పేరు (ఆంగ్లం) | Chebrolu Saraswatidevi |
పేరు (తెలుగు) | చేబ్రోలు సరస్వతీదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | రాజా గోపాలమనాయుడు. |
పుట్టినతేదీ | 1/1/1900 |
మరణం | – |
పుట్టిన ఊరు | పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సరస్వతీ రామాయణము, శ్రీ సరస్వతీశతకము, సత్యనారాయణ వ్రతకల్పము, ఆత్మోపదేశము, పతివ్రతాశతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవి కలహంసి |
ఇతర వివరాలు | ఈమె జటప్రోలు సంస్థానకవి వాజపేయాజుల రామసుబ్బరాయశాస్త్రి స్థాపించిన స్నేహలతా సంఘానికి ఉపాధ్యక్షురాలుగానూ, గృహలక్ష్మి మాసపత్రికకి ఉపసంపాదకురాలుగానూ పనిచేసారు. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చేబ్రోలు సరస్వతీదేవి |
సంగ్రహ నమూనా రచన | కవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. |
చేబ్రోలు సరస్వతీదేవి
కవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు.
ఈమె భర్త నూజివీడు జమీందారైన రాజా గోపాలమనాయుడు. ఈమెకు ముగ్గురు కుమారులు.
సరస్వతీదేవి సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. ఈమె గురువు కందాడై కృష్ణమాచార్యులు, పంచకావ్యములు, నాటకాలంకారములు జ్ఞానసముపార్జన దృష్టితో బోధించేరని సుమిత్రాదేవి పేర్కొన్నారు.
ఈమె జటప్రోలు సంస్థానకవి వాజపేయాజుల రామసుబ్బరాయశాస్త్రి స్థాపించిన స్నేహలతా సంఘానికి ఉపాధ్యక్షురాలుగానూ, గృహలక్ష్మి మాసపత్రికకి ఉపసంపాదకురాలుగానూ పనిచేసింది.
———–