భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి (Bairapureddy Reddy Narayanareddy)

Share
పేరు (ఆంగ్లం)Bairapureddy Reddy Narayanareddy
పేరు (తెలుగు)భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి
కలం పేరు
తల్లిపేరునాగమ్మ
తండ్రి పేరువేంకటరెడ్డి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ2/2/1923
మరణం7/1/1979
పుట్టిన ఊరురాయవరము, రాయచోటి తాలూక, కడప జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసంగమేశ్వర శతకము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి
సంగ్రహ నమూనా రచనకలమునకు హలమునకు సమాన ప్రాధాన్యత నిచ్చిన కవులు మన కరుదుగా నున్నారు. వారిలో శ్రీ భైరపురెడ్డి రెడ్డి నారాయణరెడ్డి ఒకరు. కడపమండల మందలి మడితాడు గ్రామమునకు చెందిన రెడ్డివారిపల్లెలో వీరు జన్మించిన కృషీవలులు. నాలుగైదేండ్ల ప్రాయమున అల్లరిపిల్లవాడుగా తిరుగుచుండిన యీతని, నితని తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ నింట విడిచి చదువు నేర్పించిరి. అతనికైదవ తరగతి వరకు మాత్రమే చదువబ్బినది. చిన్ననాటి నుండియు పుస్తకములు చదువుట యందాసక్తి కనబరచు చుండుటచే కాపుబిడ్డడు కవి కాగలిగినాడు.

భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి

కలమునకు హలమునకు సమాన ప్రాధాన్యత నిచ్చిన కవులు మన కరుదుగా నున్నారు. వారిలో శ్రీ భైరపురెడ్డి రెడ్డి నారాయణరెడ్డి ఒకరు. కడపమండల మందలి మడితాడు గ్రామమునకు చెందిన రెడ్డివారిపల్లెలో వీరు జన్మించిన కృషీవలులు. నాలుగైదేండ్ల ప్రాయమున అల్లరిపిల్లవాడుగా తిరుగుచుండిన యీతని, నితని తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ నింట విడిచి చదువు నేర్పించిరి. అతనికైదవ తరగతి వరకు మాత్రమే చదువబ్బినది. చిన్ననాటి నుండియు పుస్తకములు చదువుట యందాసక్తి కనబరచు చుండుటచే కాపుబిడ్డడు కవి కాగలిగినాడు.
కవిశేఖరుల ధర్మపత్ని శ్రీమతి భాగ్యలక్ష్మి, అకాలమరణము చెందినది. ఆ విషాద సంఘటనతో అతని హృదయము ద్రవించినది. ‘క్రౌంచమిథున మరణముతో వాల్మీకి హృదయము గాయమై రామాయణ కావ్యమై నట్లు’ వీరి మనోభావములు ‘తలపోతలు’గా అవతరించినది.
కవిగారు ఆస్తికులు, భగవంతుని సంపూర్ణముగా నమ్మినవారు, దైవభక్తి పరాయణులు. వారి స్వగ్రామమునకు దగ్గరగాగల బాహుదా నదీ సమీపమునగల సంగమేశ్వరాలయమునకు వారు ధర్మకర్తలుగా వ్యవహరించిరి. ఆ స్వామియెడ కవిగారికి గల భక్తిప్రపత్తులకు నిదర్శనమేవారి సంగమేశ్వర శతకము.
హైమ నగాధివాసమున నద్రి హిమాంబువు లాని దేహ మే
సామయోగాని చిత్తమల చండశిలాకృతి వీడలేక యా
కాముని కంటిమంటలను గాల్చితివా సతిగూర్చు తప్పున
హైమవతీ పతీ యురగహార నటేశ్వర సంగమేశ్వరా
పై విధముగా కవిగారు తమ సంగమేశ్వర శతకమున చమత్కరించిరి.
రెడ్డిగారి మూడవ పంట, ‘రాయలసీమ రైతు’ వీరి రచనలపైకిది మేల్పంతి ఇందుకవి సజీవుడై నాడు. రాయలసీమ రైతుగా తాను నిలిచి నాడు అతని కన్నీటికి గలకారణములను కవితలో వినిపించినాడు కఱవు రాయలసీమ వాసులకు తోబుట్టువు పెట్టిన పైరు లెదిగిరాక, మెట్టభూముల లోనే గుట్టుగా నెండిపోవు విషాద సంఘటనలు రాయలసీమ రైతుల కేటేట అనుభవైక వేద్యమే అందుకే కవిగారిట్లనిరి.
మూడు జగముల మేఘుండు మోపనీక
తొలగ దోలిన కఱవెందు మెలగలేక
దత్తమండల మందు తానెత్తువడియె
గాక యుండిన యిట్లేల కలతవెట్టు
నిజమే. ఈ ప్రశ్న ఆలోచింపదగినదే. పూర్వమీ సీమను శ్రీకృష్ణరాయలు పాలించినప్పుడు సహితము యిట్లే వుండెనా? లేదుకదా.
‘‘రాసులై రాజిల్లు రత్నాల నమ్ముచు
బచ్చులు సంగళ్లఁబరిగు చుండ
………………………………………….
………………………………………….
తే. తెలకు ముమ్మూరు వర్షముల్ నిలిచి కురియ
కాపు కోరిన ధాన్యముల్ గాంచెధరణి
జనుల కారోగ్య భాగ్యము నెనయు దివ్య
సీమ శ్రీకృష్ణ రాయల సీమ యొప్పె.
అదియేమి దౌర్భాగ్యమో, అదనులో వానరలురాక, పపంటలుపండక కఱవును కొని తెచ్చుకొన్నట్లుగా ఈ సీమలో తాండవించినది. 1972వ సం. లో వచ్చిన కఱువును కవిగారు ప్రత్యక్షముగా చూచి ఇందు వర్ణించినారు. అవర్ణనలు చదువరికంట కన్నీటిని గార్చును. కడుపున మంట పుట్టిచును, వ్యవసాయ కూలీలకు పనులులేవు. పశువులకు పచ్చిగడ్డిలేదు దప్పి దీర్చుకొనుటకు నీటిచుక్కలేదు. ఆ మూగజీవుల బాధను కవిగారిట్లు పాడిరి.
కసపు పొసగదు; నీరైన నొసగలేక
మేప నడవికి తోలిన గోపవరుల
కనుగొలంకుల జొచ్చిన కరుణజలము
గ్రోలగను జూచినట్లుండె గోచయంబు
ఇదొక అద్భుతభావన. ఈ దృశ్యమును అనుభవ పూర్వకముగా కవిగారు చెప్పిర.
వీరి కవిత్వము పూర్వాంధ్రకవుల కవిత్వమునకేమాత్రము తీసిపోదు. చదివిన చదువునకు వ్రాయు కవిత్వమునకు హస్తి మశకాంతరమున్నది. లేకున్న కీ.శే. విశ్వనాథ సత్యనారాయణ గారంతటివారు రెడ్డిగారిని పొగడుచు, ఇట్లు వ్రాసెదరా?
‘‘ఒక మంచి కవిని పొగడుట నాకిష్టముగా నుండదు. అభిప్రాయము వ్రాయుట కసలిష్టముండదు. అభిప్రాయము అల్పకవుల గ్రంథముల మీద వ్రాయవలయును. గొప్పకవుల గ్రంథములు, విద్వాంసులు భావుకులుచదివి ఆనందింపదగినవి కాలము దుష్టమై విద్వాంసుల భావుకులయొక్క సంఖ్య తక్కువై అభిప్రాయములమీద నాధారపడవలసిన పరితల సంఖ్య అధికమై నేడీదేశమునకీ దుర్యోగము పట్టినది. ఇంత చక్కని రచన చేయు కవులీ ప్రాంతమునందు రెడ్లలోనుండగా అల్పప్రతిభావంతులు అల్పసాహిత్యపరులు పైకి వచ్చుట నాకు బాగుగా కనిపించలేదు. ఈయన గ్రంథమున కొకని యభిప్రాయ మెందులకో నాకు తెలియుటలేదు. వీరికి రాదగిన కీర్తి పరమేశ్వరుడు తెచ్చునుగాక.’’
ఇంతకంటెను కావలసినదేమి? ఇంతటి గొప్ప పొగడ్త ఊరకనే వచ్చునా? అది కవిగారి పూర్వ పుణ్యవిశేషమే. సుగుణసంపన్నులు నిరాడంబరులు, ఉత్తమ భారతీయ సంసాకరులు, దేశభక్తి ధర్మపరాయణత్వము ఆస్తికత్వముగల ఈకర్షక కవివేఖరులు పోతనకు సమానులే.
విధివైపరీత్య మెట్టిదోగాని ఇట్టివారిని భగవంతుడు భూమిపై నూరేండ్లునిండుగా బ్రతకనివ్వడు.
‘‘తొల్లిటి జన్మమందు నిను దుర్లభుగాగ దలంచి వేడకే
నొల్లక దేహధారినయి యుర్విజనించిన యార్తిబాయగా
నెల్లపుడున్ దలంతునిక యేర్పడజూచియు మోక్షభిక్షరా
గిల్లగనిమ్ము కోరనిక నేమియు నిమ్మని, సంగమేశ్వరా’’
వారి కోరిక మేరకే శివుడువారికి మోక్షమునిచ్చి త్వరగా మననుండి దూరము చేసినాడు. వారికివే మన శ్రద్ధాంజలులు.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...