పేరు (ఆంగ్లం) | Mantha Venkataramanarao |
పేరు (తెలుగు) | మంథా వెంకటరమణారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కథలు: అక్షర జ్యోతి, అగ్ని పరీక్ష, అడుగుల సడి, అమ్మా! త్హలన్హొప్పి!!, ఆఖరి తప్పు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మంథా వెంకటరమణారావు ఆఖరి తప్పు |
సంగ్రహ నమూనా రచన | స్థలం రైల్వేస్టేషను. కూలీలకేకలు, అమ్మకపువాళ్ళ అరుపులు, ప్రయాణీకుల గోల, ముష్టీవాళ్ళ దీనాలాపాలు ఇంజన్లకూతలు. ఇంతలో లౌడ్ స్పీకర్ లోనుండి బొంగురుగా ఒక కంఠం. ‘‘మద్రాసు మెయిలు మరొక ఐదునిమిషాలలో బయల్దేరుతుంది.’’ ఒక కంపార్ట్ మెంట్ తలుపు తెరుచుకుంటుంది. |
మంథా వెంకటరమణారావు
ఆఖరి తప్పు
స్థలం రైల్వేస్టేషను. కూలీలకేకలు, అమ్మకపువాళ్ళ అరుపులు, ప్రయాణీకుల గోల, ముష్టీవాళ్ళ దీనాలాపాలు ఇంజన్లకూతలు.
ఇంతలో లౌడ్ స్పీకర్ లోనుండి బొంగురుగా ఒక కంఠం.
‘‘మద్రాసు మెయిలు మరొక ఐదునిమిషాలలో బయల్దేరుతుంది.’’ ఒక కంపార్ట్ మెంట్ తలుపు తెరుచుకుంటుంది.
ఒక వ్యాపారి: వెంకట్రావ్ గారూ, భోజనం చెయ్యకపోయినా ఫలహారం ఏమన్నా పుచ్చుకోరూ?
వెంక : రాజమండ్రీలో పూర్తిగా టిఫిన్ తీసుకునే ఎక్కేను బండి, ఆకలిగాకూడా అనిపించడంలేదు. మరోగంటకల్లా మా ఊరు.
వ్యాపారి : సరే మీ ఇష్టం.
వెంక : ఎలా ఉంది బెజవాడ భోజనం?
వ్యాపా : ఈ స్టేషను భోజనాలమీద నాకదొకరకమైన విరక్తి భావం ఉండేది చూసేరుకదూ. మరి ఇన్నిసార్లు వ్యాపారరీత్యా ఈఊరుమీంచి వెళ్లేరు. ఇంతవరకు ఇక్కడ భొంచెయ్యలేదు. ఇదే మొదటి సారి.
వెంక : విరక్తి తప్పక కలుగుతుంది లెండి. ఇంట్లోలా ఉంటుందా?
వ్యాపా : మీకాశ్చర్యం వెయ్యొచ్చు. ఇంట్లోకన్నా బాగుంది.
వెంక : ఇంట్లోకన్నా బాగుందా? నాకు నమ్మకం లేదు.
వ్యాపా : ఓసారి తినిచూడండి.
వెంక : అయితే అదృష్టవంతులే. సంక్రాంతి అయినందుకు ఇంట ఉండకపోయినా మంచి భోజనం దొరికింది.
వ్యాపా : పీకలమీది పనికాబట్టి… లేకపోతే కదిలేవాడినా? ఈ వ్యాపారంలో ఎప్పటిదప్పుడు తెగిపోతేనేకాని…
వెంక : మీరు దిగాల్సీన స్టేషన్ ఇంకా ఎంత దూరం ఉంటుంది?
వ్యాపా : మనమిద్దరమే ఉన్నట్టుంది పెట్టెలో. అయినా సంక్రాంతి పూటా ఎవడు బయల్దేర్తాడు లెండి. ఎవడో నాలాటి దరిద్రుడు తప్పించి… మీరు కలవరండోయి. హహహ మాదంతా డబ్బుగురించి ప్రాకులాట.
వెంక : (గొంతు తగ్గించి) పోలీసులా ఉన్నారెవరో ఆయన… ఆ మూడోసొరుగులో మీదని పడుక్కున్నారు.
వ్యాపా : (బాగా గొంతు తగ్గించి) పోలీసా, అయినా ఈ కొత్తరకం పెట్టెలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఈ సొరుగులూ అవీను. పక్క సొరుగులో ఎవరున్నదీ తెలీదు. (రైలుకూత పెట్టి కదుల్తుంది.)
వెంక : (ఆత్రంగా) ఎవరా అమ్మాయి. మనపెట్టె వేపే పరుగెత్తుకొస్తోంది?
వ్యాపా : ఆఁ? అర్రెర్రె. ఉండండుండండి. తలుపు తీస్తున్నా.
వ్యాపా : ఆబ్యాగ్ ఇలా ఇవ్వండి ముందు. తొందరొద్దు… జాగర్త. (ఆమె రైలెక్కుతుంది. బాగా ఆయాసంతో ఒగర్చువస్తుంది.)
వ్యాపా : ఆలస్యంగా వచ్చినట్టుంది…
స్త్రీ : (మౌనం)
వ్యాపా : బాగా అలసిపోయేరు.
స్త్రీ : (మౌనం)
వెంక : (మృదువుగా) మీరింక గాభరాపడనవసరం లేదులెండి. రైలందుకున్నారుగా.
స్త్రీ : (మౌనం)
వ్యాపా : ఇవాళ పెట్టంతా ఖాళీయే, కూర్చోండి.
స్త్రీ : (ఇంకా ఒగరుస్తూనే) దేముడు నిజంగా రక్షించేడు.
వ్యాపా : (సరిగ్గా వినబడక) క్షమించాలి. ఏమన్నారు?
స్త్రీ : బండిని అందుకోడం నా అదృష్టం.
వ్యాపా : మీకూ చాలా తొందరపనే అయి ఉండాలి లేకపోతే పండగపూటా…
స్త్రీ : (మెల్లగా) ఔను.. రోడ్డు మీద నిజంగా పరుగెత్తడమే అయింది.
వాయ : (ఆశ్చర్యంగా) రిక్షాలో రాలేదూ?
స్త్రీ : (కొద్దిగా ఊరుకుని) సైకిల్ రిక్షా టైర్ బద్దలయింది. స్టేషన్ ఇంకో ఫర్లాంగుందనగా… ఫర్లాంగేకదా నడిచేద్దామనుకున్నాను. నిజంగా బండిదొరకడం..
వ్యాపా : పాపం, బాగా అలిసిపోయేరు. ప్రయాణం ఉందీ అంటే గంటముందు నుంచీ స్టేషన్లో వెళ్ళికూర్చుంటాన్నేను. రైల్లో కూర్చునేవరకూ అది తప్పిపోతుందన్న బెంగే. ఎంతవరకూ వెళ్తారు?
స్త్రీ : మద్రాసు.
వ్యా : మద్రాసే?
స్త్రీ : వింతగా అడుగుతున్నారేం?
వ్యా : ఒంటిగా వెళ్తున్నారే?
స్త్రీ : ఏం? వెళ్లకూడదా?
వ్యా : (ఊరుకొని) మద్రాసులో మీ ఇల్లా?
స్త్రీ : ఉహు
వ్యాపా : బెజవాడనుకుంటాను. మద్రాసులో చదువుతున్నారేమో…
స్త్రీ : (నీరసంగా) కాదు.
వ్యాపా : ఎవరన్నా బంధువులు కాని పండక్కి రమ్మని నిర్భంధించేరా?
స్త్రీ : (గద్గదస్వరంతో) ఉహుఁ.
వ్యాపా : (ఆశ్చర్యంగా) మీదీ ప్రాతంకాదూ? అర్రెర్రె. ఎందుకలా కంటనీళ్లు పెట్టుకుంటున్నారు? ఏమన్నా కష్టం కలిగే మాటన్నానా? క్షమించండి.
స్త్రీ : (దుఃఖంమధ్య) లేదు. మీరేమీ అనలేదు… (వెక్కి వెక్కి ఏడుస్తుంది)
వ్యాపా : (బాధతో నిండిన గొంతుతో) అయ్యో, ఎందుకలా ఏడుస్తారూ? ఏదన్నా కష్టంలో ఉన్నారా? బాధలేదు. నాతో చెప్పండి మా పిల్లల్లాటివారు.
స్త్రీ : (మరింతకుమిలి కుమిలీ ఏడుస్తుంది)
వ్యాపా : మనస్సు స్థిమితపడ్డాక చెప్పండి. ఎప్పటి కెవరి కెలాటి కష్టాలొస్తాయో చెప్పలేం. ఏబాధ కలుగుతుందో కనుక్కోలేం. మనిషిగా పుట్టాక నాకూ గుండెన్నది ఉంది. గుండె రక్తమేకాకుండా దయకూడా చిమ్మాలని మా గురువుగారన్నారు. నాకు చేతయిన సాయమేమున్నా చేస్తాను.
(ఆమె ఇంకా ఏడుస్తుంది)
ఊరుకోండి, మీ బాధ చెప్పండి. నిజంగా ధైర్యవంతులని మొదట అబ్బురపడ్డాను. ఇంతేనా ధైర్యం.
స్త్రీ : (తేరుకొని) ఇంత… దయతో నిండిన గొంతువిని ఎన్నాళ్లయింది?
వ్యాపా : అబ్బే దయకేముంది, ఇదీ వ్యాపారంలాటిదే. ఇచ్చి పుచ్చుకోడం… నేను మీకు సాయపడితే దేముడు నాకు సాయపడతాడన్న ఆశ. అంతే మరి. నాకు లాభం లేదనుకోకండి. అప్పుడే నవ్వు మానేశారా? ఇంతకీ మీ రెందుకంత బాధపడ్డారు. ఇష్టంలేకపోతే చెప్పబోకండి.
స్త్రీ : (వికారంగా) పండగ. ఆ మాట వినగానే దుఃఖం పొర్లివచ్చింది… పండగ… బంధువులు (ఏడుపు బిగపట్టుకొని) నా కెవ్వరూ… లేరు. (ఏడ్చేస్తుంది.)
వ్యాపా : (విస్తుపోయి) ఆఁ….
స్త్రీ : (కాస్సేపటికి ఏడుపు ఆపుకుంటుంది) మీ కాశ్చర్యం వెయ్యొచ్చు.
వ్యాపా : అవును చాలా ఆశ్చర్యంగా ఉంది.
స్త్రీ : చాలానా?
వ్యాపా : ఔను. మొదట ఒకలా అనుకున్నాను. ఇంకోలా అయినందుకు చాలా ఆశ్చర్యం వేసింది… మీకు ఎవ్వరూ లేరా?
స్త్రీ : ఉహుఁ….
వ్యాపా : చాలా వింతగా ఉందే… క్షమిస్తే… మీకు వివాహం…
స్త్రీ : (గద్గద స్వరంతో) ఉహుఁ.
వ్యాపా : రుమాలిందండి… కళ్లొత్తుకోండి. అంతగా అధైర్యపడి కన్నీళ్ళు కార్చకండి ఒంటికి మంచిదికాదు.
(కొంతసేపు మౌనం)
ఇదంతా ఒక నాటకం.
స్త్రీ : (బెదురుగా) ఆఁ…
వ్యాపా : ఈ జీవితం ఒక నాటకం. మనని ఆడిస్తున్న వాడెవడో ఉన్నాడనుకుంటాం. ఉన్నాడేమో కూడా, మనకి కనుపించడు.
స్త్రీ : (స్థిమితపడి) చెపుతే మీరు నమ్మలేరు… నాకన్నా ఎక్కువ కష్టాలు వచ్చిన వాళ్లు లేకపోలేదు. కష్టాలెప్పుడో ఓనాడు పోతాయంటారు.
వ్యాపా : పోతాయి. వాటికి మనం అంటే విసుగు పుడుతుంది ఓనాటి కన్నా.
స్త్రీ : కాని నేనంటే వాటికి ప్రత్యేక ఆకర్షణ ఉన్నట్టుంది. నాలో అవి ఎప్పటికీ బస ఏర్పరచేసుకున్నాయి. (ఏడుస్తుంది)
వ్యాపా : అలా అని ధైర్యం వదులుకుంటే మరీ బాధ. ధైర్యం లేని మనష్యులంటే వాటికి సరదా. రోజులు మారతాయి రాత్రి ఎప్పుడూ చీకటిగానే ఉండిపోతుందా?… అయితే బెజవాడలో మీరు ఏం చేస్తున్నట్టు ఇన్నాళ్ళూ?
స్త్రీ : ఎన్నాళ్లోకాదు. మూడు రోజులే.
వ్యాపా : ఇంతేనా. అయితే మరి…
స్త్రీ : నా కథ చెప్పి మిమ్మల్ని శ్రమపెట్టలేను.
వ్యాపా : శ్రమ అంటే నే నొప్పుకోను.
స్త్రీ : మాది ఈస్ట్ బెంగాల్.
వ్యాపా : పాకిస్తానా?
స్త్రీ : విభజనకు పూర్వం.
వ్యాపా : అయితే మీరు…
స్త్రీ : నాకన్నా పెద్దవారు… మీరు అని నన్ననకండి.
వ్యాపా : (నవ్వి) ఓ… ఫరవాలేదు.
స్త్రీ : ఈ విభజనముందునుంచీ ఆరంభమయ్యేయి కష్టాలు… మేం స్థితిమంతులం.
వ్యాపా : మాటలనిబట్టే తెలుస్తోంది.
స్త్రీ : తల్లి చిన్నప్పుడే పోయింది మా నాన్నగారు జనపనారలో పెద్ద వ్యాపారస్థులు.
వ్యాపా : ఓహో. మీదీ వ్యాపారమే..
స్త్రీ : ఔను. నా కిద్దరు అన్నలు. నేనంటే వాళ్ళకి ప్రాణం. హిందూ ముస్లిమ్ అల్లర్లకి అన్నలిద్దరూ బలైపోయారు. (వెక్కి వెక్కి ఏడుస్తుంది)
వ్యాపా : ఎంత ఘోరం. ఎంత ఘోరం జరిగిపోయిందీ?
———–