పేరు (ఆంగ్లం) | Katragadda Balakrishna |
పేరు (తెలుగు) | కాట్రగడ్డ బాలకృష్ణ |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీదేవమ్మ |
తండ్రి పేరు | కోటయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/26/1906 |
మరణం | 12/18/1948 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామము |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | Hindu Materialism, |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కాట్రగడ్డ బాలకృష్ణ |
సంగ్రహ నమూనా రచన | ప్రాథమిక విద్యాభ్యాసము గుంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశారు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించారు. బ్రిటన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో అమెరికా వెళ్ళి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు. వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు. |
కాట్రగడ్డ బాలకృష్ణ
ప్రాథమిక విద్యాభ్యాసము గుంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశారు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించారు. బ్రిటన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో అమెరికా వెళ్ళి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు. వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు. 1939 సెప్టెంబర్ లో చిదంబరంలో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశారు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించారు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూరు కారాగారంలో నిర్బంధించింది.
భారతస్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో అనేకమంది భారతీయులు చదువుల కోసం ఇంగ్లండ్, ఐర్లండ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినవాళ్ళు చాలా తక్కువ. అందులో తెలుగువారు మరీ అరుదు. అలా వెళ్ళినవారిలో కాట్రగడ్డ బాలకృష్ణ (1898-1950) ఒకరు. ఆయన ఇంటూరు (గుంటూరు జిల్లా అమృతలూరు మండలం) గ్రామము నుండి వెళ్ళారు. తొలుత ఇంగ్లండులో లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ లో హెరాల్డ్ లాస్కీ వద్ద చదువుదామనుకున్నారు. కానీ, అక్కడి ఖర్చులు భరించే స్థితి లేక అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. రూపర్ట్ ఎమర్సన్ వద్ద పిహెచ్.డి. (1932-37) చేశారు. ఎమర్సన్ ఆసియా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలవారు.బాలకృష్ణ స్థానికంగా బోస్టన్ లో విద్యార్థి సంఘాల సమావేశాల్లో పాల్గొని, 1933 నుండి బోస్టన్ రచయితల సంఘానికి అధ్యక్షులయ్యారు. భారత స్వాతంత్ర పోరాటాన్ని గురించి వారికి వివరించేవారు. బ్రిటీషు వారి సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ద్రావిడ సాహిత్యంలో రాజకీయాల గురించి బాగా అధ్యయనం చేశారు. భారత జాతీయవాదాన్ని కూలంకషంగా పరిశీలించారు. బౌద్ధ సాహిత్యంలో రాజకీయ సామాజిక విషయాలను లోతుగా అవగాహన చేసుకున్నారు. పిహెచ్.డి. పూర్తి చేసిన తరవాత 1937లో ఇండియాకు తిరిగి వచ్చి బ్రిటిష్ వ్యతిరేక కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. దానివల్ల జైలుపాలయ్యారు. అప్పటికే జైళ్ళలో కాంగ్రెస్, సోషలిస్టు పార్టీలవారుండేవారు. ఎన్.జి.రంగా జైళ్ళలో రాజకీయ పాఠశాలలు పెట్టి డిటెన్యూలకు పాఠాలు చెప్పేవారు. రంగాకు వ్యతిరేకంగా కె.బి.కృష్ణ కమ్యూనిస్టు తరగతులు నడిపేవారు. జైలు నుండి విడుదలయిన తరువాత కె.బి.కృష్ణ కొద్ది కాలంపాటు బెల్గాం యూనిర్సిటీలో పనిచేశారు. కానీ క్షయ వ్యాధితో ఎక్కువ కాలం బతకలేదు. 1950 లో చనిపోయారు.హిందూ ముస్లిం సమస్యలపై, అల్పసంఖ్యాకుల విషయాలపై ఆయన రచనలు యునెస్కోవారు ఉత్తమమైనవిగా స్వీకరించారు. కె.బి.కృష్ణ విషయాలు మరుగున పడిపోయాయి. బాపట్ల నుండి రవిచంద్ బాగా పట్టించుకుని ఆయన రచనలు అన్నీ వెలికి తెచ్చారు. 2000 సంవత్సరం ప్రాంతంలో నేను అమెరికాలో వుండగా మిత్రులు అమెరికా వచ్చి బాలకృష్ణ విషయాలు తెలుసుకోమని కోరారు. హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీ ద్వారా కొంతవరకు విషయ సేకరణ చెయ్యగలిగాను. కారణం తెలియదు గాని కమ్యూనిస్టులు బాలకృష్ణ విషయంలో ఉదాసీనత వహించారు. అమెరికాలో ఆనాడు బాలకృష్ణకు అరుదైన ఆదరణ హార్వర్డ్ లో లభించింది. ఆయన రాసిన ప్రముఖ పుస్తకాలు ఈ క్రింద చూడండి..
1. Studies in Hindu materialism by K. B Krishna ( Book )
3 editions published in 1994 in English and held by 31 WorldCat member libraries worldwide
2. Political and social thought of the Buddhist writers of the early Christian era : (a study of the movement of protest against caste system from the 2. century A.D. to the 5. century A.D.) by K. B Krishna ( Book )
1 edition published in 1960 in English and held by 1 WorldCat member library worldwide
———–