పాలపర్తి ధనరాజ్ (Palaparthi Dhanraj)

Share
పేరు (ఆంగ్లం)Palaparthi Dhanraj
పేరు (తెలుగు)పాలపర్తి ధనరాజ్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంతర్జాతీయ నాన్నల సంవత్సరం, అమ్మయ్య పెళ్లయింది, అవ్యక్తం, ఆరంభం…, ఆశయాలకు ఉరితాళ్లు
ఇతర రచనలుhttp://m.prajasakti.com/Article/Kotha_Pustakalu/1832181 (చదివించే చిన్ని కథలు)
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపాలపర్తి ధనరాజ్
అంతర్జాతీయ నాన్నల సంవత్సరం
సంగ్రహ నమూనా రచన‘‘నాన్నా’’ ఒక్క గావు కేక వినిపించింది. ఆఫీసు నుంచి వచ్చి పేపరు చూసుకుంటున్న వాడుకాస్త అదిరిపడ్డాడు సుబ్బారావు గొంతును బట్టి తనకొడుకు కనిపించినా, పరిగెత్తుకొస్తున్న వాణ్ణి సరకాయించి చూశాడు. దేశ జనాభాలా పెరుగుతున్న అద్దె ఇళ్ళలో ఏ వాటాలో వాళ్ళు ఎవరు ఎవరిని ఎవర్ననుకుని పిలుస్తున్నారో తెలీడం లేదు.

పాలపర్తి ధనరాజ్
అంతర్జాతీయ నాన్నల సంవత్సరం

‘‘నాన్నా’’ ఒక్క గావు కేక వినిపించింది. ఆఫీసు నుంచి వచ్చి పేపరు చూసుకుంటున్న వాడుకాస్త అదిరిపడ్డాడు సుబ్బారావు గొంతును బట్టి తనకొడుకు కనిపించినా, పరిగెత్తుకొస్తున్న వాణ్ణి సరకాయించి చూశాడు. దేశ జనాభాలా పెరుగుతున్న అద్దె ఇళ్ళలో ఏ వాటాలో వాళ్ళు ఎవరు ఎవరిని ఎవర్ననుకుని పిలుస్తున్నారో తెలీడం లేదు.
వాడు దగ్గిరికి వచ్చి మళ్ళీ ‘నాన్నా’ అన్నాడు. సందేహంలేదు. రఘు తన కొడుకే. తననే పిలిచాడు.
‘‘నాన్నా మా పరీక్షలు ఎల్లుండి నుంచి’’. ఐ.ఏ.యస్. పరీక్ష పాస్ అయినంత సంబరంగా చెప్పాడు. వాడు చదివేది పదో క్లాసు. సుబ్బారావుకి మతి పోయింది వాడి సంతోషం చూసి. రాయవలసినవి పబ్లిక్ పరీక్షలు. మరి అంత సతోషం ఎందుకో అంతు పట్టడం లేదు. ఈలోగా పుత్రరత్నం తుర్రుమన్నాడు.
ఎందుకు వాడి కంత సంతోషం. అంతుపట్టడం లేదు. పేపర్లోకి చూశాడు. గుర్తు రాలేదు. వాసాల్లెక్కెట్టాడు. వూహఁ. మిగిలిన గుక్కెడు కాఫీ నోట్లో వంచుకున్నాడు. కుదరలేదు. ఎదైన్గా గుర్తొస్తుందేమోనని మనస్సుని చాలా రకాలుగా తిప్పి చూశాడు. ‘టక్’ మని వెలిగింది బల్బు.
రఘు సెవెన్త్ క్లాసు చుదువుతూండగా వాళ్ళ క్లాసు మాస్టారికి చెప్పించి పాస్ చేయించాడు. ఎలా అయినా తన కొడుకు ఉత్తీర్ణుడవ్వాలి. అంతే తనకి కావలసింది గవర్నమెంటు వారు చేసే అనేక పుణ్యాల్లో క పుణ్యమా అని ఎయిత్, నైన్త్ క్లాసులకి పరీక్షలు లేవు. అందుకే తను మరిచిపోయాడు.
అంటే ఇప్పుడు తన కొడుకు మళ్ళీ తనని అవే పనులు చేయమని అల్టిమేటమ్ ఇచ్చాడన్నమాట. అదైతే చిన్న క్లాసు. ఇప్పుడు పదో క్లాసు అంటే మాటలా? భారీ యెత్తున ప్రయత్నించాలి. ఏం చెయ్యాలో తెలీక తల పట్టుక్కూర్చున్నాడు.
ఆ రాత్రి భోజనాల దగ్గర పార్వతమ్మ అంది. ‘‘ఏవండీ మనబ్బాయి పరీక్షలు ఎల్లుండినుంచట.’’ తలూపాడు సుబ్బారావు తెలుసన్నట్లు.
‘‘మరి ఏవన్నా ఆలోచించారా? మీరు ప్రయత్నం చేయకపోతే మన ఒక్కగానొక్క కొడుకు తప్పిపోతాడు. అటు జగన్నాథంగారి అబ్బాయి, అప్పారావు గారి కూతురు పాసయి కూర్చుంటారు. ఇక నేను ఏనుయ్యో గొయ్యో చూసుకోవాలి. లేకపోతే ఎంత అప్రతిష్ఠ?’’ అంది.
‘‘నా మొహానికి అంతదృష్టం కూడానా నువ్వు చచ్చినా పడవునుయ్యిలో’’ అనుకుని భోజనం కానిచ్చే కార్యక్రమాని కుపక్రకమించాడు సుబ్బారావు.
‘‘భోజనం చేస్తున్నారు, కూర్చోండి’’ అంటూ కుర్రాడు లోపలి కెళ్ళాడు. సుబ్బారావు అస్థిమితంగా ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. అయిదు నిమిషాలకి హెడ్మాష్టరు పెద్దిరాజుగారు బొజ్జవూపుకుంటూ వచ్చారు.
‘‘నమస్కారం సార్.’’
‘‘మీరా సుబ్బారావుగారూ నమస్కారం… కూర్చోండి’’ ఆయన కూర్చోడానికి కొంత టైమ్ పడుతుంది కాబట్టి సుబ్బరావుని తొందరపెట్టారు. ఆ తరువాత తన మహా కాయాన్ని ఒక కుర్చీలోకి సర్దారు.
‘‘ఏమిటి మీ ఎఫ్.సి.ఐ. వాళ్ళు మొత్తం మా గ్రౌండు అంతట్నీ ఆక్రకమించేస్తున్నారు?’’
‘‘ఆఁ – ఏదో గవర్నమెంటు ఆర్డర్లు. మేము ఏం చేస్తాం చెప్పండి.’’
‘‘ఒరేయ్ రామూ ఆ ఫాన్ కొంచెం ఇటు పెట్టు’’ అని కేకేశాడు పెద్దిరాజు.
‘‘మీ అబ్బాయాండీ?’’ అన్నాడు సుబ్బారావు.
‘‘అబ్బెబ్బె, స్కూల్లో కుర్రాడండి. ఏదో ఆపనీ ఈ పనీ చేస్తుంటాడు. ఆఁ ఇంతకీ ఏమిటి విశేషం. పొద్దుపోయి వచ్చారు – ఏమైనా పనుందా?’’
‘‘ఏం లేదండీ. అదే మా అబ్బాయి రఘురాం. మీ స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. వాడికి ఎల్లుండి నుండీ పరీక్షలు.’’
‘‘ఆఁ ఆఁ మరే బాగా చదువుతున్నాడా?’’
‘‘ఏం చదువు లెండి నా మొహం. వాడి గురించే మీ దగ్గరికివచ్చాను. కొంచెం మా వాణ్ణి… ఇహిహి… చూసుకోవాలి. మా వాడు బాగా బిలో ఏవరేజి. ఎలాయైనా మీరే గట్టిక్కించాలి.’’ అభ్యర్థించాడు సుబ్బారావు.
‘‘ఛీఫ్ నన్న తరవాత చాలా పన్లుంటాయి కదా. కొంచెం ఇబ్బందే.’’
‘‘అదేం లేదండి – మీరు ఏమీ అనుకొకపోతే, ఆ నాల్రోజులు వాచర్లని ఎవర్ని ఏ రూముకి వేస్తారో చెబితే…’’ అర్ధోక్తిలో ఆగాడు తెలివిగా.
అంతకన్న తెలివైన వాడు పెద్దిరాజు. ఈ మాటకి అతనికికోపంవచ్చిన సంగతి నిజమేగాని, తమాయించుకున్నాడు. నలుగురిలోనూ తన మీద ఏదో అభిప్రాయం తెల్సుకోనిదే సుబ్బారావు వచ్చి ఉండడు. తీరా నే నటువంటి పనులు చెయ్యనని చెప్పినా లాభం లేదు. అందుకె… తల పంకించి, అటూ ఇటూ తిప్పి, ఏవో లెక్కలు మనసులో వేసి, ఆనక వాటి నన్నింటినీ కొట్టేసి, ‘‘ఒకపని చేస్తారా? రేప్పొద్దుటే తొమ్మిది గంటల కొకసారి కలవండి’’ అన్నాడు చివరికి.
సెలవు తీసుకుని ఉసూరుమంటూ బయల్దేరాడు సుబ్బరావు.
‘‘సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చిందంట. మావాడి పరీక్షలు నా ప్రాణానికొచ్చాయోయ్’’ నిట్టూరుస్తూ అన్నాడు హనుమంతరావు. అతని కొడుకు కృష్ణ పదోక్లాసు.
‘‘చదివేది మీవాడు, రాసేది మీవాడు. మధ్య నీ ప్రాణానికేమయింది?’’ బలరామయ్య అడిగాడు. బలరామయ్య చిన్నసైజు సేటు. ఇద్దరికీ మంచి దోస్తీ.
‘‘సరే, పదో క్లాసు చదివేవాళ్ళు చదివేది, రాసేది వాళ్ళే అయితే ఇక గొడవే లేదు. అలా కాకే కదా ఈ తిప్పలనీన. సరే ఇవన్నీ ఎందుగ్గానీ ఎడ్వాన్సుగా పేపర్లు తెలిసే పద్దతేమయినా ఉందా?‘‘
‘‘ఒకపనిచెయ్ ఈ రాత్రికి భోంచేసి మా ఇంటి కొచ్చేయ్. విజయవాడ ఫోన్ చేద్దాం. అదీ కాదంటే హైదరాబాద్’’ లేచాడు హనుమంతరావు.
ఆ రాత్రి తొమ్మిది గంటలకి….
‘‘ఆఁ నేనే బలరామయ్యని పని జరిగిందా… హల్లో..ఆహఁ రేపు జరుగుతుందా…. సరే… ప్రొద్దున్న పదికి… తప్పక జరగాలి.’’ పెట్టేశాడు ఫోను.
‘‘అదయ్యా సంగతి. పేపర్లు అవుటయ్యేలాగున్నయంట. రేపు పది గంటలకి ఫోన్ చెయ్యమన్నాడు. అన్నట్లు మీవాడి పరీక్షలు ఎల్లుండి నుంచి కదా.’’
మర్నాడు ఆఫీసుకి సెలవు పెట్టి పెద్దిరాజు దగ్గరికి బయల్దేరాడు సుబ్బారావు. మళ్ళీ విషయమంతా గుర్తు చేసిన తరవాత, విషయమంతా అప్పుడే గుర్తుకు తెచ్చుకున్నట్లు నటించి, తల వూపాడు పెద్దిరాజు. అరగంట సేపు ఏదో కార్యక్రమంలో ఉండి, ఆ తరవాత రఘు ఏ రూంలోపడతాడో, ఏ రోజు ఎవరు వాచర్గా ఉంటారో వివరించాడు.
మరుక్షణం ఎక్కుపెట్టిన బాణంలా విష్ణుమూర్తి ఇంటికి పరుగెత్తాడు సుబ్బారావు. విష్ణుమూర్తి రఘురాంకి మొదటి రోజు వాచర్ ఇంట్లోనే ఉన్నాడు విష్ణుమూర్తి.
‘‘నమస్కారం విష్ణుమూర్తి గారూ’’
‘‘నమస్కారం… మీరు…’’
‘‘నేను సుబ్బారావునండి. రఘురాం అని మా అబ్బాయి మీ స్కూల్లోనే టెన్త్ చదువుతున్నాడు.’’
‘‘అయితే?’’
‘‘అయితే ఏం లేదండి. మా వాణ్ణి. మీరేమీ అనుకోకపోతే, కొంచెం చూసుకోవాలి.’’
‘‘ఎలా?’’ ఇంకా అర్థం కావడం లేదు విష్ణుమూర్తికి.
‘‘మా వాడి రూమ్కి మీరే వాచరు మొదటి రోజు. కొంచెం మా వాడిని… అహ ఏం లేదు…. మా వాడు కొంచెం బిలో ఏవరేజి. అందుకని ఇహిహి’
‘‘మీ వాడి నెంబరు’’ చెప్పాడు సుబ్బారావు.
‘‘సరే వెళ్ళిరండి. ఎందుకో మొహం చూస్తుంటే కాదనబుద్ధి కావటంలేదు.’’ థాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాడు సుబ్బారావు. ‘అమ్మయ్య ఒక పనయ్యింది’ నిట్టూర్చాడు.
రెండో రోజు వాచర్ని పట్టుకోవాలి. చీటీ చూశాడు. భైరవమూర్తి ఈయనెటువంటివాడో. చెమటలు కార్తున్నాయి. సైకిలు సరిగా తొక్కలేక పోతున్నాడు. రోడ్డు మీద వెళ్ళేవాళ్లు నిశ్చింతగా కనబడుతున్నారు తన కళ్ళకి. ఛీ వెధవ ప్రయాస.
‘‘సుబ్బరావుగారూ ఏవండోయ్, ఎందాకా? ఎండలో పడ్డారు?’’ సుబ్బారావు పక్కకి చూశాడు. లింగమూర్తి.
‘‘ఏవోయ్ లింగమూర్తీ. ఏమిటి విశేషాలు’’ సైకిలు దిగుతూ అడిగాడు.
‘‘ఏం లేదు గానీ, మా ధాన్యానికేంటి, ఏమన్నా ఇప్పిస్తారా సొమ్ములు?’’
‘‘రేపోసారి కనపడండి.’’
‘‘అదడుగుదామనే పిల్చాను. ఏమిటి? ఇలా ఎండలో బయల్దేరారు?’’
విషయం వివరించాడు సుబ్బారావు.
‘‘భైరవమూర్తా? అమ్మమ్మ వాడసలే చండశాసనం ముండాకొడుకండోయ్. చిన్న ఉపాయం చెప్పనా? ఆయనకి వాళ్ళావిడ మాట మీద గురి. గురేమిటి లెండి నా శ్రాద్ధం. ఆవిడ మాటంటే భయం. అందుకని, మీ శ్రీమతిని అక్కడికి తోలండి. ఆవిడ అంగీకరించిందా, మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే.’’
ఇక ఆలోచించడానికి టైం లేదు. రేపే పరీక్షలు మొదలు. ఇటువంటివన్నీ ముందే అరేంజి చేసుకోవాలి. ఇంటి కొచ్చి పార్వతమ్మకు రిక్షా కట్టించి తను మూడో దేవుడి దగ్గరికి పరిగెత్తాడు.
ఎవరో పిల్లాడు ఉన్నాడు గేటు దగ్గర.
వాణ్ణి అడిగాడు.
‘‘ఎవర్రా అదీ’’ లుంగీ కట్టుకుంటూ వచ్చాడు రామ్మూర్తి మూడో దేవుడు.
తనని పరిచయం చేసుకుని, వచ్చిన సంగతి వివరించి చెప్పాడు సుబ్బారావు.
‘‘అరెరె అలాగా. అంటే నేను మీవాడికి పడింది లెక్కల రోజున్నమాట. నేను షోషల్ స్టడీస్ నండి. మరి అంత జస్టిస్ చేయలేనేమో. ఒక పన్జేయి కూడదూ. హెడ్మాష్టరు గారికి చెప్పి మేథ్స్ మాష్టార్ని వేసుకొనే ఏర్పాటు చేసుకోండి.’’ ఉచిత సలహా ఇచ్చాడు. లెక్కల మాష్టారెవరో తెలుసుకున్నాడు.
హెడ్మాస్టరుగారికి తర్వాత చెప్పొచ్చు అనుకుని రయ్యని లెక్కల మేష్టారు దగ్గరికి పరిగెత్తాడు. అప్పటికే ఇద్దరు తండ్రులు ఉన్నారు. తను మూడోనాన్న.
లెక్కల మేష్టారు అన్నీ కనుక్కొని, తను కేవలం నిమిత్తమాత్రుణ్ణని, లెక్కల పేపరు ఇంపార్టెంటుగాబట్టి వూర్లో పేరొందిన గుప్తాగారు తనను తన ఇష్టం వచ్చిన రూంలోకి వేయించుకొనే ప్రమాదమున్నదనీ, ఒక వేళ వాళ్ళబ్బాయిల రూంలోనే ఉన్నట్లయితే తప్పక సాయం చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మీ అబ్బాయిలకి లెక్కలేమన్నా వచ్చా అసలు అనడిగాడు.
ఎవరో తమ పిల్లాడి గురించి తక్కువని చెప్పుకోలేక. ఆఖరికి తేల్చుకుని ముక్త కంఠంతో ఫరవాలేదన్నారు.
అక్కణ్ణుంచి లెక్కల మాష్టార్ని షోషల్ మాష్టార్ని మార్చినట్లు అనుమతిమ్మని హెడ్మాస్టరుగారికి వివరించి, తల ప్రాణం తోక్కొచ్చిసరికి రెండయింది. ఇంటి కొచ్చేసరికి పార్వతమ్మ వచ్చేసి ఉంది.
‘‘ఆవిడ కొత్తవార్ని నమ్మదంటండీ అందుకని మళ్ళీ ఇంటికి వచ్చి పక్కింటి పిన్నిగారికి ఆవిడ తెలుసంటే తీసుకుని వెళ్ళి చెప్పించాను. రేప్పొద్దుటే అబ్బాయిని నెంబరట్టుకుని రమ్మన్నారు’’ చెప్పిందావిడ.
అదే రోజు పొద్దున్న పది గంటలకి…
బలరామయ్య, హనుమంతరావు విజయవాడ ఫోన్ కోసం తంటాలు పడుతున్నారు. తగులుకుంది ఫోను ఒక అర గంటకి.
‘‘ఆ ఆ బలరామయ్యనే మాట్లాడుతూంట. ఏంటి? ఎస్ పది పదిహేను, నూటపది, నూట ఇరవైరెండు… అసలివి యేంటి… ఆ రిప్… తొమ్మిది, పదకొండు, నూటనలభై నాలుగు, నూట ఎనిమిది….అబ్బాయిని పిలవనా? సరే అయితే లైన్లో డు…’’ అని హనుమంతరావు కేసి తిరిగి, ‘‘వాడేదో కోడ్ లో చెబుతున్నాడయ్యా. కుర్రాళ్ళకి తెలుస్తుందంట. మీ వాడికి కబురంపించు’’ అని ఫోన్ మూతి దగ్గిర పెటుకునేసరికి లైన్ కట్ అయిపోయింది.
హతాశయులయ్యారిద్దరూ. ‘ఎన్’ ఏమిటో ‘రిఫే’ ఏమిటో అర్థం కాలేదు. ఆ నంబర్లేమిటో ఈలోగా కృష్ణ కబురందుకుని ఆతృతగా వచ్చాడు. విషయం విన్నాడు.
‘‘ఆ ఏ నెంబర్లిచ్చాడు. చంపేశాడు డాడీ. ఎస్ అంటే ఎస్సేలు, రిఫే అంటూ రిఫరెన్సులు. నెంబరు టెక్స్ట్ బుక్కులో పేజీ నంబర్లు.’’ ఇద్దరూ నెంబర్లు చెప్పలేక తల గోక్కున్నారు.
మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల వరకూ తిప్పలుపడిన తరవాత విజయవాడ కనెక్షన్ వచ్చింది. మిగతా రోజుల పేపర్లకి రోజూ రాత్రి పది గంటలకి ఫోన్ చెయ్యమన్నాడు ఆగంతుకుడు.
మధ్యాహ్నం రెండు గంటలకి…
ఆదరా బాదరా అన్నం తిని నాలుగో వాడి భజనకు బయలుదేరాడు సుబ్బారావు. ఆయన పేరు గోవిందం. గోవిందంగారి దగ్గరకూడా మళ్ళీ అదే రికార్డు. మీట నొక్కాడు.
గోవిందంగారు నెంబరు తీసుకుని, ’’బెంగపడకండి మా వాడుకూడా అదే రూము. అది చాలుగా మీ వాడు పాస్ కావడానికి’’. పని సులువుగా జరిగింది.
మిగిలిన వారి పేర్లు లిస్టులో చూశాడు. ఇంకా కలుసుకోవలసిన వారు చాలా మంది ఉన్నారు. సాయంకాలం లోగా తిరిగేయాలి.
‘‘సుబ్బారావుగారూ, సుబ్బారావుగారూ’’ కేకతో ఉలిక్కి పడ్డాడు.
‘‘మీ గురించి ఇంటి కెళ్ళానండి. క్వాలిటీ ఇన్ స్పెక్టరుగారు వచ్చారంట. మిమ్మల్ని అర్జంటుగా బస్తాలకాడకి రమ్మన్నారు. అర్జంటుట’’ ప్యూను చెబుతున్నాడు.
హడావుడిగా అటుపరిగెత్తాడు. ఆఫీసర్నివదిలించుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది.
మరునాడు పరీక్షలు మొదలయ్యాయి.
రోజులు గడుస్తున్నాయి. పరీక్షలు అవుతున్నాయి. సుబ్బారావు మిగిలిన వాచర్ల ఇంటికి పరుగు లెడుతున్నారు. హనుమంతరావు విజయవాడకి రోజు రాత్రి పదింటికి ఫోను చేస్తున్నాడు.
మిగతా నాన్నలు మిగిలిన తిప్పలు పడుతున్నారు. పరీక్షలయ్యాయి.
రఘు ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు.
సుబ్బారావు నూట నాలుగు డిగ్రీల జ్వరంతో మంచమెక్కాడు.

———–

You may also like...