పేరు (ఆంగ్లం) | Benguluru Nagaratnamma |
పేరు (తెలుగు) | బెంగుళూరు నాగరత్నమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | పుట్టలక్ష్మమ్మ |
తండ్రి పేరు | సుబ్బారావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/3/1878 |
మరణం | 5/19/1952 |
పుట్టిన ఊరు | మైసూరు దగ్గరలోని నంజనగూడు |
విద్యార్హతలు | గిరిభట్ట తమ్మయ్య అను గురువు వద్ద సంస్కృతము, వివిధ కళలు నేర్చుకున్నారు |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | కన్నడము, తెలుగు, తమిళము, ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం), మద్యపానం (తెలుగు సంభాషణం), దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), పంచీకరణ భౌతిక వివేక విలక్కం(తమిళం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | విద్యాసుందరి, గానకళాప్రవీణ, త్యాగసేవాసక్త |
ఇతర వివరాలు | కర్ణాటక సంగీతములో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త బాణీని సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. సాహిత్యమును చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. మాతృభాష కన్నడము లోని దేవరనామములు ఆసక్తిగా పాడేది. అమె గళములో స్త్రీ కంఠములోని మాధుర్యముతో పాటు పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమై వినసొంపుగా ఉండేది. సంగీత శాస్త్రాధ్యయనముతో బాటు నాట్య, అభినయ శాస్త్రములలో ఆమెకు పరిచయము ఉన్నందువలన ఆమె సంగీతము భావభరితము . ఆమె కచ్చేరులలో స్వరకల్పన కన్న రాగాలాపనకు ప్రాముఖ్యత అధికము. యదుకుల కాంభోజి రాగము పాడని కచ్చేరీలు అరుదు. 1892 వవరాత్రుల సమయములో మైసూరు మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో నాగరత్నమ్మ చేసిన నాట్యము పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, కంఠములోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ నమస్కారము చేసింది. అనతికాలములోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదురుకున్నది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి. తల్లి ప్రతిన నెరవేర్చింది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బెంగుళూరు నాగరత్నమ్మ ‘‘త్యాగ సేవాసక్త’’ విద్యాసుందరి గానకళా విశారద |
సంగ్రహ నమూనా రచన | గత శతాబ్ద మధ్యమున మైసూరు సంస్థానమున ‘‘సుబ్బన్న’’యని యొక సంపన్న గృహస్థుడుండెను. ఆయనకు భోగినీకుల సంజాతయందు శ్రీమతి పుట్ట లక్ష్మమ్మగారు జన్మించిరి. ఆ యుతి ఉచిత వయస్సున తమ కులాచారానుసారము శ్రీ యం. సుబ్బారావుగారను యొక వైశికుని ప్రేయసియాయెను. ఆయన మైసూరునందు సుప్రసిద్ధ న్యాయవాది; బ్రాహ్మణుడు. వారికి ఆ చిర కాలముననే యొక ఆడుబిడ్డకల్గినది. ఆమెకా తల్లి ‘నాగరత్నము’ అని పేరు పెట్టెను. |
బెంగుళూరు నాగరత్నమ్మ
‘‘త్యాగ సేవాసక్త’’
విద్యాసుందరి గానకళా విశారద
గత శతాబ్ద మధ్యమున మైసూరు సంస్థానమున ‘‘సుబ్బన్న’’యని యొక సంపన్న గృహస్థుడుండెను. ఆయనకు భోగినీకుల సంజాతయందు శ్రీమతి పుట్ట లక్ష్మమ్మగారు జన్మించిరి. ఆ యుతి ఉచిత వయస్సున తమ కులాచారానుసారము శ్రీ యం. సుబ్బారావుగారను యొక వైశికుని ప్రేయసియాయెను. ఆయన మైసూరునందు సుప్రసిద్ధ న్యాయవాది; బ్రాహ్మణుడు. వారికి ఆ చిర కాలముననే యొక ఆడుబిడ్డకల్గినది. ఆమెకా తల్లి ‘నాగరత్నము’ అని పేరు పెట్టెను.
ఈమె జననకాలమును జాతక చ్రకమును ఈ క్రిందనిచ్చుచున్నాము. జ్యోతిషశాస్త్ర ప్రవేశముకల వారరయుదురుగాక.
నాగకన్యలు సంగీతక విద్యానిపుణులు, రత్నము ప్రకాశ యానము, కావున శ్రీమతి పుట్ట లక్ష్మమ్మ గారు తన తొలిచూపు శిశువున కాపేరు పెట్టుకొనుటలో ఆమె భవిష్యత్ ను గూర్చి ఎట్టి మధురస్వప్నములుగాంచినదో మాతృహృదయము క్షీరసాగర తుల్యము. అందమృతము, లక్ష్మీ, కల్పవృక్షము, కామధేనువు, చంరదుడు, అప్సరసలు ఇత్యాదులుద్భవమగును.
శ్రీమతి పుట్ట లక్ష్మమ్మ గారిది ఉదాత్తమైన ప్రకృతి. ప్రాచీన కులధర్మాదులందు ఆమెకు నైజముగనే ఆసక్తిమెండు. సకలశాస్త్రకళాసారంగతులైన విద్యావంతులై, ఏకచారిణీ వ్రతపరాయణలై, ఉన్నతపథమున జీవితమునడుపుట తమకులధర్మమని ఆమెకు సహజముగనే తోచినది. కాని నాటి లోకవాడుకననుసరించి ఆమె ధనసంపాదనాసాధన మొనర్చుటలేదని ఆమెను పెంచి పెద్ద చేసినవారికి కంటకమైనది. వారామెకు శ్రీ సుబ్బారావుగారి ఆశ్రయమును తప్పించిరి. కాని ఆమె కొరకరాని కొయ్యముక్కఆయెను. ఆ పోషకులుకోపించి పిల్లను తల్లిని నిలువుదోపుగావించి చింకపేలికలతో వీధిలోనికి నడిపించిరి.
నిండు జవ్వనమున నిరుపేదయైయున్న పుట్ట లక్ష్మమ్మగారు అప్పుడేమి చేయదగును? అవ్యక్త మధురముగా తన చేతులలో కిలకిల నవ్వుచున్న బిడ్డ ముఖారవిందము చూచినది. ఆమెకేమితోచెనో? తన్ను మరచినది; తన శిశువును ఉత్తమ విద్యావంతురాలి నొనర్చి, తనకు పట్టిన కర్మము పట్టకుండ సర్వతంత్ర స్వతంరతగా, పిదప జీవితము నడుపగల ధీరస్వాంత నొనర్పవలయునని ఆ మాతృదేవత నిజహృదయమున దృఢసంకల్పమొనర్చుకొన్నది. అందుకనుగుణ్యముగా మైసూరు వాసులగు సంగీత సాహిత్య కవితా విశారద ఆస్థాన విద్వాణ్ గిరిభట్ట తమ్మయ్య శాస్త్రీగారి నాశ్రయించినది. ఆయన నామె అరగహారములుగాని, ఖండ్రికలుగాని, ధనరాసులుగాని కోరలేదు. తన శిశువునకు విద్యాదాన మొనర్పుమని ప్రార్థించినది. ఆ శాస్త్రిగారు కడుదయార్ధ్ర హృదయులు. ఆ మాతృ హృదయావేదనమును గ్రహించినారు. ఆయన బహుకుటుంబి. శ్రీమతి పుట్ట లక్ష్మమ్మతో ‘నీకు సంచులు క్రుమ్మరింపజాలనుగాని యధోచితముగ అన్న వస్త్రములకు గడుపుచు, నీ బిడ్డను మాత్రము శాయశక్తుల విద్యావతి నొనర్తు’నని వాగ్దత్త మొనర్చినారు.
శ్రీమతి నాగరత్నముగారు శిశువుగా జిలిబిలి పలుకులు పలుకనేర్చినవెంటనే శాస్త్రిగారామెకు విద్యాభ్యాసమొనర్చిరి. ఆమెకు 9 సం.ల వయస్సు వచ్చునాటికి త్రికాండముల అమరము నోటికివచ్చినది. ఇతర సాహిత్యములందు ప్రవేశము కల్గినది. మాతృభాషయగు కన్నడము, సంగీతభాష తెలుగు, రాజభాష ఆంగ్లము ఇన్నిట ప్రవేశము కల్గినది. శ్రీ శాస్త్రిగారివల్లను వారి శిష్యులగు బిడారం కృష్ణప్పగారివల్లను సంగీతశాస్త్రమున, సర్వములు, ‘అ’కార ‘ఉ’కార సాధనము అలవడినవి.
అయితే సరస్వతీదేవి శ్రీమతి పుట్ట లక్షమ్మ సంకల్పబలమెట్టిదో పరీక్షింపదలచెను కాబోలు. శ్రీ సుబ్బారావుగారి ఆశ్రయము విడిచిన శ్రీమతి పుట్ట లక్ష్మమ్మకు శాస్త్రిగారి పంచన తలదాచుకొన నవకాశమొదపుటయు, ఆమెశిశువు చంద్రరేఖవలె దినదిన కళాభివృద్ధినందుచుండుటయు చూడగా కులము వారికి కన్నుకుట్టినది. లేనిపోని తంపులు పెట్టి వెన్నవంటి తమ్మయ్యశాస్త్రగారి మనస్సును పాషాణమొనర్చిరి. శ్రీ శాస్త్రిగారు అరగహాతిరేకమున ‘‘నీ బిడ్డ మైసూరున పేడకడులెత్తును పో’’ అని శఠించిపల్కుచు అమాతాశిశువులను వీధిలోనికంపిరి. శ్రీమతి పుట్ట లక్ష్మమ్మ తాము తిరిగీ నారాధారులైనందుల కంతగా నగవలేదు. నైజముగా మృదుభాషణులగు శ్రీ శాస్త్రిగారి దూషణవాక్యములకు ఆమెకు ఎక్కడలేని రోషము వచ్చినది.
‘‘మాతృత్వమును వివరింపజాలము, ఆ మాతృత్వముతో నీవు తర్కింపజాలవు. అదియే మాతృమూర్తకి ఉత్కృష్టత కలుగజేయునది. ఆమె తర్కమునకందదు. అప్పుడు తల్లి ఇంకేమాత్రము స్త్రీగాదు. ఆమె ఆడుపులి; ఆమె బిడ్డలు పులి పిల్లలు. కావున మాతృత్వమున, తర్కవితర్కముల కతీతమై, ఏకకాలమునందే నూయనమును, ఆధిక్యమునైన విబూతియొక్కటి అంతర్భూతమైయున్నది. తల్లికి అమోఘమైన సహజజ్ఞాన మొకటియుండును. అపారమును అవాజ్మావసగోచరమునగు ఈశ్వరేచ్ఛ ఆమెయందే అంతర్వాహినియైయుండి ఆమెకు దారిచూపును. దైవకటాక్షమున వెల్గుగాంచుచున్న అంధత్వమది… ఒక సుస్థిర సంకల్పము వెర్రిగానైన పరిణమించును లేదా విరోత్సాహముగనైన పరిణమించును.’’
ఇట్టి ఉత్తమవాక్యములతో మాతృత్వ విశేషమును పరానుకవీంద్రుడు విక్టర్ హ్యూగో వర్ణించియున్నాడు.
శ్రీమతి పుట్ట లక్ష్మమ్మగారి స్థితి సరిగా ఇప్పుడట్టిది.
ముప్పది సం.లు నిండియు నిండని లేబ్రాయపు జవరాలు పుట్ట లక్ష్మమ్మగారు 9 సం.లు బాలిక వ్రేలు పట్టుకొని వీధిలోనికి నడచుచు, తన్ను తనకూతురును తిరస్కరించి, తుస్కరించి, చూలపల్కు శాస్త్రిని రోషకషాయితనేత్రయై గాంచి ఇట్లు పల్కినదామె. ‘‘నా బిడ్డ ఏ చేతులతో పేడకడు లెత్తునని పల్కుచున్నారో, ఆ చేతులకే, తన సంగీతసాహిత్య విద్యాచాతుర్యమునకై ఇచ్చటనే బంగారు తోడాలు తొడిగించుకొనజాలదేని తిరిగీ మేమీ మైసూరు రాజ్యమున అడుగు బెట్టము. అట్టి చాతుర్యము నా కూతురున కలవడదేని మేమీభూమిపై బ్రతికియుండము ఆత్మహత్యగావించుకొందుము.’’
శ్రీ శాస్త్రిగారి గృహము విడిచినదిమొదలు తన శపథము నెరవేర్చుటకే శ్రీమతి పుట్ట లక్ష్మమ్మ గారు కషిచేసిరి. మున్ముందు కాంచీపురమునకు వచ్చరి. అచ్చట శ్రీమతి ధనకోటి అమ్మాళ్ సుప్రసిద్ధగాయక శిరోమణియై వెలయుచుండెను. ఆమె దరిచేరి తన కుమారెతకు విద్యాదానమొనర్చుమని శ్రీ పుట్టలక్ష్మమ్మ కోరెను. ఇంత చిన్ని బాలికను సంగీతశాస్త్రమున శిక్ష్చుట తనకు సాధ్యము కాదని ఆమె చెప్పి, అయినను శ్రీరంగములోనున్న యొకక అధ్యాపకుని కుదుర్తు ననెను.
కాని ఆమాటలతో శ్రీ పుట్ట లక్ష్మమ్మగారికి తృప్తికలుగలేదు. వెంటనే బెంగుళూరునకు వెళ్లి అక్కడ శ్రీ దేశికాచార్యుల దయవల్ల మునిస్వామియప్ప అను సంగీత శాస్త్రాధ్యాపకుల పరిచయము సంపాదించెను. శ్రీ మునిస్వామియప్పయు భోగినీకులస్తుడే. అంతేకాదు. శ్రీ వాలాజాపేట పట్టునూలు కృష్ణస్వామి భాగవతులవారు శ్రీ త్యాగరాజువారి ప్రత్యక్ష శిష్యులు. ఆ కృష్ణస్వామి భాగవతులవారి శిష్యులు శ్రీ మునిస్వామియప్పగారు. అట్టవారిని శ్రీ పుట్ట లక్ష్మమ్మ ఆశ్రయించి తన 9 సం.ల బాలికకు సంగీతము నేర్పుమని వేడుకొనెను. శ్రీ పుట్ట లక్ష్మమ్మ ఆర్తి నాయనగ్రహించినారు. ఆమెయందు సోదరీప్రేమ యుదయింప మునిస్వామియప్ప శ్రీమతి నాగరత్నముగారిని శిష్యురాలినిగా అంగీకరించెను.
కర్నాటక సంగీతమున విశేషముగ తెలుగు వాడుక భాషయైనది. కాని విద్వాంసులు పులువురికి తమిళులు. కర్నాటక సంగీతమునకు తమిళదేశమున ఆదరమును మెండు. అందుచే తమిళమున నేర్పించుటకొక ఉపాధ్యాయ నేర్పరచినది. ఆంధ్రగీర్వాణహళాణ భాష లదివరకునుండియు నేర్పించుచుండెను గదా.
సంగీతమనగా కేవలము గీతాలపన రూపకమగు గానమే కాదు. ‘‘గీతం వాద్యం నర్తనంచ త్రతయం సంగీత మచ్యతే’’ తన సంగీతదర్పణమున చెప్పబడియున్నది. ‘‘గీతం వాద్యం తధా నఈత్యం త్రయం సంగీతముచ్యతే’’ అన్నాడు సారంగదేవుడు తన సంగీతరత్నాకరమున.
———–