పేరు (ఆంగ్లం) | Balivada Kantarao |
పేరు (తెలుగు) | బలివాడ కాంతారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | రవణమ్మ |
తండ్రి పేరు | సూర్యనారాయణ |
జీవిత భాగస్వామి పేరు | శారద |
పుట్టినతేదీ | 7/3/1927 |
మరణం | 5/6/2000 |
పుట్టిన ఊరు | శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో |
విద్యార్హతలు | – |
వృత్తి | భారత నౌకాదళం |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, ఒరియా |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నవలలు : జన్మభూమి, అమ్మి, సంపంగి, ఇదే నరకం ఇదే స్వర్గం, మన్నుతిన్నమనిషి, వంశధార, పుణ్యభూమి, గోడమీద బొమ్మ కథాసంపుటాలు: కావడి కుండలు – 1955, బూచీ -1952, దొంగలు – 1952, అంతరాత్మ- 1956, అన్నపూర్ణ – 1968, గోపురం – 1994, బలివాడ కాంతారావు కథలు (1987,1994) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బలివాడ కాంతారావు |
సంగ్రహ నమూనా రచన | కనకరాజు భార్య కమల సన్నజాజి పువ్వులా నాజూగ్గా సన్నంగా ఉండేది. ఎప్పుడూ వాడని పుష్పంలా నున్న ఆమె మొమును మనసారా ఆమె నిద్రపోతున్నా కూడా చూస్తూ మురిసి పోయేవాడు. ఆ దరహాసం నీలి ఆకాశంలో చవితి చందమామ చిరునగవులా ఉండేది. హంసల్లాంటి తెల్లని బట్టలు కట్టుకొని, అపూర్వమైన వయ్యారం ఒలకబోసుకొని ఒక్కొక్కఅడుగు వేస్తుంటే, గుప్పెట్లో ఇమిడిపోయేటట్లున్న ఆ నడుమును పట్టుకొని ఆమెను తనవేపు త్రిప్పుకోవడం అలవాటే. నిజం చెప్పి న్యాయంగా ధనార్జన చేస్తే మనస్సెంత చల్లగా ఉంటుందో, ఆమెతో కాపురం అలా ఉండేది. రాబడి ఖర్చులు త్రాచులో సరితూగుతున్నట్లు సంసారం సాగించేది. జీవితం నల్లచుక్క పడని తెల్ల కాగితంలా ఉండేది. |
బలివాడ కాంతారావు
కనకరాజు భార్య కమల సన్నజాజి పువ్వులా నాజూగ్గా సన్నంగా ఉండేది. ఎప్పుడూ వాడని పుష్పంలా నున్న ఆమె మొమును మనసారా ఆమె నిద్రపోతున్నా కూడా చూస్తూ మురిసి పోయేవాడు. ఆ దరహాసం నీలి ఆకాశంలో చవితి చందమామ చిరునగవులా ఉండేది. హంసల్లాంటి తెల్లని బట్టలు కట్టుకొని, అపూర్వమైన వయ్యారం ఒలకబోసుకొని ఒక్కొక్కఅడుగు వేస్తుంటే, గుప్పెట్లో ఇమిడిపోయేటట్లున్న ఆ నడుమును పట్టుకొని ఆమెను తనవేపు త్రిప్పుకోవడం అలవాటే. నిజం చెప్పి న్యాయంగా ధనార్జన చేస్తే మనస్సెంత చల్లగా ఉంటుందో, ఆమెతో కాపురం అలా ఉండేది. రాబడి ఖర్చులు త్రాచులో సరితూగుతున్నట్లు సంసారం సాగించేది. జీవితం నల్లచుక్క పడని తెల్ల కాగితంలా ఉండేది.
చల్లనిగాలి, చిలికి చిలికి గాలివాన అయినట్లు ఒకనాడు కనకరాజు జీవితం భీభత్సం అయిపోయింది. సమ్మొహనంగా ఉండిన వసంతం గ్రీష్మంగా మారింది. కళ్లల్లోని ఆశాజ్యోతులు నిరాశతో నీరైపోయాయ్. సంతోషంతో ప్రవహించిన హృదయం దుఃఖంతో చెక్కలైంది. అతను యేది నిత్యం యేది కత్యం అనుకున్నాడో అది మాయా అసత్యం అయిపోయాయ్. సమల చనిపోయి ఆరు నెలలైనా నిన్నా మొన్నా ఆ పిడుగులాంటి సంఘటన జరిగినట్టుంది. దైన్యాన్ని గుటకలు మ్రింగి, శోకాన్ని భరించి, ఇద్దరి పాపల్ని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. మాటాడిన పుష్పాన్ని కోల్పోయిన అతని మనస్సు, మాటాడని మొగ్గలతో పరిచయాన్ని యేర్పరచుకుంది. అందుకే కళ్ల వేడుకనిచ్చే పూలతోటను తన బంగళా చుట్టూ సృష్టించుకున్నాడు.
ఒకనాటి వేకువఝామున యేదో కలగని తెలివి తెచ్చుకున్న కనకరాజ నిస్పృహను నకరాలని మనసును పూలతోటపై మళ్లించాడు. తోటలోనికి వచ్చి సిమ్మెంటు దిమ్మపై కూర్చున్నాడు. వికసిస్తున్న మొగ్గలా, విచారం వదలుతున్న మనసులా ఉషస్సు ఉదయిస్తోంది. తన కుటుంబంలోని వ్యక్తుల్లా, ఆ రకరకాల పూలచెట్లతో అతనికి సన్నిహితం ఉంది. ఉదయభానుని రక్తాన్నంతా పీల్చేసి యెరుపుదేరిన మందారాలు సాయంత్రానికల్లా ఆ రక్తాన్నంతా తిరిగి అతనికి అప్పచెప్పి తలలు వంచేస్తాయ్. మల్లెలు కొల్లలుగా పూసి బంగళా చుట్టూ పన్నీరు జల్లుతాయ్. బొద్దుగా భీకరంగా పూసిన బొగడలు, ఆకుల్లో అణగి అపూర్వమైన వాసనలను వెదజల్లుతున్న సంపెంగలు, ఝుమ్మని రొదచేసే తుమ్మెదలను ఆహ్వానించే రంగురంగు గులాబులు, ముఖాన్ని పౌడరు వత్తుకొని రాత్రంతా సరమని కోసం వేచివున్న శోభినాంగిలా నున్న లిల్లీపూలు వీటన్నటిపేర్లు తెలుసు. వీటి అందాలు పరిమళాలు అతని మనసులో చోటు చేసుకొని మూగ బాసలతో తన దుఃఖాన్ని ఉపశమింపచేస్తున్నాయ్.
ఆకసంలో తోకచుక్కలా ఒక్కసారి తన దృష్టిని తొలిసారి గేటు దగ్గరేనున్న పేరు తెలియని పూలమొక్క ఆకర్షించింది. పెద్దకాడతో తెల్లగా ఒకపూవు తొలిసారి విడిపడింది. ఆకలితో సన్నబడిన తల్లిలేని పిల్లలాంటి మొక్కను షికారునకు వెళ్లినప్పుడు రునెలల క్రితం తెచ్చినాటాడు. సున్నిత మెరుగని రూపుతో మోటు ఆకులతో నున్న అడవి మొక్క అంత అందమైన పూవుతో సింగారించుకుంటుందని తను వూహించుకోలేదు. అందమైన పువ్వును చూడగానే ఆ పూలమొక్కపై అభిమానం ముంచుకొచ్చింది. గబగబా దగ్గరకెళ్లి నిల్చొని చెట్టుని ఒకసారి ఆప్యాయంగా తాకపోతుంటే చేతితో కాఫీ కప్పుతో పున్నమ్మ ప్రత్యక్షమైంది. ఇన్నాళ్లు తను లేచేసరికి బెడ్కాఫీ మంచం ప్రక్కనే బల్లమీదుండేది. ఈ వేళ తను వేగంగా లేచిపోవటం ఈమె తనకు దగ్గరగా రావటంతో పరీక్షగా చూడటం జరిగింది.
రెండేళ్ల క్రితం ఆఫీసునించి ఇంటికి వచ్చేసరికి ఆకలితో చిక్కి అసహ్యంగా నున్న పిల్ల అగుపడింది. ఎవరని అడక్కుండానే కమల ఆ పిల్లగాధ చెప్పింది. ఆ పిల్లకు యెవ్వరూలేరట. అడుక్కుని కడుపు నింపుకుంటోంది. పని చేసుకోరాదా అంటే యెవరిస్తారని యెదురు ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు సమాధానంగా కమల ఆ పిల్లని పనిపాట్లు చెయ్యడానికి పెట్టుకుంది. కమల పోయాక ఇంట్లో పని, వంట, పిల్లల కింద సేవ పున్నమ్మే చేసుకుంటోంది. భార్య ఉన్నప్పుడు, పోయినప్పుడు ఇంత వరక తనలో ఆమెపై రాజుకున్న మొహం ఇంక పున్నమ్మ అంటే తొలి రోజు చూసిన ఆకారమే మనసుతో మెసలుతుంది.
ఈ రోజు అడవిపూవు మీద చూపించిన శ్రద్ధే ఆమెవేపు చూసాక కలిగింది. పోషణతో పాటు ప్రమోదమైన వాతావరణం ఆమెను అడవి మొక్కలా యేపుగా బలిష్ఠంగా పెంచింది. వయసు ఒళ్లంతా ప్రాకిపోయింది. ఆమె అవయవాల పొందిక చూసిన కనకరాజు మనసు ఒక్కసారి చలించింది. కాఫీ త్రాగుతూ ఆగిఆగి క్రీగంటగా ఆమెవేపు పదేపదే చూసాడు.
ఆమె అక్కడనించి కదిలాక ఆమె వెంటపడాలనీ, ఒకసారి ఆమె కళ్లల్లోకి దీక్షగా చూడాలనీ, ఆమె చిరునగవు లగజోస్తే తాను యెన్నాళ్లకు మళ్లీ నవ్వగలిగానని ఇలా మనసులో ఆలోచనలతో పాటు ఆక్షేపణలను కూడా సృష్టించుకున్నాడు. చెక్కిన దంతం బొమ్మలాంటి కనులలో మంత్రించిన మొహం ఉండేది. కాదు. ఆమె అందం, సంస్కారం అంతా సున్నితమైంది. సిల్కు బట్టలాంటి శరీరం ఆమెది. మగవాడి చూపులను వెనక్కి రాకుండా బంధించగల బలిసిన యవ్వనాన్ని తాకాలనే కోర్కె కమల ఉన్న రోజులనించి తీరని కోర్కెగా నిలచిపోయింది.
ఎంటో ఈ అడవిపూవు పికపిక మంటూ తోటలోని అన్నిపూలకు దీటంటున్నది. రోజాకు రోజా అతని ఆందోళన ఆవేశం నల్లమేఘాలు పులుముకొని ఢీకొన్నట్లు మనసులో రగులుకుంటున్నాయి. కమల పోతే మళ్లీ పెళ్లి చేసుకోనని ఢంకామీద దెబ్బకొట్టినట్లు తెలియపర్చిన తన నిర్ణయాన్ని అంతా హర్షించారు. తన యేకపత్నీవ్రతాన్ని శ్లాఘించారు. కమల లాంటి అపూర్వమైన స్త్రీతో కాపురం చేసినవాడు అలాంటి స్త్రీని మళ్లీ పొందలేడన్న భావం తనలో పాతుకుపోయి ఉండేది. ఇప్పుడు గాలితో పొంగిన రబ్బరు బెలూనులా యవ్వనంతో పొంగిన పున్నమ్మవేపు దొంగ చూపులు చూస్తుంటే కనకరాజు మతిపోతుంది.
ఈ అడవిపూవు యెంకాలం ఇంత మనోహరంగా చెట్టున ఉంటుంది? రాలిన రాలుతుంది ఎవరైనా తెంపినా తెంపుతారు. ఏదో తుమ్మెద వాలితే పూవు కాయవుతుంది. కాలం అందాన్ని తెస్తుంది. అందాన్ని మింగుతుంది. చావు పుట్టుకల మధ్యకాలం దైన్యాన్ని కాకుండా ఆంనదానికి వినియోగించుకోవటంలో ఉంది మనిషి ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞను తను, నలుగురిలో అర్థంలేని గౌరవం తెచ్చుకోవడం కోసం యెందుకు వదలుకోవాలి?
కోరిక బాధించినా, ధర్మం తెలుసుకున్నవాడు కాబట్టి ఇంట్లో నున్న పున్నమ్మను ముట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు మనసు పట్టుతప్పి ఆమెవేపు కళ్లల్లో నీరుగా మారిన కామంతో మౌనంగా చూసేవాడు. ఆమె చూపులు యెప్పుడూ మిణుకు మిణుకుమనే చుక్కల్లా ఉండేది. చుక్కలవేపు చూసి కవిత్వం అల్లుకునే ప్రేమికునిలా మనసులో అనుభూతులు కలిగేవి. మరికొన్ని రోజులు పోయాక ఆమె వడ్డిస్తోంటే కుదురుగా నున్న చేతులను తాకాలని తాకలేక చిన్న నవ్వునవ్వితే జవాబు రాలేదు. బాధపడినా ఇంకోసారి వంటింట్లో ఒక్కర్తె ఉంటే దగ్గరకు వెళ్లాలని రెండు అడుగులు వేస్తే పున్నమ్మ ఇటు వస్తూ యెదురయింది. చేతులు లేచాయి గానీ ఆమె ప్రక్కకు కదిలిపోయింది. తరువాత తోటలోనికి వచ్చి యేకాంతంగా కూర్చుని గంటల తరబడి తనను తాను విమర్శించుకున్నాడు. నరాల పొగు తగ్గిన తరువాత తెలివి తెచ్చుకొని అంతా కల అనుకున్నాడు. పున్నమ్మ తన కళ్ల యెదట తన కూతురిలా పెరిగింది. కనికరించినా కడతేర్చినా తనే చెయ్యాలి. ‘‘దుష్టులు చేసే పాపం సమర్థుడు చూసి వూరుకుంటే, వాళ్ల పాపంలో తను భాగస్థుడవుతాడని’’ మహాభారతంలో చదివాడు.
సమర్థుడనుకున్న తనే దుష్టుడైతే పాపం పండిపోతుంది. తెలివితక్కువ వాడు, మూర్ఖుడు చేసిన మహాపాపాల కంటే తెలివైనవాడు, సమర్థుడు చేసిన కొద్ది పాపమే హెచ్చుగా పరిగణింప బడుతుంది.
ఈ ధర్మా ధర్మ విచక్షణ ఇంకా మనసులో నించి తుడిచి పెట్టక ముందే ఆ మరుచటి రోజు ఒక సంఘటన జరిగింది. వేగంగా ఆఫీసునించి వచ్చేసాడు. పున్నమ్మ ఇంకో ఇనుపగుండులా ఉన్న యౌవనునితో కులాసాగా పకపక నవ్వుతూ యేకాంతంగా యెంతో పరిచయ మున్నట్లు మాటాడుతోంది. ఆ మాటల్లో మోటుహస్యం విన్నాడు. ఆ కొంటె చూపుల్లో కోరికలు చూసాడు. తిరిగి వెనుకకు బాధతో కదలిపోయాడు. ఆ రాత్రి తిండి దగ్గర ఆమె వేపు చురచుర చూసాడు. ఆ చూపుల్లో ఆక్షేపణ, ఈర్ష, నరిసన అంతా వ్యక్త పరిచాడు. ఆమె తొణకలేదు బెణకలేదు. మామూలుగా పనిపాట్లన్నీ చేసుకుంటోంది. ఏదో అందామనుకున్నాడు. మందలిద్దామనుకున్నాడు. తను యేమన్నా యేది చేసినా యేదో స్వలాభంతోను, అసూయతోనే చేయటం జరుగుతుంది కానీ ఆమె రక్షకునిగా చెయ్యటం లేదని తర్కించుకోవటం వలన వూరుకున్నాడు. ఆఫీసుకు పోయినా, ఇంట్లో ఈ సరికి యేం జరుగుతుందో వూహించుకునే వాడు. థను కమల నివసించే గదిలో వీళ్లిద్దరూ స్వేచ్ఛగా విహరిస్తుంటారని తోచగానే భరించలేక ఇంటికి వచ్చేసరికి ఆమె యేదో పనిపాట్లు చేసుకుంటోంది. ఎన్ని మాటలు అందామని వచ్చాడో అన్నీ దిగమింగేసాడు. ఇంకో రోజున ఆమె పెరటి వరండాలోనే వాడితో పాటు మాటాడుతోంది. అక్కడికి వెళ్లడం మర్యాద కాదనుకున్నా చప్పున వెళ్లాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఏమి మాటాడకుండా కోపంగా మొఖం పెట్టి వచ్చేసాడు.
ఆ క్షణం నించి ఆమె అతని యెదుట పడటానికి జంకుతోంది. పువ్వు మీద మంచులా ఆమెకు దిగులు కప్పేసింది అతను ఇంట్లో ఉండగా ఇదివరకు ఉన్న చనువులేదు. సంతోషంలేదు. చాటుమాటుగా కదులుతోంది. కనకరాజు ఈ మార్పును సహించలేక పోయాడు. ఇదివరకు ఆమె నిర్లక్ష్యంగా వదిలి పెట్టిన యవ్వనం, ఎప్పుడూ చిరునవ్వుతో చిందులో తొక్కేపెదాలు, అరమరికలు లేకుండా అన్నీ అమర్చి పెట్టే ఆ చనువు ఇవన్నీ ఇప్పుడు కరవు కాగానే అతను ఇంట్లో ఉండలేకపోయాడు.
ఎన్నాళై తీరని కోరిక ఎలానైనా సాధించుకోవాలన్న పట్టుదల హెచ్చయింది. తనలో ఎన్నెన్నో ఆలోచనలు కలిగినయ్ ఆమెను ఒకసారి యేదో చేసేస్తే? తన కోరిక ఆమెతో చెప్పితే? ఆమె అందుక ఒప్పుకుంటే? ఆమె తనను పెళ్లిచేసుకోడానికి ఒప్పుకుంటే తనకు సంఘంలో ఉన్న మర్యాద అంతా గంగలో కలిసిపోతుంది. ‘‘నీకూ నాకు జోడి యెలా కుదురుతుంది బాబూ. నీ కూతురులాంటి దాన్ని’’ అంటే తనకు జవాబు చెప్పటానికి మాటలు రావు.
అతనికి రోజుకు రోజు వికారం హెచ్చవుతోంది. తనింకా యౌవనంలోనే ఉన్నాడు. తనలో ఉన్న సున్నితం, సంస్కారం ఉగ్గులు తేరిన తన జుత్తు, పుటం వేసిన బంగారం లాంటి తన శరీరచ్ఛాయ, ఆడది చూడగానే వలపులను పండించగల తనకు మాని పేదరికం, మోటుతనంతో నిండిన మనిషితో పున్నమ్మ సంపర్కం పెట్టుకోవటం ఈ అవమానంతో అతని హృదయం బేజారవుతోంది. ఈ విషయంలో మౌనం యెంత కాలమో తనకు వరించలేదు. ఒకసారి పరోక్షంగా ఆమెను వినిపించేటట్లు అన్నాడు. ‘‘ఈ మొగాళ్లు మోసం చేస్తారు’’ ఇంకోసారి ‘‘ఒక్కర్తే ఉంటావు ఇల్లు జాగ్రత్త’’ అన్నాడు. వేరొకసారి ‘‘ఎవరిని నేను లేనప్పుడు రానివ్వకు’’ అన్నాడు. ఆఫీసుకు వెళ్లిపోతూ తన అడవి పువ్వుమీద రాలటానికి యెన్నో తుమ్మెదలు కొట్లాడుకోవటం గమనించాడు.
ఆమె మనసు మెల్లగా మార్చాలన్న ప్రయత్నంతో ఒకసారి ‘‘పున్నమ్మా – నీవు లేకపోతే పిల్లల గతి చూడు’’ ఆమె జవాబు చెప్పకుండా అలాతల దించుకునే ఉంది.
‘‘మాట్లాడవేం?’’
‘‘నే నెక్కడికి వెళ్ళిపోతాను బాబూ?’’
‘‘అయితే యెందుకలా దిగులుగా ఉంటున్నావ్?’’
‘‘ఏం లేదు బాబూ’’
‘‘చూడు ఇంకా చిన్నదానెవు కాదు. మంచీ చెడు తెలుసుకొని మెసలాలి’’.
పున్నమ్మ చప్పున కళ్ల నీరు తెచ్చుకుంది.
‘‘ఏడవక. నీకు కష్ట పెట్టడం నాకిష్టం లేదు?’’
‘‘అమ్మగానే ఉంటే’’ అంటూ ఇంక బెక్కుతూనే వంటింట్లోకి వెళ్లిపోయింది.
ఈ మాట ఎన్నో అర్థాలు నిస్తుంది. అమ్మగారే ఉంటే ఇలాంటి చూపులతో మీరు నన్ను వేధించేవారా? అమ్మగారే ఉంటే వయసు వచ్చిందని నన్ను ఎవణ్ణో చూసి పెళ్లి చేసే వారుకదా? అమ్మగారే ఉంటే నేనిలా పాడయ్యేదాన్నా? అమ్మగారే ఉంటే… ఇలా యెన్నో ప్రశ్నలూ సమాధానాలతో తోటలో గడ్డిలో కూల బడిపోయాడు. కామంతో చీకటైన హృదయంలో అప్పుడప్పుడూ ఆత్మ వెలుగు పడుతోంది. ఆ వెలుగు కదలగానే మళీల చీకటి. ఆమెకు దగ్గర దగ్గర అవుతున్నాడు. మాటలు కలుపుతున్నాడు. ఆమెను చూసి నవ్వబోతున్నాడు. తాకబోతున్నాడు. ఎల్లప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. అడవిపూవు వాడిపోలేదు. అతని తృష్ణ చల్లారలేదు.
ఒకనాడు రాత్రి చిన్నపిల్ల నిద్దరనించి లేచి యేడుస్తోంది. ఎందుకో చెప్పదు. బహుశః తల్లి జ్ఞప్తకికి వచ్చిందేమో? లేక తల్లి కలలో కనిపించిందేమో? అంతవరకు పున్నమ్మ గురించి ఆలోచిస్తూ నిద్దరపోని కనకరాజు ప్రక్కగది వేపు వెళ్లి తలుపు తట్టాడు. పున్నమ్మ చిన్న పిల్లను భుజంమీద వేసుకొని వోదారుస్తూ తులపు గడియ తీసింది. పిల్లను తీసుకొని ఇటు అటు కదులుతూ ఒక మూల తలదించి నిల్చున్న పున్నమ్మవేపే చూస్తున్నాడు. ఆమె తరగని శృంగారంతో ఒయ్యారంగా ఉంది. యౌవనం సెంటులాగు ఘుమ ఘుమ మంటూ గుభాళిస్తోంది. ఒళ్లంతా కళ్లుచేసుకొని చూస్తుంటే అప్పుడప్పుడూ పై కెగసిన ఆమెకళ్లు బెదర సాగినయ్. పిల్లను ఆమె చేతికి అందివ్వబోయాడు. ఆమె అతనికి తగలకుండా అందుకుంది.
‘‘పిల్లకు భయమేమో దీపం ఉంచి పడుకో’’ అన్నాడు.
మౌనంగా తల వూపింది. కాళ్లు కట్టివేసినా అక్కడ నించి మర్యాదకు కదిలిపోయాడు. తిరిగి వచ్చినా కనకరాజుకు నిద్దరలేదు. వలపు ఒళ్లంతా కుమ్మరిస్తోంది. వయసు వెనుకకు ప్రయాణం చేస్తోంది. ఒకసారి లేచి ప్రక్కగది వేపు వెళ్లాడు. అద్దం తలుపుగుండా తొంగి చూసాడు. పైన తిరుగుతున్న ఫేను గాలిలో పున్నమ్మ ఒళ్లుమరచి నిద్దురపోతోంది. నీటిలో నిద్దరపోతున్న బలసిన బొంతచేపలా ఉంది. తను ఈదినా దానిని పట్టుకోలేడు. అతను గట్టుదాటని సముద్రంలా కట్టుబాటుతో ఉంటే వలపన్నలేడు. చూపులను ఆమె అవయవాలపై అప్పజెప్పి అతను గుటకలు మింగసాగాడు. రానురాను ఉప్పొంగిపోతున్న సముద్రంలో హృదయంనించి రక్తం పొంగసాగింది. ఆ హోరు తను వినలేకపోతున్నాడు. రాని ఆకులా వడవడ వణికిపోతూ తలుపు తట్టాడు. ఆమె చేప. నిద్దర భంగమైంది. చీర సర్దుకొని ప్రక్కకు తిరిగి పడుకుంది. పెద్ద నిట్టూర్చి మళ్లీ తలుపు తట్టాడు.
పున్నమ్మ ఒక్కసారి తలెత్తి చూసింది. ప్రసరిస్తున్న కామదృష్టికి అలాంటి చిరునవ్వే జతచేర్చాడు. ఆమె గాభరాపడింది. ఆమె ‘‘పెదాలు కదిలాయి గానీ ఆ మాటలు అతనికి వినిపించలేదు. లేచి చప్పున దీపం ఆర్పేసింది. ఆమె యేమైందో అతనికి కనపడలేదు. చీకటిలో ఆమెవైపు చూడలేని కళ్లు అవమానంతో తనలోనికి చూసినయ్. ఆమె తనను అవమానించి నందుకు నానా దుర్భాషలు మనసులోనే ఆడుకున్నాడు. ఆ మరుచటి రోజు ఆమె పని పట్టిస్తా ననుకున్నాడు. చెప్పినట్టు వినకపోతే యెలా వచ్చిందో అలానే పంపించాలని నిశ్చయించుకున్నాడు. ఆమెపై పగతీర్చుకొనే ఆలోచనలు అంతం కాకుండానే యెలాగో ఆలస్యంగా మగత నిద్ర కప్పేసింది.
తెలివి వచ్చేసరికి కిటికీగుండా సూర్యరశ్మి పడుతోంది. ప్రక్కకు చూసాడు. టేబిలు మీద బెడ్ కాఫీ లేదు. చప్పున లేచి వంట ఇంటివేపు వెళ్లాడు. అంగటికి రాగానే గేటు తలుపులు తెరిచి ఉన్నాయ్. గబగబా గేటు దగ్గరకి నడిచాడు. అడవిపూనే కాదు మొక్కతో యేదో పసుపు పీక్కొనిపోయింది. మూయని గేటుకు ఆనుకొని రెండోసారి పగిలిన హృదయాన్ని కట్టుకొని నిల్చుండి పోయాడు.
———–