గొల్లపూడి జోగారావు (Gollapudi Jogarao)

Share
పేరు (ఆంగ్లం)Gollapudi Jogarao
పేరు (తెలుగు)గొల్లపూడి జోగారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథలు: అక్కా చెల్లి, ఆత్మబలి, తప్పెవరిది?, పరిచయము, ప్రియురాలి దగ్గిరకి, మిస్ లైలా
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగొల్లపూడి జోగారావు
ప్రియురాలి దగ్గరకి
సంగ్రహ నమూనా రచనకొంతకాలం నుంచీ మధుమోహను నన్ను అతని వద్దకు వోసారి రావలసిందని అదే పనిగా ఆహ్వానిస్తున్నాడు. ఏదో వొక ముఖ్యావసరమైన విషయాన్ని నాతో చర్చించాలని వాడు వుత్తరాల్లో వ్రాస్తున్నారు. మేము చదువుకుంటున్న రోజుల్లో మధునేనూ ఒక్క మనిషిలా మసలేం. మామధ్య రహస్యాలు లేవు. చిన్ననాటనుండీ మేం స్నేహితులం. మా వుద్యోగధర్మాన్ని బట్టి యిపుడు మేం వొకరినొకరి విడచివుండవల్సివచ్చింది. ఈమధ్య వాడు వ్రాసిన వుత్తరం మరీ వొత్తిడిగా వుండటమే కాకుండా నేను చెప్పే ఓమాపణలను వాడు మరి వినేటట్టుకూడ కనిపించలేదు. తుదకు యెలాగనైతేనేమి నేనువస్తున్నానని వాడికి ముందుగా వుత్తరము వ్రాసి నేను బయలుదేరాను.

గొల్లపూడి జోగారావు
ప్రియురాలి దగ్గరకి

కొంతకాలం నుంచీ మధుమోహను నన్ను అతని వద్దకు వోసారి రావలసిందని అదే పనిగా ఆహ్వానిస్తున్నాడు. ఏదో వొక ముఖ్యావసరమైన విషయాన్ని నాతో చర్చించాలని వాడు వుత్తరాల్లో వ్రాస్తున్నారు. మేము చదువుకుంటున్న రోజుల్లో మధునేనూ ఒక్క మనిషిలా మసలేం. మామధ్య రహస్యాలు లేవు. చిన్ననాటనుండీ మేం స్నేహితులం. మా వుద్యోగధర్మాన్ని బట్టి యిపుడు మేం వొకరినొకరి విడచివుండవల్సివచ్చింది. ఈమధ్య వాడు వ్రాసిన వుత్తరం మరీ వొత్తిడిగా వుండటమే కాకుండా నేను చెప్పే ఓమాపణలను వాడు మరి వినేటట్టుకూడ కనిపించలేదు. తుదకు యెలాగనైతేనేమి నేనువస్తున్నానని వాడికి ముందుగా వుత్తరము వ్రాసి నేను బయలుదేరాను.
చాలకాలము గడిచిపోయినతర్వాత యిపుడు మేం వొకరినొకరు కలుసుకోవటంచేత యిద్దరమూ యెంతో ఆంనందించాం. ఇపుడు వాడిని చూడ్డానికి నేను మరీ అభిలషించాను. కారణం – పూర్వముకన్న వాడితో యిపుడు మార్పు కన్పించింది. నిండు యవ్వనంలో మధుముఖంలో యేదో ఆకర్షణ అగుపించింది.
ఇద్దరమూ చెరివొక పేముకుర్చీలోను ఆశీనులమైనాక మధు చిరునవ్వు పెదవులపై దోపగా కను రెప్పలాడిస్తూ నాతో చర్చించాలన్న విషయాన్ని ప్రారంభించడానికి తయారయ్యేడు.
‘నీవొక్కడవే నా కొరకై యీపనిని చేయగలవాడవి’. అన్నాడు నిర్ధారణగా, ‘అంతే కాకుండా నీవు చెప్పిన తీర్పుపై నేను ఆధారపడతాను. నీకు జ్ఞాపకమే – ఎప్పుడూ నా పెడదారులను నీవే అరికట్టేవాడివి, సరిపెట్టేవాడివి. నిన్నుగా మంచిని కోరే సలహాదారునిగా నేను యెంచుకుంటాను.’
వాడల్లా అనడం మేమిద్దరం కలిసి గడపిన పూర్వపుదినాలు స్మరణకువచ్చాయి. వాడికి సలహాయిస్తూవుండేవాడినన్న సంగతి తలచుకొని నేను నాలో నవ్వుకున్నాను. చిన్నప్పటినుంచీ నేను చాలా తెలివిగా నడచుకునేవాడ్ని. నేను యిచ్చిన సలహాబట్టి వాడు యెలా నడుచుకున్నా అవసరమున్నా లేకపోయినా నేను నా పనిని చేయక మానలేదు. ఆసంగతి మథు యీనాటికి మరచిపోలేదు. నేను నవ్వుకున్నాను.
‘సంగతి యేమిటంటే – నేనంటే ఆమెకు యెంతో మక్కువఅవటంచేత నీతో చెప్పినట్లు నా శరీరం నా స్వాధీనంలో లేకపోతోంది’.
‘అదాసంగతి’ నేను కొంచెం బోధపరచుకున్నవాడిలా అన్నాను ‘ఎవరా అమ్మాయి?’
‘నేను యిప్పటివరకు చూచినవారందరిలోను ఆరాధించవలసిన దేవతామూర్తి. అందుకనే నీ సలహా.’
‘ఆ అమ్మాయి యేమిటి అంటుంది’ నేను అడిగాను.
‘అదీ యిపుడు కావలసినది.’
‘అమ్మాయిలు సాధారణంగా అట్టె యేమి చెప్పరని నీకు తెలుసుగా. ఎంతసేపూ మిలమిలలాడే కళ్ళతో చూస్తారు. వాటిల్లో వుండేభావం యెవడికి అర్థం అవుతుంది?’
‘ఆ చూపుల్లో యేదో భావముండితీరాలి. ఆ విషయం నిర్థారణకు రావచ్చు. ఆమె ప్రేమను నీవు అర్థించడానికి తగిన అవకాశం వుంది.’
‘ప్రేమను అర్థించడం మాట వద్దు బాబూఔ అది నీవు వూమించేటంత సులభసాధ్యమైనది కాదేమో? అమ్మాయిల తల్లిదండ్రులే ముఖ్యంగా వారికి శత్రువులు. దేనికన్నా వారిని యెప్పుడూ కనిపెడుతూనే వుంటారు.’
‘దుర్మార్గుల ఆటలు సాగనివ్వకుండా కనిపెడుతూంటారు’ అన్నా నేను.
‘అది సరేకాని తెలివితేటలు కలిగి స్వబుద్ధిమీద ఆధారపడేవారిమాట నేననేది. కాని యిళ్లలో యేమూల కొట్టులోనో బంధింపబడిన వారిమాట కాదు… ఇపుడు నేను ఆ విషయాన్ని కాదు చర్చించేది. నీవు ఆ అమ్మాయిని చూచి నాకు సరి అవునా అని చెప్పమని నేను కోరేది. నా కళ్లని నేను నమ్మలేకుండా వున్నాను… ఆమె అంత ఆకర్షణీయంగా వుంది.
నేను నవ్వకుండా వుండలేక పోయాను. వాడు నిజంగా సుషుప్తావస్థలో వున్నట్టేవున్నాడు. ఈ సందర్భంలో నేను వాడికి చెయ్యగల సమాయం యేమిటో నాకు బోధపడలేదు.
‘ఆ అమ్మాయి నాకు తగిన పిల్ల అని తెలిస్తే అంతా సరిగానే వుండును. నాకు యీ ఆందోళన లేకపోదు. నా అంతట నేను నిర్ణయించడానికి నేను ఆమెచే ముగ్ధుణ్ణి చేయబడ్డాను. నీవు నాకు సహాయం చెయ్యాలి. ఇప్పట్లో నాకు కలిగిన నరాల ఉద్రేకం నా వివాహానికి కారణం అవటానికి నేను సమ్మతింపను… తర్వాత నేను విచారింపవలసి వస్తుంది… నీకు అర్థం అయిందికాదూ?
‘అవును. ఎంత దూరపుచూపు – పరిజ్ఞానం ప్రేమికులు మధ్యలోఆగి యీ విధంగా విచారణ చేయడం యెవరూ అనుకోనిది.’
‘వివాహం అంతటి ముఖ్యమైనది అంటావా లేదా?’
అది అంతటి ముఖ్యమైనది అని వాడికి తెలిస్తే సరే. కాని యీ విషయంలో నేను చేయబోయేదేముంది?
‘రేపే మన ప్రయాణం. ఆమెయింటికి వెళదాం… ఆ అమ్మాయిని.. ఆమె తాలూకు వారిని చూచి నా అభిప్రాయానికి రా.’
‘వూరికనే చూడగానే’ నేను అనుమానంగా అన్నాను. ‘మనుష్యుల నడవడిని పరిశీలించినకాని నేను ఒక అభిప్రాయానికి రాలేను.’
‘వారు నాకు క్రొత్తవారుగానే నా నమ్మకం. ఆ అమ్మాయి కూడ నీకు కొత్తకాకపోవచ్చు. నీకు అంతా సులబసాధ్యమే. ఆ అమ్మాయి నాకు యెంతవరకు తగునో అన్న విషయం నిర్థారణకు నీవు త్వరలోనే రాగలవని నా అభిప్రాయం. నేను నీవు చెప్పే సలహాపై ఆధారపడతాను. కారణం నా స్వభావం, యిష్టాయిష్టాలు నీకు యే యితర్లకన్నా బాగా తెలుసు. నేను సంతుష్టిపడాలి. నేను ఆమెను వివాహం చేసుకుంటాను. ఒకరిని ప్రేమించడం అనే అవస్థలో పడటంకంటేనా ఎప్పుడేనా నీవు అలాంటి అవస్థలో పడివున్నావా?’
వాడు చివర్ని వేసిన ప్రశ్నతో పూర్వపు రోజులు స్మరణకు వచ్చాయి. ఒకప్పుడు నేను యిలాగేవొక అమ్మాయిని చూచి ముగ్ధుణ్ణి అయాను. ఇపుడు ఆ అమ్మాయిని నా హృదయంలోంచి త్రోసిపుచ్చాను. కాని యీ సందర్భంలో ఆమె ఆకర్షణీయమైన రూపసౌందర్యంతో నా మనోవీదిలో ప్రత్యక్షమయింది. తర్వాత మధు మరునాడు మా ప్రయాణం గురించి యేమిచెప్పినా దానికి నేను ‘సరే’ అన్నాను.
నాలో వొకమార్పు కలిగింది. మాటల్లోను భావనల్లోను నేను వొక్కడిలా చరించలేదు. నేను ప్రేమించిన ఆ అమ్మాయి తిరిగి నాదగ్గరకు వచ్చి ఆ తర్వాత నన్ను విడిచిపోలేదు.
ఆరోజుల్లో ఆమె నాకు యెంత అమృతతుల్యంగా వుండేది. ఆ రోజుల్ని యెప్పటికీ మరిచిపోననుకున్నాను. కాని ఆ అమ్మాయిని – చిరునవ్వులతోను సిగ్గు దొంతరతోను నిండివుండే ఆ ముఖాన్ని మరచిపోవటం యెవరికన్నా సాధ్యమా? ఆమె నా స్వప్నం నా ఆవ నా సర్వమూగాలిలో వూగాడే వో పువ్వునీడ. ఆమెకొరకే నేను జీవిస్తున్నానంటే యెంతో సంతోషించేది. నేను చేసే యే కార్యానికైనా ఆమె నాలో వుత్సాహాన్ని కలిగించేది. నాలో కోరికల్ని రేపేది అంటే ఆమె ఆనందానిన వెలిబుచ్చేది. నా గృహానికి వెలుగునిచ్చే దివ్యజ్యోతి ఆమెయే అంటే ఆమె నవ్వేది. కవితాధోరణిలో మాట్లాడుతున్నారనేది. నేను వుత్సాహంతో ఆమెతో ‘నిన్ను నా భార్యగా స్వీకరిస్తా’నంటే ఆమె త్రుళ్ళిపడింది. నేనన్న మాటలను నేను తీవ్రంగా ఆలోచించకుండా ‘అలాకాదు’ అంది. నేను ఆమెను చూచేను. నా ముఖం తెల్లబోవటంకన్న జేవురించుకొనివుంది. ఆమె చూపులు నా ప్రార్థనను మరల వొకసారి నిర్వచించమని అన్నట్టు నాకు తోచాయి. కాని ప్రేమ వుండనీ లేకపోనీ నేను తిరిగి ఆమెకు లొంగినట్లు కనబడకూడదు. నా స్థితి నాకు తెలుసు. ఆమె స్థితీనాకు తెలుసు. ‘సరే అని నేను అని ఆమెను వదలిపెట్టాను. మరి ఆమెవద్దకు పోగూడదని, ఆమెను మరచిపోవాలని నేను నిశ్చయించుకున్నాను. బ్రహ్మచారిగా జీవితాన్ని సాగించి చాలించడం యేమంత సహింపరానిదికాదు. ఆ ఆత్మ నిశ్చయంతోటే నేను రోజులు వెళ్లబుచ్చుతున్నాను. టరిగానే. కాని నాపనిలో నిమగ్నుడవుతాను నన్ను నేను మరచిపోతూంటాను.
లీలావతిని అల్లా వదలిపెట్టవలసిన అవసరానికి కారణమయిన నాలోని గర్వానికి నేను యెప్పుడూ విచారింపలేదు. కాని యిపుడు నా స్నేహితుని మందిరంలో పడుక్కుని ఆ రాత్రి వేళలో లీలరూపాన్ని చూస్తూ ఆమె రూపకళకు పట్టువడి ఆమెచే మంత్ర ముగ్ధుడనైన ఆరోజులు తలచుకొని ఆమెదగ్గరకు మరల పోయి నా ప్రార్థనను వెలిబుచ్చి ఆమెను యింతకాలం దూరంచేసిన నాగర్వానికి నివారణకు క్షమాపణ వేడుకోమని వొక ఆపరాని తమకంనాలో బయలుదేరింది. ఆమెకు క్షమాపణ చెప్పటం నేను ఘనకార్యంగా భావించాను. కారణం యేమంటే ప్రేమను పొందాలి అంటే యెంత వ్యయమేనా చేయాలి. యెంత త్యగామేనా చేయాలి… ట్టి ఆలోచనలతో నేను యెప్పుడో నిద్రపోయాను.
మరునాడు నేను నా స్నేహితునితో అతని ప్రియురాలి యింటికి బయలుదేరినపుడు వాడి భావనలతో నేను యేకీభించాను. ప్రేమించేవారిని చూచి నేను యెన్నడూ అట్టి జాలిని గపరచలేదు.
మేం దీర్ఘమైన బస్సుప్రయాణం చేసాం కుమ్ముకుపోయి వచ్చేపోయే ప్రయాణీకులకు జాగా చేస్తూండడం ధూళికి గ్యాసుయింజను చేసే ధ్వనికి అయిష్టత చూపుతూండడం పొగత్రాగేవారికి అగ్గిపెటెట అందించే బాధ్యత మామీద పడడం పోలీసుస్టేషను ప్రాంతాల్లో దిగి ముందుకుపోయి తిరిగి యెక్కవలసిన అవస్థ యీలాంటి విషయాలు మాకు అనుభవమయాయి.
‘డ్రయివరు’ నా స్నేహితుడు పిలిచాడు. ‘ఇక్కడ మేము దిగిపోతాం.’
‘ఎక్కడ?’ బస్సు ఆగుతూంటే నేను అన్నాను.
‘అదిగో ఆ యిల్లే’ అని లీలావతి యిల్లు చూపుతూ నా స్నేహితుడు అన్నాడు – ‘ఆ యింటిలోనే ఆ అమ్మాయి వుంది.
అనుకోనిది సంఘటిల్లిన యీస్థతినేను చాల బాధపడ్డాను. ప్రపంచంలో వుండే జనంలో లీలావతిని వొకరికి సరియగు చేటిగా నిర్ణయించడానికి నేనే రావడం యెంత విపరీతం.
నామనసు యెప్పుడూ అలా సుడిగుండంలా లేదు. నా భావనలు కప్పిపుచ్చడానికని నాముఖాన్ని నేను తిప్పుకున్నాను.
‘బస్సులో యేదేనా మరచిపోయేవా?’ అని నా ఆందోళనను చూచి నా స్నేహితుడు అడిగాడు. వెళ్ళిపోతూన్న బస్సువైపు నేను చూచేను. ధూళిచెలరేగి రోడ్డుమీదికి వ్యాపించింది. నేనేమి చెయ్యాలి. అదే అప్పట్లో ఆలోచించాను.
‘ఏమి మరవలేదు’ అన్నాను జవాబు కుండా వుండడం యిష్టంలేక. ‘మనము యేమి మరచిపోలేదు. సంగతి యేమిటంటే నేను నీతో రావటం అవుసరం లేదేమో అని లోచిస్తున్నాను యేమంటే ఆయింటివారిని నాకు తెలుసు. ఆ అమ్మాయినీ తెలుసు.’
మధు నాముఖంలోకి చూచేడు. ఆ చూపు నేను నిర్వచించలేను.
‘అయితే వారిని నీవు యిష్టపడవా? – ఆ అమ్మాయిని’. ఆ ప్రశ్నతో నా హృదయం వుపొపంగింది. నేను వాడితో అలా చెపితే యేమిపోయింది. ఈ అవకాశాన్ని దొరకబుచ్చుకుని వాడిని మార్గం నుండి తప్పించవచ్చు. ఈ ఆలోచన నాలో జోరుగానే వుంది. ఆతృతతోను కాతుకంతోను వున్న మధుముఖాన్ని నేను చూచేను, వాడు నాకు యెప్పుడూ ప్రాణస్నేహితుడు. వాడిని నేను మోసం చెయ్యలేను. ఈ విషయాలు నామనసులో జొరబడి నేను వొక నిశ్చయానికి వచ్చేను. నేను నా ప్రేమను నా స్నేహితునికై త్యాగం చేయడానికే పూనుకున్నాను.
‘నీవు యింతకన్న అదృష్టవంతుడవు కాలేవు’ నేను అన్నాను. ‘ఇంతకంటె నీవు మంచి యెన్నికకు రాలేవు. లీలావతి అంత చక్కని అమ్మాయి’.
‘అయితే మంచిదే అంటావు?’ మధు అడిగాడు ‘ఆమె ఆరాధించ తగినదికాదూ?’
‘అవును. ఆరాధించతగినదే’. నేను నిట్టూర్పు విడిచాను. మధు నేను యేకాభిప్రాయానికి మరే విషయంలోను వచ్చివుండలేదేమో?
మధు నన్ను తీసుకుపోయాడు. నేను అడ్డు చెప్పలేదు. నేనుకూడ ఆమెను చూడాలన్న కుతూహలంతోనే వున్నాను. ఆ సందర్భంలో నేను నా వెనుకటి గర్వాన్ని ఆసరాతీసుకున్నాను. ఆ అమ్మాయి విషయంలో నేను నా నిరాపేక్ష పూర్వంలాగే నిలుపుకోగలను. నేను మధుకి స్నేహితునిగా యిపుడు ఆ యింటికి పోతున్నాను.
నిశ్శబ్దమైన పరిసరంలో పరిశుభ్రంగా వున్న చిన్న యిల్లు అది. లీలావతి తండ్రి పొట్టిగా వుత్సాహంగా వుంటాడు. బట్టతల – అతిధుల్ని ఆదరించడంలో అందెవేసిన చేయి, ఆమెతల్లి చక్కనిది. బాగా మాట్లాడకలదు. గృహనిర్వాహకత్వము ఆమె పని. లీలావతి… లీలావతే. ఆమెను చూడ్డంతోనే నా హృదయం వుప్పొంగింది. ఎప్పుడూ ఆమె అంత అందంగా కనబడలేదు. నాస్నేహితునిపై నాకు అసూయ జనించింది.
లీలావతి తండ్రి మనల్ని పలకరించి యోగక్షేమాలరసేడు. అతడు చేసిన యీ పనుల్లో కొంచెం అల్లునికంటె నాకు హెచ్చు మర్యాద చూపటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘నేను యెంత అదృష్టవంతుడ్ని‘ అని అతడు అన్నాడు. అతని సంతోషాన్ని కప్పిపుచ్చడానికి అతడు యేమి ప్రయత్నం చేయలేదు.
‘నేను పొందుతూన్న యీ నందానికి కారకులు మీ అంతట మీరేనా లేక మధుబాబా‘ అని అతడు అన్నాడు.
‘అతడే ముఖ్యంగా అతనికే జెందుతుంది’ అని మధు అన్నాడు.
‘నేను మరల యిక్కడకు రాగలగడానికి నేను యెంతో ఆనందిస్తున్నాను’ అని నేను అతనితో అనకతప్పినదికాదు.
అప్పట్లోనే లీలావతి ఆ దగ్గరలోవుండే తలుపు చాటుననుండి నా కంటికి అగుపడింది.
నేను అనుకున్నాను ‘నాకు యెంత చిన్నతనం’.
‘మధును ముందుకు త్రోయడానికని నేను ప్రయత్నించాను. కాని తోటలోకిపోయి వో నీడ ప్రదేశంలో సిగరెట్టు త్రాగుతూ వాడు వుండిపోయాడు. ఆగృహస్థు అతన్ని వదలి పెట్టివేసాడు.
మధుకంటె నాకు హెచ్చు గౌరవం జరుగుతూండడం నేను అన్ని విషయాల్లోను కనపెట్టాను, మా భోజనమప్పుడు కూడ నేను క్షమించమన్నట్టుగా నా స్నేహితునికేసి చూచేను. వాడు నిశ్చలంగా బోజనం చేస్తూన్నాడు. జరిగిన సంభాషణలో ముఖ్యంగా నాగురించే వాడు జొరకొనలేదు. నేను అనుకున్నాను. ‘మధు అప్పుడే ఆకుటుంబంలోని మనిషిలా పరిగణింప బడుతునానడేమో’ అని. బోజనం అయిన తర్వాత నేను నిద్రపోయాను. బలువైన భోజనం చేతనో లేక చల్లగావుండే ఆనది వాతావరణంచేతనో, గతరాత్రి నిరదలేకపోవటం మూలాన్నో నేను చాల సేపు నిద్రించాను. నేను నిద్రలేచేసరికి నాలుగు అయింది. అయినా నేను అలాగే పడుకున్నాను. లీలావతీ యింటిలోనే ఆ గడిలో ఆమెకు వరుణ్ణి కుదిర్చే పనిమీద అక్కడ పడుక్కొని వుండడం యెంత అపఖ్యాతీ అనే ఆలోచన్లో –
తలుపుపై మెల్లగా తట్టిన చప్పుడు అయింది.
‘రావచ్చు…’ నేను అన్నాను.
‘లీలావతి ‘ట్రే’లో నాకు ‘టీ’ తీసుకొచిచ గదిలో ప్రవేశించింది.
‘నేను చాలసేపు నిద్రించానా?’ అని అడిగాను లేచి కూర్చుంటూ.
‘కొంచెంగా’ ఆ అమ్మాయి బిడియపడుతూ అంది నా ముకంకేసి చూడకుండా. ఆ అమ్మాయి నన్ను చూచివుంటే నేను నా బిడియాన్ని నిజంగా దాచివుండలేకపోదును.
‘వారందరూ మూడుగంటలకే టీ త్రాగేరు’ అంది, ఆమె ట్రే అక్కడ వున్న మేజాబల్లమీద పెడుతూ.
‘ఎక్కడవున్నారు వారు’ ను అడిగాను ఆ చుట్టుప్రక్కల వారువున్నచడి లేకపోడాన్ని బట్టి’ ‘నీతండ్రి… మధు బాబున్ను.’
‘పండ్లదుకాణానికి పోయారిప్పుడే’ అంది. మధుపేరు నేను చెప్పినపుడు ఆమె సిగ్గుపడలేదు. అప్పుడే అంత పరిచయమా? నేను పోయాను.
‘మా అమ్మ యీ సాయింరతానికి కొన్ని పండ్లుకావాలి అంది. మీరు వుంటారు కాదూ…’ ఆమె నా వైపు చూచింది.
‘ఆఁ….’ నేను తడబడుతూ అన్నాను. ‘నా స్నేహితునికి యేమి యిష్టమో నాకు తెలీదు’.
ఆమె చూపుల్లో యేదో నన్ను మాట్లాడవద్దని చెప్పింది. మధు వుంటాడని ఆమెకు తెలుసుల్లే వుంది.
ఆమె టీ కలిపింది. అంతసేపూ నేను ఆమెను చూస్తూనే వున్నాను. ‘ట్రే’లో యింకో కప్పుతో టీ వుండటం చూచి మెను నాతో టీ త్రాగమని నేను ధైర్యం చేసి అడిగాను. ఆమె వప్పుకున్నందుకు నేను సంతోషించాను.
‘ఎంతకాలం నుంచీ యీ సుదినంకోసం వేచి వున్నాను’ ఆమె వడకుతూన్న కంఠస్వరంతో అంది. ‘నన్ను మీరు పూర్తిగా నిరాకరించేరనే నేను అనుకున్నాను.’
అర్థంగాక నేను ఆమె ముఖంలోకి చూచేను. నేను యెట్టి స్థితిలో వున్నాను. ఆమె యెంతో నందంగా వున్నట్టు అగుపించింది. ఆమెకోరకైనా అనురాగం పొంగి పొరలింది. కాని నేను మర్యాదగా ప్రవర్తించాలి?
‘మధుమోహను…’ నేను యేదో అనబోయి ఆగిపోయాను.
‘మరి వొకరి ప్రోద్భలానికి దీనిని అంగటలపబోకండి. పనికిమాలిన గర్వాన్ని పోషించినందుకు గాను మనిద్దరం తగిన శాస్తిని అనుభవించాం. మా నాన్న చెప్పారు. మీ అంతట మీరే వచ్చేరని, అంతకంటె నా హృదయానికి యేమిటి కావాలి. నేను పొందినబాధ మీరు గ్రహించగలుగుతే –
‘లీలావతీ నేను అన్నాను నా స్నేహితునికి ద్రోహం చేస్తున్నానేమో అని. ఆమెమాత్రం ద్రోహం చేస్తూండడం లేదూ?
‘ఇంక యెంతకాలం నేను వేచివుండడం. నాకు యిపుడు ఇరవైవొకటి – ఇరవైవొకటి దాటేయి’ లీలావతి కనుల నీరునించుతూ అంది.
ఆమెకు అప్పట్లో పదునెనిమిది. నేను నిట్టూర్పు విడచేను. ‘ట్రే’ పట్టుకొని ఆమె మెల్లగా వెళ్ళిపోయింది. లీలావతియెడగల స్నేహభావానికి మధ్యపడి అలా కూర్చుండిపోయాను.
ఆ సాయంత్రం మధుని నేను దూరంగా పిలుచుకుపోయాను.
‘లీలావతిని నేను వొకప్పుడు చాల ప్రేమించేవాడననీ ఆమెనన్ను ప్రేమించిందనీ నీకు తెలిసి వుండవలసింది.’
‘మరి యిప్పుడు’ అన్నాడు వాడు. ‘నివురు గప్పిన నిప్పురాజుకుంది.’
‘నేను చాల విచారిస్తూన్నాను’ అన్నాను నేను.
‘నాకు చాల ఆనందంగా వుంది. నాకు యిదంతా తెలుసు నీ చరిత్ర అంతా. మీరిద్దరూ తిరిగి కలుసుకోవాలని నేను యీ ప్రయత్నంచేసాను. గర్వం వైషమ్యం పనులకు సహాయకారికావు.’
‘నేను చాలకాలం క్రిందటనే అనుకున్నాను. నీవు యెంత విచిత్రమైన స్నేహితుడివి.’
మధు నాకు వొక సిగరెట్టు అందించాడు. ఒక క్షణం పోయిన తర్వాత నేను అడిగాను.
‘నిన్ను యీపనికై ఎవరూ నియమించలేదు కదా?’
‘ఎంత అవమర్యాదగా మాట్లాడుతున్నావు’ అన్నాడు.
నేను వాడిని నమ్మేను. అప్పుడే లీల మమ్మలిన కలుసుకోడానికి వస్తూంది. ఆమె రావడం నేను చూస్తూన్నాను. లీల నా దగ్గరకు వచ్చేసరికి మధు యెక్కడా అగుపించలేదు.

———–

You may also like...