Share
పేరు (ఆంగ్లం)Komaladevi
పేరు (తెలుగు)కోమలాదేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1935
మరణం
పుట్టిన ఊరుకర్నూలు జిల్లా ఆదోని
విద్యార్హతలుబి.ఎ. బి.ఇడి
వృత్తిటీచర్‌
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీషు
చిరునామాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅడ్వెంచర్, అపుర్వకోరిక, అన్వేషణ , అమృతహృదయాలు, ఆటవస్తువు, ఊహకందని పరిణామం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకోమలాదేవి
అపూర్వకోరిక
సంగ్రహ నమూనా రచనపక్షుల కిలకిలారావాలతో పిల్లల అరపులతో ఆ గృహప్రాంగణం ఎంతో సందడిగా ఉంది.
పిల్లలు అల్లీ బిల్లీ తిరుగుతున్నారు అదొహ లోకం. చిన్నారిలోకం. ఆ రాజ్యంలో ప్రవేశించటానికి పెద్దలకు అర్హత లేనట్లు గేటుకు తాళం వేసుంది.
వీధిలో నుంచున్న రాజు గేట్లోంచి చూస్తున్నాడు. పిల్లలు అతణ్ణి గమణించే స్థితిలో లేరు పరుగులు నవ్వులు ఆటల్లో ఎగస్వాస దెబ్బలాటలతో సరిపోయింది అతడొక పావుగంట చూచి గేట్ మీద చప్పుడు చేశాడు అంతా ఆరేళ్లలోపువారే.

కోమలాదేవి
అపూర్వకోరిక

పక్షుల కిలకిలారావాలతో పిల్లల అరపులతో ఆ గృహప్రాంగణం ఎంతో సందడిగా ఉంది.
పిల్లలు అల్లీ బిల్లీ తిరుగుతున్నారు అదొహ లోకం. చిన్నారిలోకం. ఆ రాజ్యంలో ప్రవేశించటానికి పెద్దలకు అర్హత లేనట్లు గేటుకు తాళం వేసుంది.
వీధిలో నుంచున్న రాజు గేట్లోంచి చూస్తున్నాడు. పిల్లలు అతణ్ణి గమణించే స్థితిలో లేరు పరుగులు నవ్వులు ఆటల్లో ఎగస్వాస దెబ్బలాటలతో సరిపోయింది అతడొక పావుగంట చూచి గేట్ మీద చప్పుడు చేశాడు అంతా ఆరేళ్లలోపువారే.
రెండవసారి శబ్దం విని ఒక జంట గేట్ ను సమీపించింది ‘‘వైడ్ పైవర్’’ లా ఆడుతోన్న పిల్లలంతా ఆటలు ఆపుజేసి ఆ జంట వెనకాతల ప్రోగయ్యారు. పిల్లలు ఉత్సుకతతో చూస్తున్నారు. ఇతడేదో క్రొత్త అంకుల్లా ఉన్నాడు. క్రొత్తగా వచ్చారేమో ఈతడికి తప్పకుండా పిల్లలుంటారు చిన్నపిల్లలు పెద్దవాళ్లవేపు చూస్తునానరు.
‘‘ఇంట్లో వినుతగారున్నారా?’’
‘‘ఓ ఉన్నారు’’ అన్నాడొకడు ‘‘మా అమ్మ’’ అంది ఒక ఆరేళ్ళపాప ఆ పాపకేసి పరీక్షగా చూచి చిన్నగా నవ్వాడు ఆ పిల్ల సిగ్గుతో వెనక్కి వెళ్ళింది.
‘‘నేను లోలపికి రావాలండర్రా’’ అనగానే ఒకరు పరిగెత్తుకుని వెళ్ళారు.
కొంతసేపటికి వినుత తాళంచెవి పట్టుకొచ్చింది. గేట్ను సమీపించగానే ఆ వ్యక్తిని చూచి నిశ్చేష్టితయైంది. కొంత సేపటికి తేరుకుని తాళంచెవి తాళంలో పెడ్తూ అంది, ‘‘మీరంతా పోయి ఆడుకోండి’’ ఆమె కంఠంలోని తీక్షణతను గమనించి అందరూ పారిపోయారు.
ఆమె తాళంచెవి త్రిప్పలేదు.
‘‘నువ్వెందుకొచ్చావ్?’’ అంది నిరసనతో.
‘‘ఏంలేదు, చూచిపోదామని వచ్చాను వినుతా?’’ అంతడి కంఠంలో ధ్వనించిన ఓ విధమైన ఓటమిని గ్రహించి చటుక్కున కళ్ళెత్తి చూచింది.
‘‘ఒక్కక్షణం మాట్లాడి పోదామని వచ్చాను… ప్లీజ్…’’ వేడికోలుగా అడగ్గానే ఆమె తాళంతీస్తూ అంది, ‘‘అంతా చిన్నపిల్లలు పారిపోయి డ్ మీదికెళ్తారని తాళంవేశాను.’’
‘‘ఇందులో పరాయి వాళ్ళెంతమంది?’’ లోపలికి వస్తూ అడిగాడు. ఆమె మళ్ళీ తాళంవేస్తూ, ఇద్దరు తప్ప అందరూ పొరుగింటిపిల్లలే.’’
ఇద్దరూ లోపలికెళ్తున్నారు ఆమె ప్రక్కలో పరాయి వ్యక్తిగా నడుస్తోంటే అతనికి వింతగా ఉంది. వినుత మాట్లాడలేదు.
ఇంట్లోకి వెళ్లకుండానే ఆ చిన్న వరండాలోనే రెండు కుర్చీలు ఉంటే అందులో కూర్చున్నారు.
‘‘మంచినీళ్ళిస్తావా వినుతా.’’
ఆమె తెచ్చి చిన్న స్టూల్మీద పెట్టి మళ్ళీ కూర్చుంది. ఆమె చూపులన్నీ పిల్లలమీద కేంద్రికమై ఉన్నాయి. ఆమెను గమనిస్తున్నాడు. ఆరోగ్యంగా ఉంది. పాలిపోయిన ముఖంతో పీలగా రోగిష్టిలా లేదిప్పుడు. ఆరోగ్యంగా హుందాగా అందంగా ఉంది. ను, తను విన్న మాట నిజమే. వినుత సంతోషంగా ఉంది. ఎక్కడో ఈర్ష్య ఇంతై అంతై అతడి హృదయాన్ని ఆవరించింది.
అదే క్షణంలో వినుత అనుకుంటుంది. ‘‘బాగా చిక్కాడు. వెంట్రుకలు బాగా నెరిసి చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఆ కళ్ళలో కాంతిలేదు. వస్త్రధారణలో శ్రద్ధలేదు. అంటే అతనికి అంత నిర్లక్ష్యభావం ఉందన్నమాట… కానియ్. అలా జరగవలసినదే’’ అనుకుంది.
అతడు మంచినీళ్ళుత్రాగి సేదతీరినట్లు ‘‘హమ్మయ్య’’ అన్నాడు.
‘‘నువ్వొచ్చినపని త్వరగా చెప్పి వెళ్ళిపోతే నాకెంతో సంతోషం’’ అతడివైపు చూడకుండానే అంది.
‘‘త్వరగా చెప్పి వెళ్ళటానికి అది ఒక చిన్న విషయంకాదు. నా ఈ జీవితంలో ఓడిపోయాను.’’
‘‘అది చెప్పటానికే వచ్చినట్లయితే నేను విమర్శించను. నువ్వు గెలిచినా ఓడినా అది కేవలం నీకు సంబంధించిన విషయం. నువ్వు గెలిస్తే నేను అసూయ చెందను ఎందుకంటే భగవంతుడు నా జీవితంలో అమృతాన్ని చిలికించాడు. నువ్వు ఓడితే ఆనందించను – దుఃఖించను ఎందుకంటే నువ్వ పరాయి మనిషివి. ఆ వీధిన పోయేవాడు నా కెంత ఆప్తుడో నువ్వూ అంతే.’’ ఆమె కంఠంలో తేలికభావం వ్యక్తమైంది.
అతడు బాధపడ్డాడు. ఆమె తనను ఏనాడు ‘అప్పుడు’ కూడా ఏకవచనంతో సంబోధించలేదు. ఔన్లే తను మాత్రం ఆమెను ఏం గౌరవించాడు కనుక ఈనాడు ఇలా ఫీలవటానికి?’’
ఆమె చటుక్కున లేచి నుంచుంది. ‘‘ఆ రోజుల్లో – ఎవడైనా పరాయి మగవాడు వచ్చి నాతో లా మాట్లాడితే నువ్వు సహించలేకపోయేవాడివని నాకు తెలుసు. ఈ రోజు నా భర్త ఇంట్లోలేని సమయంలో నువ్వు వచ్చి కూర్చుని మంచినీళ్ళు త్రాగి తేలికగా నీగోడు వెళ్ళబుచ్చుకోవాలనుకుంటే ఈ చర్యనాకిష్టంలేదు. వారు ఏడుగంటలకే వస్తారు. అప్పుడు వస్తే నిన్ను పరిచయంచేస్తాను. వారి సమక్షంలో మాట్లాడు. నాకేం అభ్యంతరంలేదు.’’
అతడు వాచీ చూసుకున్నాడు. ‘‘పావుగంట ఉంది.’’
‘‘ఐతే… అందాకా ఇక్కడే కూర్చో,’’ అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
అతడు పిల్లల ఆటల్ని చూస్తున్నాడు.
తను ఇక్కడికి రావటం ఉచితమైన పనేనా.
వినుత – అతడు తనను అమర్యాదగా చూస్తే.
‘‘ఉష్’’ తను సహించాలి తన జీవితమే తెగి తెగి ముక్కలైపోయిన త్రాడులా ఉంది. ఆ తునకల్ని తీసుకుని ముడులు వేయగల్గితే… అంతకన్నా ఏంకావాలి. తన జీవితాన్ని చక్కబరుచుకోవాలన్న ఉద్దేశం తనకున్నది నిజమే అయితే తను కొన్న అవమానాల్ని సహించగలడు. ఫరవాలేదు అది తప్పదు.
పిల్లలు ‘నాన్నా’ నాన్నా’’ అని అరవగానే వినుత తాళంతీసింది. పిల్లలందరికీ తెలుసు అది ఇళ్ళకు వెళ్ళే టైం అని. ఎవరి ఆట సరంజామా వాళ్ళు చంకల్లో పెట్టుకుని పరుగులు తీశారు.
ఆఖరి పాపను వెళ్ళనిచ్చి అతడు గేట్ వేశాడు.
ఇక తాళం వేయనవసరం లేదు.
పిల్లలు తండ్రిచేతులను పట్టుకని నడుస్తున్నారు. పదేళ్ళ పెద్ద కుర్రాడు బంతి కొట్టుకుంటూ వరండా ఎక్కాడు. ఆ నూతన వ్యక్తిని చూపుతూ అంది వినుత, ‘‘వీరు మా ఊరివారట తరువాత మాట్లాడుకుందాం. మీరు లోపలికి రండి.
నమస్కరాలైన వెంటనే అందరూ లోపలికెళ్ళారు. కొంతసేపైన తరువాత వినుత ఓ మగ్ లో కాఫీ తెచ్చి స్టూలు మీద పెట్టి వెళ్ళిపోయింది. అతడు వెంటనే త్రాగి పెట్టేశాడు.
దాదాపు పావుగంటతరువాత ఇద్దరూ వచ్చి కూర్చునానరు.
‘‘వీరిని మీకు ఎలా పరిచయం చేయాలో నాకు తెలియటంలేదు. ఒకప్పుడు ఇతడి ఇంట్లో ఉండేదాన్ని. ఆ తరువాత తరిమివేయబడి త్యజింపబడ్డాను. ఏదో మాట్లాడాలంటే మీరు వచ్చేదాకా ఆగమన్నాను.’’ పొడి పొడిగా అంది.
అతడు తనను ఎలా చూస్తాడో అన్న భయంతో ఆవ్యక్తి నేలచూపులు చూస్తునానడు.
అతడు కూర్చున్న తీరు అతడి వస్త్రధారణ ముఖంలోని దైన్యత చూచి వినుత భర్త కుమార్ కు జాలి వేసింది.
‘పాపం ఇతడు చచ్చినపాములా వున్నాడు’ అనుకున్నారు. ‘‘ఓడిపోయాడు. అమృత కలశాన్ని కోరిబ్రద్దలు చేసుకున్నాడు. మరొక ‘మగ’వాడు… ప్చ్….’’ అనుకున్నాడు.
‘‘నన్ను మీరు అసహ్యించుకుంటు…’’
‘‘లేదు… లేదు… జాలిపడ్తున్నాను’’. కుమార్ చటుక్కునఅన్నాడు.
‘‘ఔను… ఒకప్పుడు అహంకారంతో … విచ్చలవిడిగా ప్రవర్తించాను. ప్రతిచిన్న విషయానికి పెడర్థాలు తీసి వినుతను సాధించాను. ఆమె అప్పటి అనారోగ్యానికి కారకుడినయ్యాను. భార్యగా ఆమె చిన్న చిన్న కోరికలకు కూడ చెడు అర్థాలు తీశాను. ఒక బానిసలా చూసుకున్నాను. ఆమె చదువుకున్నది. పని చేస్తానంటే అంగీకరించలేదు నేను. పోనీ నాకొచ్చే డబ్బుతో ఆమెను సరా పోషించలేక పోయాను. బాబు పుట్టినతరువాత కూడ నేను మారలేదు. ఒకరోజు నేను వచ్చేసరికి ఇల్లు తాళం వేసుంది. ఎక్కడికెళ్ళావని అడిగితే డాక్టర్ దగ్గరకంది. నేను నమ్మలేదు. ఆనాటినించి ప్రతి విషయానికి ఆరా తీయటం ప్రారంభించాను. హింసించాను. హీనంగా చూసాను. చివరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తరువాత చిక్కిశల్యమైన వెంటనే వాళ్ళ యింటికి తరిమేశాను.

———–

You may also like...