పేరు (ఆంగ్లం) | Deshiraju Bharatidevi |
పేరు (తెలుగు) | దేశిరాజు భారతీదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | అన్నపూర్ణమ్మ |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | దేశిరాజు రామచంద్రరావు |
పుట్టినతేదీ | జులై 1,1914 |
మరణం | – |
పుట్టిన ఊరు | బాపట్ల |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కాంతా శతకము (కందపద్యములతో), ముక్తాంబ, సత్యాప్రతిజ్ఞ అను ఏకాంకికలు, శ్రీకృష్ణమహిమార్ణవము అను వచన గ్రంథము, ముద్దుకృష్ణ అను గీతపద్య శతకము. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1958లో గృహలక్ష్మి స్వర్ణకంకణము పొందేరు. 1956లో “కవిత్రయ కవితారీతులు-తరువాతి కవులపై వారి ప్రభావము” అను విమర్శనాగ్రంథము రచించి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారిచేతులమీదుగా బహుమతి నందిరి. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దేశిరాజు భారతీదేవి |
సంగ్రహ నమూనా రచన | 1958 జులైలో గృహలక్ష్మీస్వర్ణకంకణం పొందిన దేశిరాజు భారతీదేవి గారు గృహిణిగా తనవారి మెప్పును, కవయిత్రి గా విజ్ఞుల గౌరవమును పొందిన భారతీదేవి బాపట్లలో ప్రసిద్ధ న్యాయవాదులు చంద్రమౌళి చిదంబరరావు గారి మనుమరాలు. (కూతురి కూతురు) వీరి తల్లి అన్నపూర్ణమ్మ గారు ఉన్నవ లక్ష్మీబాయమ్మగారితో కలిసి దేశసేవలో కూడా పాల్గొనిరి. భారతీదేవి గారు పాఠశాల పరీక్షలు వ్రాయడం కుదరలేదు. |
దేశిరాజు భారతీదేవి
1958 జులైలో గృహలక్ష్మీస్వర్ణకంకణం పొందిన దేశిరాజు భారతీదేవి గారు గృహిణిగా తనవారి మెప్పును, కవయిత్రి గా విజ్ఞుల గౌరవమును పొందిన భారతీదేవి బాపట్లలో ప్రసిద్ధ న్యాయవాదులు చంద్రమౌళి చిదంబరరావు గారి మనుమరాలు. (కూతురి కూతురు) వీరి తల్లి అన్నపూర్ణమ్మ గారు ఉన్నవ లక్ష్మీబాయమ్మగారితో కలిసి దేశసేవలో కూడా పాల్గొనిరి.
భారతీదేవి గారు పాఠశాల పరీక్షలు వ్రాయడం కుదరలేదు. తండ్రి వద్దనే భారత, భాగవతాది గ్రంథమ్లు పఠించి, విజ్ఞానము సంపాదించిరి. చిన్నతనముననే వ్యాసరచన చేసి బహుమతులు పొందిరి. పద్య గద్య రచనల ప్రవీణులు. ఆకాశవాణిలో ప్రసంగములు కాళిదాసు శకుంతల, ఉత్తరకాండ సీత, సూరన ప్రణీతమైన కళాపూర్ణోదయములోని సుగాత్రి పాత్రలపై విమర్శనము చేసిరి. పోటీగ్రంథ రచనలో పాల్గొని కవిత్రయ కవితారీతులు-తరువాతి కవులపై వారి ప్రభావము రచించి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి చేతులమీదుగా 1956లో బహుమతి నందిరి. స్త్రీలకు నీతిసౌశీల్యములే ప్రధానములు. అవిలేని విద్య విద్య కాదు. హిందూ సుందరులకీ భావములు తప్పక అనుసరణీయములు.’ అని తన అభిప్రాయము తెలిపిరి.రచనలు.. కాంతా శతకము (కందపద్యములతో), ముక్తాంబ, సత్యాప్రతిజ్ఞ అను ఏకాంకికలు, శ్రీకృష్ణమహిమార్ణవము అను వచన గ్రంథము, ముద్దుకృష్ణ అను గీతపద్య శతకము.
1959 ఏప్రిల్ 26 న కేసరి గారి జన్మదిన సందర్భమున గృహలక్ష్మీ స్వర్ణకంకణం పొందిన కవిసింహి గుడిపూడి ఇందుమతీదేవి గారు కవిపండిత వంశమగు మతుకుమల్లి వారింటి ఆడపడచు. వీరి తాతగారు నరసింహ శాస్త్రిగారు ప్రసిద్ధ కవి, పండితసింహుడు. పదవయేటనుండే చిన్న పద్యములు, గేయములు రచించినది. తాతగారు ఇందుమతీ పరిణయమను కావ్యము రచించి వీరికి ఇందుమతి అని పేరిడగా తాతగారి అడుగుజాడలలో నడువవలెనని లక్షణా పరిణయము అను కావ్యము రచించి తమ పుత్రికకు లక్షణ అను నామముంచినారు.
———–