వేమూరి వెంకటరామనాథం (Vemuri Venkataramanatham)

Share
పేరు (ఆంగ్లం)Vemuri Venkataramanatham
పేరు (తెలుగు)వేమూరి వెంకటరామనాథం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథలు: అసలు కారణం, గోపమ్మ తల్లి, ప్రొఫెసరు భార్య 1, మనశ్శాంతి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేమూరి వేంకట రామనాథం
అసలు కారణం
సంగ్రహ నమూనా రచన‘‘అసలు, ఆమెకు ఇష్టం లేదు మొదట్లో అదిగో, సరో, బస్సు ఆగింది. శంకరంగారు వస్తున్నారు, కొంచెం వెళ్ళి’’
సరోజని ఒక్క గంతున బస్సు యొద్దకు పోయింది, శంకరాన్ని తోడ్కొనిరావటానికి.
‘‘మనం లోనికి పోదాంపద సుందరం’’ అంటూ శర్మ అందంగా అన్నీ అమర్చిన హాలులోనికి త్రోవతీశాడు.

వేమూరి వేంకట రామనాథం
అసలు కారణం

‘‘అసలు, ఆమెకు ఇష్టం లేదు మొదట్లో అదిగో, సరో, బస్సు ఆగింది. శంకరంగారు వస్తున్నారు, కొంచెం వెళ్ళి’’
సరోజని ఒక్క గంతున బస్సు యొద్దకు పోయింది, శంకరాన్ని తోడ్కొనిరావటానికి.
‘‘మనం లోనికి పోదాంపద సుందరం’’ అంటూ శర్మ అందంగా అన్నీ అమర్చిన హాలులోనికి త్రోవతీశాడు.
సరోజని అంతకుముందు శంకరాన్ని చూడలేదు. అతడు కూడ మెను చూసి ఎఱగడు. ఎవరో బస్సు ఎక్కటానికి పరుగెత్తి వచ్చిన పిల్లవంక చూసినట్లు చూశాడు, నవ్వీ నవ్వనట్లు. ఆమె ‘‘నమస్తే’’ అంటూ అతని వెనుకనే రావటంచూసి, ఆమెకూడ ఆనాటి పార్టీకి చెందినదేనని నిర్ణయించుకున్నాడు.
‘‘నమస్తే, నా అదృష్టమండీ, మీబోటివారి పరిచయం కల్గటం’’
సరోజని కనులు పైకెత్తకే, ‘‘ఇది నా అదృష్టమూ’’
‘‘అనుకుంటారు, అంతేనా’’ అంటూ పెద్దగా నవ్వి ఆమె వంక చూశాడు, ఆమె కూడా తన పరిహాస కోలాహలంలో మునిగి తేలుతుందన్నట్లు.
ఆమెకు నవ్వు రాలేదు. అప్పటికే శర్మ వీధిగడపలో నిలబడి, ‘‘హల్లో హల్లో, శంకరంగారు, రండి మిరతులను లోపల కూర్చోపెట్టటంతో మీ బస్సుదాకా రాలేకపోయినాను’’
‘‘ఫరవాలేదు, మీ తరపున ఈమె వచ్చింది, ఎంత చాకచక్యంగా మాటాడగలదండీ’’ అంట ఆమె వంకకు తిరిగాడు, ఆమె అప్పటికే పదడుగులు దూరంలో ఉన్న లలితను తీసుకువస్తోంది చేతిలో చేయివేసికొని.
‘‘దిగో లలిత, సరిగా టైంకు వచ్చింది దొరసానిలాగా’’ అందరూ నవ్వుతూ లోపలకి వెళ్ళారు.
మధ్య టేబిల్మీద ఒక చక్కని రజతపాత్ర…తళ థల మెరుస్తున్నది. సుందరం దాని అందం గమనిస్తూ అన్నాడు, ‘‘శర్మా, సాధారణ ప్రజలని మన మనుమంటామే, వారి భక్తి భావం, వాత్సల్యం నిజంగా వర్ణనాతీతమోయి’’.
‘‘కాకపోతే, మేమిది కావాలని కోరామా, మా ధర్మం మేము నిర్వర్తిస్తునానమన్న భావంతో మాకు చేతనైన రీతిగా వారికి వయోవిద్య గరపాము. అంతేగదా. మేము వారికి కలిగించిన నూతనోత్తేజానికి ఇది కృతజ్ఞతా చిహ్నమట వద్దంటే విన్నారుకాదు.’’
ఒంటరిగా ఒకమూల నిలబడిన లలితను బుజంమీద దట్టుతూ, సరోజని అన్నది, ‘ఎలాఉన్నది లలితా, ఆ… పాత్రమీద పూలు నీ జాకెట్టుమీద కుట్టిన పూలకన్న బాగున్నాయా?’’
లలిత అన్నది, ‘‘నీకు జాకెట్టుమీద పూలంటే ఇష్టంలేదు నిజమే కాని, మీరుచేసిన పనికి మెచ్చి మీకిచ్చిన బహుమానం మీద పూలయినా నీకు అందంగా ఉంటాయా సరోజనీ?’’
శర్మ అందుకున్నాడు, ‘‘నీకు తెలుసో తెలియదో, లలితా అసలీ సరోజనికి మాతోపాటు మొదటిలో వయోజనవిద్యా ఉద్యమంలో కలిసి పనిచేయటం ఇష్టమేలేదు.’’
‘‘మీ సరోజని నాకు క్రొత్తా? కాని ఇంతధైర్యం ఎలా వచ్చిందా అని మాత్రం ఏం సరోజనీ, స్త్రీలంత ధైర్యంగా ముందకు రావచ్చునా’’ అంటూ నవ్వింది.
శంకరం పెద్ద పెట్టున నవ్వతూ, ‘‘మీ వంటి వారుంటేగాని పార్టీలు నందంగా గడిచిపోవండీ’’ అంటూ లలితను దరిచేరాడు, లలిత వానీ చేతికి కూల్ డ్రింక్ ఒకటి అందించింది.
సుందరం తన గ్లాసు పైకెత్తి ‘‘ఈ ఊరిలో గొల్లపాలెంలో వయోవిద్యను గరపుతూ 300 మందికి అక్షరాస్యతను ప్రసాదించిన శర్మకు, అతని మిత్రవర్గానికి మన అభినందనాలు’’ అంటూ శర్మ చేతిలోని గ్లాసుకు తగిలించాడు.
లలిత సాండ్విచ్లున్న ప్లేటు అందరకూ అందిస్తూ, ‘‘ఇది నీవే చేశావా సరోజనీ’’ అన్నది.
సరోజని ఒక్క త్రుటిలో నవ్వు, నవ్వునుతరమిన ఆశ్చర్యం, చూపుతూ, ‘‘నేను ఇంతకుముందే వచ్చాను మా యింటినుంచి’’ అంది.
సుందరం, శకరం, శర్మ చూపించే ఫోటోలను ఉత్సాహంతో చూస్తున్నారు. ప్రక్కనే ఉన్న గ్రామఫోను రికార్డుల మీదకువారి దృష్టిపోయింది. అవనిన ఒక్కొక్కటి తీసిచూశారు. చివరకు సుందరంఅన్నాడు. ‘‘శర్మా, మొన్నటి తెలుగు రికార్డు లేమయినాయి? చాల బాగున్నాయి?’’
‘‘అవి మనవికాదుగా శేషుదగ్గరనుంచి తీసుకువచ్చాను. చాలా బాగున్నాయి కాదు?’’
‘‘ఊ అని మా కంపెనీకి కొన్నా బాగుండుననుకొంటాను. అవి ఇప్పుడు తెప్పిస్తే బాగుంటుందోయి చక్కనిపాటలు’’
అవును చక్కని పాటలే, తెప్పిస్తే బాగుంటుంది. శర్మతటాలున సరోజనివంక చూశాడు. సరోజిని తన మఫ్లర్ మెడకు చుట్టుకొని, ‘‘నేను వెళ్ళి తీసుకువస్తానండీ’’ అంటూ వీధివైపు బయలుదేరింది.
సుందరం చిన్నపోయిన మొగంతో అన్నాడు, ‘‘మీరు, మీ రొక్కరూ వెతారా, నాకోసం నా కంత బాగుండలేదు.’’
‘‘ఫరవాలేద’’ని శర్మ, సరోజిని ఏకకంఠంగా పల్కారు.
తటాలున శంకరం అన్నాడు, ‘‘నేను మీకు తోడువస్తాను. ఏదీ, చేయి కడుక్కొని వస్తాను’’ అంటూ బాత్ రూమ్ వైపు వెళ్ళాడు. లలిత వానివెంట వెళ్లింది తుండుచేతపట్టుకొని.
‘‘సరో, త్వరగారా. బస్సుమీద పోయిరండి పదినిమిషాల కన్న ఎక్కువపట్టదు.’’
‘‘నాకోసం మీకు వృధాశ్రమగదా’’ అన్నాడు సుందరం.
‘‘ఫరవాలేదులే సుందరం. అన్నట్లు, నీకు నచ్చిందా సరోజని? ఇదే ఇంటర్వ్యూ అనుకో. ఉద్యోగం ఇస్తావుకదూ మా సరోజినికి?’’
సుందరం నవ్వుతూ అన్నాడు, ‘‘రికార్డులు త్వరగా తెస్తే సరి’’
శంకరం తిరిగి వచ్చాడు, సరోజనివెంట బైటకు నడచాడు. వారి అదృష్టం, వీధిలో కాలుపెట్టగానే బస్సు అందింది.
అసలా రోడ్డుమీద బస్సులు ఎక్కువగా తిరుగుతూనే ఉంటాయి కాన, ఒక్కొక్కప్పుడు ఎంత వ్యవధిగానో వస్తాయి. పైగా జనం క్రిక్కిరిసి ఉండటంవల్ల సీటుకూడా దొరకకపోవచ్చును. అక్కడ శేషు యింట్లో ఉన్నాడు కూడ. అడగగానే రికార్డులు ఇచ్చాడు.
సరిగా పదినిమిషాలలో వచ్చి వాలింది సరోజని. సుందరం తన అభివందనాలు తెలిపాడు. సరోజని సరాసరి పోయి గ్రామఫోను పెట్టింది. లలిత అడిగింది, ‘‘తకు శంకరంగారిని ఎక్కడ దాచివచ్చావు సరోజని?’’
‘‘వస్తారు, కాచుకో,… తరువాత బస్సులో…’’
అంటూ ఉండగానే శంకరం కూడ అరుదెంచాడు, ‘‘అబ్బ, ఈనాడు బస్సులెంత క్రిక్కిరిసి ఉన్నాయి’’ అనుకుంటూ. ఎవరు తనవంక ప్రత్యేకంగా చూడలేదు. సరాసరి గ్రామఫోను దగ్గరకు పోయినాడు, ‘చాల చక్కని పాటకాదూ’ అనుకుంటూ.
సరోజనికి దాహమయినట్లుంది, లోపలికిపోయి ఒక గ్లాసుతో నీళ్లు తెచ్చుకున్నది. రికార్డు అయిపోగానే, పోయి పిన్నుమార్చి, కీ యిచ్చి, మరొక రికార్డు పెట్టింది. అలా ఇరవైముప్పది నిముషాలు గడిచిపోయినాయి. మధురమయిన గీతాలతో రికార్డులు గిర్రరున తిరుగుతున్నాయి. కుదిలించే తలపులేవో సరోజని హృదయాన్ని గిర్రున త్రిప్పుతున్నాయి… పాటకొక్క క్రొత్తపిన్ను తగిలించుతోంది. మాటిమాటికి తన మనఃఫలకాని కేదో గ్రుచ్చుకొన్నట్లు ఉన్నది. పాటలలో రాగాలాపన శ్రావ్యంగా ఉన్నది. తనలో మాత్రమేదో రహోవిలాపం ఆస్ఫుటంగా పొరలుకువస్తున్నది.
పార్టీ ఎప్పుడు పూర్తిఅయిందో ఆమె కనిపెట్టనేలేదు, లలిత వచ్చి పాడేపాడే రికార్డు ఆపేవరకు. ఒకరినొకరు చిరునవ్వుతో సాగనంపుకున్నారు.
గ్రామఫోను మూసి సరోజని లోనికిపోయి కూర్చున్నది టేబిల్మీద తలవాల్చుకుని. శర్మ తన చిన్న సూట్కేసుకు తెచ్చి టేబిల్మీద పెట్టాడు. ‘‘సరో, ఏమలా ఉన్నావు, శేషుదగ్గరకు వెళ్ళివచ్చినప్పటి నుండి?’’
వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నది. ‘‘నన్ను ఒంటరిగా పోనిచ్చినా బాగుండేది…. ఎంత సిగ్గయింది బస్సులో నా కెలాగో ఒక సీటు దొరికింది, కూర్చున్నాను. ఆ శంకరంగారికి సీటులేదు. కండక్టరు ‘‘ఎవరూ నిలొచనరాదు, కూర్చొండి’’ అంటున్నాడు. శంకరం గారు జరగమన్నట్లు నావంక చూశాడు. నేనుమాత్రం వానివంక చూడనట్లు కూర్చున్నాను. కండక్టరేమో, ‘‘సీటు లేకపోతే మరొక బస్సులోరండి’’ అన్నాడు శంకరంగారితో. ఈయనమాత్రం, ‘‘కాదబ్బాయి, మేమిద్దరం ఒకటి, కలిసిపోవలసిన అవసరమున్నదన్నాడు’’ ‘‘నన్నేమి చేయమనానరు, మరి కూర్చోండి అయితే, నిల్చొనటానికి మాత్రము వీలులేదు. పోలీసుస్టేషను ముందు ఉన్నది’’ అన్నాడు కండక్టరు. ఇంక ఏం చెయ్యను, నేను కొంచెం జరగక తప్పిందికాదు, ఆ యిరుకుసీటులో’’ అంటూ కన్నీరు మ్రింగుతుంది.
‘‘తిరిగి వచ్చుప్పుడు? ఆయనవెనుక ఎలా పడ్డాడు?’’
‘‘నేను కొంచెం తెలివినపడ్డాను. బస్సు ఆగింది. ఆయనను ముందు ఎక్కమన్నాను. నేను చీర కాలికి అడ్డుపడ్డట్లు నటించి ప్రక్కకు తిరిగి సర్దుకుంటున్నాను. కండక్టరు నావంక తిరిగినప్పుడు తన బస్సు పోవచ్చునన్నట్లు చూశాను. అయితే నేను అక్కడే దిగపడ్డాను. బస్సుపోయింది.’’
‘‘మరి నీవే ముందువచ్చావే’’
‘‘వినండి. ఆ శంకరంగారు తెలివితక్కువవాడా ఏం? తరువాత బస్సుస్టాపుదగ్గర దిగి నాకోసం కాపువేశారు. నా అదృష్టవశాత్తు, నేను తర్వాత ఎక్కిన బస్సు మరీ క్రిక్కిరిసి ఉండటం చేత ఆ స్టాపుదగ్గర అసలు బస్సు ఆగనేలేదు.’’
‘‘కథలోలాగ అయింది సరో’’ అంటూ శర్మ సూటుకేసు తెరిచాడు. ఎవరో బయట దగ్గినట్లు వినపడింది. ‘‘ఎవరు’’ అంటూ బైటకు తొంగిచూసేలోగా సుందరం గాడు అగుపడి, ‘‘క్షమించండి మిమ్మల్ని డిస్టబ్ చేసినందుకు. సరోజని గారు నా కారులో వస్తే వారి యింటిదగ్గర దింపిపోతాను’’ అన్నాడు.
‘‘ఏం సరో’’
‘‘వద్దు, మీకు కృతజ్ఞతలండీ. నన్ను ఒంటరిగా పోనీయండి’’ అంటూ సరోజని లేచి నిలిచి వానికి నమస్కారంచేసింది. సుందరం కారు బుర్రుమన్నది. శర్మ వానిని సాగనంపి లోనికి వచ్చాడు.
సరోజని సూటుకేసులోని నీలం జాకెట్టు గుడ్డను బైటకు లాగింది. ‘‘ఏం, ది నాకోసమేగా మీరు తెచ్చారు?’’
‘‘సరిపోతుందా సరో, నాకు ఎంత తేవాలో తెలియలేదు’’
గుడ్డ మూరతో కొలిచిచూచి, ‘‘ఓ చక్కగా సరిపోతుంది. నాకు ఉద్యోగం వచ్చిన మరునాడు దీనితో అందమైన కొత్త ఫాషనులో జాకెట్టు కుట్టుకు మీకు కనపడుతాను.’’
‘‘మంచిదే సరో’’ ద్దరు బైటకు నడిచారు.
దాదాపు సరోజని యింటిదాకా శర్మ వెంట వెళ్ళాడు. తమ వయో విద్యోద్యమంలోని తరువాత కార్యక్రమంగురించి, ఆనాటి తమ పార్టీని గురించి, అవీ యివి మాట్లాడుకుంటూ వెళ్లారు. మధ్యలో సరోజని అన్నది ‘‘ఆ లలిత యిల్లు ఇదే’’ అని.
శర్మ అడిగాడు, ‘8లలిత అంటే నీతో యింటరు చదివి తరువాత బి.యే.లో చేరింద, ఆ పిల్లేకదూ.’’
‘8అవునవును, నేను బి.యే. ఆనర్సు అని మీ గర్వంకదూ’’ అంటూ సరోజని తన యింటిగుమ్మంవైపు గంతు వేసింది.

———–

You may also like...