్నది. ‘‘సరదా ఉందిగాని మనస్ససలు పుస్తకంమీద పట్టుమని పావుగంట నిలవదు…’’మళ్ళా ఆగిపోయింది రెమ్మ.
నారాయణ అంటున్నాడు. ‘‘ఎక్కేవాళ్లూ, దిగేవాళ్లూ పద. భానూ. నిలబడితే ఎంతసేపైనా అంతే.’’ మాట్లాడకుండా దిగాడు తాను, తన వెనక వాళ్లూ దిగారు.
ఫ్లాట్ఫారమ్మీద అన్నాడు నారాయణ. ‘‘దూరపువాడివి, సిటీబస్సులో వెళ్ళాలిగదూ, నువ్వు? నేనీ మనిషిని పంపించేశాక వెళ్తాను, నువ్వెళ్లు. అన్నట్లు నీ పని మరో మూడురోజుల్లో అయిపోతుందిగదూ, వెళ్ళేముందొకసారి కనిపించు.’’
‘‘అలాగే వస్తను మరి.’’ వెళ్లిపోయేముందు ఆమెవైపు చూశాడు తాను, ఆమెకూడా తనవైపే చూస్తున్నది. మళ్ళా తలతిప్పుకుని పదడుగులు నడిచాడు. నారాయణంటున్న మాటలు వినిపించాయి. ‘‘దగిగరే హోటలు ఇంకా నాలుగు గంటల టైముంది బండికి, భోంచేసి రావచ్చు’’.
ఎందుకో అనిపించింది ఆమె ఇంకా తనవైపే చేస్తున్నదని కాని వెనుకకు తిరిగి చూడకుండా మనుష్యులలో కలిసిపోయి అవతలకు వెళ్లిపోయాడు తాను. అవతల సిటీబస్సు సిద్ధంగా ఉంది. వెళ్లి లోపలకు చొరబడ్డాడు.
———–