బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు (Bommireddypalli Suryarao)

Share
పేరు (ఆంగ్లం)Bommireddypalli Suryarao
పేరు (తెలుగు)బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణంఆగష్టు 25
పుట్టిన ఊరువిజయనగరం
విద్యార్హతలు
వృత్తిపత్రికాసంపాదకులు 
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథలు: అంటని సిరి, అంతా వ్యాపారమే, అడవి మల్లె, అన్ హాపీజర్నీ, ఆర్థిక రహస్యం,ఇంతకీ ఈబస్సు నడిపేదెవరు? , (ఎవరిది తప్పు)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు
అంతా వ్యాపారమే
సంగ్రహ నమూనా రచనరామనాథం ఢిల్లీ విమానాశ్రయంలో దిగి, క్వీన్స్ హోటల్కి టెలిఫోను చేశాడు, తనకో గది ఏర్పాటు చెయ్యమని.
క్వీన్స్ హోటల్ చాలా పెద్ద తరగతి హోటేలు అతి విశాలమైన ఆవరణ, ఆవరణలో పూలతోట, చుట్టూ ప్రహరీగోడ, ఇనపగజాల తలుపులు సింహద్వారంవద్ద గూర్ఖావాడు. దూరం నుంచి చూస్తే ఆంగ్లేయవాస్తు శిల్ప పద్ధతిలో కట్టిన యీ భవనం రాజులూ, రాణీలు నివసించే ప్రాతరకపు భవనంలా కనిపిస్తుంది దాని కొక విధమైన గంభీరాకారం వుంది.
దీనిపేరు భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది.

బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు
అంతా వ్యాపారమే

రామనాథం ఢిల్లీ విమానాశ్రయంలో దిగి, క్వీన్స్ హోటల్కి టెలిఫోను చేశాడు, తనకో గది ఏర్పాటు చెయ్యమని.
క్వీన్స్ హోటల్ చాలా పెద్ద తరగతి హోటేలు అతి విశాలమైన ఆవరణ, ఆవరణలో పూలతోట, చుట్టూ ప్రహరీగోడ, ఇనపగజాల తలుపులు సింహద్వారంవద్ద గూర్ఖావాడు. దూరం నుంచి చూస్తే ఆంగ్లేయవాస్తు శిల్ప పద్ధతిలో కట్టిన యీ భవనం రాజులూ, రాణీలు నివసించే ప్రాతరకపు భవనంలా కనిపిస్తుంది దాని కొక విధమైన గంభీరాకారం వుంది.
దీనిపేరు భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది. విలాసార్థం భారతదేశ యాత్రకు వచ్చే విదేశధనికులు, స్వదేశ ధనికులు, రాజప్రముఖులు, రాయబారులు, పెద్ద పెద్ద వ్యాపారులు వగైరా శ్రీమంతులు అక్కడ దిగుతారు.
మేనేజరు భారతీయుడే కాని ఆంగ్ల నాగరికత బాగా వొంటపట్టినవాడు. కొంచెం స్థూలకాయుడు. పొట్టిగా గుమ్మడికాయలా వుంటాడు. బట్టతల, నల్లటి ముఖంలోంచి తెల్లటి పలువరుస తొంగిచూస్తూ వుంటుంది. ఆ కళ్ళలో నిశితమైన దృష్టి, నిర్వహణసామర్థ్యం, జీవితానుభవం వుట్టిపడుతూవుంటాయి.
రామనాథానికి మంచిగదొకటి ఏర్పాటు చేశాడు మేనేజరు తనకొచ్చిన వివరాల ప్రకారం రామనాథం ఒక పెద్ద వాయపారస్తుడు. వ్యాపారంమీద విదేశాలు తిరిగిన వాడు. ప్రభుత్వ వర్గాల్లో బాగా పలుకుబడి వున్నవాడు. ఆయన ఢిల్లీ వస్తున్నాడంటే ఎవరైనా మంత్రులనో, పెద్ద వుద్యోగులనో కలుసుకోడానికే అయివుండివచ్చును. ఆయన కేలోపం జరగకూడదని బంరటోతులకూ గుమాస్తాలకూ చెప్పివుంచాడు. అతని రాకకోసం ఎదురుచూస్తున్నాడు. తను స్వయంగా స్వాగతమివ్వడమే బాగుంటుంది మధ్యాహ్నం ఒంటింగంటైంది, మేనేజరుకి ఆకలివేస్తూంది, మరో పావుగంటచూసి బోజనానికి పోవచ్చుననుకున్నాడు మేనేజరు.
అంతల్లో గుమ్మంలో కారు నిలబడింది. రామనాథం కారు దిగి చకచక మెట్లేక్కి హాలులోకి వచ్చాడు. కొంచెం పొడుగ్గా, తెల్లగా అందంగా వుంటాడు. చాల విలువలైన ఫ్రెంచి ఉనినసూటు, స్విస్ టై, కళ్ళజోడు, నోట్లో పైపు, చేతిలో తోలుసంచీ, కెమెరా. హోటలు బంట్రోతులు వచ్చి సలాం పెట్టి పెట్టె బెడ్డింగూ లోపలికి తీసుకువెళ్లేరు. మేనేజరు వినయపూర్వకంగా వంగి కరచాలనం చేశాడు. పరిచయాలు చేసుకున్నారు.
‘‘మేనేజరు, మీ హోటల్కి రావడం నాకు సంతోషంగా వుంది’’ అన్నాడు రామనాథం ఇంగ్లీషులో. అలా అనడం సంప్రదాయం కాబోలు మరి.
‘‘మీ కన్నివిధాలా సదుపాయంగా వుండేటట్లు చూస్తాను’’ అన్నాడు మేనేజరు ఈ ఆనవాయితీలయిన తరవాత వాళ్ళిద్దరూ రామనాథంకోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లేరు గదిలో రేడియో, టెలిఫోనూ, ట్రెస్సింగ్ టేబులు, సోఫాలు వగైరా సామగ్రి వుంది.
‘‘మీకేమేనా అవసరముంటే ఆఫీసులో వుంటాను టెలిఫోను చెయ్యండి’’ అన్నాడు మేనేజరు.
‘‘అలాగే’’
‘‘మీరు ప్రయాణపు బడలికతో వున్నట్టున్నారు, స్నానం, భోజనం చేసి వివ్రాంతి తీసుకోండి. మళ్ళీ సాయంత్రం కలుద్దాం’’
‘‘చూడండీ, పోస్టాఫీసునుంచి ఒక వందటెలిగ్రాం ఫారాలు తెప్పించండి, చాలాపని వుంది’’ అన్నాడు రామనాథం.
అలాగేనని చెప్పి మేనేజరు వెళ్లిపోయాడు.
సాయింత్రం రామనాథ్ ఊళ్లో కెళ్లి అటూ యిటూ తిరిగి హోటలుకి చేరుకునే సరికి చీకటి పడింది. హోటలు విద్యుద్దీపాలతో పట్టపగలులా వుంది జట్లు జట్లుగా స్త్రీ పురుషులు కార్లలోంచి దిగి విలాసంగా నడుస్తూ మాట్లాడుకుంటూ, గట్టిగా నవ్వుకుంటా లోపలికి వెళ్తున్నారు. హోటలు హాలులోంచి సంగీతం, వీధి వరండామీద స్త్రీల కిలకిల నవ్వులూ ఆవరణ అంతా వ్యాపించాయి. విద్యుద్దీపాల కాంతిలో స్త్రీల దుస్తులు, ఆభరణాలు తళ తళ మెరుస్తున్నాయి.
రామనాథం వరండాకు దిగువ ఆవరణలో వేసివున్న ఒక కుర్చీలో కూర్చుని తీరికగా పైపు కాలుస్తున్నాడు. హోటల్ లోపలికి వెళ్ళేవారినీ అక్కడ తచ్చాడుతున్నవారినీ చూస్తున్నాడు. హాలులోని నిలువుటద్దాలలో వారి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. వారంతా గొప్ప కుటుంబాలకు చెందినవారు భూస్వాములు, వర్తకలు, అధికారులు, ధనికులు. వారి నడకల్లోనూ, కదలికల్లోనూ తాము భాగ్యవంతులమనే, అదృష్టవంతులమనే భావం కనిపిస్తూంది. స్త్రీలలో అందంగావున్నవాళ్లూ, వికారంగా వున్నవాళ్లూ కూడా వున్నారు. కాని వారంతా చక్కగా ముసత్బయారు. వారి చూపుల్లో, మాటల్లో పురుషులను ఆకర్షించాలనే లక్ష్యం కనిపిస్తుంది. స్త్రీలు కూడా లోపలికి వెళ్ళి తాగుతున్నారు. బాల్ రూమ్లో జంటలుగా నాట్యం చేస్తున్నారు. హుషారుతో, వుద్రేకంతో త్రుళ్లుతున్నారు. అలసిపోయినవారు సోఫాల్లో చతికిలబడి, కొంచెం షాంపైన్, లేకపోతే గిమ్లెట్ పుచ్చుకుంటున్నారు. వైలెన్ మీద బిధోవెన్ సంగీతం మాయిగా వుంది. దాని ప్రకక్క పియానోవాయిద్యం కూడా బాగుంది. అంతా తుఫానులా, సముద్రపు హోరులా వుంది.
రామనాథానికి జీవితం ఎంతో నందమయంగా తియ్యగా కనిపించింది. ఈ సుఖాలను అందుకోడానికి మనిషి ఎంతో అదృష్టవంతుడై పుట్టాలి లేదా సమజాన్నీ జీవితాన్నీ తన పిడికిట్లో పెట్టుకుని, అనేకమందినీ, అవరోధాలనూ జయించుకువచ్చి అదృష్టాన్ని సృష్టించుకోవాలి. లేకపోతే జీవితసార్థక్యం ఏమిటి? రామనాథం ఆలోచిస్తున్నాడు వెనకనుంచి మిసెర్స స్మిత్ వచ్చింది ఆమె ఆంగ్లో యిండియన్ స్త్రీ వయసు మళ్లినప్పటికీ యవ్వనిలా వుండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ‘‘నీకోసం లోపలంతా వెదికాను. నాట్యానికి రావా?’’ అంటూ పక్కనున్న కుర్చీలో కూచుంది. ఆమెనోరు బ్రాందీవాసన కొడుతూంది. అప్పుడప్పుడు పెదిమలు చప్పరిస్తూంది. బ్రాందీ వల్ల మండుతున్నాయి కాబోలు.
అంతట్లో మేనేజరు గబగబా వచ్చి మంచి ప్రోగ్రాం ఏర్పాటుచేశాము. చాలాకాలమైంది, డియన్ డాన్స్, చూడలేదని చాలమంది అన్నారు. అంచేత ప్రత్యేకంగా కలకత్తానుండి ఒక పార్టీని తెప్పించాము, లోపలికి దయచెయ్యండి అన్నాడు.
‘‘ఇండియన్స్ కి డాన్సేమిటి, నామొహం నృత్యకళ అంటే ఫ్రాంసులో చూడాలి. నేను పేరిస్ లో వున్నప్పుడు అని ఏదో చెప్పబోయాడు రామనాథం. కాని దొరసాని అడ్డుతగిలింది.
‘‘అదేమిటి మోహన్ అలా అంటావు. భారతీయనాట్యం చాల గొప్పది. నా కెంతో యిష్టం. మీ భరతనాట్యంలో గొప్ప కళ వుంది’’
రామనాథం చిరునవ్వు నవ్వి ‘‘నిజమే కాని, యీ మామూలు డాన్సర్లందరూ శాస్త్రయక్తంగా నాట్యం చెయ్యలేరు. వీరు చవకబారు నృత్యాలతో భారతీయ సంస్కృతికీ, కళలకూ అపచారం చేస్తున్నారు, భారతీయ నాగరికతనూ, సంస్కృతినీ పాడుచేస్తునానరు’’ అని రామనాథం ఒక గ్లాసు స్కాచి విస్కీ పుచ్చుకున్నాడు.
‘‘నిజమే మోహన్, ఏ దేశంలోనైనా అంతే. కాబట్టే ప్రభుత్వం చవకబారు కళాకారుల్ని నిషేధించాలంటూ వుంటాను’’ అంది మిసెస్ స్మిత్. కళాకారుల్ని నిషేధించడమేమిటో మేనేజరుకి బోధపడలేదు. అసలీ దొరసాని ఎవరో, రామనాధాన్ని మోహన్ అని ఎందుకు పిలుస్తూందో, అర్థం కాలేదు. అతనికంతా అగమ్యగోచరంగావుంది. ‘‘క్షమించండి, మీరెవరో పరిచయం చేయలేదు’’ అన్నాడు రామనాధంతో.
‘‘ఓ, సారీ, యీమె మిసెస్ స్మిత్ నా స్నేహితురాలు. మోహన్ అన్నది మా తండ్రిగారు నాకు పెట్టిన ముద్దు పేరు,’’ అన్నాడు రామనాధం. ‘ఏడిసిట్టుంది’ అనుకున్నాడు మేనేజరు. ఇంతట్లో యింకో యువకుడు తూలుకుంటూవచ్చి వారి ప్రక్కనున్న కుర్చీలో కూచున్నాడు. అతని కళ్లు ఎర్రగా చింతనిప్పుల్లా వున్నాయి. ద్రాక్ష సారా అతని కోటు కాలరుమీదపడి మరకట్టింది. అతనే రామనాధాన్ని పలకరించాడు.
‘‘హల్లో మిస్టర్ రావ్ ఎప్పుడు కలకత్తా నుండి రవడం?’’
‘‘లేదు, లేదు. నేనిప్పుడు బొంబాయిలో వుంటున్నాను మిస్టర్ మేనేజరు, ఈయన నా మిత్రుడు డేవిడ్, నా మిత్రులు కాలేజీక్లాసుమేట్లు నన్ను రావ్ అని పిలుస్తూవుంటారు’’ అన్నాడు. ఒక మనిషికి యిన్ని పేర్లుండడ మేమిటని ఆలోచిస్తున్నాడు మేనేజరు. వాళ్లందరితో కరచాలనం చేసి వెళిలపోయాడు. వారంతా కూడా లేచి లోపలికి వెళ్లేరు.
మర్నాడు డేవిడ్ హోటలు మేనేజరు దగ్గరకొచ్చి రామనాధం యింకా వూళ్లో ఎన్నాళ్ళుంటాడని అడిగాడు. మేనేజరు, ఎందుకన్నాడు. రామనాధం తనదగ్గిర అయిదు వందలు అప్పు తీసుకున్నాడని చెప్పేడు.
‘‘ఆయన అప్పు చెయ్యవలసిన కర్మమేమిటి?’’
‘‘ఇవాళే నాకు తెలిసింది. రామనాధం వ్యాపారం దివాలాఅయిందిట. ఇప్పుడు ప్రగల్భాలు చెప్పుకు తిరుగుతున్నాడట. ఈ వూళ్లో తెలిసిన వాళ్లదగ్గర అప్పుడే అప్పులు చేశాడట. అతను తీర్చగలడనే నమ్మకం లేదు.’’ అన్నాడు డేవిడ్. మేనేజరుకి యిదంతా అగమ్యగోచరంగా వుంది. డేవిడ్ వెళ్లిపోయాడు. రామనాధం ఎటువంటి వాడై వుంటాడా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు మేనేజరు.
ఆ సాయింకాలం రామనాధం మేనేజరు దగ్గరకొచ్చి ‘‘మిస్టర్ మేనేజరు నేనింకా యీ వూళ్ళో వారం పదిరోజులుండాలి. టూ అటూ వెళ్ళడానికి తక్షణం ఒక కారుకావాలి ఎవరేనా కార్ల కంపెనీ వాళ్లకి కబురుపెడతారా’’ అని అడిగాడు. ఇతనుండే వారం పదిరోజులకూ కారుకొనడమెందుకో మేనేజరుకు అర్థంకాలేదు. ఎంత లక్షాధికారైనా టాక్సీలో పోతాడు గాని, వారం రోజులకోసం పది పదిహేను వేలు పెట్టి కారుకొనడు. సరే యిదేదో చూదామని ‘సరే’ నన్నాడు.
కార్ల కంపెనీకి కబురువెళ్ళగా, వాళ్లు రావడం, రామనాధం వాళ్లదగ్గర కారొకటి తీసుకుని పదిహేనువేలకు చెక్కు వ్రాసి యివ్వడం జరిగింది.
మన్నాడు పగలల్లా రామనాధం హోటలకు రాలేదు. సాయింత్రం వచ్చాడుగాని పేకాడడానికి గాని, వినోదకార్యక్రమానికిగాని రాలేదు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రాత్రి తొమ్మిదిగంటలకి ఎవరో యిద్దరు మనుషులు రామనాధం గదిలోంచి రావడం చూశాడు మేనేజరు వాళ్ళని కలుసుకుని, తన గదిలోకి తీసుకువెళ్ళి, పానీయాలు యిప్పించి, ఏం పనిమీద వచ్చారని అడిగాడు. వాళ్లు రామనాధం దగ్గర 12 వేలకు కారు కొనుక్కునానమని చెప్పి రసీదు చూపించారు. కారు తీసుకుపోతామని చెప్పేరు. తరవత కారు తీసుకుపోయారు కూడాను.
మేనేజరు కిదంతా ఏమిటో అంతుచిక్కడంలేదు. రామనాధం నిన్ననే కారుకొని యివాళ మూడు వేలు నష్టానికమ్మేశాడు. డేవిడ్ చెప్పింది నిజమై వుండవచ్చును. అసలు మొదటినుంచీ యీ మనిషి వ్యవహారం విచిత్రంగానే వుంది. ఈ రోజుల్లో ఎవడు పెద్దమనిషో, ఎవడు మోసగాడో తెలుసుకోవడం చాల కష్టం. హోటల్ మేనేజరయిన తరవాత యిటువంటి చిక్కు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందిమరి. రకరకాల మనుషులు వచ్చి దిగుతారుకదా. సరే రేపు చూసుకోవచ్చు ననుకున్నాడు మేనేజరు.
మన్నాడు దయం రామనాధం మేనేజరుదగ్గరికొచిచ హోటేలు బిల్లు చెల్లించి, పది టలకి విమానంలో బొంబాయి వెళ్లి పోతున్నానని చెప్పేడు. ప్రయాణానికి సన్నాహం చేయడం మొదలెటేటడు.
మేనేజరుకి తన అనుమానం రూఢిఅయింది. లేకపోతే హటాత్తుగా యీ ప్రయాణమేమిటి? తను చేసిన పని నలుగురికీ తెలిసి పట్టుబడేలోగా వూళ్లోంచి దాటేస్తున్నాడు.
మేనేజరు వెంటనే మోటారుకారు కంపెనీకి టెలిఫోను చేసి రామనాధం యిచ్చిన చెక్కు మారిందా లేదా అని అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పి, అతను పదిగంటలకి వెళ్లిపోతున్నాడని చెప్పేడు.
కార్ల కంపెనీవాళ్లు వెంటనే పోలీసు స్టేషన్కు వెళ్ళి జరిగిన కథంతా చెప్పేరు. రామనాధం యిచ్చిన చెక్కునుగరించి బ్యాంకులో దర్యాప్తుచేశారు. రామనాధానికి బ్యాంకులో ఎకౌంటు వుందో లేదో తెలుసుకోడానికి బొంబాయికి రాశామని, దాని బ్రాంచీ ఢిల్లీలో లేదనీ, టెలిగ్రాం యిచ్చినా జవాబు రావడానికి ఒకరోజు పట్టవచ్చునని బ్యాంకువాళ్లు చెప్పేరు.
అయితే చూస్తూ చూస్తూ మనిషిని విడిచిపెడితే ఎలాగ? అసలు వ్యవహారమంతా చూస్తూ వుంటే వీడు మోసగాడిలాగే కనిపిస్తున్నాడాయెను. కార్ల కంపెనీవాడు రామనాధాన్ని ఎరెస్టు చెయ్యాలని పట్టుబట్టేడు.
మొత్తం మీద రామనాధాన్ని పోలీసుస్టేషన్కు తీసుకువెళ్ళడం, ప్రశ్నించడం జరిగింది. రోజంతా అతన్ని పోలీసు స్టేషన్ లోనే వుంచారు.
మన్నాడు బ్యాంకునుండి వర్తమానం వచ్చింది. రామనాధానికి బొంబాయిలో ఒక బ్యాంకులో 65 వేల రూపాయలున్నాయట. చెక్కు సరియైనదేననీ, దానిని మోటరు కార్లకంపెనీ కౌంటుకు జమకడుతున్నామనీ బ్యాంకువాళ్ళు చెప్పేరు.
రామనాధం దర్జాగా మళ్ళీ హోటల్కి వచ్చి మకాం పెట్టేడు. మేనేజరు జరిగిన దానికి మనసులో పశ్చాత్తాప పడ్డాడు.
అయితే రామనాధంయిక్కడితో వూరుకుంటే రామనాధ మెలా అవుతాడు. అతను వెంటనే ప్లీడర్ని పిలిచి, తన పరువునష్టానికి ప్రయాణం గిపోయినందుకు వ్యపారం నష్టమయిందనీ మోటారుకంపెనీమీద 50 వేలకు దావావేసి గెలుచుకున్నాడు.

———–

You may also like...