పేరు (ఆంగ్లం) | Acharya Atreya |
పేరు (తెలుగు) | కిళాంబి వెంకట నరసింహాచార్యులు |
కలం పేరు | ఆచార్య ఆత్రేయ |
తల్లిపేరు | సీతమ్మ |
తండ్రి పేరు | కృష్ణమాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 5/7/1921 |
మరణం | 9/13/1989 |
పుట్టిన ఊరు | మంగళంపాడు సూళ్ళూరుపేట మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ |
విద్యార్హతలు | – |
వృత్తి | కవి, రచయిత నిర్మాత మరియు సినిమా దర్శకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘ప్రవర్తన’, ‘ఎన్.జి.వో’ ‘కప్పలు ‘విశ్వశాంతి’ ‘సామ్రాట్ అశోక’, భయం , |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు |
ఇతర వివరాలు | సినీ రచయిత: ముద్దుల మొగుడు (1983) (writer) ఎస్.పి.భయంకర్ (1983) (dialogue) గుప్పెడు మనసు (1979) (dialogue) జీవన తరంగాలు (1973) (screenplay and dialogue) కన్నెమనసులు (1966) (screen adaptation) డాక్టర్ చక్రవర్తి (1964) (dialogue and screen adaptation) మురళీకృష్ణ (1964) (dialogue) వెలుగు నీడలు (1964) (writer) మూగ మనసులు (1963) (writer) ఆరాధన (1962) (సంభాషణలు మరియు పాటలు) వాగ్దానం (1961) (screenplay and dialogue) పెళ్ళి కానుక (1960) (dialogue) శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) (adaptation) (dialogue) జయభేరి (1959) (story and dialogue) మాంగల్య బలం (1958) (dialogue) తోడి కోడళ్ళు (1957) (adaptation) (dialogue) అర్ధాంగి (1955) (writer) గుమస్తా (1953/II) (dialogue) (story) కన్నతల్లి (1953) (writer) నిర్మాత:దర్శకుడు: వాగ్దానం (1961) |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆచార్య ఆత్రేయ ఎవరు దొంగ ..నాటకం |
సంగ్రహ నమూనా రచన | పాత్రల పరిచయం : దొంగ , చౌదరి ,కానిస్టేబుల్ , సబ్ ఇనస్పెక్టరు , వార్డెను , డి .ఎస్ .ఓ , మునుసబు , డాక్టరు , పత్రికా విలేకరి , యిద్దరు ఖైదీలు , కుర్రవాడు . తెర ఎత్తకుండానే నాటకం మొదలవుతుంది . మొట్ట మొదట నాటకం మొదలు పెడుతున్నారని ప్రేక్షకులకు తెలియడానికి – మైక్ లో ఫలానా వారు ఫలానా వారు రచించిన “ ఎవరు దొంగ “ అన్న ఏకాంకిక ప్రదర్శిస్తారు అని ప్రకటన చేయబడుతుంది . |
ఆచార్య ఆత్రేయ
ఎవరు దొంగ ..నాటకం
పాత్రల పరిచయం :
దొంగ , చౌదరి ,కానిస్టేబుల్ , సబ్ ఇనస్పెక్టరు , వార్డెను , డి .ఎస్ .ఓ , మునుసబు , డాక్టరు , పత్రికా విలేకరి , యిద్దరు ఖైదీలు , కుర్రవాడు .
తెర ఎత్తకుండానే నాటకం మొదలవుతుంది . మొట్ట మొదట నాటకం మొదలు పెడుతున్నారని ప్రేక్షకులకు తెలియడానికి – మైక్ లో ఫలానా వారు ఫలానా వారు రచించిన “ ఎవరు దొంగ “ అన్న ఏకాంకిక ప్రదర్శిస్తారు అని ప్రకటన చేయబడుతుంది .
తరువాత బెల్ అయిన వెంటనే పోలీస్ విజిల్స్ నాలుగైదు వరుసన గోలగా వూదబడతాయి . నలుగురైదుగురు బూట్ల కాళ్లతో పరుగెత్తుతూ వున్న ధ్వని రాను రాను దగ్గరవుతుంది . కాస్సేపటిలో ఒకడు తెర ముందు నుంచి వాయు వేగంతో పరుగెత్తు కొచ్చి స్టేజి దిగి ప్రేక్షకుల్లోకి వెళ్లి కూచుంటాడు . ఆ తరువాత ఒకతను పరుగెత్తు కొచ్చి ఆగి అటు ఇటు చూచి , స్టేజి దిగి , ప్రేక్షకుల దగ్గర కొచ్చి ప్రేక్షకులనంతా కలియ చూచి , ముందు వరసలో వున్నా వాళ్లను చూచి —–
అతడు : అరే , ఇలా ఒకతను పరుగెత్తు కొచ్చాడు . చూచారండి మీరు ? ఇప్పుడే వచ్చాడు , అరే ! ఇంత లో ఎలా వెళ్లాడు ? దొంగ వెధవ , మీరెవరూ చూడలేదాండి ? వాడు దొంగండీ . మనమంతా ఇక్కడున్నామని తెలిసి ఎలా వచ్చాడో వచ్చాడు హాస్టల్లోకి . మెల్లగా అటు ఇటు చూచి స్టోర్సు తాళం పగల గొట్టి లోపల దూరాడు సార్ . రాస్కల్ . నేను కనబడేటప్పటి కల్లా పరారయ్యాడు . కాస్త చూడండయ్యా ! చూడండీ .
(ప్రేక్షకులలోంచి ఒక కుర్రాడు లేచి )
కుర్రాడు : అరే ! హాస్టల్లో దొంగ దూరాడా ? ఏం పట్టుకెళ్ళాడో ! ఇప్పుడే ఇలా ఎవరో పరుగెత్తుకొచ్చారోయ్ .
2 వ వాడు : (తమిళంలో ) ఆమా ఆమా , నాను పాతేన్ ఇప్దిదా వందాన్ .
3 వ వాడు : (ఇంగ్లీషులో ) జస్టు ఐ సా యే ఫాలో రన్నింగ్ దిస్ వే .
4 వ వాడు : ఏరా , ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్ కాదు గదా కొంపదీసి ?
1 వ వాడు : అయితే వార్డెన్ తో చెప్పవా ?
అతను : వార్డెన్ ఎక్కడ ?
1 వ వాడు : చూడు , బ్రదర్ , చూడు . ఆ మేకప్ రూంలో ఉంటాడేమో , పద , పద .
ఒకటవవాడు , అతడు స్టేజీ మీదకు పరుగెత్తుతారు . ఇంతలో వార్డెన్ వస్తూ –
వార్డె : ఐ సే , ఏమిటీ గోల ! నాటకం జరగనీకుండా . వాట్ ఈజ్ రాంగ్ విత్ యు !
అతను : హాస్టల్ స్టోర్సు లో దొంగ పడ్డాడండి .
వార్డె : దొంగ !
1 వ వాడు : అవునటండి .
వార్డె : తాళం పగల గొట్టాడా ?
అతను : అవునండీ !
వార్డె : మనిషిని చూశావా ?
అతను : ఎవడో బెగ్గర్ వెధవండి . రేగ్స్ (చింకి పాతలు ) లో ఉన్నాడు .
వార్డె : వాచ్ మెన్ అంతా ఏం చేస్తున్నారోయ్ ?
1 వ వాడు : ఇక్కడ నాటకం చూడడానికొచ్చేశారండి .
వార్డె : నాన్ సెన్స్ . ఆ వెధవలకూ వైజ్ఞానిక వారోత్సవాలు కావలసి వచ్చినాయ్ ? కమాన్ కమాన్ . వెళ్లి అక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి .(పోబోతూ , వెనక్కు తిరిగి ) మహాశయులారా ! యీ అవాంతరం కలిగినందుకు విచారిస్తున్నాం . తొందరలో ఇంజనీరింగు కాలేజీ వారి నాటకం మొదలెడతాం . మీరు కాస్త ప్రశాంతంగా వుండాలి . ఇప్పుడే వస్తా .(అని పోబోతుండగా ఎదురుగా పోలీస్ సబినస్పెక్టర్ , కానిస్టేబుల్ వస్తారు .)
వార్డె : పోలీస్ !!!!
సబినస్పెక్టర్ : గుడ్ మార్నింగ్ సార్ .
వార్డె : గుడ్ మార్నింగ్ , ఏం కావాలండీ ?
స .ఇ : ఏం లేదండీ , ఈ హాస్టల్ వార్డెన్ గారేవరండీ ?
వార్డె : నేనే , ఎందుకండీ ! దొంగ దొరికాడా ?
స.ఇ : దొంగ ?
వార్డె : ఆ దొంగండి . హాస్టల్ స్టోర్సు లో తాళం పగలు గొట్టి దూరాడు . మనిషి కనపడేటప్పటీ కల్లా పత్తా లేకుండా పోయాడు )
(ఇంతలో లోపల నుంచి ఒక కుర్రాడు పరుగెత్తు కొస్తూ )
కుర్ర : సార్ ! సార్ !
వార్డె : ఏం ?
కుర్ర : మనం నాటకానికి తెచ్చిన డ్రెస్సుల మూటంతా కనపడ్డం లేదండీ .
వార్డె : వెదకండోయ్ ? ఎక్కడో వుంటుంది . అన్నీ ఇప్పుడే వస్తాయి మీకు .
కుర్ర : వెదికామండీ ! ఎక్కడా లేదు . ఇప్పుడే తెచ్చి ఆ బైట డ్రెస్సింగ్ రూం లో పెట్టాం ; ఓ మినిట్ తరువాత చూస్తే లేదు సార్ !
వార్డె : చూచారాండీ ; ఇదీ ఆ దొంగే కొట్టేసుంటాడు ; సందేహం లేదు.
స .ఇ : దొంగ ఎలా పారిపోయాడు ఎవరన్న చూచారా ?
అతను : ఇప్పుడే ఇలా వెళ్ళాడండీ , నేను వాణ్ణి తరుము కొచ్చాను , ఇలా ఆడియన్స్ లో దూరి వెళ్లాడు .
స .ఇ : అరె ! ఎలా ఉంటాడో గుర్తుందా మీకు ?
అతను : కాస్త దూరం నుంచి టార్చి వేసి చూశానండి ; మనిషి ముఖం కనబడలా ! ఒక ముష్టి వాడిలా ఉంటాడు . చిరిగిన చొక్కా , చింపిరితల , అయిదడుగుల రెండంగుళాలు లేక మూడంగుళాలు ఉంటాడు .
స .ఇ : లావుగా ఉంటాడా , బక్కగా ఉంటాడా ?
అతను : మీడియం (మధ్యస్థంగా ) గా ఉంటాడండి .
స .ఇ : (కానిస్టేబుల్ తో ) ఏయ్ ! ఈ గుంపులో ఎక్కడన్నా ఉన్నాడేమో వెతుకు .
(కాని స్టేబుల్ స్టేజి దిగి ఆడియన్సు లోంచి మెల్లగా జారుకుంటాడు .)
స .ఇ : వాడు వెతికి పట్టుకొస్తాడు లెండి ! మీరు కాస్త దయ చేసి స్టేషన్ దాకా రావాలి .
వార్డె : దొంగ దొరకందే !
స .ఇ : దొంగ వాడే దొరుకుతాడు లెండి .
వార్డె : రేపు మార్నింగు రాగూడడూ ? నాకీ ఫంక్షనుంది .
స .ఇ : లేదండీ ! వెంటనే రావాలి .
వార్డె : కాస్త కూచోండి వెళ్దాం ? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ల నాటకం ఉంది . చూచి పోదాం . లాస్ట్ యియర్ (నిరుడు ) ఫస్టు ప్రయిజ్ వచ్చింది వాళ్ళకే . ఈ సారి కూడా మంచి నాటకమే ఆడతారు ; చూచి వెళ్దాం ; ఏమంటారు ?
స .ఇ : నో , ఎక్స్ క్యూజ్ మి ప్లీజ్ . క్షమించండి . మాకు నాటకాలు చూచే తీరికలేదు .
వార్డె : పోనీ రేపు మార్నింగు వచ్చి రిపోర్టు యివ్వకూడందండీ ?
స .ఇ : రిపోర్టు యిది వరకే యిచ్చేశారు . ఇక మీరివ్వాలిసింది సంజాయిషీనే !
వార్డె : ఏమిటీ ?
స .ఇ : యు ఆర్ అండర్ అరెస్టు (మిమ్మల్ని అరెస్టు చేశాం ).
వార్డె : ఏమిటీ ?
స .ఇ : అరెస్ట్ ! మై సెల్ఫ్ ! వాట్ ?(నన్నా ఏమిటి ).
స .ఇ : యు ఆర్ అండర్ అరెస్టు .
వార్డె : ఓ …… …… …
స .ఇ : రాండి సార్ , రాండి :
(ఇంతలో ఒక కానిస్టేబుల్ గబా గబా వస్తాడు .
సబిన్ స్పెక్టరు కి శాల్యూట్ కొట్టి …..)
కాని : సార్ !
స .ఇ : ఏం రా ?
సేకరణ : ఎవరు దొంగ ? నాటకం
———–