గిడుగు లక్ష్మీకాంతమ్మ (Gidugu Lakshmikantamma)

Share
పేరు (ఆంగ్లం)Gidugu Lakshmikantamma
పేరు (తెలుగు)గిడుగు లక్ష్మీకాంతమ్మ
కలం పేరు
తల్లిపేరుచెల్లాయమ్మ
తండ్రి పేరుగవర్రాజు
జీవిత భాగస్వామి పేరుగిడుగు వెంకట రామమూర్తి
పుట్టినతేదీ2/2/1903
మరణం
పుట్టిన ఊరురాజమండ్రి
విద్యార్హతలుహైస్కూలులో నాలుగవ ఫారం
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలులక్ష్మీశారదా గీతములు, లక్ష్మీశారదా శతకములు, లక్ష్మీశారదా సుభాషితములు, కుమారనీతి (శతకము), తిరుపతి వెంకటేశ్వరశతకము, శతక రామాయణము
ఆరోగ్యసామ్రాజ్యము, పితృస్మృతి, మానసిక సామ్రాజ్యము, లేఖదూత
వరకట్న నిరసనము, రామచంద్ర శతకము, కన్నీరు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1951లో గృహలక్ష్మి స్వర్ణకంకణము లభించింది.
ఇతర వివరాలులక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు. రెండవవారు జొన్నలగడ్డ శారదాంబ.1917 అక్టోబరులో ఈమెకు గిడుగు వెంకట రామమూర్తి పంతులుతో వివాహం జరిగింది. ఇతడు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేశాడు. ఇతని బాబాయి వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు వెంకట రామమూర్తి పంతులు. లక్ష్మీకాంతమ్మ భర్త ప్రోత్సాహంతో సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం సంపాదించింది. ఈమెకు పది మంది సంతానము. ఏడుగురు కుమార్తెలు. ముగ్గురు కొడుకులు. ఈమె కవిత్వం వాసే తొలినాళ్లలో ఈమె ఆడపడుచు జొన్నలగడ్డ శారదాంబ తోడయ్యింది. ఇద్దరికీ ఒద్దిక కలిగి ‘లక్ష్మీశారదలు’ అనే పేరుతో జంటకవయిత్రులుగా కవితలు అల్లినారు. జొన్నలగడ్డ శారదాంబ 1944లో మరణించింది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగిడుగు లక్ష్మీకాంతమ్మ
సంగ్రహ నమూనా రచన1951 లో స్వర్ణకంకణం పొందిన గిడుగు లక్ష్మీకాంతమ్మ గారు ఒకవైపు పదిమంది సంతానమునకు తల్లిగా, గృహిణిగా బాధ్యతలు ఓర్పుతో నిర్వహించుచూ మరొకవైపు భాషామతల్లికి సేవలందించిన సతీవతంసము. రాజమహేంద్రవరమున 1903 ఫిబ్రవరి మూడవ తేదీన జన్మించినారు. మాతామహ వంశము వారు కవిత్వాభిమానులు కావడంతో సద్విద్య లభించినది. గిడుగు రామమూర్తి పంతులుగారి అన్న కుమారుడైన గిడుగు వేంకట రామమూర్తి పంతులుగారు ఈ కవయిత్రి భర్త.

గిడుగు లక్ష్మీకాంతమ్మ

1951 లో స్వర్ణకంకణం పొందిన గిడుగు లక్ష్మీకాంతమ్మ గారు ఒకవైపు పదిమంది సంతానమునకు తల్లిగా, గృహిణిగా బాధ్యతలు ఓర్పుతో నిర్వహించుచూ మరొకవైపు భాషామతల్లికి సేవలందించిన సతీవతంసము. రాజమహేంద్రవరమున 1903 ఫిబ్రవరి మూడవ తేదీన జన్మించినారు. మాతామహ వంశము వారు కవిత్వాభిమానులు కావడంతో సద్విద్య లభించినది. గిడుగు రామమూర్తి పంతులుగారి అన్న కుమారుడైన గిడుగు వేంకట రామమూర్తి పంతులుగారు ఈ కవయిత్రి భర్త. వారూ మంచికవి, పండితుడు. భార్యకు, చెల్లికి కవిత్వాభ్యాసము చేయించినారు. ఈ కవయిత్రి భర్త వద్ద సంస్కృతం అభ్యసించిరి. వీరి గ్రంథములన్నియు యెక్కువగా శారదాంబ పేరు కూడా కలిపి లక్ష్మీశారదా గీతములు , లక్ష్మీశారదా శతకములు, లక్ష్మీశారదా సుభాషితములు , లక్ష్మీశారదా కుమారీనీతి అని కలవు. లేఖదూత, తిరుపతి వేంకటేశ్వర శతకము, రామచంద్రశతకము ,కన్నీరు అనునవి అముద్రితములు. భర్త ఉద్యోగరీత్యా బదిలీ చేయబడినపుడు ఒకరినొకరు ఎడబాసి ఐదునెలలు వియోగావస్థలో గడపవలసి వచ్చినది. ఈ సమయమున భార్యాభర్తలిరువురు వ్రాసికొన్న లేఖలు పద్యరూపములో ఉన్నవి. ఇరువురూ రచనాకౌశలము గలిగియుండుటచే ప్రతిపదమూ పద్యమైనది.
ప్రేయసీప్రియులు వేరు ప్రదేశములనుండి వియోగము అనుభవించుట విప్రలంభశృంగారముగా పరిగణింపబడినది. పూర్వమున మేఘము, హంస వంటి దూతలతో విరహంలో ఒకరికొకరు సందేశాలంపుకొనుట కావ్యములుగా రచింపబడిన విషయము విదితమే. వీరి నడుమ నడచిన లేఖలలో పరస్పర అనురాగ ప్రకటన, సంతానము యొక్క క్షేమవార్తలు తప్ప శృంగార భావప్రకటన లేదు. వీటిలో కొన్ని పద్యములనేరి లేఖదూత అను పేరున ప్రకటించిరి. ఇందు రెండుభాగములు కలవు. మొదటిభాగమున భార్యాభర్తల లేఖలు, రెండవభాగమున వియ్యపురాలు, తోడికోడలు గార్లతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములు పద్యరూపముననున్నవి. 1934 సెప్టెంబరు నుండి 1935 జనవరి వరకూ సాగినవీ లేఖలు. భర్త మరణించిన పిదప కన్నీరు వ్రాసిరి. అది అముద్రితము.

———–

You may also like...