చిలకపాటి సీతాంబ (Chilakapati Seethamba)

Share
పేరు (ఆంగ్లం)Chilakapati Seethamba
పేరు (తెలుగు)చిలకపాటి సీతాంబ
కలం పేరుపర్ణశాల సీతాంబ
తల్లిపేరుపర్ణశాల మంగమ్మ
తండ్రి పేరుపర్ణశాల రాఘవాచార్యులు
జీవిత భాగస్వామి పేరునరసింహాచార్యులు
పుట్టినతేదీ10/18/1900
మరణం
పుట్టిన ఊరుకలికివాయి, నెల్లూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపద్మినీపరిణయకావ్యము, సముద్రమధనము(విష్ణుమాయావిలాసము)నాటకము,
దిలీప నాటకము, అరవింద నవల, శూర్పణఖ (ఏకాంకిక), కష్టజీవి (మరికొన్ని కలిపిన సంకలనం), సీతారామాయణమను శతకము(అముద్రితము, అలభ్యము)

కదాచితుగా రాసిన పద్యాలు –

శ్రీ తల్పగిరి రంగనాయక స్తుతి, కృతజ్ఞతాపంచరత్నములు, యశోద పుత్రవాత్సల్యము, రాధాకృష్ణవిలాసము, దసరా
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిరాణి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచిలకపాటి సీతాంబ
సంగ్రహ నమూనా రచనగృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలలో రెండవవారు 1935 లో చిల్కపాటి సీతాంబ గారు. వీరు సింహపురి(నెల్లూరు) వాసులచే కవిరాణి బిరుదు పొందియుండిరి. సీతాంబగారిది నెల్లూరు జిల్లా లోని కలికివాయి గ్రామము. శ్రీమాన్ రాఘవాచార్యులు, మంగమ్మగార్లకి 1900 అక్టోబరు 18 న జన్మించినారు.

చిలకపాటి సీతాంబ

గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలలో రెండవవారు 1935 లో చిల్కపాటి సీతాంబ గారు. వీరు సింహపురి(నెల్లూరు) వాసులచే కవిరాణి బిరుదు పొందియుండిరి. సీతాంబగారిది నెల్లూరు జిల్లా లోని కలికివాయి గ్రామము. శ్రీమాన్ రాఘవాచార్యులు, మంగమ్మగార్లకి 1900 అక్టోబరు 18 న జన్మించినారు. తండ్రివైపు వారంతా సంస్కృతాంధ్ర పండితులు. తండ్రిగారి వద్ద, బావగారు విద్యారణ్య పంచానన శ్రీమాన్ విక్రాల రామచంద్రాచార్యుల వద్ద సంస్కృత వ్యాకరణ పరిజ్ఞానమును, కావ్యనాటక పరిచయమును అభ్యసించినారు. భర్తయైన చిలకపాటి వేంకట నరసింహాచార్యులవారు మంచి పండితులు. ఈ కవయిత్రి సహజ ప్రతిభా విశేషములను ఇంకను ప్రకాశింపజేసినారు.
ఈమెకు మంచి సంస్కృత పాండిత్యమున్నను ఆంధ్రకవితాస్వాదనమందు ఆసక్తి మెండు.
వీరిరచనలు:- పద్మినీ పరిణయకావ్యము, సముద్రమధనము(విష్ణుమాయావిలాసము)నాటకము, దిలీప నాటకము, అరవింద నవల , శూర్పణఖ (ఏకాంకిక), కాదాచిత్క పద్యరత్నములు (శ్రీ తల్పగిరి రంగనాయక స్తుతి, కృతజ్ఞతా పంచరత్నములు, యశోద పుత్రవాత్సల్యము, రాధాకృష్ణ విలాసము, దసరా, కష్టజీవి మరికొన్ని కలిపిన సంకలనం), సీతారామాయణమను శతకము (అముద్రితము, అలభ్యము).
ఈమె ఆశుకవిత్వము చెప్పగలదు. ఒకనాడీమె భర్తయు మరియొక పండితుడు హనుమన్నాటకములోని ఒక శ్లోకము గురించి ప్రస్తావించుకొనుచుండగా తలుపుచాటుననుండి విని దానికి తెలుగుపద్యమును వ్రాసి వారికి పంపినది.
శ్లో. కమఠపృష్ఠ కఠోరమిదం ధనుః
మధురమూర్తి రసౌ రఘునందనః
కధమధిజ్య, మనేక విధీయతాం
అహహ శాతఫణః ఖలు దారుణః
సీతాంబ గారి అనువాదము
తేటగీతి : కమఠపృష్ఠ కఠోరమీ కార్ముకంబు
సరస సుకుమారుడీ రామచంద్రమూర్తి
ఎటులనెక్కిడ నేర్చునో యేమి యౌనొ
కటకటా యేమి శపథంబు కన్నతండ్రి.
(ఈ ఉదంతమువలన ఏమి తెలుస్తుందంటే ఆకాలంలో స్త్రీల ఆచారవ్యవహారములపై ఎన్ని ఆంక్షలున్నా, వారి విద్యావికాసముపైన ఆంక్షలు లేవని. కదండీ) అప్పుడప్పుడు పత్రికలకు పంపిన పద్యరత్నములను కలిపి కాదాచిత్క పద్యరత్నములు అను పేరున ముద్రించబడినాయి.

———–

You may also like...