పేరు (ఆంగ్లం) | Rayaprolu Seetaramanjaneya Sastry |
పేరు (తెలుగు) | రాయప్రోలు సీతారామాంజనేయ శాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అయిన సంబంధాలు , అవును అది ఊరు…, అవును అది వూరు వాళ్లంతా మనుష్యులు, తలోమాటా, ధర్మంకోసం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రాయప్రోలు సీతారామాంజనేయ శాస్త్రి అవును, అది వూరు వాళ్లంతా మనుష్యులు |
సంగ్రహ నమూనా రచన | మొదట్లో సుబ్బయ్య స్వంతభూమిలోనే వ్యవసాయం చేశాడు. కాని, భార్య కాన్పులకీ, పెద్దకూతురి పెళ్ళికీ, కొడుకు చదువుకీ, తను ఖాయిలాపడినప్పుడూ షాహుకారిదగ్గిర తెచ్చిన అప్పులకింద, ఆచెక్క కాస్తా షాహుకారికి భుక్తమైపోయేసరికి ఆయనదగ్గిరే, కవులికి తీసుకున్నాడు తన భూమినే. ఇంటిల్లిపాదీ చాకిరీ చేసినా కవులుగింజలే మళ్లేవి కావు. బకాయి ధాన్యం నాలుగేళ్లు దిగడేసరికి దానికింద సుబ్బయ్య యిళ్లుకూడా తీసుకున్నాడు షాహుకారు. |
రాయప్రోలు సీతారామాంజనేయ శాస్త్రి
అవును, అది వూరు వాళ్లంతా మనుష్యులు
మొదట్లో సుబ్బయ్య స్వంతభూమిలోనే వ్యవసాయం చేశాడు. కాని, భార్య కాన్పులకీ, పెద్దకూతురి పెళ్ళికీ, కొడుకు చదువుకీ, తను ఖాయిలాపడినప్పుడూ షాహుకారిదగ్గిర తెచ్చిన అప్పులకింద, ఆచెక్క కాస్తా షాహుకారికి భుక్తమైపోయేసరికి ఆయనదగ్గిరే, కవులికి తీసుకున్నాడు తన భూమినే. ఇంటిల్లిపాదీ చాకిరీ చేసినా కవులుగింజలే మళ్లేవి కావు. బకాయి ధాన్యం నాలుగేళ్లు దిగడేసరికి దానికింద సుబ్బయ్య యిళ్లుకూడా తీసుకున్నాడు షాహుకారు. అయినా ఆయన ఎంతో దయగలవాడు కనక తన దొడ్లోని గొడ్లపాకలో ఒకవేపు కాపురం వుండవచ్చునన్నాడు సుబ్బయ్యతో. పాలేరుగా వుంటే తనకేమీ అభ్యంతరం లేదనికూడా చెప్పాడు. కాని బతికి చెడిన మనిషవడంచేత సుబ్బయ్యకి మనసాపలేదు. అయినా, తప్పనూ లేదు…
రెండు నెలలనుంచీ తండ్రి డబ్బు పంపకపోవడం వల్ల విషయం ఏమిటో కనుక్కపోదామని పట్నంనుంచి వచ్చిన సుబ్బయ్యకొడుకు మామూలుగా తన యింటికెళ్ళి చూసేసరికి, మామిడితోరణాలు కట్టివున్నాయి. తమ్ముడూ చెల్లెలూ, షాహుకారిగారి పిల్లలతో ఆడుకుంటున్నారు. నాన్న వసారా ఊడుస్తున్నాడు. అమ్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు. షాహుకారూ, ఆయన భార్యా యింట్లో హడావిడిగా తిరుగుతున్నారు. పీటలూ అవ్వీ సద్దుతూ… ఆ రోజే గృహప్రవేశం.
‘‘నాన్నా, ఏమిటిదంతా?… నువ్వు ఊడుస్తున్నామే? అమ్మ ఎదీ?’’ అని అడుగుతున్న పెద్దకొడుకుని చూసి ఉలిక్కి పడ్డాడు సుబ్బయ్య. ‘‘పసి సన్నాసి, ఈ వ్యవహారాలన్నీ వాడి కెందుకు’’ అని యింతకాలం రంగడి చెవిని పడనియ్యలేదు తండ్రి. కాని యిప్పటికి తప్పేదేముంది? చీపిరోమూల పెట్టి నలుగురిలో ఎందుకని కొడుకుని వీధిలోకి తీసుకెళ్ళి, రెండుముక్కల్లో జరిగిందంతా చెప్పాడు. ‘‘షాహుకారు ధర్మరాజు. కనకనే యింతనీడ చూపించాడు. లేకపోతే, చెట్టుకింద కాచుకు తాగాల్సొచ్చేది’’ అంటూను.
రంగడికి ఆవేశం వచ్చింది. ‘‘సాటి కులంవాళ్ళమనన్నా పాటించకుండా యింతపని చేశాడావాడు’’ అంటూన్న కొడుకు దురుసుతనానికి సుబ్బయ్య కొంచెం కోప్పడి ‘‘ఇంతకీ మన కర్మం నాయినా, ఆయనగారు చేసిందేముందీ పాపం ఇంటికి నడు.. నేనూ వస్తా, కాస్తాగి నీళ్లుతోడాలి బోలెడు. వాళ్ళ బంధువులు చాలామంది వస్తారుట…’’ అని రెండోకొడుకుని కేకేసి, అన్నయ్యని యింటికి తీసుకెళ్లు బాబూ’’ అంటూ వెనక్కెళ్ళాడు వాడితో ఆడుకుంటున్న షాహుకారిగారి యీ రెండోపిల్లకూడా వెంబడించింది వాళ్ళని.
తనతండ్రి యింతకాలం యీ వ్యవహారం దాచిపెట్టినందుకు కోపం, చదువుకున్న సమాజంలో తిరిగనందువల్ల ఏర్పడిన అస్పష్టబవాలూ, షాహుకారుమీద క్రోధం, తమ దుస్థితికి న్యూతా, కర్తవ్యబిమూఢతా, తికమకగా ఆవరించుకుని, ఉక్కిరిబిక్కిరి చేస్తుంగా, తమ్ముడితో గొడ్లసావిడిజేరాడు రంగడు. పెద్దకొడుకుని చూడగానే తల్లి బావురుమంది. కళ్లనీళ్ల పర్యంతం అయింది పాపం అతనికీని, షాహుకారుగారి గొడ్లపాకలో ‘‘గృహప్రవేశం’’ అయినప్పటినుంచి ఆవిడ మంచంపట్టింది మనోవ్యాధితో.
‘‘తట్టలో సంసారం బుట్టలో కొచ్చింది నాయనా ఏం లెక్కలో ఏం డొక్కలో నాకేం తెలుసు? మీ నాన్నకి, ఆయనగారు… ధర్మరాజు ఇంట్లోంచి వెళ్లేదాకా నాతో చెబితే ఒట్టు’’ ‘‘పాపం యివాళ కూర ఏమీ లేదు కామాలు… పప్పు పులుసు మిగిలింది పోస్తానుండు’’ అని ఇంటియజమానురాలు నాతో అంటుంటే నాకు శూలాలుపెట్టి పొడిచినట్టుంటోంది బోబూ.. నేను బతకను…’’ అంటూ కళ్లుతుడుచుకుంటున్న తల్లిని ఓదార్చటానికతని దగ్గిరేమీ సామాగ్రి కనిపించలేదు.
‘‘ఆ పిల్ల మటుకు పిల్ల ఎంత యిదిగా వుండేది. ‘‘అత్తయ్యా, అత్తయ్యా’’ అంటూ మన యింటికొచ్చినప్పుడు ఇప్పుడు కన్నెత్తిచూస్తే ఒట్టు’’ అంటూండగా సీత దొడ్డిగుమ్మంలో కొచ్చింది. పదిహేనేళ్లుంటాయి. పచ్చని పసిమి కాదు గాని, మేలిఛాయ, కొంచెం పొడగరి అవటంవల్ల బొద్దుగా వున్నట్లు కనిపించకపోయినా పుష్టిగల శరీరం. మొదట్లో సీతను రంగడికిద్దామనే వుండేది షాహుకారిగారికి కొంచెం దూరబంధత్వంకూడా వుంది. కాని షాహుకారు పట్టిందల్లా బంగామవటం మొదలెట్టినట్టుగానే, రంగడి తండ్రిపని క్రమంగా దిగనాసిల్లి, ఆఖరికీ యనకిందే పాలేరుగ జేరేటప్పటికి యిప్పుడు సంబంధం చేద్దాకునే తలంపే లేకిపోయింది. సీతకూడా యీ మార్పు కనిపెట్టి రంగడిమీద పాకబోతున్న ప్రేమలతల్ని తెంచిపారేసింది. తన దొడ్లోనే గొడ్లసావిట్లో జేరేటప్పటికి సీతకి మరీ లోకువై పోయింది. ఒకటి రెండు మాట్లు రంగడి తల్లని ‘‘ఏమే, ఒసేయి’’ అనబోయే సరికి సీతతల్లే కోప్పడింది కూడాను. చిన్నప్పటినుంచీ ఒకేవూళ్ళో సమానఫాయంగా పెరగటం వల్లా, చుట్టుపక్కలవాళ్లు ‘‘రంగడు సీతమొగుడు’’ అన్నప్పుడు చిరునవ్వు నవ్వి తలితండ్రులు తమ మోదానిన తెలుపుతూండడంవల్లా సీతకీ రంగడికి, సహజంగా వయస్సుతోపాటు కలిగే పరివర్తనలూ భావాలు ఒకరినొకరిని మరింత సన్నిహితం చేశాయి. రంగడా అమ్మాయి హృదయంలో చోటుచేసుకున్నాడనటానికి సందేహంలేదు. కాని యీ రెండు నెలల్లో జరిగిన మార్పులు, రంగణిని ఆమె హృదయంలోనుంచి నిర్ధాక్షిణ్యంగా తరిమేశాయి. ఆ అమ్మాయి ఎంతమాత్రం ప్రతిఘటించలేదు. పై పెచ్చు సంతోషించే వుండవచ్చు. ఇప్పుడు చుట్టుపక్కలవాళ్లెవరూ ‘‘సీత రంగడి పెళ్లాం అవుతుంది’’ అనడంలేదు కూడాను. ఈ సంగతి పాపం రంగడికేమీ తెలీదు.
దొడ్డి గుమ్మంలో కొచ్చిన సీతకి, తన చెల్లెలు రంగడిచెయ్యి పట్టుకొని నాట్యం తొక్కుతూన్నట్టు ఎగురుతూండటం కనిపించింది. తరిమెయ్యబడిన అతని చిత్రం మాతృకని చూసుకునేసరికి కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్లా ఆ అమ్మాయి హృదయంలో ప్రవేశించటానికి పోట్లాడుతోంది. బిగ్గరిగా పిలవటానికి ధైర్యంచాలక తన చెల్లెలికి ‘‘ఇలా రమ్మ’’ని కంటిసైగ చేసేసరికి ‘‘నేను రాను ఫో…’’ అనేసింది. తల్లితో మాట్లాడుతున్న రంగణిని, లవండరు సబ్బువాసన ఏదో జ్ఞాపకాలు తెస్తుండగా ‘‘నేను రాను ఫో…’’ అనే మాటలు వినబడి వెనక్కి చూశాడు. సీత నిర్లక్ష్యంగా పక్కకి తిరిగి వెళ్ళబోతుంటే, తాను కిందటి మాటు వచ్చినప్పుడు సీతకోసం లవండరుసబ్బుతోపాటు తెచ్చిన జండారంగుల రిబ్బను జడలో కనిపించింది. తనకేదో అధికారం వుందనిపించి ‘‘సీతా యిలా రా’’ అన్నాడు రంగడు. సమాధానంగా ఆ అమ్మాయి, ఠపీమని దొడ్డితలుపు వేసి లోపలి కెళ్ళిపోయింది, గుండెల్లో బాకుపెట్టి పొడిచినట్టు బాధపడి దూకుడుగా వీధివేపు కొచ్చాడు తలిల వారిస్తున్నా వినకుండా రంగడు ఇంట్లో ఎవరూ ప్రవేశించకుండా వీధితలుపు తాళంవేసి అప్పటికప్పుడే సీత గృహప్రవేశం అయి యింటికి పోవటానికి మెట్లు దిగుతోంది.
ఉద్రేకంగా అడిగాడు రంగడు ‘‘మా నాన్న చేసిన ఘోరం చూశావా?’’ అని జవాబు చెప్పటమే నూయనత అనిపించినట్టుంది ఆ అమ్మాయికి. తులపరించుకుపోతుంటే ‘‘నీకూ యిష్టమే నన్నమాట’’ అన్నాడు. ‘‘పిచ్చి వెధవ’’ అనుకున్నట్టు విషపునవ్వు ఒకటి నవ్వి ముందుకి సాగిపోయింది. అంత నిరాదరణని భరించడం రంగడికి చేతకాదు. కొంచెం బిగ్గిరిగా ‘‘నుంచో సీతా మరి నన్ను నువువ పెళ్లి’’ అర్దోకిలోనే పురుగుని చూసినట్టు చూసి ‘‘ఛీ సిగ్గులేదూ’’ అంటూ రెండంగల్లో తండ్రిదగ్గిరి కెళ్లి’’ పాలేరుకొడుకు నన్ను నడిబజారులో పట్టుకుని నానా కూతలూ కూశాడు’’ అని ఏడ్చింది సీత. విన్నవాళ్లు నలుగురూ రంగడిదే తప్పన్నారు. ‘‘పాలేరు కొడుకు’’ అనేసరికి రంగడికి ఒళ్లు తెలీలేదు. అడ్డమైన తిట్లూ తిట్టాడు షాహుకార్ని. సీతని నానాదుర్భాషలూ ఆడాడు. పదిమంది జతై రంగణ్ని నాలుగు ఉతికారు. తండ్రి మంచితనంవల్ల ప్రాణాలతో విడిచిపెట్టారు. తప్పితే, నిలువునా చీల్చేసి వుందురు. ఊళ్లో పెద్దషాహుకారుని, దొంగరాఓసి, ఫోర్జరీగాడూ, కొంపలు కూల్చే గాదిదీ అని తిడుతాడా, ఓ పాలేరు వెధవ పైగా నడివీధిలో పట్టుకుని, పెళ్లీడు పిల్లని పలకరిస్తాడూ నయం బతికిపోయాడు, సంతోషించండి, ఇదేంఊరనుకున్నాడా, అడివనుకున్నాడా’’ అంటూ అంతా వ్యాఖ్యానం చేశారు. అవును అది ఊరు వాళ్లంతా మనుష్యులు.
‘‘రంగారావను కాలీజీ విద్యార్థి ఎలక్ట్రిక్ ట్రెయిన్ ఎక్కుతుండగా, ప్రమాదవశమున క్రిందపడి మరణించెను’’ అనే వార్త పేపర్లో చూసి ఆ మరణించిన యువకుడు రంగడేనని గ్రామస్థులు తెలుసుకున్నారు. ‘‘అవును, కండకావడం ఊరికే పోతుందా? ఎంత కలికాలమైనా భగవంతుడు అప్పుడప్పుడు చెప్పుదెబ్బ కొట్టినట్టు, పాపానికి ఫలం వెంటనే అనుభింపచేస్తునే వుంటాడు. లేకపోతే ప్రపంచంలో వీళ్లకి పట్టపగ్గాలుంటాయా?’’ అని బాగా చదువుకున్న వేదాంతులు వ్యాఖ్యానం చేశారు రంగడి మరణవార్తమీద…
భార్య వద్దన్నా వినకుండా షాహుకారుగారు, సుబ్బయ్య కుటుంబాన్ని దొడ్లొంచి వెళ్ళగొట్టినా, రంగడి దినవారాలికి, పాపం సాయంచేశాడు పుణ్యాత్ముడు. అన్నీ అయిపోయింతర్వాత, ఆ వూళ్లో కూలినాలి చేసుకుని బతకటం తలకొట్టనట్టయి, సుబ్బయ్య భార్యనీ, పిల్లలిద్దర్ని తీసుకుని చెన్నపట్నం వచ్చేశాడు. ఆమెకి ఏడోనెల అని షాహుకారు భార్యకి తెలిసి, చాటుగా ఓ పాతిక రూపాయలు చేతులో పెట్టబోగా ‘‘పొలం బుట్రా, యిల్లూ వాకిలీ వేసుకుని, నా కొడుకుని పొట్టనబెటుటకుని, ఊళ్లోంచి వెళ్ళగొట్టినప్పుడు, ఈ పాతికాపరకా మమ్మల్ని రక్షించవు’’ అంటూ తిరస్కరించింది సుబ్బయ్య భార్య.
పట్నంలో ఫాక్టరీ కూలీగా జేర్చాడు భార్యని. మనోవ్యాధి, పుత్రశోకం, ఓపలేనిదయ్యె. పైగా.. ఒంట్లో ప్రాణమే లేదు.. పనేం చేస్తుంది? ఎనిమిదో నెలలోనే పురుడొచ్చింది. చిన్నప్రాణం బైటపడిందో లేదో, పెద్దప్రాణం ఎగిరిపోయింది కోడుకులో కలుసుకుంటానికి…
పిచ్చెక్కిందనటానికి వీలులేదు కాని, చూస్తే అలాగే కనిపిస్తాడు సుబ్బయ్య. ఓ మహారాజు రిక్షా అద్దెకిచ్చాడు, జీవనం చెయ్యటానికి, అసలు యన దొడ్లోనే యింత కాచుకు గమందాం అనుకున్నాడట కాని ‘‘రోజులు బాగుండలేదు. ఏ నాటికేం దొంగబుద్ధి పుడుతుందో, పిల్లలు గల వాడయ్యే… కైదూగీదూ పడితే కష్టమని, ఆ రిక్షాయజమాని అటువంటి అవకాశం యివ్వలేదు.
పట్నంలో మంచి విశాలమైన రోడ్లకి రెండు పక్కలా మనుష్యులు నడవటానికి సిమెంటు చేసిన దార్లు చక్కగా అద్దమల్లే వుంటాయి, సుబ్బయ్య, దానిమీద కాపరం పెట్టాడు పిల్లు ముగ్గురితోనూ… తక్కిన రిక్షావాళ్ళు ఏదోబాగానే సంపాదించుకుంటున్నారు కాని సుబ్బయ్యకు మాత్రం, రిక్షా అద్దెమళ్లటమే కష్టంగా వుంది. ఓ దొరటోపీ, మిలిటరీ నిక్కరూ, నాతబూట్సులూ సంపాదించాడు. ఎప్పుడూ ఎదోఆలోచిస్తున్నట్టగా రిక్షాముందు కూర్చుంటాడు. ఎవరన్నా పిలిస్తే వెళుతాడు. లేకపోతే లేదు మధ్యాహ్నంపూట భోజనానికి గాను ఫీసుల్లో పనిచేసేవాళ్ళూ, బళ్లోచదువుకునేవాళ్లూ, అన్నాలు తెప్పించుకుంటారు నౌకర్లచేతి టిఫిన్ కాయరియర్లలో, వాటిల్లో మిగిలిన ఎంగిలి మెతుకులు కలిపి ఆ నౌకర్లు అణాకి క ముద్ద చొప్పున పెడుతారు కూలీలకీ, రిక్షావాళ్ళకీ. రిక్షా అద్దెపోను మిగిలిన డబ్బులతో రోజూ ఆ విందారగిస్తాడు సుబ్బయ్య. పెద్దపిల్లలకేం గాని, బస్సులాగేచోట, అడుక్కుని బతుకుతున్నారు… ఆ పసిగుడ్డే పదిరోజులపాటు బతికి ప్రాణంతీసింది పాపం. తమకి పోటీగా ముష్టెత్తుకుంటానికి వచ్చిన గుడ్డిపిల్లకీ, ఆ కుటికుర్రాడికీ ఎక్కువ డబ్బులు రావటంవల్ల సుబ్బయ్య పిల్లలికి అప్పుడప్పుడనిపిస్తూవుంటుంది ‘‘మనకికూడా, కళ్లూ, కాళ్లూ లేకపోతే హాయిగా ఎక్కువడబ్బు లొచేచవిగదా’’ అని. ఆడపిల్లని చూసిన పెద్దలూ ధార్మికులూ ‘‘పాపం మంచి పుటక గలదల్లె వుంది రోజులలా వచ్చాయి కామాలు ఏదో కాస్త వయస్సొచ్చిందంటే, చక్కగానే సంపాదించుకు బతుకుతుంది…’’ అని తృప్తని వెల్లడిస్తారు.
సీతా, సీత మొగుడూ ఒకమాటు పట్నంవచ్చి, బస్సు ఎక్కబోతుంటే ‘‘అమ్మగారూ ఒక్క కానీ దయచేయించండమ్మా’’ అంటూ యీ పిల్లు కనిపించారు. సీతకళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఈ మధ్యే పెళ్లయింది. అప్పుడు గృహప్రవేశం అయిన యింట్లోనే విడిది పసుపూ, కుంకుమ కింద సుబ్బయ్యదగ్గిర కట్టకున్న పొలమూ, యిల్లూ సీతకిచ్చాడు తండ్రి.
‘‘ఒదినా’’ అని పిలవబోతున్న ఆ కుర్రవాడి గొంతును, సీతమెళ్ళో ధగధగా మెరిసే చంద్రహారం నొక్కేసింది. ఆ పిల్లల్ని కావిలించుకోటానికి ఉత్సహిస్తున్న సీతచేతులికి, ఆమెభర్త ‘‘స్టెతస్కోపు’’ సంకెళ్ళు వేసింది.
ముష్టి పిల్లల చేతులో, సీత కరూపాయి పెట్టింది. చూసినవాళ్ళకి ఆశ్చర్యాంగానే వుంది రూపాయి యివ్వడం.
సాయంత్రం బీచికి రిక్షాలో పోతూ, మాటవరసకి సీతభర్త రిక్షావాడిని ‘‘మీదేవూరు?’’ అని అడిగేసరికీ, ‘‘ఫలానా’’ అని చెప్పాడు. సీత ఉలిక్కిపడి ‘‘ఆపు ఆపు’’ అంది. అప్పడే వెలిగిన విద్యుద్దీపపుకాంతిలో ఆమె సుబ్బయ్యని గుర్తుపట్టింది. తెల్లబోయిచూస్తూన్న సుబ్బయ్య మాత్రం సీతని సరిగా గుర్తుపట్టలేదు.
‘‘ఇహ నడిచి వెడుదాం’’ అంటూ భర్త చెయ్యిపట్టుకుని రిక్షావాడికో రూపాయి గిరాటు వేసి, యిసకలో నడిచిపోతున్న సీతని చూసి సముద్రం వికటాట్టహాసం చేసింది.
‘‘ఏమిటా గాభరా?’’ అని అంటున్న సీత భర్త ప్రశ్న వినిపించుకుండాను.
———–