రామచంద్ర అప్పారావు (Ramachandra Apparao)

Share
పేరు (ఆంగ్లం)Ramachandra Apparao
పేరు (తెలుగు)రామచంద్ర అప్పారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/6/1909
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకవితలు: ఓ యీ, స్నేహ బంధము, వాల్జడ, ఈశ్వరీ, లీలా జీవితము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరామచంద్ర అప్పారావు
సంగ్రహ నమూనా రచనఓ యీ ;

నిన్నె కోరుదు నోయి ; యితరుల
నన్నె డెరుగని దాన నోయీ ;
నాడు నే డేనాటికిని నీ
దాననే నో యీ :

రామచంద్ర అప్పారావు
కవితలు

ఓ యీ ;

నిన్నె కోరుదు నోయి ; యితరుల
నన్నె డెరుగని దాన నోయీ ;
నాడు నే డేనాటికిని నీ
దాననే నో యీ :

మనసు నా కేకాంత మోయీ ;
బ్రతుకు నాకు ప్రశాంత మోయీ :
అంద మాముదదీప మోయీ :
వలపు నే నోయీ ?

సొగసు పువ్వులు సోలు ముద్దులు
వలపుపన్నీరుల తుషారము
వెలుగు తేటల పసడి నవ్వులు
కాన్క నీ కోయీ :

స్నేహ బంధము

ముసుగు తీయక లోకంపు గుసగుససలకు
శిరసు వాల్చక వలిగాలి తెరలలోన
మొలక నవ్వుతో కలలతో వలపు బరువు
తావి పిలుపుతో నిత్యమ్ము స్వాగతమ్ము
లాలపించెడి గులాబి కన్నె :

నాకొరకె వేచి వరయించి నన్నె ఆమె
ముద్దు లిచ్చును చుక్కల మోవి కాంతి
దారిలో కౌగాలించును తలుపు శాంతి
తరలు నిశ్శబ్ద రేఖలో తాండవించు
నన్ను కూడి నానీడ వెన్నాడు కొనుచు :

కంటనీ ర్వెట్టు మోదా శ్రుకణము లనుచు
వంతకే చోటులే దను సృష్టి చూపు
కౌగిలింత సోలింతలో కన్ను మోడ్చు :
క్రూర హేమంత శర్వరీ కుంతలముల
లోల మధుమాస చంద్రికా లోచనముల
కురియు ముద్దిదే యను లరగ మోడ్చు
మరచి మరపించి జాలిలో మమతలో వి
లాస సిస్తాయి నెద పువ్వు వ్రాల్చి వేయు
నా గులాబి ; నెద పువ్వు కొమ్మ ; :

వాల్జడ

కలకలలాడు వాలుజడకై జగమెంత
తప స్నొనర్చెనో చెలియ భుజాన వ్రాలి
కుచసీమ నటించుచు ఏటి దాటుతో
తొడనును వంపులోన బడి తూలుచు
మల్లెల పాల నవ్వు కాంతుల శ్రుతిగా
సువాసనల దోర్లును కోటి వసంత శ్రీలతోన్
జారిన వాలుతో విరుల జాలుల తావులతో
నెదండలో నూరు విముగ్ధ మోహన వయోరుచి
వెల్లువ సేసి సోక్కుచున్
నీరధి పై స్ఫురించు రజనీకర బింబము వోలె
జాలి నన్నోరమణి ధరింపు మిక
నొక్కుల పాయలలో గులాబి గాన్ :

జీవిత మాటగా సొగసు చిన్నెల పాటగ నవ్వి
ఒక్కటన్ దేవి భవచ్చి రోజముల నించుక
ముద్దిడనిమ్ము : చూపులన్ సేవల జేయనిమ్ము :
హృది జేరిచి సోలగనిమ్ము దివ్య కాం
త్యావిలసుందరో జ్జ్వలరహోనిశలన్
జపియించుకొందు నే :
ఎరుగని కోర్కెల నేన్నో
స్ఫురియించును , సొగసు దప్పి పూరిం చెడి నీ
తరగల వాల్జడ ముసుగున
నొరుగుదు లోకంపు దృష్టి నుండి ప్రశాంతిన్ :

ఈశ్వరీ

ఎటనో దవ్వు దవ్వుల నుండి యెగసి వచ్చి
శ్రవణముల సొలయించును చావు మేళ
మిది నిశీధి ఆ కల్లాడ దీశ్వరీ ప్ర
చండ యామినీ కింకిణీ స్వనము దక్క
నా మన స్సేనే చీల్చి కొన్నాము ధగ ధ
గాగ్ని కాంతితో దాన వెల్గారు నీ వి
నీల మోహన మూర్తి గంటికి నద్ది
నాను తలపోసి మూర్చలో నణగినాను
కనులు విచ్చి మ్రోయగలేక గాలిపరువు
నిరసనకు దూలి దౌర్భల్య వివశుడ నయి
లోక మూర్ఖ సంతోష విలోచనాల
కాహుతిగ రేక రేకగనట్టె తీసి
నల్దేసల జిమ్ము కొన్నాము ….


లీలా జీవితము

ఇసుక నేము వెర్రిగ నీవు వ్రాయుచుండ
స్ఫటిక మార్గాల నీయేరు జారి యెట్లు
నీ రహో మోహ జపము ధ్వనించునో :
నీ పెదవి కీ ప్రసవ మెట్లు వ్రాలునో ? శ
శాంక రేఖ సోయగ మ్మరసి తనను
లహరిలో చూచుకొను యెట్లు లజ్జపడునో ?

కామినీ : ఈ మనోజ్ఞ శృంగార భంగి
కెంత సులభమో ఈ జీవితైక పథము ?
గాలి కెరటాల దూర దూరాల పూల
కెటకో లీలగా హాయిగా నెగసి పోవు :
ప్రకృతి కింతగా బ్రతుకు సులభమో , అయిన
కవికి , సార్ధక ప్రేమ సంకాశి కెంత
లీలయో నాకు …… …….

సేకరణ :వైతాళికులు ..కవితా సంకలనం నుంచి ……….

———–

You may also like...