శ్రీనివాసపురం శేషాచార్యులు (Srinivasapuram Seshacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Srinivasapuram Seshacharyulu
పేరు (తెలుగు)శ్రీనివాసపురం శేషాచార్యులు
కలం పేరుశుభశ్రీ
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1921
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిభారత జాతీయ కాంగ్రెస్లో ‘క్రియాశీల’ సభ్యులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిద్యానగర చారిత్రిక నవలామాలిక
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీనివాసపురం శేషాచార్యులు
సంగ్రహ నమూనా రచనశ్రీనివాసపురం సోదరులలో వీరు జ్యేష్ఠులు. కలం పేరు ‘‘శుభశ్రీ’’. 1921లో జననము. వృత్తి ఆయుర్వేద వైద్యంలో డాక్టరు.
1941 నుండి సారస్వతకృషి. 1943లో భారతరాజకీయాల్లో ప్రవేశము. భారత జాతీయ కాంగ్రెస్లో ‘క్రియాశీల’ సభ్యులు. ప్రకాశంపంతులుగారి అనుయాయులు. కాంగ్రెస్వాది. స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ‘‘ఆంధ్రరాష్ట్ర సాధన’’ కలగా మిగిలి పోయినప్పుడు వీరు ‘శుభశ్రీ’ కలంపేరుతో నిశితమైన రాజకీయ విమర్శలు, వ్యాసాలు, గేయాలు వ్రాసి ఆంధ్రప్రజల్లో రాజకీయ చైతన్య భావాలు రేకెత్తించిన వైతాళికులు. 1917-18 ప్రాంతంలో వీరి రచనలనేకము ఆనాటి పత్రికలలో ప్రచురించబడినవి.

శ్రీనివాసపురం శేషాచార్యులు

శ్రీనివాసపురం సోదరులలో వీరు జ్యేష్ఠులు. కలం పేరు ‘‘శుభశ్రీ’’. 1921లో జననము. వృత్తి ఆయుర్వేద వైద్యంలో డాక్టరు.
1941 నుండి సారస్వతకృషి. 1943లో భారతరాజకీయాల్లో ప్రవేశము. భారత జాతీయ కాంగ్రెస్లో ‘క్రియాశీల’ సభ్యులు. ప్రకాశంపంతులుగారి అనుయాయులు. కాంగ్రెస్వాది. స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ‘‘ఆంధ్రరాష్ట్ర సాధన’’ కలగా మిగిలి పోయినప్పుడు వీరు ‘శుభశ్రీ’ కలంపేరుతో నిశితమైన రాజకీయ విమర్శలు, వ్యాసాలు, గేయాలు వ్రాసి ఆంధ్రప్రజల్లో రాజకీయ చైతన్య భావాలు రేకెత్తించిన వైతాళికులు. 1917-18 ప్రాంతంలో వీరి రచనలనేకము ఆనాటి పత్రికలలో ప్రచురించబడినవి. ముఖ్యంగా వీరి కలం గేయ, వ్యాస రచనలకే పరిమితమైనది. శ్రీ శ్రీ పోకడ వీరి కవిత్వంలో చాలావరకు కనిపించును. 1954 లో పుంగనూరు నుండి వెలువడుచున్న ‘నవీన’ మాసపత్రికకు సంపాదకత్వము వహించిరి. 1955వ సం.లో సంపూర్ణ విజయ నగర సామ్రాజ్య చారిత్రికేతిహాస రచనకు ప్రారంభించిరి. అట్లు వ్రాయబూనిన ‘విద్యానగర చారిత్రిక నవలామాలిక’ లోని 20 సంపుటములలో రాజద్రోహి – శాంతివాది – పిచ్చిప్రభువు అనుమూడు సంపుటములు వీరు రచించిరి.
1964వ సం. ఫిబ్రవరి నెలలో అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన శ్రీకృష్టదేవరాయ వర్థంతి రజతోత్సవ సందర్భంగా డా. శేషాచార్యులుగారు తమ్ములతోసమా సత్కరింపబడిరి.
శ్రీమాన్ మాడభూసి అనంతశయనం అయ్యంగార్ వారు బీహార్ గవర్నరుగా నుండిన కాలంలో వారికి, గౌరవ స్వకీయ ఆయుర్వేద వైద్యులుగా శేసాచార్యులు కొంతకాలం నియమితులై వుండిరి. చిత్తూరు జిల్లా రచయితల సహకార ప్రచురణల సొసైటీకి వీరు డైరెక్టరుగా నియమింపబడిరి. వీరు సోదరులతో కలిసి సాహితీక్షేత్రమున మరింత వ్యవసాయ మొనర్చి చక్కని సస్యములు పండింతురుగాక.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...