బుద్ధవరపు వేంకటరత్నం (Buddavarapu Venkatratnam)

Share
పేరు (ఆంగ్లం)Buddavarapu Venkatratnam
పేరు (తెలుగు)బుద్ధవరపు వేంకటరత్నం
కలం పేరుశండిల
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథలు: అడ్డదారి , ఆకుజోడు, ఆనవాలు, ఉత్తమ స్వార్థం, ఉబలాటం, ఉమాకాంత్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబుద్ధవరపు వేంకటరత్నం
అడ్డదారి
శ్రీ ‘‘శండిల’’
సంగ్రహ నమూనా రచనజనతా ఎక్సప్రెస్ పిఠాపురం స్టేషన్ వదిలిపెట్టేసరికి వేకువజామున అయిదుగంటలయ్యింది. తెల్లగా వెలుగు రావడానికి ఇంకా ఒక గంట పడుతుంది. రైలునుండి అందరికంటె ఆలస్యంగా దిగినవారు అవతారంగారే. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పిఠాపురం చేరువన కుమారపురంవైపు సాగుతున్నారు. కుమారపురానికి రోడ్డునబడి వెళ్లాలంటే రెండుమైళ్లు నడవాలి. అడ్డు త్రోవవుందికూడా; అవతారంగారికి ఆ దారి సుపరిచితమైనదే. రెండుతాపులు దాటి మళ్లగట్టు పట్టుకొంటే అర్ధగంటసేపటికి ఇలుల చేరుకుంటారు.

బుద్ధవరపు వేంకటరత్నం
అడ్డదారి
శ్రీ ‘‘శండిల’’

జనతా ఎక్సప్రెస్ పిఠాపురం స్టేషన్ వదిలిపెట్టేసరికి వేకువజామున అయిదుగంటలయ్యింది. తెల్లగా వెలుగు రావడానికి ఇంకా ఒక గంట పడుతుంది. రైలునుండి అందరికంటె ఆలస్యంగా దిగినవారు అవతారంగారే. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పిఠాపురం చేరువన కుమారపురంవైపు సాగుతున్నారు. కుమారపురానికి రోడ్డునబడి వెళ్లాలంటే రెండుమైళ్లు నడవాలి. అడ్డు త్రోవవుందికూడా; అవతారంగారికి ఆ దారి సుపరిచితమైనదే. రెండుతాపులు దాటి మళ్లగట్టు పట్టుకొంటే అర్ధగంటసేపటికి ఇలుల చేరుకుంటారు. ఆ తోపులలోను ఒకటి తెల్లజామితోట, రెండవ దానిలో సుపాళంలో ఏపుగా పెంచబడ్డ మావుళ్లు, నారింజలు, సపోటాలు ఉంటాయి. మావుళ్లు పూతమీద వున్నాయి. సపోటాలు పరువుదిగిలాయి. ఎటొచ్చీ నారింజలే పుష్కలంగా ఫలించి ఆ శీతగాలికి చక్కని ఫలాన్ని అక్కడక్కడ రాల్చి భూదేవి ఉపరితలానికి శోభగూర్చుతున్నాయి.
అవతారంగారితోటలో అడుగుపెట్టేసరికి ఇంకా చీకటివుంది. ఆ చీకటిలో క్రిందబడిన నారింజపండ్లు స్పష్టంగా కనబడుతున్నాయి. తోటను చిందరవందర చేస్తూ కొన్ని కోతులు అటూ ఇటూ చెట్లమీదికి దుముకుతూ కిచకిచలాడుతున్నాయి. ఎన్నడూ లేనిది అవతారంగారు అక్కడకొంచెం దురాశకు అతిగా లొంగిపోయారు. ఒకటి రెండు పండ్లు తీసుకొని చేతిసంచిలో వేసుకొందామనిపించింది. చుట్టూ కలయజూచి ఎవ్వరూలేదుగదా అని తనకు తానే గుణించుకొని రెండుపళ్లు పైకితీశారు. చిక్కనిరంగుతో చిత చితలాడుతూ ఆ నారింజలు ఆయన్ని ముగ్ధపరుస్తూ లోలోపల శను కొంచెం లోతుగానే రగిల్చాయి. అదొకలాగు ననిపించి ఒక పండును తినడం ప్రారంభించారు. గోటిని చొనిపీ చొనపగానే మెత్తగా దానితోలు విడిపోతోంది. ఇంతలోనే సుంత మనుష్యులు వచ్చే అలికిడయ్యింది. అప్పటివరకు ఆ ధ్యాసలో లేని అవతారంగారు తలఎత్తి అటు చూశారు. ఇద్దరు వ్యక్తులు ఆయనవైపే తదేకంగా ఆయన్ను ఒక దొంగను చూస్తున్నట్లు పరకాయిస్తూ రావడం పసిగట్టారు. తక్షణం ఆయనకో ఊహ తట్టింది. ఏమీ ఎరగనివానికివలె ఆ రెండు నారింజపండ్లు క్రిందకి జారవిడిచారు.
‘‘ఆగలాగ ఎవరు నువ్వు? తెల్లవారిందా దొంగతనానికి?’’ అంటూ అవతారంగార్ని ఎదుర్కొన్న ఇద్దరిలో ఒకాయన ఉరిమినట్లు గర్జించాడు. ఆయన ప్రక్కనే వున్న వేరొకడు బహుశా ఆయన తాబేదారు కావచ్చు. ఊతంగా ఆయనకు మదుపు ఇచ్చాడు. అవతారంగారు అదొకవిధమైన తిత్కాలోచితయుక్తి ప్రయోగించారు. కాని ఆ పాచిక పారుతుందా పారదా అని నిశితంగా ఆయన యోచనాపటిమ ముందుకు వెళ్ల లేకపోయింది.
‘‘అదేఁవిటండీ అలాగంటున్నాడు? నేనేమి దొంగతనంచేయలేది. మా వూరికి ఈ తోపుమిగుగానైతే రెండుపుంజీల అడుగులు కలిసివస్తాయని దారినవస్తున్నాను’’ అంటున్న అవతారంగారిని మిర్రుగా చూశాడు యజమాని. ఇంతలోనే ఆయన దాదగాడు క్షణం క్రితమే విరగబూచిన అంటుమామిడగిగున్న క్రింద అవతారంగారిచే చల్లగా జారవిడవబడ్డ రెండు నారింజల్నీ ముందుకు పట్టుకొచ్చి ‘‘అబద్దాలెందుకు బాబూ? తమరిప్పుడేకాదూ ఈట్ని చల్లగా గేసినారు? చూడండి ఓదానికి తొక్కగూడా దీసినారు. కొంత బోంచేద్దామనిగాబోలు’’ అన్నాడు పళ్ళు ఇకిలిస్తూ.
‘‘ఏమో, అది నాకు తెలీయదు. నేనేమీ యెరగను’’ వ్యర్థంగానే దిరాయించారు అవతారంగారు.
‘‘పురాగా దొరికిగూడా బుకాయిస్తావేమయ్యా. పెద్దమనిషివి, ఎక్కడేనా జీడిపిందెల తొడిగిన మామిళ్ళు నారింజల్ని రాల్చుతాయా? అందులోనూ పళ్లను ఒలిచి పడేస్తాయేమిటి?’’ తనుపజ్ఞకు పనిపెట్టాడు ఆసామీ.
మాయ అవతారంగారు మళ్ళీ క్రిందపడిగూడా పైపందెం నాదే అనే వస్తాదుకువలె ఇంకా మొరాయించి ‘అయితే తోట మీదిగదా అని మీమాట చెల్లాలన్నమాట. అవరిసన కోతులు అంతా హంగామా చేస్తున్నాయి. తెల్లవారుజామున రెండుపళ్ళు కోసుకొచ్చి పడవెయ్యడం ఇక్కడ వాటికి ఏమైనా ఘనకార్యమా?’’ అన్నారు.
‘‘ఔనౌను. మనుష్యులుగూడా కోతులే. కోతులు క్రమక్రమంగా మనుష్యులయ్యారంటూ మనుష్యులు క్రమక్రమంగా కోతులౌతున్నారు ఎందుకండీ అంత శుతర్కం? మీ కుడిచేయి ఇటు చాపండి. మీ గుట్టునదే బట్టబయలుచేస్తుంది.’’ అంటూ ఆసామీ, అవతారంగారిచేతిని చివాలున లాక్కొని తనముక్కు దగ్గర పెట్టుకొన్నాడు. గుమ్మని నారింజకాయ వాసన యన ముక్కుపుటాలకి సోకింది. అవతారంగారి బొటనవ్రేలిమీద చమురు చారికలు ఇంకా ఆరనేలేదు. ఆయన మొగం వేలవేశారు. కత్తి వ్రేటుకు నెత్తురుచుక్త లేదు నుదుటిపై. నోటిమాట పెకలడం లేదు. మౌనంగా తల వాల్చేశాడు.
‘‘లేచినయేల మంచిదిగాదు బాబూ. పాసిక పారలేదు. పెద్ద పెద్ద మారాజులే సిన్నకి సితక్కి కక్కుర్తి పడతావుంటే మానాటోళ్ళికొచ్చిందా? ఇయన్నీ యెరక్క మా యజమాని మమ్మల్ని దుమ్ము దులుపుతూంటాడు.’’ హేళనగా మళ్ళీ సకిలిస్తూ వెక్కరించాడు అవతారంగారి అవస్థను తాబేదారు.
‘‘చాలు పదండి ఈపాటికి. జాగ్రతత్తగా మసులుకుని ఇల్లు చేరుకోండి.’’ అని ఆ యజమాని, ఉదారుడు తోటలో తన మకాం వైపు మళ్ళిపోయారు. అవతారం గారికి తమ ఎదుటనంతా శూన్యముగా వున్నటుల, కళ్ళు చీకట్లు గమ్మినట్లు ఏమీతోచక బరువుగా అడుగులు ముందుకుపడ్డాయి.
తెల్లగా తెల్లవారింది. సూర్యోదయానికి ఇంకా ఒక అర్థగంటకు పైగా వ్యవధి వుంటింది. అవతారంగారు ఇంకా ఆనారింజతోటను పూర్తిగా అధిగమించి బయటపడలేదు. ఆ తోపు ఆయన్ను బయటకు పోవలసినదిగా ఎంత వేగిర పడుతున్నా ఆకర్షణనుంచి తప్పించుకోలేకపోతున్నాడు. పదిబారల దూరంలో తోటకు కంచె కట్టి కనబడుతోంది. అది దాటితే మళ్ళీ గట్టు తగులుతుంది. ఇంక అక్కడకు అంది పుచ్చుకున్నట్లు వుంటుంది కుమారపురం. అయితే ఈ కాసేపటిలోను అవతారంగారికి గొడవ మళ్ళీ ఎక్కువైనట్లుంది. చెట్లక్రింద రాలిపడిన నారంజపండ్లు చితచితలాడుతూ కొట్టవస్తున్నాయి నిజంగా ఒక్క పండునయినా అందుకోకుండా వుండడం మనిషితరం గాదు. కాని అవతారంగారు మళ్ళీ ఆ పళ్ళను ముట్టుకోవలసిన మాట కాదు.
అయితే అవతారంగారు మనిషి. రక్తమాంసాలు గల మనిషి ఆకాపాశించేత బంధంపబడ్డ మనిషి అసలు కోరిక తీరే అంత. అది తీరేవరకు నిద్రపోదు. మనసు నిద్రపోనివ్వదు. తత్ఫలితంగా ఎట్టి శిక్షనయినా తలపడడానికే మానవ ప్రవృత్తి పూనుకొంటుంది గాని ఇది మొహపాశిమని గాని, భ్రాంతి అని గాని వదలిపెట్టదుగదా. కొలనిలో తామరతూడుకై ఎగబడే ఏనుగు మొసలి ఉంటుందని తెలిసీ గూడా దాన్ని లక్ష్యపెట్టదు.
ఇక్కడ ఇంకొక వైపరీత్యం సంభవించింది. కోరికకు గ్రుడ్డిదైన ప్రతీకారంగూడా జతపడింది. అది కేవలం అనవసరం; కాగా మూర్ఖత్వం అవతారంగారనుకొంటున్నారు. ‘‘ఈ నాలుగుబారల్లోను ఇంతలోకే ఎవడు వచ్చి చస్తాడు? కాకపోయినా మనిషంత మనిషిని పట్టుకొని, వెదవది, రెండుపండ్లు తీసుకొంటేమాత్రం దానికింత యాగీమా? ఇప్పుడు ఎవడొస్తాడో చూస్తాగా? సంచినిండా ఎత్తుకొని కంచె దాటేస్తాను. వాళ్ల ఒక వేళ మూలనుంచి చూచినా ఇక్కడకు వచ్చేసరికి నేను ఊరి తలవాకిట్లో వుంటాను. అప్పుడు శివి తమ పళ్ళని ఎలా రుజువు చేస్తాడు? పొరుగూరివాడు ఇక్కడకొచ్చి తోటకొన్నానుగదా అనీ ఇంత పొగరా?’’
మనస్సు ఒక నిశ్చయానికి వచ్చేసరికి పనిని చెయ్యడానికి శరీరం దానంతట అదే ఉరకలు పెడుతుంది. మరి కాసేపటికి అవతారం గారు వంగి చెట్లక్రింద రాలిన చెంబెడేసి నారింజపండ్లు అరడజనుకు పైగా సంచిలో వేసుకొన్నాడు. అక్కడితో గాలా? చేరువులోనే వున్న ఇంకొకచెట్టుక్రింద పళ్ళు ఆయన్ను మరీ బలంగా లాక్కున్నాయి. అవతారంగారు ఇప్పుడు జాగ్రత్తపడినా బావుండేది కానీ ఇది మన భ్రమ. లేకపేత చెరిసగందూరం శిరవేగంతో కోరికవల్ల ఈడ్వబడ్డ మనం అది త్రోసివేసీ సుడిగుండంలోంచి బయటపడగలమా? మహామహులు మడతలో పడిపోయారు. మనమూ అవతారంగారూ ఒక లెఖ్కా? అంతే. ఆయన రెండవచెట్టుక్రింది నారింజపండు వైపు వంగారో లదో అది భూమికి లేచీరాని పండుగా ఆయన చెయ్యి దానికి అతుక్కుపోయినట్లు, జబ్బలాక్కుని గూడు సవరించుకొని వంగినమనిషి లేచి నిలబడి తమాయించుకోడానికి కూడా ఎంతమాత్రమూ ఆస్కారంలేని చిక్కులో ఇరుక్కుపోయారు. బలీయమైన ఒక మూర్ఖహస్తం, ఉక్కు చెయ్యి అవతారం గారి బుజాన్ని వొడిసిపట్టుకొని భూమిమీదకు అదిమి వేస్తున్నట్లైంది. తలయెత్తి చూశారు. గంటనేవైనా దాటనిశ్రితం ఆయన చూచిన తోటయజమానిగారి దాదరుని పరంగా అవతారంగారు బందీకృతులై వున్నాడు ఆ కింకరుని జవసత్వాలు అవతారం గారివాటికంటె ఎన్నో రెట్లు హెచ్చు. ఆయన వాడినుంచి తప్పించుకు పోదామని ఆలోచించడమంత మూర్ఖత్వం మరొకటి వుండదు ఎంచేతనంటే ఆ ప్రయత్నం వృధా. ఒకవేళ ప్రయత్నిద్దామనుకొన్నా ఆ ప్రక్రియ చిచ్చుల్ని మరింత దగ్గరగా బిగించి రామచిలుక అవస్థను విపరీతంగా ప్రమాదభరితం చేస్తుంది.
అద్దారుడు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అవతారంగారిని లాక్కొని తోటమధ్యనున్న తాటియాకు పాక మకాంలో ఎత్తయిన మట్టిదిమ్మమీద సింహాసనారూఢుడైన న్యాయాధికునివలె తనాయించి కూర్చున్న యజమాని ముందు హాజరుపెట్టాడు అవతారంగారు కొద్దిసేపటి క్రితమే కేవలం గౌరవ పురస్కృతిమన హెచ్చరికతో తనను విడిచిపుచ్చిన యజమానిని చూచి వడుకుతూ తలవంచుకొని నిల్చున్నారు ఆయన ఇప్పుడు నేరస్తుడు; కాగా ఒక ఘరానా దొంగ; పేరుమోసిన పెద్దమనిషి.
‘‘ఏమండి మీకు మాటలతో పెట్టిన గడ్డి చాలలేదన్నమాట. లేకపోతే ఇక్కడున్న వాళ్ళింతా గుడ్డివెధవలు, అదమరచివుంటే చేతికి దొరికినవి పట్టుకుపోదామనా? మీ ధైర్యానికి మాకు ఆశ్చర్యం కలుగుతోంది. తోటకొనుక్కొన్నవాళ్ళు పొరుగూరి ఆసామీలు గదా అని మీ ధీమా కాబోలు. న్యాయమనేది మీకు మాకు ఒకటే. తప్పు అంతే. ఇప్పుడు నిన్నిక్కడ చెట్టుకు రెక్లు విరచికట్టి తొక్కలొలిస్తే ఎవడొస్తాడు కాపాడానికి? ఇప్పుడైనా నేరం చేశానని వప్పకుంటావా? లేక కాయలు సంచినిండా వుంచుకొని గూడా బుకాయిస్తావా? మీ ఈ సంచి నాదిగాదు, నేను కలగంటున్నాను. అంటావా?’’ అని రుముతూ ఉద్దారునకు సంజచేశాడు ఆ సంచిలో నున్నవన్నీ వారికియ్యమని. వాడు క్షణంలో సంచి ఖాలీచేశాడు. అక్కడ ప్రోగుపడ్డ వాటిలో ఎనిమిదినారింజపండు, రెండు చొక్కాలు, రెండు పంచెలు, ఒక లాల్ షమీ కంపినివారి పచ్ఛశాలువా, ఒక పూలు సెవటరు, రెండుమూడు కాగితాల సంచులు ఉన్నాయి. అవతారంగారు నేరం ఒప్పుకోబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఉద్రేకంలో యజమాని ఆజ్ఞకు బద్ధుడై ఉద్గారుడు ఆయన వెన్నును రేవుపెట్టి వుండేవాడు. ‘‘వీడికి తగిన శాస్తి చెయ్యాలి అప్పుడు గాని రోగం చప్పగా కుదరుదు.’’ అని అవతారంగారి శాలువాను, సెవటరును ఊడబుచ్చుకొన్నరు ఆయన ఎదుటనే ఉద్దారుడు, యజమాని వాటిని పంచుకొన్నారు. యమకింకరునివలె నున్న ఉద్దారుని భుజమ్మీదనుంచి ‘అగ్నిదేవలోహి’ శాలువా ‘లాల్ షమీ’ కంపెనీవారి ఆకుపచ్చనిది తన యజమానిని చూచి జాలిపడి విచారిస్తున్నట్లుంది. లేక అది ఆక్షణంనుండి తనకు ప్రాప్తించిన బానిసత్వానికే దుఃఖించిందేమో.
అవతారంగారు తోపు కంచె దాటేసరికి సూర్యోదయమయ్యింది. పంచినతల యెత్తికుండా ఆబాలభానుని ముఖారవిందం చూడలేక సిగ్గుపడుతున్నటు, అప్పటివరకు తనకేమీ జరుగనట్లై స్థిరచిత్తంతో గ్రామంలో ప్రవేశించి తనయిల్లుముఖం చూడడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు అవతారంగారు కుమారపురం ప్రవేశించారు.

———–

You may also like...