పేరు (ఆంగ్లం) | Andra Seshagirirao |
పేరు (తెలుగు) | ఆండ్ర శేషగిరిరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 2/8/1902 |
మరణం | 1/1/1965 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలుగు పండితులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రచించిన నాటకాలు: భక్త నందనార్, దుర్గావతి లేదా గడామండల వినాశము, చిత్తూరు ముట్టడి, సాయిబాబా, త్యాగరాజు, భారతిపుత్రి రచించిన కావ్యాలు: రామలింగేశ్వర శతకము, శంకరస్తవము (శివానందలహరి అనువాదము), లలితా సుప్రభాతము, ఆత్మపుష్పాంజలి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆండ్ర శేషగిరిరావు ముక్కామల కన్నమ్మ |
సంగ్రహ నమూనా రచన | స్వర్గతుడైన పతితో సాగుమానం చేసి ఏనాడో అమ్మవారై ఈనాటికినీన ఆంధ్రదేశానిన అలరిస్తూన్న కాంతామణులోల కన్నమ్మ ఒకతె. ఆకాంతారత్నం కార్యక్షేత్రం ముక్కామల గ్రామం. గోదావరి నదీమతల్లి ఏడుపాయల్లో ఒకటై నేడు తూర్పు గోదావరి, పడమటిగోదావరి మండలాలకి సరిహద్దుగా వెలుస్తూ ఉన్న వశిష్టగోదావరి పశ్చిమతీరాన్ని ఉంది ముక్కామల. ముక్కామలకి ఒకటిన్నర మైళ్లు నైరుతిమూలగా వశిష్టగోదావరి ఒడ్డునే కాకరపర్రు అనేగ్రామం ఉంది. |
ఆండ్ర శేషగిరిరావు
ముక్కామల కన్నమ్మ
స్వర్గతుడైన పతితో సాగుమానం చేసి ఏనాడో అమ్మవారై ఈనాటికినీన ఆంధ్రదేశానిన అలరిస్తూన్న కాంతామణులోల కన్నమ్మ ఒకతె.
ఆకాంతారత్నం కార్యక్షేత్రం ముక్కామల గ్రామం.
గోదావరి నదీమతల్లి ఏడుపాయల్లో ఒకటై నేడు తూర్పు గోదావరి, పడమటిగోదావరి మండలాలకి సరిహద్దుగా వెలుస్తూ ఉన్న వశిష్టగోదావరి పశ్చిమతీరాన్ని ఉంది ముక్కామల.
ముక్కామలకి ఒకటిన్నర మైళ్లు నైరుతిమూలగా వశిష్టగోదావరి ఒడ్డునే కాకరపర్రు అనేగ్రామం ఉంది.
ముక్కామల కాకరపర్రు గ్రామాలు హదుదగాగల వశిష్టగోదావరి ఒడ్డుకు అడుగు అడ్డగీతగా గ్రహించి పశ్చిమగోదావరిమండలంలోనికి ఒక చిన్న అర్థచంద్రికను ఏర్పరిచామనుకోండి. ముక్కామలదిక్కునుండి ఆ అర్థవలయం ఖండవల్లి, ఖండ్రిక, కుముడివల్లి, పెదవలిగ్రామాల్ని రుసుకుంటూ కాకరపర్రువద్ద ముగుస్తుంది.
ఈజనపదాలన్నిటిలోనూ పెరవలి అని ప్రాచీనగ్రామ మనడానికి ఆ ఊరిలో నేటికిన్ని ఉన్న కొన్ని జైన శిథిలాలు నుంచి నిదర్శనాలు.
పెదవలిలో జైనశిథిలాలు ఉంటే ఖండవిల్లిలో మహమ్మదీయ దండయాత్రాసందర్శనమైన ఉదంతాలను కీర్తించే శిథిలాలు కొన్ని ఉనానయి.
పెరవల్లి, ఖండవల్లి గ్రామాలకు ఇరుగుపోరుగు గ్రామమైనందుకు ముక్కామలలో కూడా కొన్ని శిథిలాలు ఉన్నాయి.
అయితే ముక్కామలశిథిలాలు పెదవల్లి శిథిలాలకంటె, ఖండవల్లి శిథిలాలకంటె అధునాతనమైనవి.
అధునాతనమైన ముక్కామల శిథిలాల్లో కన్నమ్మ పేరంటాలు గుడి ఒకటి.
వశిష్టగోదావరిలో ముక్కామలరేవు బ్రహ్మగుండక్షేత్రమని స్థానికులు చెబుతారు. ఆదిమకాలంలో అనగా దేవతలు ఈ భూమిమీద తిరిగేరోజుల్లో బ్రహ్మ అక్కడ యజ్ఞంచేశాడట. పాముపాలులో ప్రస్తుతి పొందిన భ్రహ్మగుండక్షేత్రమదేట.
తనకు భర్తగా నిర్దేశింపబడ్డ పామును పెట్టెలో ఉంచుకుని, ఆ పెట్టెను తలమీద పెట్టుకుని అన్ని తీర్థాలు తిరిగి విసిగి వేపారి రాచపడుచు తుదకు ఆ తీర్థానికి వచ్చింది.
ఆ తీర్థప్రాంతాన్ని తపస్సు చేసుకుంటూ ఉండిన మునులతో ఆమె తన గోడు చెప్పుకొంది. వారు ఆమెకు బ్రహ్మగుండక్షేత్ర మహాత్మ్యాన్ని విపులపరిచి, అందలి స్నానం వల్ల ఆమె సంకల్పం సిద్ధించి, ఆమె పాము మగడు మనుష్యరూపాన్ని పొందగలడని చెప్పారు.
మునులు చెప్పిన రీతిని ఆమె గోదావరికి వెళ్లి బ్రహ్మగుండక్షేత్రంలో స్నానంచేసింది. ఆమె పాము మగడు నరరూపాల్ని పొందాడు.
ఈ గాన ఆఊరిదే అనడానికి నిదర్శనం ముక్కామల్లో ఇప్పటికి మునికోడు (పాము పాటలోని మునులు తపస్సు చేసినచోటు) పాములకోడు (మునికోడునుచిం నెత్తిమీది పాములబుట్టతో రాచపడుచు గోదావరికి వెళ్లిన దారి) అనే మాటలు నిలిచిఉన్నాయి.
ఈ గానవల్ల బ్రహ్మగుండ క్షేత్రాన గోదావరినదీమదల్లి ఒక స్త్రీకి మహోపకారం చేసింది.
కాని కాలాంతరాన ఆగోదావరి నదీమతల్లే ఆ బ్రహ్మగుండ క్షేత్రంలోనే స్త్రీజాతికే చెందిన మన కథానాయకురాలికి తీరని అపకారం చేసింది.
వశిష్టగోదావరిలో బ్రహ్మగుండక్షేత్రాన పడమటి గోదావరివైపున ముక్కామల ఉన్నట్లే తూర్పుగోదావరివైపున అంకంపాలెం అనే ఊరు ఉంది.
రెండుఊళ్లకి నడుమదూరం సుమారు రెండు మైళ్లు ఉంటుంది. గోదావరి వరదపొంగులో ఈ రెండు మైళ్లు ఏకంగా జలమయమై ఉంటుంది. ఉట్టిరోజుల్లో ఇటు అటు కొంత మెరకలంక పోను నడుమ నదీ గర్భం అరమైలువరకు ఉంటుంది.
ముక్కామల్లోనూ, అంకంపాలెంలోనూ జాస్తీ జనసంఖ్య కమ్మవారే.
మన కథానాయకురాలైన కన్నమ్మ అంకంపాలెం కమ్మవారింట పుట్టింది. ముక్కామల్లో ఒక కమ్మయువకుణ్ణి చేపట్టింది.
కాటన్ దొర కరస్పర్శ తగిలి ధవళేశ్వరం వద్ద అభండ గౌతమి ఆనకట్టచే బంధిత న తరవాత ముక్కామల అంకంపాలెం గ్రామాలనడుమ వశిష్టగోదావరి బాగా మేటవేసిలకలు పెంచి ఏటేట నాగులచవితి నాటికే నక్కలు దాటేపాటిరేవుగా, పుష్యమాసపు పున్నమి నాటికి పాడన్నానానికి మాత్రం నీళ్లగల మెరకపాయగా, గాదిపాద్యమి నాటికి ఆచమనానిదైనా నీళ్లులేని సకపర్రగా మారుతూ ఉంది.
కాని మనకథాకాలం నాటికి అక్కడ వశిష్టగోదావరి విశాలంగానూ, లోతుగానూ ఉండి సుడిగుండాలతో చూడ్డానికే భయంకొలుపుతూ ఉండేది.
ఈ పరిస్థితుల్లో ఇద్దరినుంచి అద్ధరికి దుకుని వెళ్లడం గజఈతగానికికూడా ఘనకార్యమే.
మనకథా నాయకురాలైన కన్నమభర్త ఇట్టిఘనకార్యాన్ని రోజుకు రెండుసారులు చొప్పున కొన్ని మాసాలు చేశాడు.
కమ్మకులంలో తడవులనుపట్టి ఉన్న ఆచారాన్ననుసరించి కన్నమ్మ కార్యం జరిగిన కొత్తలో కొన్ని మాసాలు అంకంపాలెంలో పుట్టింటనే ఉండిపోయింది.
ముక్కామల కాపురస్తుడైన ఆమెభర్త పొద్దస్తమానూ ముక్కామల్లో పొలంపనుల చూచుకుని రాత్రి పెందరాలే భోజనంచేసి వశిష్టగోదావరిని ఈదుకొని పడక్కి అంకంపాలెంలోని అత్తవారింటికి వెళుతూ ఉండేవాడు.
అతడు గజ ఈతగాడు. పైగామంచివడుచుతనపు ముమ్మరంలో ఉన్నాడు. కాగా వడి, సుడిగలతుండాలతో కూడిన పోతు గోదావరిని దినదినమూ రాత్రి ఉత్తరించడం అతనికి కష్టమనిపించేది కాదు. అందులో అతను దినదినమూ పోయేది నూతనవధూసందర్శనార్థం.
రాత్రి గోదావరిని ఈదుకునిపోయి అతడు అంకంపాలెంలో అత్తింట ప్రియభార్యతో నిద్రచేసి తూర్పు తెల్లవారకుండగా లేచి తిరిగి గోదావరి ఈదుకొని ముక్కామల్లో కాలం పనికి సకాలంలో అందుకునేవాడు.
ఈ రీతి దినచర్యతో అతడు కొన్ని మాసాలు సునాయాసంగా, సుఖంగా వెళ్లబుచ్చాడు. ఈతసమయంలో నడుమ ఆయాసం రాకుండా ఊతగా ఉండడానికి అతడు రోజూ ఒక చాకలిబావను తీసుకువెళ్లి తీసుకువస్తూఉండేవాడు. నీటిమీద బోర్లించిన చాకలిబావకి చక్కగా తేలి అతనికి ఈత సమయంలో ఊతతెప్పగా ఉపయోగిస్తూ ఉండేది.
బ్రహ్మగుండక్షేత్రపురేవుకి దిగువునకూడ వేటుదూరంలో గోదావరి ఒడ్డున ముక్కామల చాకళ్లు చాకిరేవులు ఏర్పరుచుకుని ఉండేవారు. పొద్దుపొడిచినతరవాతకాని వారు రేవుకి వచ్చేవారు కారు. పొద్దుకూకె సమయానికి వారు వెళ్లిపోయేవారు. పోయేటప్పుడు వారు తమ చాకిబానల్ని అక్కడే బోర్లించిపోయేవారు.
ఆ బానల్లో ఒక దానిని రారతి, తెల్లవారుజామున ఈతసమయంలో కన్నమ్మనర్త ఉపయోగిస్తూఉండేవాడు. అంకంపాలెంనుంచి ముక్కామల ఈదుకుని వచ్చి అతడు చాకిబానను తిరిగి దాని స్థలంలో బోర్లించివేస్తూఉండేవారు.
ఈతకార్యశ్రమాన్ని ఉపక్రమించిన కొత్తలో అతడు ఎక్కడతీసినబానని అక్కడ బోర్లించివేస్తూ ఉండేవాడు. కాని కాలక్రమాన్ని అతడు పొలంపనికి యథాకాలం అందుకోవాలనే తహతహలో చాకిబానవి యథా ప్రదేశవినివేశితం చేయడం కొద్దిగా మరేవాడు. చాకిబానని సరిగా ఎక్కడ తీశాడో అక్కడ కాక ఆ సమీపంలో ఎక్కడో ఒకచోట బోర్లించి అతడు తొందరగా ముందుపనికి పోతూఉండేవాడు.
పొద్దుపొడిచాక చాకలివాళ్లు వచ్చి తమ తమ చాకిబానల్లో ఒకటి తాము పెట్టిన చోట కాక స్థలాంతరాన్ని ఉంటూ ఉండడము గమనించినారు. ఇట్లా వరు బహువారాలు గమనించారు.
రోజురోజూ తమచాకిబానల్లో ఒకటి పెట్టినచోట ఉండకాం మారుతావున ఉండడానికి కారణం ఏమిటి? ఎంతగా ఆలోచించినా చాకలివాళ్లకు ఏమీ పాలుపోలేదు.
ఆ చాకిరేవులు ఉన్న ప్రదేశం రస్తొకాదు. పొద్దుకూకేసరికి అక్కడ గుయ్యిమంటూ ఓదరంగా ఉండి ఎవరురావడానికైనా భయం వేస్తూఉంటుంది.
దగ్గరలో జనపదం ఏమీలేదు. అక్కడికి దిగువవాలులో రాయివేటు దూరంలో మాత్రం ఒక మర్రిక్రింద సన్యాసులు మకాముగా ఉంటున్నారు. ఆ నిస్సంగులకు చాకిబానలతో ఏమి పని ఉంటుంది?
ఇంచుమించు సూర్యుడు అస్తమించేవరకు చాకళ్లు అక్కడే ఉంటారు. పొద్దు పొడిచిగడియలో, అరగడియకో తిరిగి వారు రానేవస్తారు. ఈలోగా చాకిబావని కదుపుతూ ఉండేది ఎవరు?
మనుష్యులా? దెయ్యాలా?
చాకలివాళ్లకు సందేహం దినదినమూ హెచ్చింది. సోదా చూద్దామని వారు ఒక నాడు కాల్చని పచ్చిబానలు తెచ్చి అక్కడ బోర్లించి పండుబానల్ను ఇంటికి పట్టుకుపోయారు.
ఈ సంగతి మన కథానాయకుడికి తెలియదు. మామూలుగా ఆనాడుకూడా అతడు చుక్కపొద్దువేళ భోజనం చేసి గోదావరి రేవుకి వెళ్లాడు; ఎప్పటిమాదిరిగా చాకిబానని తీసుకుని గోదావరికి అడ్డపడ్డాడు.
అతడు గోదావరి మయానికి వెళ్లేసరికి పచ్చిబాన నీటిలో నాని విచ్చిపోయింది. ఆ విచ్చిపోవడంలోనూ అది ఒక సుడిమధ్యలో విచ్చిపోయింది.
అనుదినసాధనతో ఈతలో మొనగాడైన అతణ్ణికూడా అసుడిలోని జలభూతం లొంగ తీసేసింది. అతడు బారలుచాపి ముందుకు దలేకపోయాడు. వెనక్కిన్ని మెదలలేకపోయాడు.
అవి వరదరోజులూ కావు. నది అట్టే ప్రవాహవేగంలోనూ లేదు. నా అతని దొంగబానతో దొంగసుడిలోపడి సుడివడికి గిరగిర తిరిగి మునకలు వేశాడుణ నీళ్ళు తాగాడు. జలదేవతకు బలి నాడు.
అంకంపాలెంలోని కన్నమ్మకు తన అనుస్థలోని ఈమార్పు ఏమీ తెలియదు. యథారీతిని ఆమె ఒళ్లంతా కళ్లచేసుకుని మగని రాకకు ఎదురుచూస్తూ ఉంది.
ఎంతసేపు ఎదురుచూసినా అతడు రాలేదు. కోడికీ అమెకూ ఒకేసారి తెల్లవారింది. భర్త రాత్రి రాలేదన్న సంగతి కన్నమ్మ కన్నతండ్రికి చెప్పింది. సంగతి కనుక్కువదాదమని అతడు ముక్కామలకు బయలుదేరాడు.
సూర్యునిలాగ నియమంతప్పక రోజూ పొలం పనికి అందుకునే కొడకు నాడు ఇంకా రాకపోవడానికి కారణం తెలియక కొంచెం కంగారుపడుతూ అతని తండ్రి ముక్కామలనుంచి అంకంపాలానికి ప్రయాణమయ్యాడు.
అంకంపాలెం ఆసామీ ముందు బయలుదేరాడు కాబట్టి గోదావరిని దాటి ముక్కామల రేవుకి చేరాడు. ఆ రేవులో వియ్యంగుళ్లు ఇద్దరూ కలుసుకున్నారు. అన్యోన్యం మాట్లాడుకున్నారు.
వారిద్దరికీ గుండెల్లో రాయపడింది. ప్రేమ అధికమై ఉన్నచోట అపాయ శంకకూడా అధికమై ఉంటుంది. అతగాణ్ని గోదావరి ఏదో చేసి ఉంటుందని వారు ద్దరూ అనుకున్నారు.
ఇంతలో సన్యాసులమర్రికి ఎదురుగా ఉన్న గోదావరి రేవులో ఏదో కలకలం బయలుదేరింది. స్నానాలు సాగించక సన్యాసులు ఒడ్డున నిలబడి ఏదో వస్తువు వైపు చూస్తూఉన్నారు. వియ్యంకుళ్లు ఇద్దరూ అక్కడికి పోయి చేసేసరికి వాళ్లు అనుకున్నంతా ఐంది.
సర్వసంగపరిత్యాగులైన సన్యాసులు అఘమర్షణస్నానార్థం అనుదినమూ ఉపయోగించుకునే దివ్యఘట్టంలో మన కథానాయకుడైన కమ్మయువకునిశవం తేలి ఉంది.
అంకంపాలెంలోని కన్నమ్మకు పతిజల మరణవార్త తెలిసింది. తోడనే ఆసాధ్వికులు వెడలివచ్చి సన్యాసుల స్నానపురేవులో సతితో సాగుమానం చేసింది.
సర్వసంగపరిత్యాగులైన సన్యాసులకు కూడా ఆసాధ్వి సహగమనసాహసం హా పుట్టించింది. కాగా వారు ఊరంత ఊడలతో విశాలరమ్యమైన తమ మర్రికింద ఆ పేరంటాలికి ఒక గుడికట్టారు. ఆగుడిలో వెలసిన దేవతకువారు ప్రథమపూజారులు అయ్యారు.
కాలక్రమాన్ని గోదావరికి పోతగట్టులు పుట్టాయి. ఆఏటిగట్టులపక్కనే పెద్దకాలువలు పుట్టాయి.
ఈ ఏటిగట్టుల్లో ఒకటి, ఈ పెద్ద కాలువల్లో ఒకటి సన్యాసులు మర్రిని ఏటివైపుకు తోసి దానిని ఒరసుకుంటూ సాగిపోయాయి.
క్రమంగా ఆప్రాంతం విశేషజనాకీర్ణం ఐంది. కాగా జనాకీర్ణప్రదేశపు మర్రిని వీడి సన్యాసులు విజనస్థలానికి పోయారు.
వారు వీడిన పిమ్మట మర్రి ఊడలలో విన్నవి పళ్లుదోముపుల్లలుగా, పెద్దవి కట్టెపేళ్లుగా ఖర్చుపడిపోయాయి. క్రమంగా వని కొమ్మలుకూడా సికస్థుపడిపోయాయి. మోకులు తిరిగే దానిమానుమాత్రం నేటికిన్నీ నిలిచిఉండి సన్యాసుల మర్రి అనే పేరును నిలుపుకుని ఉంది.
ఆతపశీతానిలవర్ష వారణమై తనను కాపాడుతూ ఉండిన సన్యాసుల మర్రిస్థితి సర్వవిధాలా సన్యాసమైపోగా పేరంటాలమ్మ గుడి ఎండకి ఎండుతూ, చలికి వణుకుతూ, గాలికి అల్లాడుతూ, వర్షానికి తడుస్తూ కాలము వెళ్లబుచ్చుతూ ఉండింది.
ఈమారతపుస్థతిలో కూడా ఆగుడిని ఉంచడానికి గోదావరమ్మకు సమ్మతం కాకపోయింది.
ఎక్కడనుంచో వచ్చిన రాచపడుచు రాము మగనికి నరరూపమిచ్చి దయపెట్టి స్త్రీ జనపక్షపతి అనిపించుకున్న బ్రహ్మగుండక్షేత్రపు గోదావరమ్మ ఎందుచేతనో తన తీరస్థురాలైన కమ్మపడుచుమీద కసిపూసింది.
ఆమె ఆకమ్మకాంతి కాంతునికి తన గర్భాన్ని శ్మశానవాటికగా చేసింది. అంతతో ఆమె కసితీరలేదు.
ఒకానొక ప్రావృట్కాలంలో ఆమె ఉబ్బెత్తుగా పొంగికన్నమ్మ పేరంటాలమ్మ గుడిని, ఆగుడిపక్క పోతగట్టుని, ఆపోత గుట్టులోతట్టు పెద్దకాలవని తనఏటినోటిలో వేసుకుంది. మోకులు తిరిగేమానుగల సన్యాసుల మర్రిని మాత్రం గంగమ్మ కదల్చలేదు.
ప్రభుత్వంవారు తమకు కావలసిన పోతగట్టుని పెడగాపోశారు; ఆకొత్తపోతగట్టుకు లోవైపున పెద్దకాలువ తవ్వారు.
పాతపోతగట్టుతోబాటు, పాతకాలవతో బాటు ఏటిలో కలిసిన కన్నమ్మ పేరంటాలి గుడి ఊసుమాత్రంవారు ఎత్తుకోలేదు.
కొంతకాలానికి పిమ్మటముక్కామలము కమ్మకులస్థడు – ఆగుడిసంగతి తడిమాడు. అమ్మవారు అతనికలలో కనిపించి తనగోడు చెప్పుకుని స్థలాంతరంలో తనగుడి కట్టించమని చెప్పిందని పామరులు అంటారు; ధార్మికుడు, భక్తుడు కాబట్టి అతడు స్వబుద్ధిచేతనే దేవాలయాన్ని కొత్తస్థలంలో కట్టడానికి పూనుకున్నాడని ఉచితజ్ఞులు అంటారు; అతడు కమ్మకులస్థుడు కాబట్టి కులాభిమానం కొద్దీ అందుకు పూనుకున్నాడని సంకుచిత భావులు అంటారు.
ఏమైతేఏమి – అతడు కొత్తపోతగట్టుకి లోపల, కొత్తపెద్దకాలవకి ఇతరల విశాలస్థలులో కన్నమ్మపేరంటాలి గుడికొత్తగా కట్టించాడు. ఈ నిర్మాణం జరిగి ఇప్పటికి మూడు తరాలు ఐ ఉంటుంది.
ఈగుడికి ఇప్పుడు గమళ్ల వాళ్లు పూజారులు.
ముక్కాముల్లో కమ్మవారింట పెళ్లి పేరంటాలు జరిగినప్పుడల్లా కన్నమ్మ పేరంటాలమ్మ గుడిలో బోనంబంతి సాగించడం ఇప్పటికీ తప్పని ఆచారమై ఉంది.
———–